మహేశ్‌బాబు చిత్రంలో విజయ్‌ దేవరకొండ?  | Vijay Devarakonda May Act In Mahesh Babu Vamsi New Film | Sakshi
Sakshi News home page

మహేశ్‌బాబు చిత్రంలో విజయ్‌ దేవరకొండ? 

Published Sun, Feb 2 2020 1:25 PM | Last Updated on Sun, Feb 2 2020 1:27 PM

Vijay Devarakonda May Act In Mahesh Babu Vamsi New Film - Sakshi

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు ప్రస్తుతం ‘సరిలేరు నీకెవ్వరు’ గ్రాండ్‌​ సక్సెస్‌ను విదేశాల్లో ఎంజాయ్‌ చేస్తున్నాడు. దీనిలో భాగంగా కుటుంబసమేతంగా విదేశాల్లో విహరిస్తున్న ఫోటోలను సోషల్‌ మీడియాలో ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటున్నాడు మహేశ్‌. ఇక తన 27వ చిత్ర దర్శకత్వ బాధ్యతలను వంశీ పైడిపల్లికి అప్పగించిన విషయం తెలిసిందే. మహర్షితో సూపర్‌ డూపర్‌ హిట్‌ అందించిన వంశీపై నమ్మకంతో మరో సినిమాకు మహేశ్‌ సైన్‌ చేశాడు. ‘సరిలేరు’  సక్సెస్‌ మీట్‌లో ‘మహర్షి, సరిలేరు’ చిత్రాల కంటే గొప్ప చిత్రాన్ని అభిమానులకు అందిస్తానని వంశీ మాటిచ్చాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త టాలీవుడ్‌లో హల్‌చల్‌ చేస్తోంది. అన్నీ అనుకున్నట్లు కుదిరితే విజయ్‌ దేవరకొండ- మహేశ్‌ బాబు ఒకే స్క్రీన్‌పై కనిపించే అవకాశం ఉంది. 

మహేశ్‌-వంశీ కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రంలో టాలీవుడ్‌ సెన్సేషన్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండ నటిస్తున్నట్టు సమాచారం. విజయ్‌ కోసం వంశీ స్పెషల్‌ క్యారెక్టర్‌ రూపొందిచనట్టు తెలుస్తోంది. అయితే ఈ చిత్రంలో విజయ్‌ది కీలక పాత్రన లేక అతిథి పాత్రనా అనేది తెలియాల్సి ఉంది. ఇక మహేశ్‌తో ఉన్న సాన్నిహిత్యం కారణంగా విజయ్‌ కూడా ఈ చిత్రంలో నటించేందుకు అంగీకరించనట్టు వార్తలు వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇది నిజం కావాలిన అటు టాలీవుడ్‌ ఇటు అభిమానులు కోరుకుంటున్నారు. వీరిద్దరు ఒకే తెరపై కనిపిస్తే రచ్చర​చ్చే అని అంటున్నారు.  కాగా, మహేశ్‌ విదేశాల నుంచి తిరిగొచ్చాక ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ప్రీ పొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది. 

చదవండి:
శేఖర్‌ మాస్టర్‌కు మహేశ్‌ బాబు బంపర్‌ ఆఫర్‌.. 

సరిలేరు నీకెవ్వరు : మూవీ రివ్యూ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement