ఫస్ట్‌ డే కలెక్షన్స్‌ అదుర్స్‌.. రాజా! | Raja The Great movie First day Collection | Sakshi
Sakshi News home page

రాజాకు గ్రేట్‌ కలెక్షన్లు!

Oct 19 2017 5:05 PM | Updated on Oct 20 2017 9:16 AM

Raja The Great movie First day Collection

సాక్షి, హైదరాబాద్‌: రవితేజ తాజా సినిమా ‘రాజా ది గ్రేట్‌’  ప్రేక్షకులను అలరిస్తోంది. దీపావళి కానుకగా గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద దూసుకుపోతుంది. మొదటి రోజు రూ. 10 కోట్లు వసూలు చేసినట్టు ‘ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ వెల్లడించింది. అయితే ఓపెనింగ్‌ డే కలెక్షన్ రూ. 15 కోట్ల వరకు ఉండే అవకాశముందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రెండో రోజు దీపావళి సెలవు కావడంతో వసూళ్లు మరింత పెరిగే అవకాశముందని భావిస్తున్నాయి. ప్రేక్షకాదరణ ఇలాగే కొనసాగితే రవితేజ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఈ సినిమా నిలుస్తుందని అంటున్నారు.

కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా అమెరికాలోనూ మంచి కలెక్షన్లు రాబోడుతోందని ప్రముఖ ట్రేడ్‌ ఎనలిస్ట్‌ తరణ్‌ ఆదర్శ్‌ తెలిపారు. 95 ప్రాంతాల్లో విడుదలైన ఈ చిత్రం తొలిరోజు 84.32 లక్షలు వసూలు చేసినట్టు వెల్లడించారు. వారం మధ్యలో విడుదలైనా ఓపెనింగ్స్‌ బాగున్నాయని, వారాంతంలో కలెక్షన్లు మరింత పెరుగుతామని ఆయన అంచనా వేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ సినిమాలో మెహ్రీన్‌ పిర్జాదా హీరోయిన్‌గా నటించింది. రాధికా శరత్‌కుమార్‌, ప్రకాశ్‌రాజ్‌, వివన్, రాధిక, శ్రీనివాస్ రెడ్డి ముఖ్యపాత్రల్లో కనిపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement