పంద్రాగస్టుకి... | Raja The Great Movie Teaser was released on August 15th | Sakshi
Sakshi News home page

పంద్రాగస్టుకి...

Published Mon, Jul 31 2017 12:38 AM | Last Updated on Tue, Sep 5 2017 5:13 PM

పంద్రాగస్టుకి...

పంద్రాగస్టుకి...

కళ్ల ముందు ఏం జరుగుతుందో రాజా చూడలేడు. ఎందుకంటే... అతను బ్లైండ్‌ కాబట్టి! కానీ, సౌండ్‌ను బట్టి చుట్టుపక్కల ఏం జరుగుతుందో చెప్పగలడు. అంత తెలివైనోడు. అయినా... అతనికి కొన్ని కష్టాలు ఎదురయ్యాయి. అవేంటి? అతని కథేంటి? అనేది ఈ ఏడాది అక్టోబర్‌లో చూపిస్తామంటున్నారు హీరో రవితేజ.

అంతకంటే ముందు పంద్రాగస్టుకు టీజర్‌ చూపిస్తారట! అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రవితేజ బ్లైండ్‌ పర్సన్‌గా నటిస్తున్న సినిమా ‘రాజా ది గ్రేట్‌’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌ను ఆగస్టు 15న విడుదల చేయాలనుకుంటున్నారు. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. మెహరీన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీనివాసరెడ్డి, రఘుబాబు, ‘అదుర్స్‌’ రఘు తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement