opening collections
-
బన్నీ స్టార్‌డమ్‌పై కరణ్ జోహర్ షాకింగ్ కామెంట్స్.. ఏమన్నాడంటే ?
ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషనల్లో వచ్చిన క్రేజీ హ్యాట్రిక్ చిత్రం 'పుష్ప: ది రైజ్'. ఈ రష్మిక మందన్నా హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ సమంత స్పెషల్ సాంగ్‌లో అలరించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్లను కొల్లగొడుతూ తగ్గేదే లే అంటోంది. డిసెంబర్ 17న విడుదలై పుష్ప రాజ్ ఇప్పటికే రూ. 100 కోట్లకుపైగా రాబట్టాడు. ఇది బన్నీ సినిమా చరిత్రలోనే ఎక్కువ వసూళ్లు సాధించిన సినిమాగా చెప్పుకోవచ్చు. పుష్ప రాజ్ పాత్రలో బన్నీ ఊర మాస్ యాక్టింగ్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. వివిధ భాషల్లో రిలీజ్ అయి పాన్ ఇండియా చిత్రంగా వచ్చిన ఈ సినిమాపై బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో కరణ్ జోహార్ పుష్ప సినిమా కలెక్షన్లు ఉదహరిస్తూ తెలుగు సినిమాల ప్రారంభ వసూళ్లను హిందీ చిత్రాలు కూడా అందుకోలేకపోతున్నాయని తెలిపాడు. 'ఓటీటీ, ఇతర మాధ్యమాల ద్వారా తెలుగు చిత్రాలు హిందీలో అనువాదమవుతున్నాయి. దీంతో అందులో నటించిన నటులకు కూడా మంచి ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్‌కు బాలీవుడ్లో క్రేజ్ పెరిగింది. దీన్ని ఎవరూ ఆపలేరు. అందుకే హిందీలో రిలీజైన పుష్ప సినిమాకు కూడా భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. హిందీ సినిమాలు సైతం అతంగా వసూళ్లు సాధించలేకపోయాయి.' అని పేర్కొన్నాడు కరణ్ జోహార్. అంతేకాకుండా అల్లు అర్జున్‌కు పుష్ప సినిమాతో బాలీవుడ్లో మరింత క్రేజ్ పెరిగింది. ఇప్పటికే పలువురు బీటౌన్ సెలబ్రిటీలు సినిమాపై, బన్నీ యాక్టింగ్‌పై ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలోనే కరణ్ జోహార్ కూడా అల్లు అర్జున్ పొగడ్తలతో ముంచెత్తాడు. బన్నీ స్టార్‌డమ్‌తోనే హిందీ పుష్పకు అత్యధిక వసూళ్లు వచ్చాయని పేర్కొన్నాడు. ఇదీ చదవండి: పుష్ప మేకింగ్ వీడియో.. అలరిస్తున్న తెర వెనుక సన్నివేశాలు -
ఫస్ట్ డే కలెక్షన్స్ అదుర్స్.. రాజా!
సాక్షి, హైదరాబాద్: రవితేజ తాజా సినిమా ‘రాజా ది గ్రేట్’ ప్రేక్షకులను అలరిస్తోంది. దీపావళి కానుకగా గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. మొదటి రోజు రూ. 10 కోట్లు వసూలు చేసినట్టు ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ వెల్లడించింది. అయితే ఓపెనింగ్ డే కలెక్షన్ రూ. 15 కోట్ల వరకు ఉండే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రెండో రోజు దీపావళి సెలవు కావడంతో వసూళ్లు మరింత పెరిగే అవకాశముందని భావిస్తున్నాయి. ప్రేక్షకాదరణ ఇలాగే కొనసాగితే రవితేజ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఈ సినిమా నిలుస్తుందని అంటున్నారు. కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా అమెరికాలోనూ మంచి కలెక్షన్లు రాబోడుతోందని ప్రముఖ ట్రేడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ తెలిపారు. 95 ప్రాంతాల్లో విడుదలైన ఈ చిత్రం తొలిరోజు 84.32 లక్షలు వసూలు చేసినట్టు వెల్లడించారు. వారం మధ్యలో విడుదలైనా ఓపెనింగ్స్ బాగున్నాయని, వారాంతంలో కలెక్షన్లు మరింత పెరుగుతామని ఆయన అంచనా వేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ సినిమాలో మెహ్రీన్ పిర్జాదా హీరోయిన్గా నటించింది. రాధికా శరత్‌కుమార్, ప్రకాశ్‌రాజ్, వివన్, రాధిక, శ్రీనివాస్ రెడ్డి ముఖ్యపాత్రల్లో కనిపించారు. -
దుమ్మురేపుతున్న కలెక్షన్లు
సాక్షి, చెన్నై: ‘ఇళయదళపతి’ విజయ్ నటించిన తమిళ సినిమా ‘మెర్శల్’ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. అక్టోబర్ 18న విడుదలైన ఈ సినిమా భారీగా ఓపెనింగ్ కలెక్షన్లు రాబట్టింది. తొలిరోజు 31.3 కోట్ల వసూళ్లు సాధించినట్టు ట్రేడ్ వర్గాల సమాచారం. వివాదాలను దాటుకుని భారత్‌లో 2500 స్క్రీన్లపై విడుదలైన ఈ సినిమా అటు విదేశాల్లోనూ భారీ కలెక్షన్లు రాబడుతోంది. ఒక్క చెన్నైలోనే తొలిరోజు రూ.1.52 కోట్లు సాధించినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. తమిళనాడులో రూ. 18-19 కోట్ల బిజినెస్ చేసినట్టు తెలిపాయి. అమెరికా, ఆస్ట్రేలియా, మలేసియా, యూకేలోనూ విడుదలైన ఈ సినిమా ఊహించిన దానికంటే ఎక్కువగా కలెక్షన్లు సాధిస్తోంది. అమెరికాలో 129 ప్రాంతాల్లో విడుదలైన ఈ సినిమా తొలిరోజు రూ. 2.25 కోట్లు వసూలు చేసినట్టు ప్రముఖ ట్రేడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. మలేసియాలో రూ.90.31 లక్షలు, యూకేలో 81.08 లక్షలు, ఆస్ట్రేలియాలో రూ.68.01 లక్షలు రాబట్టినట్టు తెలిపారు. శ్రీతేనాండాళ్ ఫిలింస్ నిర్మించిన ఈ చిత్రానికి అట్లీ దర్శకుడు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్.రెహ్మాన్ సంగీత బాణీలను అందించారు. సమంత, కాజల్ అగర్వాల్, నిత్యామీనన్ నాయికలుగా నటించారు. -
మొదటిరోజే రూ. 35 కోట్లు దాటిన కలెక్షన్లు
ఏదైనా సినిమా విడుదల అయ్యిందంటే మొదటిరోజు 10-15 కోట్ల కలెక్షన్లు వస్తే సూపర్ హిట్ అంటారు. అలాంటిది బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్ మల్లయోధుడిగా నటించిన ‘సుల్తాన్’ సినిమా.. అతడి ఈద్ సెంటిమెంటుకు తగ్గట్లుగానే అత్యంత భారీ ఓపెనింగ్స్ సాధించింది. మొదటిరోజు ఏకంగా రూ. 36.5 కోట్ల కలెక్షన్లు వచ్చినట్లు యష్ రాజ్ ఫిలింస్ ప్రొడక్షన్ సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. 2016 సంవత్సరంలో ఇప్పటివరకు విడుదలైన అన్ని సినిమాల్లోకి ఇదే అత్యధిక ఓపెనింగ్ అని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ్ కూడా చెప్పారు. దీని తర్వాత ఫ్యాన్ సినిమాకు మొదటి రోజు రూ. 19.20 కోట్లు వచ్చాయి. ఉడ్తా పంజాబ్ సినిమా రూ. 10.05 కోట్ల కలెక్షన్లు సాధించింది. అయితే.. సల్మాన్ హీరోగా నటించిన ప్రేమ్ రతన్ ధన్ పాయో సినిమాకు మాత్రం దీనికంటే ఎక్కువగా మొదటిరోజు ఏకంగా రూ. 40.35 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. సల్లూభాయ్ ఈద్ సెంటిమెంట్ ప్రకారం చూసుకున్నా.. ప్రస్తుతం వరుసగా ఐదు రోజుల సెలవులు రావడం చూసుకున్నా ఈ సినిమా బాక్సాఫీసు రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమని బాలీవుడ్ పండితులు చెబుతున్నారు. ఈ ఐదు రోజుల్లో సుల్తాన్ సినిమా హరికేన్ సృష్టించడం ఖాయమని తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. -
బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న 'సరైనోడు'
