Sarileru Neekevvaru Movie
-
మేరా భారత్ మహాన్
-
‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ నాకు మైనస్ అయ్యింది: సంగీత షాకింగ్ కామెంట్స్
నటి సంగీత.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ఖడ్గం మూవీతో ఒకే ఒక్క చాన్స్ అంటూ అమాయకపు మాటలతో కుర్రకారును ఆకట్టుకుంది. ఆ తర్వాత పెళ్లాం ఊరెళితే, ఖుషి ఖుషిగా, సంక్రాంతి వంటి చిత్రాల్లో నటించి ఫ్యామిలీ ఆడియన్స్‌కి దగ్గరైంది. చివరిగా 2010లో కారా మజాకా చిత్రంలో కనిపించిన ఆ తర్వాత నటనకు బ్రేక్ ఇచ్చింది. దాదాపు 10ఏళ్ల విరామం అనంతరం మహేశ్ బాబు సరిలేరు నీకెవ్వరు మూవీ రీఎంట్రీ ఇచ్చింది. చదవండి: హాట్‌టాపిక్ బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ పారితోషికం, ఎవరెవరికి ఎంతంటే..! సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆడపదడపా చిత్రాలు చేస్తూ.. పలు డాన్స్, కామెడీ షోలకు జడ్జీగా వ్యవహరిస్తోంది. తాజాగా ఆమె ‘మసూద’ అనే హార్రర్ చిత్రంలో నటిచింది. ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా ఓ టీవీ షోలో పాల్గొన్న ఆమె సరిలేరు నీకెవ్వరు మూవీ, ఆ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడిపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ సినిమాలో ఆమె హీరోయిన్‌కి తల్లిగా చేసిన సంగతి తెలిసిందే. సుదీర్ఘ విరామం తర్వాత తెలుగులో ఆమె చేసిన ‘సరిలేరు నీకెవ్వరు’లో హీరోయిన్‌కి మదర్‌గా చేయడం ప్లస్ అయ్యిందా? మైనస్అయ్యిందా? అని హోస్ట్ ప్రశ్నించగా.. రెండూ అని సమాధానం ఇచ్చింది. చదవండి: ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ నాకు మైనస్ అయ్యింది: సంగీత షాకింగ్ కామెంట్స్ ఆ తర్వాత అనిల్ రావిపూడి వచ్చి తనకు కథ వివరించారని చెప్పంది. ఇక ఇప్పుడు అనిల్‌ని చూస్తే ‘రేయ్ ఇలా చేశావ్ రా నన్ను’ అని తింటుకుంటాను అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది సంగీత. ఆ తర్వాత అవకాశం వదులుకున్న సినిమాలు ఏమైనా ఉన్నాయా అని కూడా సంగీతని అడగ్గా.. ఓ సినిమా షూటింగ్ కి రెండు రోజులు వెళ్లానని, ఆ తర్వాత వాళ్లు చిత్రం నుంచి తీసేశారని ఆవేదన వ్యక్తం చేసింది. కాగా సరిలేరు నీకెవ్వరులో సంగీత హీరోయిన్గా తల్లిగా ‘అబ్బబ్బా నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్’ అంటూ తన కామెడీతో ప్రేక్షకులను బాగా నవ్వించ్చింది. -
మహేశ్ సినిమాలో ఆ పాత్రను అయిష్టంగానే చేశా: ప్రకాశ్ రాజ్
ప్రకాశ్ రాజ్.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు ఇది. పరిశ్రమలో ప్రకాశ్ రాజ్‌కు ప్రత్యేకం స్థానం ఉంది. ఎలాంటి పాత్రలోనైన ఇట్టే ఒదిగిపోయే నటుడు ఆయన. అందుకే ఆయన నటనకు ఫిదా కానీ ప్రేక్షకులు ఉండడనడంలో అతిశయోక్తి లేదు. ఎలాంటి పాత్రెయిన ఆయన ఇమిడిపోయే తీరు ప్రేక్షకులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అలా ఆయనను అందరి చేత విలక్షణ నటుడిగా ప్రశంసలు అందుకుంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఆయన ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహేశ్ బాబు చిత్రంలో తనకు నచ్చని పాత్ర చేశానంటూ ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశారు. చదవండి: ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే.. ‘ఏ ఆర్టిస్టుకైనా ఒక్కోసారి నచ్చని పాత్రలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి పాత్రల్లో 'సరిలేరును నీకెవ్వరు' సినిమాలో నేను చేసిన పాత్ర ఒకటి. ఆ సినిమాలో అబద్ధాలు చెప్పే రాజకీయనాయకుడి పాత్ర పోషించాను. అయితే నాకు పాత్ర నచ్చకున్న అయిష్టంగానే చేయాల్సి వచ్చింది. నటులకు కొన్ని సార్లు వారి నిర్ణయాలు.. అభిప్రాయాలతో పనిలేకుండా అలా జరిగిపోతూ ఉంటుంది’ అని చెప్పుకొచ్చారు. కాగా మహేశ్ బాబు హీరోగా చేసిన ఆ సినిమాలో తానును అలాంటి పాత్రను చేయడం అసంతృప్తిగా అనిపించినా, ఆయన నిర్మించిన 'మేజర్' సినిమాలోని పాత్ర తనకు సంతృప్తినిచ్చిందన్నారు. ఇక తన కెరీర్లో 'ఆకాశమంత' .. 'బొమ్మరిల్లు' సినిమాలు తనకు చాలా సంతోషాన్ని కలిగించాయని ఆయన చెప్పారు. చదవండి: కొత్త జంట నయన్-విఘ్నేశ్‌కు ఓటీటీ షాక్! రూ. 25 కోట్ల ఒప్పందం రద్దు? -
2 ఏళ్ళు పూర్తి చేసుకున్న సరిలేరు నీకెవ్వరు
-
2020 ‘సినిమా’ రివ్యూ
