Karan Johar Shocking Comments on Allu Arjun Pushpa Hindi Box Office Collection - Sakshi
Sakshi News home page

Pushpa Movie: బన్నీ స్టార్‌డమ్‌పై కరణ్‌ జోహర్‌ షాకింగ్‌ కామెంట్స్‌.. ఏమన్నాడంటే ?

Published Tue, Dec 28 2021 5:34 PM | Last Updated on Tue, Dec 28 2021 7:44 PM

Karan Johar Shocking Comments On Allu Arjun And Pushpa Movie Openings - Sakshi

ఐకానిక్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, క్రియేటివ్ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషనల్‌లో వచ్చిన క్రేజీ హ్యాట‍్రిక్‌ చిత్రం 'పుష్ప: ది రైజ్‌'. ఈ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో స్టార్‌ హీరోయిన్‌ సమంత స్పెషల్‌ సాంగ్‌లో అలరించింది. ఈ చిత‍్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్లను కొల్లగొడుతూ తగ్గేదే లే అంటోంది. డిసెంబర్ 17న విడుదలై పుష్ప రాజ్‌ ఇప్పటికే రూ. 100 కోట్లకుపైగా రాబట్టాడు. ఇది బన్నీ సినిమా చరిత్రలోనే ఎక్కువ వసూళ్లు సాధించిన సినిమాగా చెప్పుకోవచ్చు. పుష్ప రాజ్‌ పాత్రలో బన్నీ ఊర మాస్‌ యాక్టింగ్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. వివిధ భాషల్లో రిలీజ్‌ అయి పాన్‌ ఇండియా చిత్రంగా వచ్చిన ఈ సినిమాపై బాలీవుడ్‌ దర్శక నిర్మాత కరణ్‌ జోహార్‌ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. 

ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో కరణ్‌ జోహార్‌ పుష్ప సినిమా కలెక్షన్లు ఉదహరిస్తూ తెలుగు సినిమాల ప్రారంభ వసూళ్లను హిందీ చిత్రాలు కూడా అందుకోలేకపోతున్నాయని తెలిపాడు. 'ఓటీటీ, ఇతర మాధ్యమాల ద్వారా తెలుగు చిత్రాలు హిందీలో అనువాదమవుతున్నాయి. దీంతో అందులో నటించిన నటులకు కూడా మంచి ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్‌కు బాలీవుడ్‌లో క్రేజ్‌ పెరిగింది. దీన్ని ఎవరూ ఆపలేరు. అందుకే హిందీలో రిలీజైన పుష్ప సినిమాకు కూడా భారీ ఓపెనింగ్స్‌ వచ్చాయి. హిందీ సినిమాలు సైతం అతంగా వసూళ్లు సాధించలేకపోయాయి.' అని పేర్కొన్నాడు కరణ్‌ జోహార్‌. 

అంతేకాకుండా అల్లు అర్జున్‌కు పుష్ప సినిమాతో బాలీవుడ్‌లో మరింత క్రేజ్‌ పెరిగింది. ఇప్పటికే పలువురు బీటౌన్‌ సెలబ్రిటీలు సినిమాపై, బన్నీ యాక్టింగ్‌పై ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలోనే కరణ్‌ జోహార్‌ కూడా అల్లు అర్జున్‌ పొగడ్తలతో ముంచెత్తాడు. బన్నీ స్టార్‌డమ్‌తోనే హిందీ పుష్పకు అత్యధిక వసూళ్లు వచ్చాయని పేర్కొన్నాడు. 

ఇదీ చదవండి: పుష్ప మేకింగ్‌ వీడియో.. అలరిస్తున్న తెర వెనుక సన్నివేశాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement