Raja the Great
-
హీరోగా ఎంట్రీ ఇస్తున్న రవితేజ కొడుకు?
టాలీవుడ్లో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి స్టార్ హీరోగా ఎదిగిన హీరోల్లో మాస్ మహారాజా రవితేజ ఒకరు. కెరీర్ ఆరంభంలో చిన్న పాత్రలు చేస్తూ ఇప్పుడు స్టార్ హీరోగా సత్తా చాటుతున్న రవితేజకు మహాధన్ అనే కొడుకు ఉన్న సంగతి తెలిసిందే. ఈయన హీరోగా నటించిన 'రాజా ది గ్రేట్' సినిమాలో రవితేజ చిన్నప్పటి రోల్లో మహాధన్ కనిపించాడు. ఇక అప్పటి నుంచి హీరోగా రవితేజ కొడుకు ఎంట్రీ అంటూ వార్తలు పుట్టుకొస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇదివరకే స్పందించిన రవితేజ అతని చదువు పూర్తవగానే సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాడని పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా కాలేజీ నేపథ్యంలో సాగే ఓ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ని మహాధన్‌తో తీయడానికి రవితేజను సంప్రదించగా ఆయన కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. రాజా ది గ్రేట్ సినిమాతో రవితేజకు హిట్ ఇచ్చిన అనిల్ రావిపూడే ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తుంది. దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. -
హీరోకు జబ్బు.. నిర్మాతకు డబ్బు
-
‘రాజా ది గ్రేట్’ కి సీక్వెల్.. మరోసారి మాయ చేయనున్న అనిల్
మాస్ మహారాజ రవితేజ, యంగ్ సెన్సేషన్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘రాజా ది గ్రేట్’. 2017లో ఫన్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్‌గా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ఇందులో రవితేజని అంధుడిగా చూపించి మెప్పించాడు అనిల్ రావిపూడి. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో దీనికి సీక్వెల్ ఉంటుందని అనిల్ రావిపూడి ఓ సందర్భంలో చెప్పాడు. అయితే అది ఎప్పుడనేది కూడా చెప్పలేనని తెలిపారు. తాజాగా దీనిపై ఓ న్యూస్ టాలీవుడ్లో చక్కర్లు కొడుతుంది. అనిల్ రావిపూడి 'రాజా ది గ్రేట్' సీక్వెల్‌కు కథ రెడీ చేస్తున్నాడట. ఇటీవల హీరో రవితేజకి అనిల్ రావిపూడి స్టోరీలైన్ వినిపించాడట. అది నచ్చడంతో పూర్తి స్కిప్టు రెడీ చేసుకోమని రవితేజ చెప్పాడట. దీంతో అనిల్ రావిపూడి స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా ఉదృతి తగ్గి, పరిస్థితులు అనుకూలిస్తే ఈ ఏడాది చివరిలో లేదా వచ్చే ఏడాది జనవరిలో సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రవితేజ ప్రస్తుతం ‘ఖిలాడి’ చిత్రంలో నటిస్తున్నాడు. అనిల్ రావిపూడి వెంకటేశ్, వరుణ్‌తేజ్‌తో కలిసి ‘ఎఫ్ 3’ మూవీ తీస్తున్నాడు. అయితే కరోనా కారణంగా ఈ మూవీ షూటింగ్ నిలిచిపోయింది. -
షూటింగ్ పూర్తి చేసుకున్న ‘నేల టిక్కెట్టు’
రీ ఎంట్రీలో మాస్ మహారాజ్ రవితేజ ఫుల్ ఫాంలో ఉన్నాడు. లాంగ్ గ్యాప్ తరువాత రాజా ది గ్రేట్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన రవితేజ సూపర్ హిట్ అందుకున్నారు. తరువాత టచ్ చూసి చూడుతో కాస్త తడబడినా వెంటనే తన మార్క్ మాస్ ఎంటర్టైనర్ నేల టిక్కెట్టుతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. సోగ్గాడే చిన్ని నాయనా, రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలతో వరుస విజయాలు అందుకున్న కల్యాణ్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన సందర్భంగా దర్శకుడు కల్యాణ్ కృష్ణ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. షూటింగ్ పూర్తి అయినందుకు చాలా ఆనందంగా ఉంది, అదే సమయంలో యూనిట్ మొత్తాన్ని చాలా మిస్ అవుతున్నా అంటూ ట్వీట్ చేశారు కల్యాణ్ కృష్ణ. రవితేజ సరసన మాళవిక శర్మ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామ్ తళ్లూరి నిర్మిస్తున్నారు. మే 10న జరగనున్న ఈ సినిమా ఆడియో వేడుకకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిధిగా హాజరు కానున్నారు. Its a mixed feeling.. very happy and damn missing .. just done wit last day shoot of #nelatickettu wit mass maharaj.. loved working wit @RaviTeja_offl😍love you sir ❤️🤗 — Kalyankrishnkurasala (@kalyankrishna_k) 7 May 2018 -
నెల్లూరంటే ఇష్టం : హీరోయిన్ మెహ్రిన్
సాక్షి, నెల్లూరు(బృందావనం): నెల్లూరుంటే తనకు ఎంతో ఇష్టమని రాజాది గ్రేట్ ఫేమ్, ప్రముఖ సినీ హీరో యిన్ మెహ్రిన్‌కౌర్ పేర్కొన్నారు.వీనులవిందైన సంగీతం, సినీతారల మెరుపులు, మిరుమిట్లుగొలిపే విద్యుద్దీపకాంతుల నడుమ నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లోని మైదానంలో శనివారం రాత్రి తెలుగుసినీ కళోత్సవం వైభవంగా జరిగింది. ముఖ్య అతిథిగా ప్రముఖ హీరోయిన్ మెహ్రిన్‌కౌర్ హాజరై మాట్లాడారు. నెల్లూరుకు మళ్లీ మళ్లీ రావాలని ఉందన్నారు. ఇప్పటి వరకు ఏడు పర్యాయాలు నెల్లూరుకు వచ్చానన్నారు. నెల్లూరన్నా.. నెల్లూరీయులన్నా తనకెంతో ఇష్టమన్నారు. ఎలా ఉన్నారంటూ...? ముద్దు ముద్దు మాటాలతో సింహపురీయుల్లో జోష్ నింపారు. నెల్లూరీయులంటే ఎనర్జిటిక్ అని మెహ్రిన్‌కౌర్ ప్రశంసలజల్లు కురిపించారు. స్కంద ఆర్ట్స్ పర్యవేక్షణలో నిర్వహించిన తెలుగుసినీ కళోత్సవ కార్యక్రమాన్ని తొలుత ఆ సంస్థ సీఈఓ సందీప్‌దంపతులు జ్యోతిప్రజ్వలనచేసి ప్రారంభించారు. బుల్లితెర హాస్యనటులు బుల్లెట్భాస్కర్, సునామీ సుధాకర్, ఉదయ్, చైతన్య బృందం నిర్వహించిన(జబర్దస్త్ టీం) స్కిట్స్ నవ్వులు పూయించాయి. ప్రముఖ ల్యాండ్ డెవలపర్, రియల్టర్ సత్యంజీ గ్రూప్ అధినేత జి.సత్యనారాయణ, జెడ్ఎస్ న్యూస్ మీడియా ఇన్చార్జి దిలీప్, హోండా, వెస్పా సన్ మోటార్స్, సజావ్కార, సెట్నెల్, స్పోర్ట్స్ అథారిటీ నిర్వాహకులు పర్యవేక్షించారు. కళాకారుల ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. జ్యోతిప్రజ్వలన చేసి కళోత్సవాన్ని ప్రారంభిస్తున్న సందీప్‌దంపతులు -
‘రవితేజకు ఏం కాలేదు’
లాంగ్ గ్యాప్ తరువాత రాజా ది గ్రేట్ సినిమాతో ఆకట్టుకున్న రవితేజ యమా స్పీడుగా సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల టచ్ చేసి చూడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ఎనర్జిటిక్ స్టార్ ప్రస్తుతం సోగ్గాడే చిన్నినాయనా ఫేం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు నేల టికెట్ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న రవితేజకు సంబంధించిన వార్త ఒకటి రెండు రోజులుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. షూటింగ్ లో జరిగిన ప్రమాదంలో రవితేజ గాయపడ్డారని, తీవ్రమైన గాయాలు కాకపోయినా ప్రస్తుతం ఆయన హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ వార్తలపై స్పందించిన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ‘అసలేం జరగలేదు.. అవన్నీ పుకార్లు.. ఎవరు ఆందోళన చెందొద్దు.. ఆయన (రవితేజ) ఎప్పటి లాగే పర్ఫెక్ట్గా ఉన్నారు’ అంటూ ట్వీట్ చేశారు. Nothing happened.. all false news .. don’t worry.. he is damn perfect as always ..😊👍🏻 https://t.co/qwlqsxjuRq — Kalyankrishnkurasala (@kalyankrishna_k) 27 February 2018 -
‘నేల టికెట్’కు 25 కోట్లు
రాజా ది గ్రేట్ సినిమాతో గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇచ్చిన మాస్‌మహారాజ్ రవితేజ తరువాత టచ్‌చేసి చూడు సినిమాతో మరోసారి తడబడ్డాడు. ప్రస్తుతం ఈ ఎనర్జిటిక్ స్టార్ నేల టికెట్ సినిమాలో నటిస్తున్నాడు. సోగ్గాడే చిన్ని నాయనా, రారండోయ్ వేడుక చూద్దాం లాంటి రెండు వరుస విజయాల తరువాత కళ్యాణ్ కృష్ణ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో మాళవిక శర్మ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన బిజినెస్ కూడా దాదాపుగా పూర్తయినట్టుగా చిత్రయూనిట్ ప్రకటించారు. సినిమాకు సంబందించిన డిజిటల్, శాటిలైట్, హిందీ డబ్బింగ్ రైట్స్‌ను ఓ ప్రముఖ టీవీ ఛానల్ 25 కోట్లకు సొంతం చేసుకుంది. గత చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా.. మాస్ లో రవితేజకు ఉన్న ఫాలోయింగ్‌ను దృష్టిలో పెట్టుకొని ఇంతటి భారీ మొత్తాన్ని ఆఫర్ చేసినట్టుగా తెలుస్తుంది. -
‘నింగి మెరుపులా దూకుతాడు వీడు’
రాజా ది గ్రేట్ సినిమాతో ఘనవిజయం సాధించిన రవితేజ, మరోసారి తన ఎనర్జీకి తగ్గ పాత్రలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో తెరకెక్కుతున్న టచ్ చేసి చూడు సినిమాలో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు రవితేజ. రాశీఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా టైటిల్ సాంగ్ లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. రవితేజ క్యారెక్టరైజేషన్ కు సంబంధించిన ఈ పాటకు మార్క్ డి మ్యూస్ సంగీతమందించగా చంద్రబోస్ సాహిత్యమందించారు. బ్రిజేష్ శాండిల్య, శ్రీరామ్ చంద్రలు ఆలపించారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను ఫిబ్రవరి మొదటి వారంలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
రవితేజకు జోడిగా కొత్తమ్మాయి
రాజా ది గ్రేట్ సినిమాతో మంచి హిట్ అందుకున్న రవితేజ వరుస సినిమాలకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే టచ్ చేసి చూడు షూటింగ్ పూర్తి చేసిన ఈ సీనియర్ హీరో త్వరలో కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో మరో సినిమాను ప్రారంభించనున్నాడు. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో రవితేజ సరసన కొత్తమ్మాయిని హీరోయిన్ గా ఫైనల్ చేశారు. జనవరి 5న షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమా కోసం మాళవిక శర్మను హీరోయిన్ గా ఎంపిక చేశారు. ముందుగా హీరోయిన్ పాత్రకు రకుల్ ప్రీత్ సింగ్ ను తీసుకోవాలని భావించినా.. రవితేజ, రకుల్ కాంబినేషన్ లో వచ్చిన కిక్ 2 ఫ్లాప్ కావటంతో వేరే హీరోయిన్ కోసం ప్రయత్నించారు. యాడ్ ఫిలింస్ తో ఆకట్టుకున్న మాళవిక శర్మ, హిమాలయ గర్ల్ గా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు రవితేజ సరసన నేల టికెట్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అవుతోంది. -
‘నేల టికెట్’కు ఫిదా టచ్
‘రాజా ది గ్రేట్’ సినిమాతో కం బ్యాక్ అయిన మాస్ మహారాజ రవితేజ వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. ప్రస్తుతం టచ్ చేసి చూడు పనుల్లో బిజీగా ఉన్న ఈ సీనియర్ హీరో వెంటనే ‘సొగ్గాడే చిన్నినాయనా’ ఫేం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకు ‘నేల టికెట్’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. జనవరి 5న సినిమాను లాంచనంగా ప్రారంభించనున్నారు. ఈ సినిమాకు ఓ కొత్త సంగీత దర్శకుడిని తీసుకునే ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా ‘ఫిదా’. ఈ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించిన సంగీత దర్శకుడు శక్తికాంత్ కార్తీక్‌ను ‘నేల టికెట్’ సినిమాకు సంగీత దర్శకుడిగా తీసుకోవాలని భావిస్తున్నారట. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. -
పుట్టిన రోజు కానుకగా ‘టచ్ చేసి చూడు’
రాజా ది గ్రేట్ సినిమాతో మంచి హిట్ అందుకున్న సీనియర్ హీరో రవితేజ, తన తదుపరి చిత్ర పనుల్లో బిజీ అయ్యాడు. రాజా ది గ్రేట్ తో పాటు షూటింగ్ ప్రారంభించిన టచ్ చేసి చూడు సినిమాను రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు. ఈ సినిమాను విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో నల్లమలుపు బుజ్జి, వల్లభనేని వంశీలు నిర్మిస్తున్నారు. రవితేజ సరసన రాశీఖన్నా, సీరత్ కపూర్ లు హీరోయిన్లు గా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్న ఈసినిమాను రవితేజ పుట్టిన రోజు కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. జనవరి 26న రవితేజ పుట్టిన రోజు కావటంతో ఒక్క రోజు ముందు జనవరి 25న సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాను ముందుగా సంక్రాంతికి రిలీజ్ చేయాలని భావించినా.. వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారట. -
మల్టీస్టారర్స్‌తో భారీ చిత్రం
సాక్షి, గుంటూరు : మల్టీస్టారర్ భారీ చిత్రానికి రూపకల్నన చేస్తున్నట్టు ప్రముఖ సినీ దర్శకులు అనిల్ రావిపూడి చెప్పారు. గణపవరం శ్రీ చుండి రంగనాయకులు ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం జరిగిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, చిన్నతనం నుంచి కళలంటే ఎంతో అభిమానమని, సినిమాలు ఎక్కువగా చూసేవాడినని, 2015లో తన బాబాయి అరుణ్ ప్రసాద్ ప్రోద్బలంతో సినీరంగ ప్రవేశం చేసినట్లు చెప్పారు. 2015కు ముందు కంత్రీ, శౌర్యం, గౌతమ్ ఎస్ఎస్సీ, కందిరీగ, మరికొన్ని సినిమాలకు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేశానని తెలిపారు. 2015లో పటాస్ సినిమాకు దర్శకత్వం వహించానన్నారు. ఆ తర్వాత సుప్రీం, రాజా ది గ్రేట్ సినిమాలకు దర్శకత్వం వహించానని పేర్కొన్నారు. త్వరలో దగ్గుబాటి వెంకటేశ్‌తో మల్టీస్టారర్ సినిమాకు రూపకల్పన చేశానని, సినిమాల్లో నాణ్యత, కొత్తదనం చూపే వారికి భవిష్యత్తు ఉంటుందన్నారు. తన స్వగ్రామం యద్దనపూడి మండలం, చిలుకూరివారిపాలెం అని గుంటూరు విజ్ఞాన్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తి చేసి 2005లో సినీరంగంలో అడుగు పెట్టానన్నారు. సినీరంగంలో దిల్రాజాతో పాటూ మరికొంతమంది తనకు ప్రోత్సాహం అందిస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో అవకాశం వస్తే పెద్ద హీరోల సినిమాలకు దర్శకత్వం వహించి టర్నింగ్ పాయింట్ సాధిస్తానన్నారు. -
నా తల్లిదండ్రులే నాకు బలం
చిలుకూరివారిపాలెం (యద్దనపూడి): ‘ నా తల్లిదండ్రుల ప్రోత్సాహం, ప్రోద్బలంతోనే నేను ఈ స్థాయికి చేరుకున్నాను. ఏ కొడుకైనా సినిమా రంగంలోకి వెళ్తానంటే ఏ ఉద్యోగమో, వ్యాపారమే చేసుకోమంటారు.. కానీ నా తల్లిదండ్రులు నేను డైరెక్టర్‌ను అవుతానని చెప్తే నీ వెన్నంటే ఉంటామని నన్ను ప్రోత్సహించారు. అందుకే నా తల్లిదండ్రులే నాకు బలం వారికి జీవితాంతం రుణపడి ఉంటాను’ అని రాజా ది గ్రేట్ సినిమా దర్శకుడు రావిపూడి అనిల్ అన్నారు. చిలుకూరివారిపాలెంలో ఆదివారం రావిపూడి అనిల్‌కి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టుదల, కృషి, ఓర్పుతో ఏ రంగంలోనైనా రాణించవచ్చన్నారు. రాబోయే చిత్రాలు సమాజానికి సందేశాత్మకంగా, హస్యానికి ప్రాధాన్యతనిస్తూ నిర్మిస్తానన్నారు. రచయిత కందిమళ్ల సాంబశివరావు మాట్లాడుతూ మారుమూల గ్రామంలో పుట్టిన అనిల్ అంచెలంచెలుగా ఎదిగారన్నారు. ఆయన దర్శకత్వం వహించిన పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్ సినిమాలు విజయవంతం కావడం ఆనందంగా ఉందన్నారు. ఐ అండ్ పీఆర్ రాష్ట్ర కమిషనర్ ఎస్.వెంకటేశ్వరన్ మాట్లాడుతూ సమాజంలో ఉన్న మంచి చెడులను విశ్లేషిస్తూ ప్రజల్లో తీసుకువచ్చేందుకు నాటకరంగం, చలనచిత్ర రంగం దోహదపడతాయన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, పారిశ్రామిక వేత్తలు, రచయితలు దర్శకుడు అనిల్, ఆంధ్రప్రదేశ్ కాటన్ అసోసియేషన్ అధ్యక్షుడు పెరవళ్లి రాఘవరావును ఘనంగా సత్కరించి సన్మానించారు. కార్యక్రమంలో పేర్ని వీరనారాయణ, కల్పతరువు సంస్థ అధినేత రఘురామిరెడ్డి, ఏఎమ్‌జీ సంస్థల డైరెక్టర్ బాబు, పెరవళ్లి కోటిరామయ్య, రావిపూడి బ్రహ్మయ్య, కరణం శివ, చిలుకూరి శ్రీనివాసరావు, కరణం శ్రీను, కమ్మ పద్మారావు, చెరుకూరి కాంతయ్య తదితరులు పాల్గొన్నారు. -
‘రాజా ది గ్రేట్’ మరింత ఫన్..!
లాంగ్ గ్యాప్ తరువాత మాస్ మహరాజ్ రవితేజ హీరోగా తెరకెక్కిన సినిమా రాజా ది గ్రేట్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించాడు. రవితేజ మార్క్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన రాజా ది గ్రేట్ ఘన విజయం సాధించటంతో చిత్రయూనిట్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఈ వారం గరుడవేగ, నెక్ట్స్‌నువ్వే, ఏంజెల్ లాంటి ఇంట్రస్టింగ్ సినిమాలు రిలీజ్అవుతుండటంతో కలెక్షన్లు పడిపోకుండా కాపాడుకునేందుకు చిత్రయూనిట్ కొత్త ప్లాన్ వేశారు. ఈ శనివారం నుంచి ఎడిటింగ్ లో తీసేసిన మూడు కామెడీ సన్నివేశాలను యాడ్ చేయబోతున్నారు. ఇప్పటికే అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా ఇకపై మరింత వినోదాన్నిపంచనుంది. మరి ఈ కొత్త ప్లాన్ రాజా దిగ్రేట్ థియేటర్లకు రిపీట్ ఆడియన్స్‌ను తీసుకువస్తుందేమో చూడాలి. -
రీమేక్‌ను పక్కన పెట్టేసిన మాస్ మహరాజ్
రెండేళ్ల విరామం తరువాత బ్లాక్ బస్టర్సక్సెస్ తో రీ ఎంట్రీ ఇచ్చాడు మాస్ మహరాజ్ రవితేజ. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన రాజా ది గ్రేట్ సినిమాతో మరోసారి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమా ఘనవిజయం సాధించటంతో వరుస సినిమాలకురెడీ అవుతున్నాడు రవితేజ. ఇప్పటికే టచ్ చేసి చూడు సెట్స్‌మీద ఉండగా, శ్రీనువైట్ల దర్శకత్వంలో మరో సినిమా అంగీకరించాడు. ఈ రెండు సినిమాలతో పాటు తమిళ సూపర్ హిట్ భోగన్ను రవితేజ హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా రవితేజ ఈ రీమేక్‌ను తప్పుకున్నాడన్న ప్రచారం జరుగుతోంది. తమిళ్లో జయం రవి, అరవింద్ స్వామిలు ప్రధాన పాత్రల్లో తెరకకెక్కిన ఈ సినిమా కోలీవుడ్ లో భారీ వసూళ్లు సాదించింది. అయితే ఈ సినిమా తెలుగు రీమేక్‌లో జయం రవి పాత్రకు రవితేజను తీసుకున్నారు. కానీ అరవింద్ స్వామి పాత్రకు సరైన నటుడు కుదరకపోవటంతో రవితేజ ఈ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టేశాడట. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ పై అధికారిక సమాచారం లేకపోయినా.. టచ్ చేసి చూడు సినిమా తరువాత రవితేజ శ్రీనువైట్ల సినిమా చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నాడట. -
విద్యార్థులతో స్టెప్పులేసిన రవితేజ
-
గుంటూరులో రాజా ది గ్రేట్ సక్స్స్ మీట్
-
వీరికి 'రాజా ది గ్రేట్' ఫ్రీ.. ప్రీమియర్ షో
సాక్షి, హైదరాబాద్: దివ్యాంగుల సంక్షేమ శాఖ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. ఆ శాఖ పరిధిలోని సదనాలు, వసతిగృహాల్లో ఉంటున్న దివ్యాంగులకు ఇటీవల విడుదలైన ‘రాజా ది గ్రేట్’ తెలుగు సినిమా ప్రీమియర్ షో ఏర్పాటు చేసింది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సుదర్శన్ 35ఎంఎం సినిమాహాలులో ఆదివారం ఉదయం 11 గంటలకు సినిమాను ప్రదర్శించనున్నారు. దివ్యాంగుడి నేపథ్యంతో సాగే ఈ సినిమాలో హీరో విజయం సాధించిన తీరును వివరించేందుకు షోను ఏర్పాటు చేసినట్లు దివ్యాంగుల సంక్షేమ శాఖ కమిషనర్ బి.శైలజ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రీమియర్ షో అనంతరం హీరో రవితేజతో దివ్యాంగ పిల్లల ముఖాముఖి కార్యక్రమం ఉంటుందని ఆమె పేర్కొన్నారు. -
జనవరి నుంచి మాస్ మహరాజ్ కొత్త సినిమా
రెండేళ్ల విరామం తరువాత వెండితెర మీద కనిపించిన మాస్ మహరాజ్ రవితేజ సూపర్ హిట్ తో అలరించాడు. రాజా ది గ్రేట్ సినిమాలో అంధుడిగా నటించిన రవితేజ గ్రాండ్ విక్టరీతో అభిమానులను ఖుషీ చేశాడు. అదే జోరులో మరిన్ని సినిమాలకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే టచ్ చేసి చూడు సెట్స్ మీద ఉండగా మరో రెండు సినిమాలను లైన్ లో పెడుతున్నాడు ఈ మాస్ హీరో. శ్రీనువైట్ల దర్శకత్వంలో రవితేజ హీరోగా ఓ సినిమా ఉంటుందన్న టాక్ చాలా రోజులుగా వినిపిస్తోంది. ఈ సినిమా జనవరిలో ప్రారంభం కానుంది. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన వెంకీ, దుబాయ్ శీను లాంటి చిత్రాలు ఘనవిజయం ఆసాధించిన నేపథ్యంలో కొత్త సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాతో పాటు తమిళ సూపర్ హిట్ భోగన్ రీమేక్ కూడా అదే సమయంలో ప్రారంభ కానుందట. ఈ రెండు సినిమాల్లో ఒకేసారి నటించేలా ప్లాన్ చేసుకుంటున్నాడు రవితేజ. -
నాలుగు రోజులుగా ఫోన్ కాల్స్ ఆగలేదు
-
మావాడు నా దగ్గరే పోజు కొడుతున్నాడు
‘‘ప్రేక్షకులకు పెద్ద థ్యాంక్స్. ‘రాజా ది గ్రేట్’ సినిమాలో బాగా చేశారంటూ నాకు వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్‌లు చూస్తుంటే హ్యాపీగా ఉంది. కొంచెం గ్యాప్ వచ్చినా రిజల్ట్ చూస్తే.. సో హ్యాపీ. నేను కావాలని గ్యాప్ తీసుకోలేదు... వచ్చిందంతే’’ అని రవితేజ అన్నారు. రవితేజ, మెహరీన్ జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ‘రాజా ది గ్రేట్’ ఇటీవల విడుదలైంది. ఆదివారం సక్సెస్‌మీట్ నిర్వహించారు. రవితేజ మాట్లాడుతూ– ‘‘నన్ను అనిల్ నమ్మాడు. అనిల్‌ని నేను నమ్మాను. అందుకే ఇంత మంచి ప్రాజెక్ట్ వచ్చింది. మెహరీన్‌ది గోల్డెన్‌లెగ్. ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టింది. శిరీష్ చాలా హానెస్ట్‌గా ఉంటాడు. తనలో నాకు నచ్చేది అదే. అనిల్ నువ్వు నీలాగే ఉండు. నిన్ను చెడగొట్టడానికి రకరకాలుగా ట్రై చేస్తుంటారు. అనిల్‌కి మంచి క్లారిటీ, కన్వెన్షన్‌తో పాటు పాజిటివ్ నేచర్ ఉంది. మా వాడి (కొడుకు మహాధన్) నటనకు కూడా మంచి మెసేజ్‌లు వస్తుంటే వాడు పొంగిపోతున్నాడు. నా దగ్గరే చిన్నగా ఫోజు కొట్టడం మొదలెట్టాడు’’ అన్నారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ– ‘‘నాలుగు రోజులుగా ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకుంటూనే ఉన్నాం. అందరూ ఒక్కటే మాట అంటున్నారు. సినిమా సినిమాకి నవ్వులెక్కువవుతున్నాయని. ఇప్పుడు భయం వేస్తోంది. వచ్చే సినిమాలో ఇంకెన్ని నవ్వులు పంచాలా అని. నా గత సినిమాలకీ, ఈ సినిమాకి తేడా ఏంటంటే.. ఈ చిత్రానికి సక్సెస్‌తో పాటు ప్రశంసలు రావడం గొప్పగా ఉంది. సినిమా ప్రారంభం నుంచి ఎంyì ంగ్ వరకూ ఓ అంధుడి క్యారెక్టర్‌తో ప్రేక్షకులను కూర్చోబెట్టడం మామూలు విషయం కాదు. ఏదైనా సినిమాలో ఒక సీన్ హైలైట్ అవుతుంది. ఈ సినిమాలో ఇన్ని సీన్స్ గురించి ప్రేక్షకులు మాట్లాడుకోవడం ఒక రచయితగా, దర్శకునిగా నా లైఫ్‌లో నేను మరచిపోలేను. సక్సెస్ చేసిన ప్రేక్షకులకు జీవితాంతం రుణపడి ఉంటా. అంధ విద్యార్థుల కోసం ఒక షో వేయబోతున్నాం. సాయికార్తీక్ అనగానే అతని ట్యూన్స్ పెద్దగా బాగుండవు కదా అన్నారు. నాకు తెలిసి ఈ జనరేషన్లో వన్నాఫ్ ది బెస్ట్ నేపథ్య సంగీత దర్శకుడతను’’ అన్నారు. ‘‘ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్యూ వెరీ మచ్’’ అన్నారు శిరీష్. ‘‘ఇక డబుల్ హ్యాట్రిక్ కోసం ఎదురు చూస్తున్నా’’ అన్నారు మెహరీన్. సంగీత దర్శకుడు సాయికార్తీక్, కెమెరామేన్ మోహనకృష్ణ, శ్రీనివాసరెడ్డి, రఘుబాబు, రవిప్రకాశ్, ‘చిత్రం’ శ్రీను, ఎడిటర్ తమ్మిరాజు తదితరులు పాల్గొన్నారు. -
మేకింగ్ ఆఫ్ మూవీ - రాజా ది గ్రేట్
-
'రాజా ది గ్రేట్' దర్శకుడి ఆవేదన
తెలుగు, తమిళ్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలను వేదిస్తున్న ప్రధాన సమస్య పైరసీ. ఎంతటి స్టార్ హీరో సినిమా అయినా.. రిలీజ్ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. సినిమా రిలీజ్ అయిన రెండో రోజే పైరసీ వెబ్ సైట్లలో సినిమాల లింకులు దర్శనమిస్తున్నాయి. ఇటీవల రిలీజ్ అయిన రవితేజ సినిమా రాజా ది గ్రేట్ కు కూడా పైరసీ బారిన పడింది. ఈ విషయంపై దర్శకుడు అనిల్ రావిపూడి తన సోషల్ మీడియా పేజ్ ద్వారా స్పందించారు. ఓ అభిమాని ట్విట్టర్ లో షేర్ చేసిన ఫొటోను అనిల్ రీ ట్వీట్ చేశారు. శ్రీనివాస్ కుమార్ అనే వ్యక్తి ' ఎయిర్ పోర్ట్ లాంజ్ లో మేడమ్ హెడ్ ఫోన్స్ పెట్టుకొని మరి చూస్తున్నారు రాజా ది గ్రేట్ సినిమా. చాలా బాధగా ఉంది. సినిమాలను బతికించండి, కిల్ పైరసీ' అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ను రీ ట్వీట్ చేసిన దర్శకుడు 'ఫేస్ బుక్ లో చాలా మంది ఈ సినిమాను షేర్ చేస్తున్నారు. దయచేసి పైరసీని ప్రొత్సహించకండి. థియేటర్లలోనే సినిమాను చూడండి' అంటూ ట్వీట్ చేశారు. #Rajathegreat movie ...sharing by so many people on Facebook wall....plz friends don't encourage piracy..nd watch it only in theatres — Anil Ravipudi (@AnilRavipudi) 21 October 2017 Airport lounge lo madam headphones pettukoni Mari chustunnaru Raja The great film, felt very bad Cinema Lani batikinchandi pls Kill Piracy 🙏 pic.twitter.com/BM3k8DJ2Df — Sreenivasa Kumar (@SKNonline) 21 October 2017 -
రవితేజ సినిమా చూసి ఫోన్లు.. స్విచ్ఛాఫ్!
సాక్షి, భీమిలి: సినిమాలో చెప్పిన ఫోన్ నెంబరు ఎంత పని చేసింది... అదే పనిగా సినిమా బాగుందంటూ ఫోన్లు వస్తుంటే ఆ వ్యక్తికి చిర్రెత్తుకొస్తోంది. ఎందుకంటారా.. ఆ సినిమాలో యాదృచ్ఛికంగా చెప్పిన ఫోన్ నెంబరు తన ఫోన్ నెంబరు ఒకటే కాబట్టి. ఈ విశేషమేంటో చదువుదాం. రాజా ది గ్రేట్ సినిమా ఇటీవలే విడుదలైంది. అందులో హీరో రవితేజ అంధుడిగా, ఆయనకు తల్లి పాత్రలో రాధిక నటించారు. గుడ్డి వాడి (హీరో) చేతిలో ఓడిపోవలసి వచ్చిందిరా అని విలన్లు ఒక డైలాగ్ చెబుతారు. ఆ మాటలను సహించలేని రాధిక మీకు ధైర్యముంటే నా కొడుకు(హీరో రవితేజ) వద్ద ఉండే 8074545422 నంబరుకు మీరున్న లొకేషన్‌ను వాట్సాప్‌లో పెట్టి చూడండి.. అప్పుడు తెలుస్తుంది అని అంటుంది. రవితేజాదిగా రాధిక చెప్పిన ఫోన్ నంబరు విశాఖ జిల్లా ఆనందపురానికి చెందిన లంకలపల్లి గోపి ఫోన్ నెంబరు ఒకటే. దీంతో సినిమా చూసిన చాలామంది ఆ నంబరుకు ఫోన్ చేసి రవితేజ గారండీ.. సినిమా ఎంతో బాగుంది.. మీ నటన అద్భుతం అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. దీంతో రెండు రోజులుగా విరామం లేకుండా ఫోన్ కాల్స్ వస్తుండడంతో విసుగెత్తిన గోపి చివరకు తన ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేసుకోవాల్సి వచ్చింది. రవితేజకు ఫోన్ ఇమ్మంటున్నారు.. తన నంబర్ ఎవరు ఇచ్చారో తెలియదని లంకలపల్లి గోపి చెప్పారు. సినిమా యూనిట్‌తో తనకు ఎటువంటి సంబంధం లేదని, తనకు తెల్సినవాళ్లు ఎవరూ ఈ సినిమాకు పనిచేయలేదని తెలిపారు. సినిమా చూసిన వాళ్లలో చాలా మంది ఫోన్లు చేస్తున్నారని వాపోయారు. వరుసపెట్టి ఫోన్లు వస్తుండటంతో తనకు చాలా ఇబ్బందిగా ఉందని, ఇప్పటివరకు 300 వరకు ఫోన్ కాల్స్ వచ్చాయని వివరించారు. అర్ధరాత్రి కూడా ఫోన్లు వస్తున్నాయని చెప్పారు. ఫోన్ చేసి సినిమా బాగుందని కొంతమంది, రవితేజతో మాట్లాడాలి ఫోన్ ఇవ్వమని కొందరు అడుగుతున్నారని గోపి వివరించారు. -
సోగ్గాడిగా మాస్ మహరాజ్..?
దాదాపు రెండేళ్ల విరామం తరువాత రాజా ది గ్రేట్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన రవితేజ, సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్నాడు. అంధుడిగా కనిపిస్తూనే తన మార్క్ ఎంటర్ టైన్మెంట్ మిస్ కాకుండా రవితేజ తీసుకున్న జాగ్రత్తలు మంచి విజయాన్ని అందించాయి. అదే జోరులో మరిన్ని సినిమాలకు రెడీ అవుతున్నాడు ఈ మాస్ హీరో. ఇప్పటికే టచ్ చేసి చూడు సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్న రవితేజ, పలువురు దర్శకులతోజరుపుతున్నాడు. రవితేజ రవితేజ నెక్ట్స్ సినిమాల లిస్ట్ లో ఓ ఆసక్తికరమైన ప్రాజెక్ట్ చేరిందన్న ప్రచారం జరుగుతోంది. సోగ్గాడే చిన్ని నాయనా సినిమాతో దర్శకుడి మంచి గుర్తింపు తెచ్చుకున్న కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రవితేజ ఓ సినిమా చేయబోతున్నాడట. అంతేకాదు ఈ సినిమా సోగ్గాడే చిన్నినాయనకు ప్రీక్వల్ అన్న టాక్ వినిపిస్తోంది. బంగార్రాజు పేరుతో నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ ఓ సినిమా తెరకెక్కించాలని భావించాడు. అయితే ప్రస్తుతం నాగ్ ప్రాజెక్ట్ చేసేందుకు సుముఖంగా లేకపోవటంతో అదే కథను కొద్దిపాటి మార్పులతో రవితేజ హీరోగా తెరకెక్కించాలని భావిస్తున్నారట. అయితే ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన లేకపోయినా.. ఈ వార్తలు ఫిలిం నగర్ లో గట్టిగానే వినిపిస్తున్నాయి. -
ఫస్ట్ డే కలెక్షన్స్ అదుర్స్.. రాజా!
సాక్షి, హైదరాబాద్: రవితేజ తాజా సినిమా ‘రాజా ది గ్రేట్’ ప్రేక్షకులను అలరిస్తోంది. దీపావళి కానుకగా గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. మొదటి రోజు రూ. 10 కోట్లు వసూలు చేసినట్టు ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ వెల్లడించింది. అయితే ఓపెనింగ్ డే కలెక్షన్ రూ. 15 కోట్ల వరకు ఉండే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రెండో రోజు దీపావళి సెలవు కావడంతో వసూళ్లు మరింత పెరిగే అవకాశముందని భావిస్తున్నాయి. ప్రేక్షకాదరణ ఇలాగే కొనసాగితే రవితేజ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఈ సినిమా నిలుస్తుందని అంటున్నారు. కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా అమెరికాలోనూ మంచి కలెక్షన్లు రాబోడుతోందని ప్రముఖ ట్రేడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ తెలిపారు. 95 ప్రాంతాల్లో విడుదలైన ఈ చిత్రం తొలిరోజు 84.32 లక్షలు వసూలు చేసినట్టు వెల్లడించారు. వారం మధ్యలో విడుదలైనా ఓపెనింగ్స్ బాగున్నాయని, వారాంతంలో కలెక్షన్లు మరింత పెరుగుతామని ఆయన అంచనా వేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ సినిమాలో మెహ్రీన్ పిర్జాదా హీరోయిన్గా నటించింది. రాధికా శరత్‌కుమార్, ప్రకాశ్‌రాజ్, వివన్, రాధిక, శ్రీనివాస్ రెడ్డి ముఖ్యపాత్రల్లో కనిపించారు. -
'రాజా ది గ్రేట్' మూవీ రివ్యూ
టైటిల్ : రాజా ది గ్రేట్ జానర్ : కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ తారాగణం : రవితేజ, మెహరీన్, వివన్, రాధిక, శ్రీనివాస్ రెడ్డి, ప్రకాష్ రాజ్ సంగీతం : సాయి కార్తీక్ దర్శకత్వం : అనిల్ రావిపూడి నిర్మాత : దిల్ రాజు, శిరీష్ దాదాపు రెండేళ్ల విరామం తరువాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ అంధుడిగా కనిపించి షాక్ ఇచ్చాడు. పటాస్, సుప్రీమ్ లాంటి వరుస హిట్స్ తో మంచి ఫాంలో ఉన్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాజా ది గ్రేట్ సినిమాతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన రాజా ది గ్రేట్ మరోసారి మాస్ మహరాజ్ స్టామినాను ప్రూవ్ చేసిందా..? రెండేళ్ల విరామం తరువాత వెండితెర మీద కనిపించిన రవితేజ, అదే స్థాయిలో అలరించాడా..? దర్శకుడు అనిల్ రావిపూడికి హ్యాట్రిక్ విజయం దక్కిందా..? కథ : ప్రకాష్ (ప్రకాష్ రాజ్) సిన్సియర్ పోలీస్ ఆఫీసర్, డ్యూటీ, కూతురు లక్కీ(మెహరీన్) తప్ప మరో ప్రపంచం తెలీదు. తన కూతురి పుట్టిన రోజున తన సొంత ఊరిలో ఉత్సవాలు చేయించటం ప్రకాష్ అలవాటు. అలా ఒకసారి ఉత్సవాలకు వచ్చిన ప్రకాష్, కూతురి వచ్చే ఏడాది నీకో సర్ ప్రైజ్ ఇస్తానని మాట ఇస్తాడు. ఆ తరువాత ప్రకాష్ కు నల్లగొండ జిల్లా, భువనగిరి ప్రాంతానికి ట్రాన్స్ ఫర్ అవుతుంది. అక్కడ క్రిమినల్ దేవరాజ్ (వివన్) ఆగడాలను అడ్డుకునే ప్రయత్నంలో దేవరాజ్ తమ్ముడిని చంపేస్తాడు. అందుకు ప్రకాష్ కూతురు లక్కీ కూడా సాయం చేస్తుంది. తన ప్రాణంగా చూసుకుంటున్న తమ్ముడి చావును తట్టుకోలేని దేవరాజ్, ప్రకాష్ తో పాటు తన తమ్ముడి చావుకు కారణమైన ఆఫీసర్స్ అందరిని చంపేస్తాడు. (సాక్షి రివ్యూస్) లక్కీ మాత్రం అక్కడి నుంచి తప్పించుకుంటుంది. దేవుణ్ని బలంగా నమ్మే ప్రకాష్ తన కూతుర్ని కాపాడటానికి ఎవరో ఒకడు వస్తాడన్న నమ్మకంతో చనిపోతాడు. రాజా (రవితేజ) పుట్టుకతోనే అంధుడు. తన కొడుకుకు కళ్లు లేకపోయినా ఏ విషయంలోనూ ఎవరికన్నా వెనకపడకూడదన్న కసితో రాజాకు చదువుతో పాటు మార్షల్ ఆర్ట్స్ లాంటి వాటిల్లోనూ శిక్షణ ఇప్పుస్తుంది తల్లి అనంత లక్ష్మీ (రాధిక). తన కొడుకు ఎప్పటికైన గొప్పవాడవుతాడన్న నమ్మకంతో రాజా ది గ్రేట్ అంటూ పిలుచుకుంటుంది. రాజాను పోలీస్ ఆఫీసర్ ను చేయాలనుకున్న అనంత లక్ష్మీ, ఐజీ సంపత్ లక్కీ కాపాడేందుకు ఏర్పాటు చేసిన సీక్రెట్ మిషన్ లో రాజాకు అవకాశం ఇప్పిస్తుంది. కళ్లు లేని రాజా, లక్కీని ఎలా కాపాడాడు..? అన్నదే మిగతా కథ. నటీనటులు : రెండేళ్ల తరువాత వెండితెర మీద కనిపించిన రవితేజ, మరోసారి తన మాస్ అప్పీల్ కు డోకా లేదని ప్రూవ్ చేశాడు. డబుల్ ఎనర్జీతో అలరించాడు. అంధుడి పాత్రలోనూ తనదైన హాస్యం పండించి ఆకట్టుకున్నాడు. కామెడీ టైమింగ్ తో పాటు యాక్షన్ సీన్స్ లోనూ తనకు తిరుగులేదని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. హీరోయిన్ గా మెహరీన్ అందంగా కనిపించింది. ఎమోషనల్ సీన్స్ లో మంచి నటన కనబరిచింది. విలన్ గా వివన్, రవితేజతో పోటి పడి అలరించాడు. రాక్షసుడిలా కనిపిస్తూనే కామెడీ పండించటంలోనూ సక్సెస్ అయ్యాడు. స్టైలిష్ విలన్ గా వివన్ కు మరిన్ని అవకాశాలు రావటం ఖాయం.(సాక్షి రివ్యూస్) బుల్లితెర మీద ఎక్కువగా హుందాగా కనిపించే పాత్రలు మాత్రమే చేస్తున్న రాధిక వెండితెర మీద మాత్రం మంచి ఎంటర్ టైనింగ్ రోల్ లో అలరించింది. కామెడీ టైమింగ్ తో నవ్వులు పూయించింది. క్లైమాక్స్ లో రాధిక అనుభవం, నటన.. సీన్స్ మరింత ఎలివేట్ అయ్యేలా చేశాయి. హీరో ఫ్రెండ్ గా శ్రీనివాస్ రెడ్డి మరోసారి తనదైన నటనతో అలరించాడు. ఇతర పాత్రల్లో ప్రకాష్ రాజ్, సంపత్, తనికెళ్ల భరణి తన పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. సాంకేతిక నిపుణులు : మాస్ ఇమేజ్ ఉన్న హీరోను అంధుడి పాత్రలో చూపించే ప్రయత్నం చేసిన దర్శకుడు అనిల్ రావిపూడి మంచి విజయం సాధించాడు. హీరో అంధుడైనా.. కమర్షియల్ ఎలిమెంట్స్ కు ఏ మాత్రం డోకా లేకుండా పక్కా మాస్ మసాలా ఎంటర్ టైనర్ లా సినిమాను నడిపించాడు. తొలి అర్థభాగం ఫుల్ ఎంటర్ టైనింగ్ గా నడిపించిన దర్శకుడు, సెకండ్ హాఫ్ లో కాస్త నెమ్మదిగా కథ నడిపించి బోర్ కొట్టించాడు. అయితే కథ పరంగా కొత్తదనం లేకపోయినా. కథనంతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ప్రతీ సీన్ లోనూ కామెడీ పండిచటంలో సక్సెస్ సాధించిన అనిల్, హ్యాట్రిక్ విజయాన్ని సాధించాడనే చెప్పాలి. (సాక్షి రివ్యూస్) మెహన్ కృష్ణ సినిమాటోగ్రఫి సినిమాకు మరో ప్లస్ పాయింట్. డార్జిలింగ్ లో తీసిన సన్నివేశాలు చాలా అందంగా రిచ్ గా ఉన్నాయి. యాక్షన్ సీన్స్ లోనూ కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. సాయి కార్తీక్ అందించిన పాటలు పెద్దగా గుర్తుండక పోయినా.. నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచింది. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్ధాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : రవితేజ నటన కామెడీ స్క్రీన్ ప్లే మైనస్ పాయింట్స్ : సెకండ్ హాఫ్ లెంగ్త్ ఓవరాల్ గా రాజా ది గ్రేట్ ఫుల్ గా ఎంటర్ టైన్ చేస్తాడు.. - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ చదవండి రంగస్థలం రివ్యూ -
ఫ్యాన్స్ ఆగ్రహం, థియేటర్ ఫర్నిచర్ ధ్వంసం
సాక్షి, సూర్యాపేట : అభిమానం హద్దు మీరింది. టికెట్లు అమ్మి ప్రత్యేక షో వేయలేదని ఆగ్రహించిన అభిమానులు బుధవారం ఓ సినిమా థియేటర్‌పై దాడి చేసి ఆందోళనకు దిగారు. ఆగ్రహం వ్యక్తం చేస్తూ థియేటర్ ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. ఈ ఘటన సూర్యాపేటలో చోటుచేసుకుంది. కాగా హీరో రవితేజ నటించిన ‘రాజా ది గ్రేట్’ చిత్రం బుధవారం విడుదలైన విషయం తెలిసిందే. స్థానికంగా ఉన్న తేజ థియేటర్ యాజమాన్యం నిన్న రాత్రి బెనిఫిట్ షో పేరిట టికెట్లు విక్రయించింది. అయితే సినిమా ప్రదర్శన ఆలస్యం కావడంతో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ చర్యకు పాల్పడ్డారు. కాగా దాదాపు రెండేళ్ల విరామం అనంతరం రవితేజ రాజా ది గ్రేట్ చిత్రంతో ప్రేక్షకుల ముందకు వచ్చాడు. దిల్ రాజు నిర్మాణ సారధ్యంలో రావిపూడి అనిల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సాయి కార్తీక్ సంగీతం అందించాడు. -
రాజా ది గ్రేట్ అవుతుంది
ద్వారకాతిరుమల : రాజా ది గ్రేట్ సినిమాను అన్ని వర్గాల ప్రజలు ద గ్రేట్ అనేలా నిర్మించామని ప్రముఖ సినీ నిర్మాత దిల్‌రాజు అన్నారు. తెలుగు చిత్రపరిశ్రమలో ఉన్న దీపావళి సెంటిమెంట్‌ను తాను బ్రేక్‌చేసి విజయాన్ని పొందుతానని ధీమా వ్యక్తం చేశారు. ద్వారకాతిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయంలో రాజా ది గ్రేట్ చిత్ర యూనిట్ సభ్యులు సోమవారం సందడి చేశారు. సినిమా ఘనవిజయం సాధించాలని శ్రీవారికి అమ్మవార్లకు పూజలు చేశారు. భక్తులు దిల్‌రాజు, హీరోయిన్ మెహ్రీన్‌కౌర్, దర్శకుడు రావిపూడి అనిల్, మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తీక్‌లతో ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపారు. అనంతరం స్థానిక వీఐపీ లాంజ్‌లో వారు విలేకర్లతో మాట్లాడారు. హీరో రవితేజ అద్భుతంగా నటించారని దిల్‌రాజు అన్నారు. ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ ఎల్వీఆర్ (ఏలూరు), సీతారామ్ తదితరులున్నారు. మద్ది హనుమను దర్శించుకున్న చిత్ర యూనిట్ జంగారెడ్డిగూడెం రూరల్: గుర్వాయిగూడెంలోని మద్ది ఆంజనేయస్వామిని సోమవారం రాజా ది గ్రేట్ చిత్ర యూనిట్ బృందం దర్శించుకున్నారు. స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ గెస్ట్‌హౌస్‌లో విలేకరులతో హీరోయిన్ మెహ్రీన్ మాట్లాడుతూ ఈ చిత్రం విజయవంతం కావాలని మద్ది ఆంజనేయస్వామిని మొక్కుకున్నానన్నారు. -
హీరోలు ముందుకొస్తేనే కొత్త కథలొస్తాయి– ‘దిల్’ రాజు
‘‘రవితో (రవితేజ) నాకు 20ఏళ్ల పరిచయం. ‘ఆర్య’ కథని ఫస్ట్ తనకే చెప్పాం. కథ బాగుంది. కానీ, నాకు కరెక్ట్ కాదన్నాడు. నితిన్, ప్రభాస్ తర్వాత బన్ని (అల్లు అర్జున్) వద్దకు వెళ్లింది. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే కొన్ని కథలు వాటికవే ప్రయాణం చేస్తూ వాళ్లతోనే చేయిస్తాయి’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. రవితేజ, మెహరీన్ జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ‘రాజా ది గ్రేట్’ ఈ నెల 18న రిలీజవుతోంది. ప్రీ–రిలీజ్ ఫంక్షన్లో ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘అనిల్ నాకు ‘రాజా ది గ్రేట్’ ఐడియా చెప్పినప్పుడు ఎగై్జటయ్యా. సినిమా మొత్తం హీరో అంధుడు అన్నప్పుడు తెలుగులో ఇలాంటి సినిమా వర్కట్ అవుద్దా? అని చాలామంది డౌట్లు అడిగారు. ఈ కథ చాలామంది హీరోల వద్దకు వెళ్లింది. రవికి రాసిపెట్టి ఉండటంతోనే ఆయన వద్దకు వెళ్లింది. సినిమా చూశాక రవికి ఫోన్ చేసి ‘ఇరగ్గొట్టేశావ్’ అన్నా. ‘నీ మాటలో ఏంటి? ఇంత కాన్ఫిడెన్స్’ అన్నారు. ‘శతమానం భవతి, నేను లోకల్, డీజే, ఫిదా’ వరుస సక్సెస్‌లు. బాల్ పడుతుంటే బ్యాట్స్‌మెన్‌కి టెన్షన్ ఉన్నట్టే నాకూ ఈ సినిమాతో మొన్నటి వరకూ టెన్షన్ ఉండేది. సినిమా చూశాక ‘థ్యాంక్యూ అనిల్... ఫిఫ్త్ బాల్ కూడా సిక్సర్ కొట్టేశాం’ అన్నా. రవితేజ కెరీర్లో ‘ఇడియట్’ వన్నాఫ్ ద బెస్ట్ ఫిల్మ్. ఆ తర్వాత ‘భద్ర’, ‘విక్రమార్కుడు’... ఇప్పుడు మళ్లీ ‘రాజా ది గ్రేట్’. మమ్మల్ని నమ్మి అంధుడి పాత్ర చేసినందుకు రవికి హ్యాట్సాఫ్. కమర్షియల్ సినిమా కొత్తగా రావాలంటే అది హీరోతోనే సాధ్యం. హీరో ముందుకొస్తే కొత్త కథలు, పాత్రలొస్తాయి’’ అన్నారు. రవితేజ మాట్లాడుతూ– ‘‘ఈరోజు నేనీ స్థాయిలో ఉన్నానంటే నా డైరెక్టర్లే కారణం. మనకి నిర్మాతలు చాలామంది ఉంటారు. మేకర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. వారిలో రాజు ఒకరు. తనకున్న జడ్జిమెంట్ కానీ, టేస్ట్ కానీ, ఆ సక్సెస్ రేట్ చూస్తే తెలుస్తుంది. ప్రతి సినిమాకి రేయింబవళ్లు కష్టపడతాడు తను. శిరీష్ నాలానే. అనిల్ మంచి ఎనర్జిటిక్, పాజిటివ్ పర్సన్. ఈ సినిమాతో హ్యాట్రిక్ కొడతాడు’’ అన్నారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ– ‘‘సుప్రీమ్’ తర్వాత రాజుగారితో బ్లైండ్ కాన్సెప్ట్ చెప్పగానే చేద్దామన్నారు. రవితేజగారు ఎంటరయ్యాక ఆయన ఎనర్జీ లెవల్స్‌కి తగ్గట్టు కథ రాశా. కథ మొత్తం అమ్మాయి చుట్టూ తిరిగినా... మార్నింగ్ షో చూశాక అందరూ ‘రవితేజ ది గ్రేట్’ అంటారు. ఆయన నటన చూశాక నాకు మాటలు రాలేదు. నిర్మాతలు నాకు ఫ్రీడమ్ ఇవ్వబట్టే ఇంతమంచి సినిమా వచ్చింది’’ అన్నారు. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ– ‘‘వెరైటీ పాత్రలు చేయాలనుకునే వారే నటులు. నాకు తెలిసి ఒక కమర్షియల్ హీరో... మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో ఇంత అద్భుతమైన పాత్ర చేయడం తొలిసారి. ఈ సినిమా తర్వాత ‘రవితేజ గొప్ప నటుడు’ అంటారు. ‘సర్వేంద్రియానాం సర్వమ్ ప్రదానం’ అని ఈ సినిమా ప్రూవ్ చేస్తుంది’’ అన్నారు. -
ఈ దీపావళి ఫుల్ స్పెషల్!!
‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ సినిమాలో ‘‘నేను చెప్పానా! నీకు చెప్పానా!! నీకు చెప్పానా!!!’’ అంటూ ఓ డైలాగ్ ఉంది. గుర్తొచ్చింది కదూ!? ఆ మహాలక్ష్మిని మనమెలా మరచిపోతాం!? ఇప్పుడు ఆ మహాలక్ష్మి.. అదే మన మెహ్రీన్.. టాలీవుడ్ సెన్సేషన్. దసరాకు ‘మహానుభావుడు’తో వచ్చి హిట్ కొట్టేసింది. దీపావళికి ‘రాజా ది గ్రేట్’ అంటూ వచ్చేస్తోంది. ఆ వెంటనే ‘జవాన్’. ఇలా తెలుగులో ఫుల్ బిజీ అయిపోయిన మెహ్రీన్ చెప్పిన దీపావళి ముచ్చట్లివి.. ఫెస్టివల్ టు ఫెస్టివల్.. పండగంతా మీ సినిమాలతోనే నిండిపోయినట్టుందీ? (నవ్వుతూ..) బ్లెస్స్డ్. దసరాకి వచ్చిన ‘మహానుభావుడు’ ఇంత పెద్ద హిట్ అవుతుందని అనుకోలేదు. రేపు దీపావళికి ‘రాజా ది గ్రేట్’ వచ్చేస్తోంది. ఈ ఫెస్టివల్ టైమ్ నిజంగా స్పెషల్! ఈ దీపావళి స్పెషల్ ఏంటి? ఈ దీపావళే స్పెషల్! దీపావళంటే ఇంట్లో అందరం ఒక్కచోట చేరిపోతాం. నిజంగా పండుగ అనే దానికి అర్థమిచ్చేలా ఉంటుంది అందర్నీ కలవడం. ఈ సారైతే ‘రాజా ది గ్రేట్’ విడుదలవుతోంది. సో అదింకా స్పెషల్. హ్యాట్రిక్ కొడతానన్న నమ్మకం ఉంది. చిన్నప్పుడు దీపావళి ఎలా సెలిబ్రేట్ చేసుకునేవారు? చిన్నప్పుడు దీపావళికి క్రాకర్స్ కాల్చడం పెద్ద సరదా. ఇల్లంతా పిల్లలే ఉండేవాళ్లం కదా, ఎంత సేపు కాల్చినా సరిపడేన్ని క్రాకర్స్ కొనిపెట్టేది అమ్మ. పొద్దునంతా పూజ చేస్తూంటే, ఎప్పుడెప్పుడు సాయంత్రం అవుతుందా.. ఎప్పుడెప్పుడు క్రాకర్స్ కాలుస్తానా అని ఎగై్జట్ అయిపోయేదాన్ని. ఇప్పుడు క్రాకర్స్‌కి పూర్తిగా దూరం. పెద్దదాన్ని అయిపోయా కదా.. (గట్టిగా నవ్వుతూ!) దీపావళి అనగానే మీకేం గుర్తొస్తుంది? మా ప్రాంతంలో (పంజాబ్) దీపావళి పెద్ద పండుగ. అందరం కలవడమే పెద్ద సెలిబ్రేషన్. అదీకాక నా బర్త్‌డే (నవంబర్ 5) కూడా దీపావళి టైమ్‌లోనే వస్తుంది కాబట్టి ఈ టైమ్ కోసం ఏడాదంతా ఎదురుచూస్తుంటా. ఇప్పుడు నాకు స్మోక్ అన్నా, ఆ సౌండ్ అన్నా చచ్చేంత భయం. చిన్నప్పుడు అంతలా ఎలా క్రాకర్స్ కాల్చేదాన్నా అనిపిస్తూ ఉంటుంది! దీపావళికే వస్తోన్న మీ సినిమా ఎలా ఉండబోతోంది? ‘రాజా ది గ్రేట్’ దీపావళికే రావాల్సిన సినిమా. ఇందులో రవితేజ గారు బ్లైండ్ పర్సన్‌గా కనిపిస్తారు. కళ్లు కనిపించని వారికి ఒక ట్రిబ్యూట్‌లా ఉంటుంది. దీపావళి అంటే వెలుగుల పండుగ. కానీ కళ్లు లేని వాళ్లకు దీపావళి కూడా చీకటే! అయితే వారి మనసు, మంచి ఆలోచనే గొప్ప వెలుగు అని చెప్పేలా సినిమా ఉంటుంది. కాబట్టి ఈ సినిమా దీపావళికి రావడమే పర్ఫెక్ట్. తెలుగు ఇండస్ట్రీ ఎలా ఉంది? పండుగకు ప్రేక్షకులకు ఇచ్చే మెసేజ్? తెలుగు ఇండస్ట్రీ సూపర్బ్. మహాలక్ష్మి అంటూ ఇప్పటికీ నాపై అదే ప్రేమ చూపిస్తున్నారు. ఐ లవ్ పీపుల్ హియర్. నేనిచ్చే మెసేజ్ అంటే అందరూ హ్యాపీగా ఉండాలి. ఒకరి లైఫ్‌లో వెలుగులు నింపే ప్రయత్నం చేస్తే మన లైఫ్ కూడా అందంగా ఉంటుంది. అదే దీపావళి. -
సెన్సార్ పూర్తి చేసుకున్న 'రాజా ది గ్రేట్'
చాలా రోజుల విరామం తరువాత సీనియర్ హీరో రవితేజ హీరోగా తెరకెక్కిన సినిమా రాజా ది గ్రేట్. పటాస్ ఫేం అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెహరీన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను దీపావళి కానుకగా అక్టోబర్ 18న రిలీజ్ చేయనున్నారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. రవితేజ మార్క్ మాస్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు యు/ఎ సర్టిఫికేట్ ను జారీ చేశారు. సాయి కార్తీక్ సంగీతమందిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటి రాధిక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ లకు మంచి రెస్పాన్స్ రావటంతో సినిమా సక్సెస్ మీద కూడా చిత్రయూనిట్ నమ్మకంగా ఉన్నారు. -
మెగా హీరో అతిథి పాత్రపై క్లారిటీ..!
చాలా రోజుల తరువాత మాస్ మహారాజ్ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న సినిమా రాజా ది గ్రేట్. పటాస్ ఫేం అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 18న రిలీజ్ అవుతోంది. రవితేజ అంధుడిగా నటిస్తున్న ఈ సినిమా పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా రూపొందింది. రవితేజ మార్క్ కామెడీతో పాటు మాస్ యాక్షన్, కామెడీ అలరిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. అయితే కొద్ది రోజులుగా ఈ సినిమాలో మెగా హీరో సాయిధరమ్ తేజ్ అతిథి పాత్రలో నటించాడన్న ప్రచారం జరుగుతోంది. రాజా ది గ్రేట్ యూనిట్ తో సాయి కలిసి దిగిన సెల్పీలు సోషల్ మీడియాలో దర్శనమివ్వటంతో ఆ ప్రచారానికి మరింత బలం చేకూరింది. అయితే తాజాగా ఈ విషయంపై దర్శకుడు అనీల్ క్లారిటీ ఇచ్చారు. తమ సినిమాలో రాశీఖన్నా మాత్రమే గెస్ట్ రోల్ చేశారన్న అనీల్, సాయి సరధాగా సెట్ కు వచ్చారే గాని తమ సినిమాలో నటించలేదన్నారు. -
‘రాజా ది గ్రేట్’ ట్రైలర్ లాంచ్
-
ఈ విజయంతో ఓ దారి వేయాలనుకుంటున్నాం – ‘దిల్’ రాజు
‘‘దిల్’ రాజుతో సినిమా చేసి 13 ఏళ్లైంది. కొంచెం లేటయినప్పటికీ... మంచి సినిమా చేశాం. విపరీతమైన క్లారిటీ ఉన్న దర్శకుడు అనిల్. మోస్ట్ పాజిటివ్ పర్సన్! అందర్నీ నవ్విస్తూ హుషారుగా వర్క్ చేస్తాడు. తను చేసినదాంట్లో నేను 50 శాతం చేస్తే... మంచి పేరొస్తుందని నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఈ సిన్మాతో అనిల్‌కి హ్యాట్రిక్ హిట్ వస్తుంది’’ అన్నారు రవితేజ. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఆయన హీరోగా ‘దిల్’ రాజు, శిరీష్‌లు నిర్మించిన ‘రాజా ది గ్రేట్’ ట్రైలర్‌ను శుక్రవారం విడుదల చేశారు. రవితేజ మాట్లాడుతూ– ‘‘మాతో పాటు శిరీష్ ఈ సినిమాకి దగ్గరుండి వర్క్ చేశారు. అంతకుముందు ఆయనతో నాకంత ఇంట్రాక్షన్ లేదు. రాధిక, రాజేంద్రప్రసాద్, పోసానిగార్లతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ సూపర్. వాళ్లతో పాటు శ్రీనివాసరెడ్డి బాగా నటించారు. మెహరీన్‌కి కూడా ఈ సినిమా హ్యాట్రిక్ అవుతుంది. ఎడిటర్ తమ్మిరాజు, డీఓపీ మోహన్‌కృష్ణ, సంగీత దర్శకుడు సాయికార్తీక్‌లతో ఫస్ట్ టైమ్ వర్క్ చేశా. వాళ్లందరూ ఈ సిన్మాతో నెక్ట్స్ లెవల్‌కి వెళతారని అనుకుంటున్నా’’ అన్నారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘అనిల్ కథ చెప్పగానే, రవితేజ నాకు ఫోన్ చేసి... ‘దర్శకుడు నా ముందు చేసినట్టు నేను సినిమాలో చేస్తే చాలు’ అన్నారు. అన్నట్టుగానే అద్భుతంగా నటించాడు. రవితేజ నటనే సినిమా సక్సెస్‌కి ముఖ్య కారణమవుతుంది. వెంకటేశ్వరస్వామి దయ వల్ల హిట్స్‌లో ఉన్న మా సంస్థకి మరో హిట్ అందించేలా ఉన్నాడు అనిల్. దీపావళికి తమిళంలో, హిందీలో పెద్ద సినిమాలు విడుదలవుతాయి. తెలుగులో మాత్రం పెద్ద సినిమాలు విడుదల చేయడానికి ఆలోచిస్తారు. దాన్ని బ్రేక్ చేయాలి. మనకు సంక్రాంతి, ఉగాది, దసరా ఎలాగో... దీపావళి అలాగే కావాలని ప్రయత్నిస్తున్నాం. మా సినిమా విజయంతో తెలుగులో పెద్ద సినిమాల విడుదలకు ఓ దారి వేయాలని కోరుకుంటున్నాం’’ అన్నారు. ‘‘మంచి పేరొచ్చే మంచి సినిమా చేస్తున్నామనే ఫీల్‌ను ‘రాజా... ది గ్రేట్’ స్టార్టింగ్ నుంచి ఎంజాయ్ చేస్తున్నా. రవితేజగారికి 20 నిమిషాలు కథ చెప్పిన తర్వాత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంధుడైన తన కుమారుణ్ణి గుడ్డిగా నమ్మే అమ్మ పాత్రలో రాధికగారు నటించారు. సినిమాకి సెంటర్ పాయింట్ అదే. అంతే గుడ్డిగా రవితేజగారు నన్ను నమ్మారు. ఆయన నమ్మకమే నా బలం. ‘దిల్’ రాజుగారు హెడ్ మాస్ట్టర్లా పాజిటివ్ గైడెన్స్‌తో మమ్మల్ని ప్రొత్సహించారు. దీపావళికి థియేటర్లో బిట్ సాంగ్‌తో ప్రేక్షకుల్ని సర్ప్రైజ్ చేస్తాం’’ అన్నారు అనిల్ రావిపూడి. ‘‘కళ్లుండి గుడ్డివాడిలా నటించడం చాలా కష్టం. కానీ, రవితేజగారు సూపర్‌గా నటించారు. పదిమంది సురేశ్‌బాబులు, పదిమంది ‘దిల్’ రాజులు ఉంటే తెలుగు చిత్రసీమ ఇండియాలో వన్నాఫ్ ది బెస్ట్ ఇండస్ట్రీ అవుతుంది’’ అన్నారు పోసాని. ‘‘ఓ అంధుడిపై ఇంత కమర్షియల్ సిన్మా రావడం గ్రేట్. నా లైఫ్‌లో మర్చిపోలేని సినిమాల్లో ఇదొకటి అవుతుందని గుండె మీద చేయి వేసుకుని చెప్తున్నా’’ అన్నారు రాజేంద్రప్రసాద్. ఈ కార్యక్రమంలో హీరోయిన్ మెహరీన్, నటుడు శ్రీనివాసరెడ్డి, స్వరకర్త సాయికార్తీక్, డీఓపీ మోహన్‌కృష్ణ పాల్గొన్నారు. -
రవితేజ కొత్త సినిమా ట్రైలర్ ఎలా ఉందంటే..
సాక్షి, హైదరాబాద్ : ‘మాస్ మహారాజా’ రవితేజ నటించిన ‘రాజా ది గ్రేట్’ సినిమా ట్రైలర్ శుక్రవారం విడుదలైంది. శ్రీవెంకటేశ్వర పతాకంపై ‘దిల్’రాజు నిర్మించిన ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకుడు. మెహరీన్ కౌర్ హీరోయిన్. దీపావళి కానుకగా అక్టోబర్ 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రవితేజ తన కెరీర్లో మొదటిసారి అంధుడి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘ప్రేక్షకుల ముఖచిత్రాలేమిటో..!’ అనే డైలాగ్ ట్రైలర్లో హైలెట్‌గా నిలిచింది. ఇప్పటికే విడుదలైన టీజర్, రెండు పాటలు నెటిజన్లను ఆకట్టుకున్నాయి. సుమారు రెండు సంవత్సరాల సాంగ్ గ్యాప్ తరువాత రవితేజ నటిస్తున్న ‘రాజా ది గ్రేట్’ మూవీపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. -
ప్రేక్షకుల ముఖచిత్రాలేంటో...?