2020.. ప్రపంచానికే ఓ బ్లాక్ ఇయర్. ఈ ఇయర్లోకి ఎంటరైన రెండు నెలలకే కరోనా వైరస్ మానవాళిపై దాడి చేసింది. ఈ మహమ్మారి దాటికి ప్రపంచం మొత్తం చిగురుటాకులా వణికి పోయింది. అన్ని రంగాలు కుదేలైపోయాయి. ముఖ్యంగా చిత్ర పరిశ్రమకు అయితే గట్టి దెబ్బ కొట్టింది. టాలీవుడ్లో ప్రతి ఏడాది దాదాపు 250 సినిమాల వరకు విడుదలై ప్రేక్షకుల్ని అలరించేవి. కానీ కరోనా ధాటికి ఈ ఏడాది దాదాపు 50 సినిమాలు కూడా విడుదల కాలేదు. సంక్రాంతి తప్ప.. ఈ ఏడాది మొత్తంలో ఒక్క స్టార్ హీరో సినిమా కూడా థియేటర్లలో విడుదలవలేదు. 2020లో విడుదలైన సినిమాలేంటి? వాటిలో ఏవి హిట్ అయ్యాయి. ఏవి ప్లాప్‌ను మూటగట్టుకున్నాయి? సమగ్ర సమాచారం మీకోసం... సంక్రాంతికి సందడి చేసిన మహేశ్-బన్నీ టాలీవుడ్ సినిమా క్యాలెండర్ ప్రతి ఏటా సంక్రాంతి నుంచి మొదలవుతుంది. ఈ సీజన్లో బడా హీరోలంతా బరిలోకి దిగుతారు. వీలైనన్ని పెద్ద సినిమాలు సంక్రాంతికి వస్తాయి. ఈ సారి కూడా పెద్ద పెద్ద సినిమాలే సంక్రాంతి బరిలోకి దిగాయి. మహేశ్ బాబు సరిలేరు నీకెవ్వరుతో బరిలోకి దిగగా... ‘అల వైకుంఠపురములో’తో అల్లుఅర్జున్ రంగంలోకి దూకాడు. ఇక ‘ఎంతమంచివాడవురా’ అంటూ కళ్యాణ్ రాము సంక్రాంతి పోరులో నిలిచారు. అయితే ఈ ముగ్గురిలో మాత్రం.. మహేశ్- బన్నీల మధ్యే ప్రధాన పోరు జరిగింది. ఒక్క రోజు తేడాతో వచ్చిన ఈ రెండు సినిమాలు బాక్సాపీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. ఈ రెండు సినిమాల్లో మాత్రం ‘అల వైకుంఠపురములో’కి కాస్త ఎక్కువ మార్కులు పడ్డాయి. ఇక రెండు భారీ సినిమాల మధ్య విడుదల అయిన కల్యాణ్ రామ్ ‘ఎంత మంచివాడవురా’ ప్లాప్‌ను మూటగట్టుకుంది. ప్లాప్‌ను మూటగట్టుకున్న మాస్ మహారాజా మహేశ్, బన్నీ సినిమాలు సక్సెస్‌పుల్‌గా రన్ అవుతున్న సమయంలో ‘డిస్కోరాజా’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రవితేజ. జనవరి 24న విడుదలైన ఈ సినిమా అట్టర్ ప్లాప్ అయింది. సినిమా సక్సెస్ అవుతుందని ఎన్నో అశలు పెట్టుకున్న మాస్ మహారాజ ఫ్యాన్స్‌కు నిరాశే మిగిలింది. సినిమా కోసం రవితేజ కూడా బాగానే కష్టపడ్డాడు కానీ వర్కౌట్ కాలేదు. అలరించని ‘అశ్వథ్థామ’ ఛలో’ సినిమాతో యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న యంగ్ హీరో నాగశౌర్య.. ‘అశ్వథ్థామ’గా ప్రతాపం చూసేందుకు ముందుకు వచ్చాడు. మెహరిన్ హీరోయిన్గా నటించిన ఈ మూవీ ఈ ఏడాది జనవరి 31న విడుదలై పాజిటివ్ టాక్‌ను రాబట్టింది కానీ సిల్వర్ స్క్రీన్‌పై పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. కానీ బుల్లితెరపై మాత్రం సక్సెస్ అయింది. ఈ మూవీ శాటిలైట్ రైట్స్ దక్కించుకున్న జెమినీ టీవీ మే 15న ఈ చిత్రాన్ని ప్రసారం చేయగా.. 9.10 టీఆర్పీ రేటింగ్‌ను దక్కించుకుంది. మాయ చేయని ‘జాను’ శర్వానంద్ నటించిన ‘జాను’ సినిమా ఫిబ్రవరి 7న విడులైన ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. `96`కి రీమేక్ గా వచ్చిన `జాను` పై ప్రేక్షకులకు ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. కానీ వాటిని ‘జాను’ అందుకోలేకపోయింది. `96`కి జిరాక్స్ కాపీగా మిగిలిందే తప్ప, ప్రత్యేకమైన ముద్ర వేయలేకపోయింది. కానీ శర్వానంద్, సమంత నటనకు మంచి మార్కులు పడ్డాయి. డిజాస్టర్ మూటగట్టుకున్న‘రౌడీ’ మంచి ఫాంలో ఉన్న విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అంటూ వాలెంటైన్స్ డే రోజు ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. కానీ ప్రేక్షకుల ప్రేమను మాత్రం చురగొనలేదు. క్రాంతి మాధవ్ తెరకెక్కించిన ఈ సినిమా డిజాస్టర్ అనిపించుకుంది. మూడు లవ్ స్టోరీలు చూపించినా.. ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాడు. ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఇరవై కోట్లు కూడా రాబట్టలేకపోయిందట. ఫలించిన ‘భీష్మ’ బాణం వరుస పరాజయాలను మూటగట్టుకుంటున్న టాలీవుడ్‌ను భీష్ముడుగా వచ్చి కాపాడాడు యంగ్ హీరో నితిన్. వెంకీ కుడుమల దర్శకత్వంలో నితిన్, రష్మిక జంటగా నటించిన `భీష్మ` ప్రేక్షకుల్ని అలరించింది. నితిన్ కెరీర్లో ఇది పెద్ద హిట్టుగా నిలిచింది. విజయాలు లేక బోసిపోయిన థియేటర్లకు యూత్‌తో పాటు కుటుంబ ప్రేక్షకులను రప్పించింది. ఆ సినిమా విడుదలైన కొన్ని వారాలకే లాక్ డౌన్ మొదలైంది. లేకుంటే బాక్సాఫీస్ వద్ద 50కోట్ల క్లబ్ లో చేరేది. ‘హిట్’ సూపర్ హిట్ నాని నిర్మించిన ‘హిట్’ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు హీరో విశ్వక్ సేన్. ఫిబ్రవరి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన `హిట్`…పేరుకి తగ్గట్టే హిట్ అనిపించుకుంది. ఈ సినిమా పాజిటీవ్ టాక్‌తో మంచి వసూళ్లను రాబట్టి.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమాలో రుహానీ శర్మ హీరోయిన్గా నటించింది. పర్వాలేదనిపించిన ‘పలాస’ మార్చి 6న విడుదలైన `పలాస` విమర్శకుల్ని మెప్పించింది. ఎలాంటి అంచనాలు లేకుండ వచ్చిన సినిమా ఇది. కరోనా వైరస్ లేకపోతే ఈ సినిమా సూపర్ హిట్ అయ్యేది. సినిమా రిలీజ్ అయిన కొద్ది రోజులకే థియేటర్లు మూతపడడంతో సినిమా అంతగా సక్సెస్ కాలేదు. థియేటర్లలో పెద్దగా ఆడలేదు గానీ, ఓటీటీలో వచ్చాక… ఈసినిమాకి వ్యూవర్ షిప్ పెరిగింది. ఈ సినిమాలో నాదీ నక్కిలీసు గొలుసు పాట మాత్రం మాస్ ఆడియన్స్ ని ఊపేసింది. మార్చి 17 నుంచి థియేటర్లు మూత పడటం సినిమాల విడుదలకు ఊహించని బ్రేక్ పడింది. సినిమాలు లేక విలవిలలాడిన సినీ ప్రేమికులను ఓటీటీ సంస్థలు కాపాడాయి. లాక్‌డౌస్ సమయంలో చొరవ చూపి మరి కొన్ని చిత్రాలను విడుదల చేశాయి. వాటిలో నాని, సుధీర్ బాబు హీరోలుగా నటించిన ‘వి’, కీర్తీ సురేష్ పెంగ్విన్, మిస్ ఇండియా, అనుష్క నటించిన ‘నిశ్శబ్దం’అట్టర్ ప్లాప్ అయ్యాయి. ఇక పెద్ద సినిమాల్లో సూర్య హీరోగా నటించిన ఆకాశమే హద్దురా మాత్రం హిట్ టాక్‌ను సంపాదించుంది. వీటితో పాటు కలర్ ఫోటో, మిడిల్ క్లాస్ మెలోడీస్’, ఉమా మహేశ్వర ఉగ్ర రూపశ్య, జోహార్ లాంటి చిత్రాలు విజయవంతం అయ్యాయి. మొత్తానికి థియేటర్లు లేని లోటును కొద్దో గొప్పో ఓటీటీ వేదికలు తీర్చాయని చెప్పొచ్చు. -
దటీజ్ మహేశ్.. వరుసగా మూడోసారి
సూపర్‌స్టార్ మహేశ్ బాబు, రష్మిక మందన జంటగా వచ్చిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 11న రిలీజై మహేశ్ బాబు గత సినిమా రికార్డులన్నింటిని తిరగరాసింది. తాజాగా ఈ సినిమా మరో సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. (చదవండి : నిహారికకు చిరంజీవి ఖరీదైన బహుమతి) అత్యధిక హ్యాష్‌ట్యాగ్‌లు సాధించి ట్విటర్లో ట్రెండింగ్‌లో నిలిచిన తెలుగు సినిమాల జాబితాలో అగ్ర స్థానంలో నిలిచింది. అలాగే ఈ ఏడాదికి ఓవరాల్‌గా భారత్‌లో మూడో స్థానం సాధించింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ `దిల్ బెచారా`, సూర్య `సూరారై పొట్రు` తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. కాగా, 2019లో కూడా మహేష్ బాబు హీరోగా నటించిన ‘మహర్షి’ సినిమా కూడా ఎక్కువ మంది ట్వీట్స్ చేసిన సినిమాగా నిలిచింది. అంతకు ముందు 2018లో ‘భరత్ అనే నేను’ సినిమా కూడా ఎక్కువ మంది ఈ సినిమాను ట్వీట్ చేస్తూ ట్యాగ్ చేసిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. (చదవండి : ఈ ఏడాది ట్విట్టర్లో ఎక్కువగా చర్చించిందేంటంటే..) Most Tweeted Hashtags Related to Movies In Telugu 🔥 2018 - #BharathAneNenu 2019 - #Maharshi 2020 - #SarileruNeekevvaru Super ⭐ @urstrulyMahesh 🤘#SSMBRuledTwitter2020 💥#SarkaruVaariPaata #ThisHappened2020 pic.twitter.com/5A2sniOAVs — BARaju (@baraju_SuperHit) December 8, 2020 -
వావ్..‘మైండ్ బ్లాక్’ చేసిన సితార
సూపర్ స్టార్ మహేశ్ బాబు గారాల పట్టి సితార మరోసారి తన డ్యాన్స్‌తో ఇరగదీసింది. ఇప్పటికే ఇంగ్లీష్ పాటలతో పాటు తన తండ్రి మహేశ్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రంలోని ‘డాంగ్ డాంగ్’ పాటలకు చిందేసి హల్చల్ చేసిన సీతు పాప...తాజాగా అదే సినిమాలోని ఫేమస్ సాంగ్ ‘మైండ్ బ్లాక్’కి తనదైన స్టైల్లో స్టెప్పులు వేసి అదరగొట్టింది. (చదవండి : సితార డాడీ కూతురు.. ఫోటో షేర్ చేసిన నమ్రత) ఈ డ్యాన్స్‌కు సంబంధించిన వీడియోను నమ్రత తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం సితార డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సితార వేసిన స్టెప్స్‌కి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. తండ్రికి తగ్గ తనయ అని అనిపించావు అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురుపిస్తున్నారు. కాగా, అనిల్ రావిపుడి దర్శకత్వంలో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో రష్మిక, విజయశాంతి ముఖ్య పాత్రలు పోషించారు. (చదవండి : మహేశ్ బాబు ఇంట బర్త్‌డే పండగ) -
‘మైండ్ బ్లాక్’ చేసిన సితార
-
మహేశ్ పాటకు చంపేశావ్ పో..
-
నేను..నీ ముందు తేలిపోయా: వార్నర్
క్రికెటర్‌గా బిజీ బిజీగా ఉండే ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కరోనా లాక్డౌన్ సమయంలోనూ తీరిక లేకుండా గడుపుతున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సారథ్యం వహిస్తున్న వార్నర్ తెలుగు సూపర్ హిట్ సినిమా పాటలకు భార్యతో కలిసి టిక్‌టాక్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. వారు చేసిన టిక్‌టాక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కూడా అవుతున్నాయి. తాజాగా ఈ దంపతులు సూపర్‌స్టార్ మహేశ్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలోని మైండ్ బ్లాక్ పాటకు స్టెప్పులేశారు. దాదాపు 50 టేక్‌ల అనంతరం తాము సక్సెస్ అయ్యామని ట్విటర్లో ఆ వీడియోను శనివారం షేర్ చేశాడు. అయితే, వార్నర్ దంపతులు అదే పాటకు ఆదివారం కూడా స్టెప్పులేశారు. ఈ సందర్భంగా.. తన భార్య కాండిస్ మాదిరిగా తాను డ్యాన్స్ చేయలేకపోయానని వార్నర్ చెప్పుకొచ్చాడు. మైండ్ బ్లాక్ పార్ట్-2 లో ఆమె డ్యాన్స్ ఇరగదీసిందని మెచ్చుకున్నాడు. దీనికి మూడో పార్ట్ కూడా ఉంటుందని వార్నర్ చెప్పుకొచ్చాడు. ‘ డియర్.. నీ ముందు తేలిపోయా.. నేను చెత్తగా డ్యాన్స్ చేశా. నువ్వు మాత్రం స్టెప్పులతో ఇరదీశావ్. మరో పార్ట్‌తో ముందుకొస్తాం’ అని వార్నర్ తెలిపాడు. (చదవండి: ‘మైండ్ బ్లాక్’తో వచ్చిన వార్నర్..) -
వార్నర్ ‘మైండ్ బ్లాక్’ అదిరింది కానీ..