చెన్నై: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజా చిత్రం 'సరైనోడు' బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. సినిమాపై మిశ్రమ స్పందన వ్యక్తమైనప్పటికీ రిలీజ్ రోజున భారీ కలెక్షన్లు కొల్లగొట్టాడు. రిలీజ్ రోజున ప్రపంచవ్యాప్తంగా రూ. 22 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ ఎనలిస్ట్ త్రినాథ్ వెల్లడించారు. విమర్శకులకు ఈ సినిమా నచ్చనప్పటికీ ప్రేక్షకులు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నారని ఆయన విశ్లేషించారు. వీకెండ్ లో ఎంత వసూలు చేస్తుందనే దానిపై కలెక్షన్లు ఆధారపడివుంటారని చెప్పారు. విదేశాల్లో 'సరైనోడు' కాసుల వర్షం కురిపిస్తున్నాడని చెప్పారు. ఉత్తర అమెరికాలో ఇప్పటికే కలెక్షన్లు 5 లక్షల డాలర్లు మించాయి. గీతా ఆర్ట్స్ నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్, కేథరిన్ ట్రెసా హీరోయిన్లుగా నటించారు. -
మూడు రోజుల్లో రూ. 54 కోట్ల కలెక్షన్లు
ముంబై: బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తాజా చిత్రం 'సింగ్ ఈజ్ బ్లింగ్' భారీ వసూళ్లను సాధిస్తోంది. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం తొలి మూడు రోజుల్లో 54.44 కోట్ల రూపాయలు రాబట్టింది. అక్షయ్ కుమార్ కెరీర్లో బాక్సాఫీస్ వద్ద ఎక్కువ ప్రారంభ వసూళ్లు సాధించిన చిత్రం ఇదే. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అక్షయ్, అమీ జాక్సన్, కే కే మీనన్, లారా దత్తా నటించారు. రౌడీ రాథోడ్ తర్వాత ప్రభుదేవా, అక్షయ్ కుమార్ కాంబినేషన్లో వచ్చిన రెండో చిత్రమిది. -
'1' నేనొక్కడినే ఓపెనింగ్ కలెక్షన్ రూ. 8.4 కోట్లు
చెన్నై: 'ప్రిన్స్' మహేష్‌బాబు నటించిన '1' నేనొక్కడినే బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తోంది. ఓపెనింగ్ రోజు రూ. 8.4 కోట్లు కలెక్షన్లు వసూలు సాధించింది. అయితే 'అత్తారింటికి దారేది' సినిమా ప్రారంభ వసూళ్లను '1' అధిగమించలేకపోయింది. ఈ సినిమాపై ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన రావడంతో అనుకున్న స్థాయిలో కలెక్షన్లు లేవని విశ్లేషకులు అంటున్నారు. రూ. 70 కోట్లు బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాను శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా 1400 స్ర్కీన్లపై విడుదల చేశారు. సైకాలజికల్ థిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. భారీ అంచనాలు, డిపెరెంట్ నేరేషన్, నిడివి ఎక్కువగా ఉండడం సినిమాకు ప్రతిబంధకంగా మారిందని విశ్లేషకులు అంటున్నారు. మిశ్రమ స్పందన వ్యక్తమవడంతో సినిమా నిడివి తగ్గించినట్టు సమాచారం. -
ధూమ్ ౩ తొలిరోజు కలెక్షన్లు 35 కోట్లు!!
అమీర్ ఖాన్ విలన్‌గా నటించిన ధూమ్-౩ అంచనాలకు తగ్గట్లే ఆడుతోంది. మొట్టమొదటి రోజే ఏకంగా 35 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. దాదాపు 100 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందిన ఈ భారీ చిత్రం హిందీలో రూ. 33.42 కోట్లు, తెలుగు, తమిళంలో కలిపి రూ. 2.80 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ ఎనలిస్టు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ఇప్పటివరకు సెలవులు కాని రోజుల్లో విడుదలైన చిత్రాల్లో దీనిదే అతిపెద్ద ఓపెనింగ్ అని ఆయన చెప్పారు. అభిషేక్ బచ్చన్, ఉదయ్ చోప్రాలతో పాటు ఈసారి కత్రినా కైఫ్ కూడా నటించిన ఈ సినిమాలో అద్భుతమైన స్టంట్టు ఉన్నాయి. ఈ సినిమా దేశవ్యాప్తంగా 4వేల థియేటర్లలో విడుదలైంది. ఇది చాలా అద్భుతమైన సినిమా అని, అమీర్ ఖాన్, కత్రినా కైఫ్ లాంటి అగ్రనటులు ఉండటంతో తమకు ప్రీ బుకింగుల రూపంలోనే 3.5 కోట్లు వచ్చాయని, తొలిరోజున అన్ని థియేటర్లలో 90 శాతానికి పైగా ఆక్యుపెన్సీ ఉందని పీవీఆర్ సినిమాస్ సీవోవో గౌతమ్ దత్తా చెప్పారు.