-
రాజా ది 'గ్రేట్ డీల్'
లాంగ్ గ్యాప్ తరువాత మాస్ మహరాజ్ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న సినిమా రాజా ది గ్రేట్. రవితేజ అంధుడిగా కనిపిస్తున్న ఈ సినిమాలో మెహరీన్ హీరోయిన్ గా నటిస్తోంది. పటాస్, సుప్రీమ్ సినిమాలతో వరుస విజయాలు సాధించిన అనీల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకుడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను అక్టోబర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అనీల్ ట్రాక్ రికార్డ్ కు రవితేజ మాస్ ఇమేజ్ తొడవ్వడంతో రాజా ది గ్రేట్ సినిమా రైట్స్ కు మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఇప్పటికే బిజినెస్ స్టార్ట్ చేసిన చిత్రయూనిట్, శాటిలైట్, డిజిటల్, హిందీ డబ్బింగ్ రైట్స్ భారీ మొత్తానికి అమ్మినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ మూడు రైట్స్ కలిపి 18 కోట్లు పలికినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. రవితేజ సినిమాల డబ్బింగ్ వర్షన్ లకు ఉత్తరాదిలో మంచి డిమాండ్ ఉండటం కూడా ఈ సినిమాకు కలిసొచ్చింది. -
'దర్శకుడి కోసం ఫ్రీగా చేశా'
టాలీవుడ్ యంగ్ హీరోల సరసన నటిస్తూ స్టార్ ఇమేజ్ కోసం కష్టపడుతున్న బ్యూటీ రాశీఖన్నా. త్వరలో ఎన్టీఆర్ సరసన నటించిన జై లవ కుశ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న రాశీ.. ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. సాధారణంగా ఫాంలో ఉన్న హీరోయిన్లు ఎంత చిన్న క్యారెక్టర్లో నటించినా.. ఓపెనింగ్ కార్యక్రమాల్లో పాల్గొన్నా భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తారు. అలాంటి రాశీ ఓ స్పెషల్ సాంగ్ ను ఫ్రీగా చేసిందట. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న రాజా ది గ్రేట్ సినిమాలో రాశీ ఖన్నా స్పెషల్ సాంగ్ లో నటించింది. అయితే ఆ చిత్ర దర్శకుడు అనీల్ రావిపూడితో ఉన్న స్నేహం కారణంగా ఆ పాటలో ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోకుండా నటించిందట రాశీ. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాను వచ్చే నెలలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
రాశీ... రాకింగ్ స్టెప్స్!
రాశీ ఖన్నా ఫస్ట్ టైమ్ ఓ సాంగ్ షూట్‌కి రెడీ అయ్యారు. అదేంటీ! ఇప్పటికే ఆమె చాలా సాంగ్స్ చేశారు కదా.. ఫస్ట్ టైమ్ సాంగ్ చేయడమేంటి? అనుకుంటున్నారా? అవన్నీ హీరోయిన్గా చేశారు. ఇప్పుడు తాను హీరోయిన్ కాని ఓ సినిమాలో కాలు కదపడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రవితేజ, మెహరీన్ జంటగా రూపొందుతున్న చిత్రం ‘రాజా ది గ్రేట్ ’. ఈ చిత్రంలో రవితేజ, మెహరీన్ కాంబినేషన్లో వచ్చే ఓ పాటలో రాశీ ఖన్నా తళుక్కుమంటారు. ఆ పాటలో కాసేపు కనిపించి, అలరించనున్నారు. స్పెషల్ అప్పియరన్స్ అన్నమాట. రెండేళ్ల క్రితం ‘మనం’ సినిమాలో రాశీ గెస్ట్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. కానీ, సాంగ్‌లో స్పెషల్ అప్పియరన్స్ ఇవ్వడం ఇదే తొలిసారి. ‘‘ మై లవ్లీ డైరెక్టర్ అనిల్ రావిపూడి కోసం ‘రాజా ది గ్రేట్’ చిత్రంలో షార్ట్ అండ్ స్పెషల్ అప్పియరన్స్లో కనిపించబోతున్నా’’ అని రాశీ ట్వీట్ చేశారు. వెంటనే ‘‘వెల్కమ్ టు అవర్ వరల్డ్’’ అని అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు. ఈ సాంగ్‌లో రాకింగ్ స్టెప్స్‌లో రాశీ కనువిందు చేయనున్నారట. -
రాజా ది గ్రేట్ లో రాశీ స్పెషల్ సాంగ్
చెన్నై: రవితేజ హీరోగా రానున్న ‘రాజా ది గ్రేట్’ సినిమాలో నటి రాశీఖన్నా ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రంలోని ప్రత్యేక పాటలో కొద్దిసేపు మాత్రమే కనిపిస్తానని, ఆ పాత్ర స్పెషల్‌గా ఉంటుందని రాశీఖన్నా ట్వీట్ చేసింది. దర్శకుడు అనిల్ రావిపూడి కోరిక మేరకు రాశీ ఈ పాత్ర చేస్తోందని టాక్. రాజా ది గ్రేట్ లో మాస్ రాజా అంధుడిగా కనిపించనున్నాడు. ఈ సినిమాతోనే ఆయన కుమారుడు మహాధన్ తెరంగేట్రం చేయనున్నాడు. రెండేళ్ల తర్వాత వస్తున్నరవితేజ సినిమాలో మెహ్రీన్ పిర్జాదా, ప్రకాష్‌రాజ్, రాధికా శరత్‌కుమార్ లు నటించనున్నారు. దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. -
టచ్‌లోనే ఉన్నారు
ఎవరితో? ‘టచ్ చేసి చూడు’ దర్శక–నిర్మాతలతో! ఆల్మోస్ట్ రెండేళ్లవుతోంది రవితేజ సినిమా వచ్చి! ‘బెంగాల్ టైగర్’ తర్వాత కొన్నాళ్లు సరైన కథల కోసం వెయిట్ చేసిన రవితేజ ఇంచుమించు సేమ్ టైమ్‌లో రెండు సిన్మాలు స్టార్ట్ చేశారు. ఒకటి... అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘రాజా.. ది గ్రేట్’. ఇంకొకటి... రచయిత విక్రమ్ సిరికొండను దర్శకుడిగా పరిచయం చేస్తూ ప్రారంభించిన ‘టచ్ చేసి చూడు’. రీసెంట్గా ఏదొక వార్తతో ఒక సిన్మా టచ్‌లోనే ఉంటోంది. ఇంకొక సిన్మా గురించి ఏ వార్తా వినిపించడం లేదు. ఈలోపు కొందరు ఏవేవో గాసిప్పులు పుట్టించేశారు. ‘టచ్ చేసి చూడు’ ఆగిందన్నది వాటి సారాంశం. అసలు మేటర్ ఏంటంటే... ‘రాజా.. ది గ్రేట్’లో రవితేజ గడ్డంతో కొత్త లుక్‌లో కనిపించనున్న సంగతి తెలిసిందే. ‘టచ్ చేసి చూడు’ను సేమ్ లుక్‌తో చేయడం రవితేజకు ఇష్టం లేదట. అందులో చిన్నపాటి గడ్డంతో కొన్ని, క్లీన్ షేవ్‌తో మరికొన్ని సీన్లలోనూ కనిపించనున్నారట. న్యూ లుక్‌లోకి మారే ముందు ఇప్పుడున్న లుక్‌లో సిన్మా కంప్లీట్ చేయాలనుకున్నారట. ‘‘రవితేజ ‘టచ్ చేసి చూడు’ టీమ్‌తో 100% టచ్‌లో ఉన్నారు. ప్యారలల్‌గా రెండు సిన్మాల షూటింగులు చేయాలంటే... గెటప్ ఇష్యూ వస్తుందని ‘టచ్ చేసి చూడు’కి చిన్న బ్రేక్ ఇచ్చారు. ‘రాజా ది గ్రేట్’ పూరై్తన తర్వాత నాన్–స్టాప్‌గా ‘టచ్ చేసి చూడు’ షూటింగ్ చేయడానికి ప్లాన్ చేశారు. ఆయన క్లీన్ షేవ్‌తో మరింత హ్యాండ్సమ్గా కనిపించే సీన్లను ఈ షెడ్యూల్లో చిత్రీకరించనున్నారు’’ అని నిర్మాణ సంస్థ సన్నిహిత వర్గాలు తెలిపాయి. రాశీఖన్నా, సీరత్ కపూర్ హీరోయిన్లుగా నటిస్తున్న ‘టచ్ చేసి చూడు’ను లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీ నిర్మిస్తున్నారు. -
స్టార్ హీరో వారసుడొస్తున్నాడు..!
ఇండస్ట్రీలో అతి చిన్న స్థాయి నుంచి స్టార్ హీరోగా ఎదిగిన నటుడు రవితేజ. మహా మహరాజ్‌గా తిరుగులేని స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న రవితేజ ఈ మధ్య కాస్త స్లో అయ్యాడు. వరుస ఫ్లాప్‌లు ఎదురవ్వటంతో లాంగ్ గ్యాప్ తీసుకొని ప్రస్తుతం రాజా ది గ్రేట్, టచ్ చేసి చూడు సినిమాలు చేస్తున్నాడు. పటాస్ ఫేం అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజా ది గ్రేట్ ఇప్పటికే షూటింగ్ పూర్తి కావచ్చింది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రస్టింగ్ అప్ డేట్ ఒకటి బయటకు వచ్చింది. రవితేజ కుమార్ మహాధన ఈ సినిమాతో వెండితెరకు పరిచయం అవుతున్నాడట. ఈ సినిమాలో రవితేజ చిన్నప్పటి క్యారెక్టర్లో మహాధన నటిస్తున్నాడు. రాజా ది గ్రేట్ సినిమాలో రవితేజ అంధుడిగా నటిస్తున్నాడు. అంటే తొలి సినిమాలోనే అంధుడిగా ఛాలెంజింగ్ రోల్‌తో వెండితెరకు పరిచయం అవుతున్నా మహాధన. మెహ్రీన్ కౌర్ హీరోయిన్గా నటిస్తున్న రాజా ది గ్రేట్, అక్టోబర్ 12న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
కబడ్డీ.. కబడ్డీ.. కబడ్డీ.. తోడ్‌దే దుష్మన్ కి హడ్డీ!
కబడ్డీ... కబడ్డీ... ఆటగాళ్లు, వీక్షకులతో ఓ ఇండోర్ స్టేడియంలో సందడి నెలకొంది. ఆ ఆటగాళ్లలో రాజా (రవితేజ) ఒకడు. ‘కబడ్డీ.. కబడ్డీ..’ అంటూ కూత పెడుతూ ప్రత్యర్థి కోర్టులోకి అడుగు పెడతాడు. అప్పటివరకు అది ఆటే అనుకుంటారంతా! కానీ, రాజా అడుగుతో వేటగా మారుతుంది. ‘కబడ్డీ.. కబడ్డీ..’ అనే కూత ‘తోడ్‌దే దుష్మన్ కి హడ్డీ’ (దుష్టుల/విలన్స్ ఎముకలు విరగొట్టేయ్) అనేలా వినబడుతుంది అందరికీ! అప్పుడు తను అంధుడనే సంగతి ఎవ్వరికీ గుర్తు రానంతగా రాజా ఆడిన ఆట... కాదు.. కాదు.. సాగించిన వేట ‘రాజా ది గ్రేట్’ సిన్మా హైలైట్స్‌లో ఒకటిగా నిలుస్తుందట! రవితేజ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘రాజా ది గ్రేట్’. ఇందులో రవితేజ అంధుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయినా... ప్రేక్షకులు ఆశించే యాక్షన్ సీక్వెన్సులకు ఏమాత్రం లోటు ఉండదట. ముఖ్యంగా కబడ్డీ ఫైట్ చాలా బాగుంటుందని సమాచారం. ‘దిల్’ రాజు, శిరీష్‌లు నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ప్రస్తుతం రవితేజ, రాధిక, ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. మెహరీన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు సాయికార్తీక్ సంగీత దర్శకుడు. -
రాజా ది గ్రేట్ సినిమా స్టిల్స్
-
ఐయామ్ బ్లైండ్ : రాజా ది గ్రేట్
-
ఐయామ్ బ్లైండ్ : రాజా ది గ్రేట్
మాస్ మహరాజా రవితేజ లాంగ్ గ్యాప్ తరువాత నటిస్తున్న సినిమా రాజా ది గ్రేట్. పటాస్ ఫేం అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేశారు. రవితేజ అంధుడిగా నటిస్తున్న ఈ సినిమాలో కృష్ణగాడి వీర ప్రేమగాథ ఫేం మెహరీన్ కౌర్ హీరోయిన్ గా నటిస్తోంది. బెంగాల్ టైగర్ సినిమా తర్వాత దాదాపు ఏడాది పాటు గ్యాప్ తీసుకున్న రవితేజ రాజా ది గ్రేట్ తో పాటు టచ్ చేసి చూడు సినిమాల్లో నటిస్తున్నాడు.టీజర్ లో మాస్ మాహరాజ్ తనదైన స్టైల్ లో కనిపించాడు. బ్లైండ్ క్యారెక్టర్ లోనే కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ పంచినట్టుగా కనిపిస్తోంది. ఐమామ్ ది బ్లైండ్.. బట్ ఐయామ్ ది ట్రైన్డ్ అంటూ రవితేజ చెప్పే డైలాగ్ హైలెట్ గా నిలుస్తోంది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాను అక్టోబర్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
రాజా ది గ్రేట్ టీజర్
రవితేజ, మెహరీన్ జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్‌లు నిర్మిస్తున్న ‘రాజా ది గ్రేట్’ టీజర్‌ను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 15న విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. -
పంద్రాగస్టుకి...
కళ్ల ముందు ఏం జరుగుతుందో రాజా చూడలేడు. ఎందుకంటే... అతను బ్లైండ్ కాబట్టి! కానీ, సౌండ్‌ను బట్టి చుట్టుపక్కల ఏం జరుగుతుందో చెప్పగలడు. అంత తెలివైనోడు. అయినా... అతనికి కొన్ని కష్టాలు ఎదురయ్యాయి. అవేంటి? అతని కథేంటి? అనేది ఈ ఏడాది అక్టోబర్‌లో చూపిస్తామంటున్నారు హీరో రవితేజ. అంతకంటే ముందు పంద్రాగస్టుకు టీజర్ చూపిస్తారట! అనిల్ రావిపూడి దర్శకత్వంలో రవితేజ బ్లైండ్ పర్సన్‌గా నటిస్తున్న సినిమా ‘రాజా ది గ్రేట్’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌ను ఆగస్టు 15న విడుదల చేయాలనుకుంటున్నారు. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. మెహరీన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీనివాసరెడ్డి, రఘుబాబు, ‘అదుర్స్’ రఘు తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్. -
నాని హీరోయిన్ యమా బిజీ..!
నాని హీరోగా తెరకెక్కిన కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ముద్దుగుమ్మ మెహరీన్. తొలి సినిమాలోనే అందంతో పాటు అభినయంతోనూ ఆకట్టుకుంది మెహరీన్. అయితే కృష్ణగాడి వీర ప్రేమగాథ తరువాత వెంటనే బిజీ హీరోయిన్ అవుతుందని భావించినా.. పెద్దగా అవకాశాలు రాలేద. దీంతో బాలీవుడ్ మీద దృష్టి పెట్టిన మెహరీన్ ఫిలౌరీ సినిమాతో ఆకట్టుకుంది. బాలీవుడ్ సినిమా చేస్తుండగానే టాలీవుడ్ నుంచి వరుస అవకాశాలు తలుపు తట్టాయి. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్‌తో జవాన్, రవితేజతో రాజా ది గ్రేట్, శర్వానంద్, మారుతిల సినిమాల్లో నటిస్తున్న ఈ బ్యూటీ, సందీప్ కిషన్ సరసన నటిస్తున్న సినిమాతో కోలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతోంది. వీటితో పాటు మరికొన్ని సినిమాలు ఇప్పుడు చర్చల దశలో ఉన్నాయి. -
నో మోర్ గ్యాప్!
ప్రామిస్... అభిమానులకు, ప్రేక్షకులకూ రవితేజ ఓ ప్రామిస్ చేస్తున్నారు. అదేంటి అంటే... ఇక నుంచి గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తానంటున్నారు. ‘బెంగాల్ టైగర్’ విడుదలైన 420 రోజుల తర్వాత ‘టచ్ చేసి చూడు’ సినిమాకు కొబ్బరికాయ కొట్టారు. తర్వాత కొన్ని రోజులకు ‘రాజా.. ది గ్రేట్’ సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఇన్నాళ్లు మీరు ఎక్కడికి వెళ్లారు? అని రవితేజను ప్రశ్నిస్తే... ‘‘ఎక్కడికీ వెళ్లలేదు. స్క్రిప్ట్స్ వింటుండేవాణ్ణి. దాంతోనే నా టైమంతా గడిచింది. ఇక నుంచి గ్యాప్ ఉండదు. వరుసగా సినిమాలు చేస్తా. ‘టచ్ చేసి చూడు’ చిత్రీకరణ మొదలైంది. ఏప్రిల్‌లో ‘రాజా.. ది గ్రేట్’ చిత్రీకరణ ప్రారంభించాలనుకుంటున్నాం’’ అన్నారు. ఈ గ్యాప్‌లో ఎప్పుడైనా నెగిటివ్‌గా ఫీలయ్యా రా? అని రవితేజను అడిగితే... ‘‘నా బ్లడ్ గ్రూప్ బీ పాజిటివ్. పాజిటివ్‌గా ఆలోచిస్తా. పాజిటివ్‌గా ఉంటాను’’ అన్నారు. విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో ‘టచ్ చేసి చూడు’ను నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీ నిర్మిస్తున్నారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించనున్న ‘రాజా.. ది గ్రేట్’కి అనిల్ రావిపూడి దర్శకుడు. -
రవితేజ‘రాజా ది గ్రేట్’ ప్రారంభోత్సవం
-
తొలిసారి రవితేజ అంధుడి పాత్ర
-
ఆ చిత్రాలను మించి హిట్ అవుతుంది
–‘దిల్’ రాజు మాస్ మహారాజా రవితేజ కొత్త చిత్రానికి కొబ్బరికాయ కొట్టేశారు. ‘బెంగాల్ టైగర్’ వంటి హిట్ తర్వాత ఏడాదికి పైగా గ్యాప్ తీసుకున్న ఆయన ఇప్పుడు రెట్టించిన కొత్త ఉత్సాహంతో నూతన చిత్రాలను ఎక్స్‌ప్రెస్ లెవల్లో పట్టాలెక్కిస్తున్నారు. రవితేజ హీరోగా విక్రమ్ సిరికొండను దర్శకునిగా పరిచయం చేస్తూ నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీ నిర్మిస్తున్న ‘టచ్ చేసి చూడు’ గత శుక్రవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. రవితేజ, మెహరీన్ కౌర్ జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ నిర్మిస్తున్న ‘రాజా ది గ్రేట్’ మూవీ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. హీరో, హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ఫైనాన్షియర్ ఎం.వి.ఆర్.ఎస్. ప్రసాద్ కెమెరా స్విచ్చాన్ చేయగా, హీరో నందమూరి కల్యాణ్ రామ్ క్లాప్ ఇచ్చారు. కాగా, ఈ చిత్రంలో రవితేజ అంధుడిగా కనిపించనున్నారు. చిత్ర సమర్పకుడు, నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ – ‘‘భద్ర’ చిత్రం తర్వాత రవితేజతో, ‘సుప్రీమ్’ మూవీ తర్వాత అనిల్ రావిపూడితో మా బ్యానర్లో చేస్తున్న చిత్రమిది. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కనుంది. ‘భద్ర’, ‘సుప్రీమ్’ చిత్రాల కంటే ‘రాజా ది గ్రేట్’ బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుంది. మార్చిలో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతాం’’ అన్నారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ– ‘‘వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కనున్న చిత్రమిది. ఇప్పటి వరకూ కనిపించని విలక్షణ పాత్రలో రవితేజ కనిపిస్తారు. ఆయన అభిమానులు, ప్రేక్షకులకు నచ్చేలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ‘దిల్’ రాజుగారి బ్యానర్లో రెండో చిత్రం చేయడం హ్యాపీ. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో చెబుతాం’’ అని తెలిపారు. నిర్మాత శిరీష్, దర్శకుడు సతీష్ వేగేశ్న పాల్గొన్నారు. -
రవితేజ హీరోగా 'రాజా ది గ్రేట్'
లాంగ్ గ్యాప్ తరువాత మాస్ మహరాజ్ రవితేజ షూటింగ్‌కు రెడీ అవుతున్నాడు. దాదాపు సంవత్సర కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ సీనియర్ హీరో, ఒకేసారి రెండు సినిమాలను లైన్లో పెట్టాడు. అంతేకాదు ఈ రెండు సినిమాలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లను కూడా రిలీజ్ చేసిన అభిమానులను ఖుషీ చేస్తున్నాడు. జనవరి 26న తన పుట్టిన రోజు కానుకగా 'టచ్ చేసి చూడు' ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే రిలీజ్ కాగా.. తాజాగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న 'రాజా ది గ్రేట్' టైటిల్ లోగోను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో రవితేజ అంధుడి పాత్రలో కనిపించనున్నాడు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా మార్చిలో సెట్స్ మీదకు వెళ్లనుంది. -
రాజా... నువ్వు గ్రేట్!
రవితేజ హీరోగా నటించబోయే కొత్త సినిమా స్క్రిప్ట్ రెడీ... టైటిల్ కూడా రెడీ! మంచి ముహూర్తం చూసి దర్శక–నిర్మాతలు షూటింగ్ ప్రారంభించడమే తరువాయి. రామ్ దగ్గర్నుంచి ఎన్టీఆర్... అక్కణ్ణుంచి అటూ ఇటూ తిరిగిన బ్లైండ్మ్యాన్ స్టోరీ, చివరకు రవితేజ దగ్గరికి చేరిందట! ఈ కథకు రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని సమాచారం. ‘పటాస్’, ‘సుప్రీమ్’ చిత్రాల ఫేమ్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ఇందులో రవితేజ అంధుడిగా కనిపించనున్నారని ఫిల్మ్‌నగర్ వర్గాల సమాచారం. ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు నిర్మించనున్న ఈ సినిమాకి ‘రాజా... ది గ్రేట్’ టైటిల్ ఖరారు చేశారట! ‘‘ఆల్మోస్ట్ స్క్రిప్ట్ వర్క్ ఫైనల్ వెర్షన్ పూర్తయింది. మార్చిలో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రవితేజ పాత్ర, సినిమా చాలా కొత్తగా ఉంటుంది’’ అని యూనిట్ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఇందులో రవితేజకి జోడీగా ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ ఫేమ్ మెహరీన్ కౌర్ నటించనున్నారు.