హైదరాబాద్: లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ టిక్‌టాక్ వీడియోలతో అభిమానులను అలరిస్తున్నాడు. ముఖ్యంగా తెలుగు డైలాగ్స్, పాటలతో అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు. బుట్టబొమ్మ, పోకిరి, బాహుబలి డైలాగ్స్‌తో టాలీవుడ్ అభిమానులను మెప్పిస్తున్నాడు. దీంతో ఆయా హీరోల అభిమానులు వార్నర్‌కు పలు విజ్ఞప్తులు చేస్తున్నారు. ఈ క్రమంలో మహేశ్‌బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలోని ‘మైండ్ బ్లాక్’ పాటకు టిక్‌టాక్ చేయాల్సిందిగా ఫ్యాన్స్ కోరుతున్నారు. (ఊపిరి పీల్చుకున్న టిక్‌టాక్) దీంతో అభిమానుల కోరిక మేరకు ‘మైండ్ బ్లాక్’ పాటకు సంబంధించిన స్టెప్పులతో పార్ట్-1 విడుదల చేశారు. ఈ పాట స్టెప్పుల కోసం చాలా కష్టపడ్డానని, 15 నిడివిగల ఈ టిక్‌టాక్ కోసం 51 సార్లు ప్రయత్నం చేశానని వార్నర్ చెప్పుకొచ్చాడు. అయితే తాజా వార్నర్ టిక్‌టాక్ వీడియో మహేశ్‌తో పాటు ఓవరాల్ టాలీవుడ్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా అభిమానుల కోరిక మేరకు అతడు పడుతున్న కష్టానికి ఫిదా అవుతున్నారు. ఈ పాటకు సంబంధించి మరో టిక్‌టాక్ వీడియో త్వరలోనే విడుదల చేస్తానని వార్నర్ పేర్కొన్నాడు. ప్రస్తుతం వార్నర్ ‘మైండ్ బ్లాక్’ టిక్‌టాక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. (వార్నర్ వీడియోకు రష్మిక ఫిదా) Attempt 51 haha part 1 of @urstrulyMahesh #mindblock @CandyFalzon pic.twitter.com/AYrRVD3ooX — David Warner (@davidwarner31) May 30, 2020 -
రేపు వార్నర్ ‘మైండ్ బ్లాక్’ సర్ప్రైజ్!
ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ గత కొద్దిరోజులుగా టిక్‌టాక్ వీడియోలతో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ హీరోలను అనుకరిస్తూ ఇప్పటికే చేసిన టిక్‌టాక్ వీడియోలు ఎంత హైలైట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బుట్టబొమ్మ సాంగ్, పొకిరి డైలాగ్, బాహుబలి సాంగ్‌కు తనదైన స్టైల్లో ఆకట్టుకున్నాడు వార్నర్. తన సతీమణి, కూతురుతో చేస్తున్న వీడియోలతో టిక్‌టాక్‌లో వార్నర్ ఫాలోవర్స్ సంఖ్య గణనీయంగానే పెరిగింది. ఈ క్రమంలో మహేశ్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలోని మైండ్ బ్లాక్ సాంగ్‌కు టిక్‌టాక్ చేయమని వార్నర్‌ను అభిమానులు కోరుతున్నారు. (వార్నర్ వీడియోకు రష్మిక ఫిదా) ఇప్పటికే ఆ పాటలోని చిన్న బిట్‌కు టిక్‌టాక్ చేసిన వార్నర్, తాజాగా ఆ పాటకు సంబంధించిన పార్ట్1ను రేపు(శనివారం) విడుదల చేయనున్నట్లు తెలిపాడు. అయితే ‘మైండ్ బ్లాక్’ సాంగ్‌కు టిక్‌టాక్ అని చెప్పకుండా సర్ప్రైజ్ అంటూ ఆ పాటకు సంబంధించిన స్టెప్పులతో చిన్న హింట్ ఇచ్చాడు వార్నర్. దీంతో వార్నర్ తర్వాత టిక్‌టాక్ ‘మైండ్ బ్లాక్’అని అభిమానులు ఫిక్సయ్యారు. ఇక ‘బాహుబలి’ చిత్రంలోని ప్రభాస్ ఫోటోను, తన ఫోటోను జతచేస్తూ ‘మీరు మాలో ఎవర్ని ఇష్టపడుతున్నారు. మాలో ఎవరి దుస్తులు ఇష్టపడుతున్నారో చెప్పండి’అంటూ అభిమానులను వార్నర్ ప్రశించాడు. ఇక ఈ ఫోటోకు ‘దేవసేన ఎక్కడ’, ‘టాలీవుడ్లో హీరోగా ఎందుకు ట్రై చేయడం లేదు’, ‘ప్రభాస్ ఇండియా బాహుబలి, వార్నర్ ఆస్ట్రేలియా బాహుబలి’ అంటూ కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. (ఎన్టీఆర్‌కు వార్నర్ స్పెషల్ విషెస్!)! View this post on Instagram If you can guess this we will release part 1 tomorrow. #dance #nochance #wife #daughter @candywarner1 250k likes 👍👍 A post shared by David Warner (@davidwarner31) on May 28, 2020 at 11:36pm PDT View this post on Instagram Who’s costume do you prefer? 😂😂 @baahubalimovie #bahubali #prabhas #funny #fun A post shared by David Warner (@davidwarner31) on May 27, 2020 at 11:16pm PDT -
‘సరిలేరు’ తర్వాత మహేశ్ చిత్రం ఇదే!
‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం తర్వాత టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు చేసే చిత్రం దాదాపు ఖరారయింది. మహేశ్ తన 28 చిత్రాన్ని ‘గీతా గోవిందం’ఫేమ్ పరుశురామ్‌కు అప్పగించినట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు పరుశురామ్ తన తదుపరి చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ‘ఒక్కడు సినిమా చూసిన తరవాత ఇండస్ట్రీకి రావాలని నిర్ణయించుకున్నాను. మహేష్ సార్‌తో సినిమా చేయాలనదే నా బలమైన కోరిక. నా కల ఇప్పుడు నెరవేరబోతోంది. ఇది నా కెరీర్లో గుర్తుండిపోయే సినిమా అవుతుంది. గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమాలో మానవ సంబంధాలు, కుటుంబ భావోద్వేగాలు అన్నీ ఉంటాయి. ప్రస్తుతం తన స్క్రిప్టులో ఇవన్నీ పొందుపరుస్తున్నాను. ఇది చాలా మంచి సినిమా అవుతుంది. నవరసాలు ఉంటాయి. అభిమానులు మహేశ్‌ను ఎలా చూడాలనుకుంటున్నారో అలానే ఈ చిత్రం ఉండబోతుంది. నాగ చైతన్యతో తాను కచ్చితంగా సినిమాను తెరకెక్కిస్తాను.. మహేశ్ చిత్రం తరువాత ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుంది’అని పరుశురామ్ వివరించాడు. కాగా మహేశ్ గత కొంతకాలంగా సందేశాత్మక కథాంశాలతో సినిమాలు చేస్తున్నారు. ఆ పంథాకు పూర్తి భిన్నంగా పూర్తిస్థాయి ప్రేమకథతో ఈ సినిమా మంచి ఎంటర్టైనర్గా ఉండనుందని సమాచారం. ఇక ఈ సినిమాలో మహేశ్ సరసన ‘మహానటి’ఫేం కీర్తి సురేష్ నటించనుందని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ చిత్రంలో కన్నడ స్టార్ ఉపేంద్రను విలన్ పాత్ర కోసం చిత్ర బృందం ఎంపిక చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. గోపీ సుందర్ సంగీతమందిస్తున్న ఈ చిత్రం అన్నీ కుదిరితే ఆక్టోబర్‌లో సెట్స్‌పైకి వెళ్లనుంది. అయితే తన తదుపరి చిత్రం గురించి మహేశ్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. చదవండి: వార్నర్‌కు థ్యాంక్స్ చెప్పిన అల్లు అర్జున్ ‘మా అమ్మ బయోపిక్‌కి అనుమతి లేదు’ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_931254882.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
‘బాహుబలి’ని బ్రేక్ చేసిన మహేశ్ చిత్రం
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరోగా యంగ్ అండ్ ట్యాలెంటెడ్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా వచ్చిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ . ఈ సినిమా విడుదలైన తొలి ఆట నుంచే కలెక్షన్ల సునామీ సృష్టించిన విషయం అందరికి తెలిసిందే. అంతేకాకుండా మహేశ్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. అయితే ‘సరిలేరు’ చిత్రం తాజాగా మరో ఘనతను అందుకుంది. ఉగాది కానుకగా ఓ ప్రముఖ ఛానల్లో వచ్చిన ఈ చిత్రం అత్యధిక టెలివిజన్ వ్యూవర్షిప్ రేటింగ్ (టీవీఆర్)ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ‘బాహుబలి 2’రికార్డులను సైతం ఈ చిత్రం అధిగమించింది. ఇప్పటివరకు 22.70 టీవీఆర్‌తో బాహుబలి-2 అగ్ర స్థానంలో ఉండగా.. తాజాగా మహేశ్ సరిలేరు నీకెవ్వరు చిత్రం 23.4 టీవీఆర్‌ను సాధించి గత రికార్డులన్నింటిని తిరగరాసింది. బాహుబలి తొలి పార్ట్‌కు 21.84 టీవీఆర్ వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో కూడా వచ్చేసింది. అంతేకాకుండా ఈ సినిమా హెచ్డీ ప్రింట్‌ను కొంత మంది ఫేస్బుక్లో కూడా అప్లోడ్ చేశారు. దీంతో ఇప్పటికే ఈ సినిమాను చాలా మంది చూశారు. అయినప్పటికీ ఇటీవల ఓ ప్రముఖ ఛానల్లో వచ్చిన ఈ సినిమాను ఎవరూ ఊహించన విధంగా బ్రహ్మరథం పట్టారు. దీంతో చిత్ర యూనిట్‌తో పాటు మహేశ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా గడిచిన పదిహేనేళ్లలో ఏ తెలుగు చిత్రానికి ఈ విధంగా టీవీఆర్ రాలేదని దర్శకనిర్మాతలు పేర్కొంటున్నారు. కాగా, ‘సరిలేరు.. మీకెవ్వరు’చిత్రంతోనే లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి దాదాపు పన్నెండేళ్ల తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అనిల్ సుంకర, దిల్ రాజు, మహేశ్‌లు ఈ చిత్రాన్ని నిర్మించారు. రష్మిక మందన హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించాడు. చదవండి: ‘ప్రేక్షకులూ.. సరిలేరు మీకెవ్వరూ..’ ఆసక్తికర విషయం చెప్పిన నమ్రత var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_931254882.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
‘ప్రేక్షకులూ.. సరిలేరు మీకెవ్వరూ..’
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు, రష్మిక మందన జంటగా వచ్చిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్ రావిపూడి దర్వకత్వం వహించిన ఈ చిత్రం విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 11న రిలీజై అయిన ఈ చిత్రం మహేశ్ బాబు గత సినిమా రికార్డులన్నింటిని తిరగరాసింది. లేడీ అమితాబ్ విజయశాంతి 13 ఏళ్ల సుదీర్ఘ గ్యాప్ తర్వాత ఈ సినిమాతోనే రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రం హిట్ టాక్‌తో దిగ్విజయంగా 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర యూనిట్ ఫ్యాన్స్‌కు చిన్న సర్ప్రైజ్ ఇచ్చింది. ‘సరిలేరు నీకెవ్వరు’ స్పెసల్ ప్రోమోతో పాటు మైండ్ బ్లాక్ వీడియో సాంగ్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ రెండు వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఇక ‘సరిలేరు నీకెవ్వరు’చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి 50రోజులు అయిన సందర్భంగా హీరో మహేశ్ బాబు, దర్శకుడు అనిల్ రావిపూడిలు ట్విటర్ వేదికగా ఆనందం వ్యక్తం చేశారు. ‘ఇంతటి పెద్ద విజయాన్ని అందించిన దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత అనిల్ సుంకరలకు బిగ్ హగ్. అదే విధంగా చిత్రయూనిట్‌కు స్పెషల్ థ్యాంక్స్. అభిమానుల సపోర్ట్, ప్రేమ వర్ణించలేనిది’ అంటూ మహేశ్ బాబు ట్వీట్ చేశాడు. మరో మర్చిపోలేని సంక్రాంతి అంటూ దర్శకుడు అనిల్ రావిపూడి ట్వీట్ చేశాడు. అంతేకాకుండా చిత్రంలోని ఫవర్ ఫుల్ డైలాగ్‌లతో పాట సరిలేరు ప్రయాణానికి సంబంధించిన పలు ఆసక్తిర విషయాలను పేర్కొన్నాడు. హీరో మహేశ్‌తో పాటు ఇతర నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, నిర్మాతలకు, అభిమానులకు అనిల్ రావిపూడి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. 50 Days of #SarileruNeekevvaru. A BIGGG hug to my director @AnilRavipudi & my producer @AnilSunkara1 for giving me this BLOCKBUSTER🤗 Thanks to my entire team, without whom this wouldn't have been possible! @vijayashanthi_m @iamRashmika @RathnaveluDop @prakashraaj @ThisIsDSP pic.twitter.com/2r1csytrMc — Mahesh Babu (@urstrulyMahesh) February 29, 2020 🙏🙏🙏 pic.twitter.com/iNbNtwqqxo — Anil Ravipudi (@AnilRavipudi) February 29, 2020 చదవండి: మణిశర్మ, తమన్.. ఇప్పుడు అనిరుద్? ఆవిడంటే నాకు చాలా ఇష్టం: నమ్రత సరిలేరు నీకెవ్వరు : మూవీ రివ్యూ -
మహేష్, రష్మిక ఫుల్ వీడియో ‘మైండ్ బ్లాక్’!
‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలోని 'మైండ్ బ్లాక్' సాంగ్ ఫుల్ వీడియోను చిత్ర యూనిట్ శనివారం విడుదల చేసింది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మహేష్ బాబు సరసన రష్మిక మందాన హీరోయిన్గా నటించింది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చగా.. మైండ్ బ్లాక్ పాట మాస్ బీట్తో ప్రేక్షకుల్ని హుషారెత్తించింది. సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. దీంతోపాటు సినిమా విడుదలై 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ స్పెషల్ వీడియోను సైతం చిత్ర యూనిట్ ప్రేక్షకులకు అందించింది. మహేష్ బాబు గురించి ప్రకాశ్ రాజ్‌కు అజయ్ చెబుతున్న వీడియో అది. ‘కర్నూలు కొండారెడ్డి బురుజుకాడ అల్లూరి సీతారామరాజును చూసినా అన్నా. చుట్టూ 50 మంది. చేతిలో కత్తిలే.. గొడ్డలిలే.. ఎట్టా నిలబడినాడో.. అచ్చం ఈయన లెక్నే రొమ్మిరిసి.. (అల్లూరి సీతారామరాజు గెటప్‌లో ఉన్న కృష్ణను చూపిస్తూ) అని అజయ్ చెప్పిన నేపథ్యాన్ని పవర్‌ఫుల్‌గా చూపించారు. ఇక ‘సరిలేరు నీకెవ్వరు’ విజయం తనకు మరో సంక్రాంతిని అందించిందని దర్శకుడు అనిల్ రావిపూడి అన్నారు. అద్భుతమైన విజయం ప్రసాదించింన ప్రేక్షక దేవుళ్లూ.. సరిలేరూ మీకెవ్వరూ! అని ఆయన ట్వీట్ చేశారు. మహేష్‌తో ఉన్న ఫొటోను షేర్ చేశారు. ఇదిలాఉండగా.. సూపర్‌స్టార్ మహేష్ అభిమానులు ఈ సినిమా విజయాన్ని పురస్కరించుకుని సోషల్ మీడియా వేదికగా.. మహేష్ పోస్టర్లను షేర్ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. #SarileruNeekevvaru, #50DaysOfBBSLN అనే హ్యాష్‌ట్యాగ్‌లు ట్విటర్లో ట్రెండింగ్‌లో ఉన్నాయి. -
సరిలేరు నీకెవ్వరు ఫేమ్ పల్లవి లేటెస్ట్ ఫొటోస్
-
అది నా తప్పు కాదు, క్యారెక్టర్ అలాంటిది
ఇండస్స్త్రీలో రాణించడమంటే మాటలు కాదు.. అదృష్టం, ప్రతిభ.. ఈ రెండూ ఉంటేనే నిలదొక్కుకోగలరు. వీటిని సమానంగా బ్యాలెన్స్ చేస్తున్న రష్మిక మందన్నాకు ప్రస్తుతం మంచి రోజులు నడుస్తున్నాయి. ఆమె ఎంపిక చేసుకున్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఎలా ఉన్నా హీరోయిన్‌కు మాత్రం అవకాశాలు గుమ్మం దగ్గరికి వస్తున్నాయి. సినిమా హిట్టు ఫట్టుతో సంబంధం లేకుండా ఆమె పాత్రకు ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంటోంది. ఇక సరిలేరు నీకెవ్వరు సినిమాతో ఈ క్యూట్ హీరోయిన్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. సూపర్ స్టార్ మహేశ్‌బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’లో ‘హీ సో స్వీట్.. హీ సో క్యూట్’ అంటూ లవ్లీ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆడిపాడిన రష్మికను చూసి అభిమానులు మంత్రముగ్ధులైపోయారు. కానీ ఈ చిత్రంలో ఆమె కాస్త అతి చేసిందన్న విమర్శలూ లేకపోలేదు. ప్రతీదానికి అతిగా ఎగ్జైట్ అవుతూ ఓవర్ యాక్షన్ చేసిందని కొందరు నెటిజన్లు ఆమెను దారుణంగా ట్రోల్ చేశారు. కాగా ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనపై వచ్చిన విమర్శలపై స్పందించింది. తాను అతిగా ప్రవర్తించానంటున్నారు.. కానీ తనకిచ్చిన పాత్రే అలాంటిదని సంజాయిషీ ఇచ్చుకుంది.(సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ) పాత్రకు పూర్తి న్యాయం చేయడం తన బాధ్యతగా అభివర్ణించింది. ‘ సినిమాలో నా పాత్ర ఎలా డిజైన్ చేశారో దానికి తగ్గట్టుగానే నేను ప్రవర్తించాను. నిజానికి ఆ పాత్ర కోసం చాలా శ్రమించాను. ఇక విమర్శలంటారా.. దాన్ని నేను మనసారా ఆస్వాదిస్తాను. ఎందుకంటే నేను ఇప్పుడీ స్థాయిలో ఉన్నానంటే అవే కారణమని నమ్ముతున్నాను. నన్ను నేను మెరుగుపర్చుకోడానికి అవి ఎంతగానో దోహదం చేస్తాయని’ తెలిపింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ భామ నితిన్ సరసన నటించిన ‘భీష్మ’ చిత్రం విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అదేంటో కానీ.. నాకు వచ్చే పాత్రలన్నీ నా నిజజీవితానికి దగ్గరగా ఉంటున్నాయని పేర్కొంది. భీష్మలో తన పాత్ర ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంని భరోసాగా చెప్తోంది. (నిశ్చితార్థానికి ముందే నితిన్ లవ్‌స్టోరీ తెలుసు) -
తమన్నా స్టెప్పులేసిన సితార
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు, నమ్రతల గారాల పట్టీ సితార పాప మల్టీ ట్యాలెంటెడ్ అన్న విషయం తెలిసిందే. ఈ పసి ప్రాయంలోనే అటు యూట్యూబ్‌లో వీడియోలు, ఇంటర్వ్యూలు చేస్తూనే.. మరోవైపు నాట్యం నేర్చుకుంటుంది. క్లాసికల్ డ్యాన్స్‌తో పాటు తన తండ్రి సినిమా పాటలకు ఔరా అనిపించేలా స్టెప్పులు వేస్తుంటుంది. తాజాగా మహేశ్ నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సూపర్ డూపర్ హిట్ చిత్రంలోని ‘డాంగ్ డాంగ్’ సాంగ్‌కు స్టెప్పులేసింది. ఆ పాటలో తమన్నా వేసిన స్టెప్పులను అచ్చుగుద్దినట్టు సితార వేసింది. డాంగ్ డాంగ్ సాంగ్‌కు సితార చేసిన డ్యాన్స్‌ను నమ్రత సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అయింది. అంతేకాకుండా సితార ప్రతిభను నెటిజన్లు కొనియాడుతున్నారు. కాగా మహేశ్ బాబు ముద్దుల తనయ సితార, దర్శకుడు వంశీ పైడిపల్లి కుమర్తె ఆద్య కలిసి ‘ఏ అండ్ ఎస్’ అనే పేరుతో యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్న సంగతి తెలిసిందే. విభిన్న పోస్టులతో ఫాలోవర్స్‌ను పెంచుకుంటున్న ఈ చిచ్చర పిడుగులు.. ఇటీవల సరిలేరు నీకెవ్వరు సినిమా హీరో మహేశ్ బాబు, హీరోయిన్ రష్మిక మందనలను ఇంటర్వ్యూ చేశారు. ఇక ప్రస్తుతం ‘సరిలేరు నీకెవ్వరు’ సక్సెస్‌ను మహేశ్ తన కుటుంబంతో కలిసి విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఇదే టూర్లో మహేశ్ తన మోకాలి శస్త్ర చికిత్స చేయించుకోనున్నాడు. విశ్రాంతి అనంతరం స్వదేశానికి తిరిగొచ్చి వంశీ పైడిపల్లి చేయబోయే సినిమాను పట్టాలెక్కించనున్నాడు. View this post on Instagram absolutely nailed it💃💃👏👏 #SarileruNeekevvaru A post shared by Namrata Shirodkar (@namratashirodkar) on Feb 13, 2020 at 5:33am PST -
‘ఆ సమయం వస్తుందో లేదో తెలియదు’
దాదాపు 13 ఏళ్ల తర్వాత వెండితెరపై కనిపించారు లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి. రాజకీయాల్లో బీజిగా ఉన్న విజయశాంతి.. ఇటీవల మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ప్రొఫెసర్ భారతి పాత్రలో ఆమె నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అయితే ఈ చిత్రం తర్వాత విజయశాంతి మరిన్ని చిత్రాల్లో నటిస్తారా? లేక రాజకీయాలపైనే ఫోకస్ చేస్తారా? అనే చర్చ మొదలైంది. దీంతో తన భవిష్యతు కార్యచరణపై విజయశాంతి స్పందించారు. ఈ మేరకు ట్విటర్లో ఆమె ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు, అనిల్ రావిపూడిలతోపాటు తనను ఆదరిస్తున్న అభిమానులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. మళ్లీ సినిమాల్లో నటించే సమయం వస్తుందో, లేదో తెలియదని.. ఇప్పటికి ఇక సెలవని విజయశాంతి పేర్కొన్నారు. ప్రజా జీవన పోరాటంలోనే తన ప్రయాణమని వెల్లడించారు. ‘సరిలేరు మీకెవ్వరు.. ఇంత గొప్ప విజయాన్ని నాకు అందించిన, నన్ను ఎల్లప్పుడూ ఆదరిస్తూ వస్తున్న ప్రేక్షకులకు, అభిమానులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నా నట ప్రస్థానానికి కుళ్లుకుల్ ఇరమ్, కిలాడి కృష్ణుడు నుంచి నేటి సరిలేరు నీకెవ్వరు వరకు ఆ గౌరవాన్ని అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ప్రజా జీవన పోరాటంలో నా ప్రయాణం.. మళ్లీ మరో సినిమా చేసే సమయం, సందర్భం నాకు కల్పిస్తోందో, లేదో నాకు కూడా తెలియదు.. ఇప్పటికి సెలవు’ అని విజయశాంతి ట్వీట్ చేశారు. కాగా, సరిలేరు నీకెవ్వరు చిత్రంలోని పాత్ర నచ్చడంతోనే తాను నటించేందుకు అంగీకరించానని విజయశాంతి పలు సందర్భాల్లో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. -
మహేశ్‌బాబు చిత్రంలో విజయ్ దేవరకొండ?
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ప్రస్తుతం ‘సరిలేరు నీకెవ్వరు’ గ్రాండ్ సక్సెస్‌ను విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నాడు. దీనిలో భాగంగా కుటుంబసమేతంగా విదేశాల్లో విహరిస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటున్నాడు మహేశ్. ఇక తన 27వ చిత్ర దర్శకత్వ బాధ్యతలను వంశీ పైడిపల్లికి అప్పగించిన విషయం తెలిసిందే. మహర్షితో సూపర్ డూపర్ హిట్ అందించిన వంశీపై నమ్మకంతో మరో సినిమాకు మహేశ్ సైన్ చేశాడు. ‘సరిలేరు’ సక్సెస్ మీట్లో ‘మహర్షి, సరిలేరు’ చిత్రాల కంటే గొప్ప చిత్రాన్ని అభిమానులకు అందిస్తానని వంశీ మాటిచ్చాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త టాలీవుడ్లో హల్చల్ చేస్తోంది. అన్నీ అనుకున్నట్లు కుదిరితే విజయ్ దేవరకొండ- మహేశ్ బాబు ఒకే స్క్రీన్‌పై కనిపించే అవకాశం ఉంది. మహేశ్-వంశీ కాంబినేషన్లో వస్తున్న రెండో చిత్రంలో టాలీవుడ్ సెన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్నట్టు సమాచారం. విజయ్ కోసం వంశీ స్పెషల్ క్యారెక్టర్ రూపొందిచనట్టు తెలుస్తోంది. అయితే ఈ చిత్రంలో విజయ్‌ది కీలక పాత్రన లేక అతిథి పాత్రనా అనేది తెలియాల్సి ఉంది. ఇక మహేశ్‌తో ఉన్న సాన్నిహిత్యం కారణంగా విజయ్ కూడా ఈ చిత్రంలో నటించేందుకు అంగీకరించనట్టు వార్తలు వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇది నిజం కావాలిన అటు టాలీవుడ్ ఇటు అభిమానులు కోరుకుంటున్నారు. వీరిద్దరు ఒకే తెరపై కనిపిస్తే రచ్చరచ్చే అని అంటున్నారు. కాగా, మహేశ్ విదేశాల నుంచి తిరిగొచ్చాక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ప్రీ పొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: శేఖర్ మాస్టర్‌కు మహేశ్ బాబు బంపర్ ఆఫర్.. సరిలేరు నీకెవ్వరు : మూవీ రివ్యూ -
‘సరిలేరు నీకెవ్వరు’ గురించి కృష్ణ..
