![Vijay Devarakonda, Mehreen to add Tollywood flavour to World Telugu Conference - Sakshi](/styles/webp/s3/article_images/2017/12/11/VIJAY.jpg.webp?itok=Y46_RDGL)
ప్రపంచ తెలుగు మహాసభలు ఈ నెల 15 నుంచి హైదరాబాద్‌లో జరుగనున్న విషయం తెలిసిందే. ఈ సభలును విజయవంతం చేయటం కోసం తెలుగు దర్శకులు కూడా తమ వంతు కృషి చేస్తున్నారని సమాచారం. తెలుగుదనం ఉట్టిపడేలా సభలకు సంబంధించిన ప్రమోషనల్ వీడియోను షూట్ చేసే పనిలో దర్శకులు వంశీ పైడిపల్లి , హరీష్ శంకర్, నందిని రెడ్డి బిజీగా ఉన్నారట. ఆల్రెడీ విజయ్ దేవరకొండ, మెహరీన్ జంటపై హోలీ నేపథ్యంలో ఓ పాటను చిత్రీకరించారట.మరోవైపు సాయి ధరమ్‌తేజ్, తెలుగు అమ్మాయి ఇషాలపై మరో సాంగ్‌ను రెడీ చేస్తున్నారట హారీష్ శంకర్. ఇంతకు ముందు హరీష్ దర్శకత్వంలో తేజ్ హీరోగా వచ్చిన ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ లో తెలుగు గొప్పతనాన్ని వర్ణిస్తూ ఓ పాట ఉన్న సంగతి తెలిసిందే. ఈ ప్రమోషనల్ సాంగ్స్‌ను చంద్రబోస్ రచించారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment