Meharine
-
చాణక్య వ్యూహం
అవును.. తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి వ్యూహాలు పన్నుతున్నారు గోపీచంద్. మరి.. ఈ వ్యూహాలు ఎంత వరకు సఫలం అయ్యాయి? అతనికి ఎదురైన అడ్డంకులు ఏంటి? అనే ఆసక్తికర అంశాలు ప్రస్తుతానికి సస్పెన్స్. గోపీచంద్ హీరోగా తిరు దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రానికి ‘చాణక్య’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇందులో మెహరీన్, జరీనా ఖాన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ లోగోను దర్శక–నిర్మాతలు ఆదివారం ఆవిష్కరించారు. ‘‘యాభై శాతానికి పైగా చిత్రీకరణ ముగిసింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది. త్వరలోనే ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: అజయ్ సుంకర, అభిషేక్ అగర్వాల్, సంగీతం: విశాల్ చంద్రశేఖర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికపాటి, మాటల రచయిత: అబ్బూరి రవి. -
తెలుగుదనం ఉట్టిపడేలా..
ప్రపంచ తెలుగు మహాసభలు ఈ నెల 15 నుంచి హైదరాబాద్‌లో జరుగనున్న విషయం తెలిసిందే. ఈ సభలును విజయవంతం చేయటం కోసం తెలుగు దర్శకులు కూడా తమ వంతు కృషి చేస్తున్నారని సమాచారం. తెలుగుదనం ఉట్టిపడేలా సభలకు సంబంధించిన ప్రమోషనల్ వీడియోను షూట్ చేసే పనిలో దర్శకులు వంశీ పైడిపల్లి , హరీష్ శంకర్, నందిని రెడ్డి బిజీగా ఉన్నారట. ఆల్రెడీ విజయ్ దేవరకొండ, మెహరీన్ జంటపై హోలీ నేపథ్యంలో ఓ పాటను చిత్రీకరించారట.మరోవైపు సాయి ధరమ్‌తేజ్, తెలుగు అమ్మాయి ఇషాలపై మరో సాంగ్‌ను రెడీ చేస్తున్నారట హారీష్ శంకర్. ఇంతకు ముందు హరీష్ దర్శకత్వంలో తేజ్ హీరోగా వచ్చిన ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ లో తెలుగు గొప్పతనాన్ని వర్ణిస్తూ ఓ పాట ఉన్న సంగతి తెలిసిందే. ఈ ప్రమోషనల్ సాంగ్స్‌ను చంద్రబోస్ రచించారని సమాచారం. -
మహానుభావుడే.. దసరా బుల్లోడు!
ఈ ఏడాది సంక్రాంతికి ‘శతమానం భవతి’, గతేడాది సంక్రాంతికి ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ సిన్మాలతో శర్వానంద్ సందడి చేశారు. ఇప్పుడీ హీరో దసరాపై కన్నేశారు. శర్వానంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న సినిమా ‘మహానుభావుడు’. మెహరీన్ హీరోయిన్. ఓ పాట మినహా చిత్రీకరణ పూర్తయిన ఈ సినిమాను దసరాకు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాతలు ప్రకటించారు. ఈ నెల 24న ఫస్ట్ లుక్, ఫస్ట్ టీజర్లను విడుదల చేస్తారు. దర్శకుడు మారుతి మాట్లాడుతూ– ‘‘భలే భలే మగాడివోయ్’ తర్వాత నాకు నచ్చిన క్యారెక్టరైజేషన్‌తో చేస్తున్న మ్యూజికల్ కామెడీ ఎంటర్టైనర్ ఇది. శర్వానంద్ అద్భుతంగా నటిస్తున్నారు. ఎస్.ఎస్. తమన్ మంచి పాటలిచ్చారు’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: నిజార్ షఫి, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎన్. సందీప్, సహ నిర్మాత: ఎస్.కె.ఎన్. -
పంద్రాగస్టుకి...
కళ్ల ముందు ఏం జరుగుతుందో రాజా చూడలేడు. ఎందుకంటే... అతను బ్లైండ్ కాబట్టి! కానీ, సౌండ్‌ను బట్టి చుట్టుపక్కల ఏం జరుగుతుందో చెప్పగలడు. అంత తెలివైనోడు. అయినా... అతనికి కొన్ని కష్టాలు ఎదురయ్యాయి. అవేంటి? అతని కథేంటి? అనేది ఈ ఏడాది అక్టోబర్‌లో చూపిస్తామంటున్నారు హీరో రవితేజ. అంతకంటే ముందు పంద్రాగస్టుకు టీజర్ చూపిస్తారట! అనిల్ రావిపూడి దర్శకత్వంలో రవితేజ బ్లైండ్ పర్సన్‌గా నటిస్తున్న సినిమా ‘రాజా ది గ్రేట్’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌ను ఆగస్టు 15న విడుదల చేయాలనుకుంటున్నారు. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. మెహరీన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీనివాసరెడ్డి, రఘుబాబు, ‘అదుర్స్’ రఘు తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్.