తన కుమారుడు మహేష్‌బాబు హీరోగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా గురించి సూపర్ కృష్ణ స్పందించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. దర్శక, నిర్మాతలు ‘ బ్లాక్ బస్టర్ కా బాప్’ అని హెడ్డింగ్ పెట్టి ప్రచారం చేయడం బాగుందన్నారు. ఈ సినిమా ఇంకా మరికొన్ని రోజులు ఆడుతుందని, మరిన్ని వసూళ్లు సాధిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా చాలా బాగుందని, నిర్మాతలు రాజీలేకుంగా నిర్మించారని మెచ్చుకున్నారు. ఎక్కడా బోరు కొట్టకుండా సినిమాను దర్శకుడు అనిల్ రవిపూడి తెరకెక్కించారని కృష్ణ ప్రశంసించారు. తన తండ్రి మాటలపై మహేష్‌బాబు స్పందిస్తూ.. ‘థ్యాంక్యూ మై సూపర్‌స్టార్.. సరిలేరు నీకెవ్వరు’ అంటూ ట్వీట్ చేశారు. తమ సినిమాను సూపర్ స్టార్ మెచ్చుకోవడం పట్ల నిర్మాత అనిల్ సుంకర సంతోషం వ్యక్తం చేశారు. మూడు తరాలు కలిసి నటించే సినిమా కోసం ఎదురు చూస్తున్నామని ఆయన ట్వీట్ చేశారు. జనవరి 11న విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాకు డివైడ్ టాక్ వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద నిలబడి మంచి వసూళ్లు రాబట్టింది. (చదవండి: సరిలేరు నీకెవ్వరు మూవీ రివ్యూ) Superstar Krishna Garu About#SarileruNeekevvaru #BlockBusterKaBAAP @urstrulyMahesh @AnilRavipudi @AnilSunkara1 @vijayashanthi_m @iamRashmika @ThisIsDSP @RathnaveluDop#AllTimeBlockBusterSLN 💥💥 pic.twitter.com/va6S19rZPq — Team Mahesh Babu (@MBofficialTeam) January 31, 2020 -
మహేశ్ బాబు భావోద్వేగ ట్వీట్
71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు తన జీవితంలో మరపురానివని సూపర్‌స్టార్ మహేశ్‌బాబు అన్నారు. గణతంత్ర వేడుకల సందర్భంగా సరిలేరు నీకెవ్వరూ చిత్ర బృందం హైదరాబాద్‌లోని భద్రతా బలగాలను కలిసింది. దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్న వేళ ధైర్య, సాహసాలతో విధులు నిర్వర్తించే మన జవాన్లను కలవడం తనకు లభించిన గౌరవంగా భావిస్తున్నానని సినీనటుడు మహేశ్ బాబు వెల్లడించారు. ఈమేరకు ట్వీట్ చేశారు. (సినిమాలకు తాత్కాలికంగా బ్రేక్ చెప్పనున్న మహేశ్!) 'మనల్ని ప్రతి క్షణం కంటికి రెప్పలా కాపాడుతున్న భారత హీరోలకు సెల్యూట్ చేస్తూ.. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు' తెలుపుతున్నట్టుగా సూపర్‌స్టార్ పేర్కొన్నారు. లేడీ అమితాబ్ విజయశాంతి, చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి కూడా మహేశ్‌తో ఉన్నారు. సంక్రాంతి కానుకగా విడుదలైన 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు జవాన్‌గా నటించిన విషయం తెలిసిందే. (సరిలేరు నీకెవ్వరు : మూవీ రివ్యూ) It was such an honour meeting all the brave soldiers. This was undoubtedly one of my most memorable days! Huge salute to the nation's heroes who continue to protect us everyday🙏🏼#SarileruMeekevvaru🙏🏻🙌#HappyRepublicDay! 🇮🇳 pic.twitter.com/YIqDafYuUg — Mahesh Babu (@urstrulyMahesh) January 26, 2020 -
నా కెరీర్లో ఇలాంటి సంక్రాంతి చూడలేదు
‘‘నేను ఇండస్ట్రీకి వచ్చి 22 ఏళ్లు అవుతోంది. నా కెరీర్లో ఇప్పటివరకు ఇలాంటి సంక్రాంతిని చూడలేదు’’ అని అన్నారు ‘దిల్’ రాజు. మహేశ్‌బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఇందులో రష్మికా మందన్నా కథానాయికగా నటించారు. ‘దిల్’ రాజు సమర్పణలో రామబ్రహ్మం సుంకర, మహేశ్‌బాబు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలైన సంగతి తెలిసిందే. తమ సినిమాకు మంచి స్పందన, కలెక్షన్స్ వస్తున్నాయని చిత్రబృందం చెబుతోంది. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘కేవలం ఐదు నెలల్లో సినిమాను పూర్తి చేసి ‘సరిలేరు మాకెవ్వరు’ అనిపించారు మహేశ్‌బాబు, అనిల్ రావిపూడి. ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాన్ని బ్లాక్ బస్టర్‌కా బాప్ అనే స్థాయిలో రెవెన్యూ క్రియేట్ చేసి డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ నిజమైన సంక్రాంతి అనుకునేలా చేశారు అనిల్. మా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌కు, ఏకే ఎంటర్టైన్మెంట్స్కి హాయ్యస్ట్ రెవెన్యూ కలెక్ట్ చేసిన సినిమాగా చేశారు అనిల్. డిస్ట్రిబ్యూటర్స్‌కు ఎంత లాభాలు కావాలో అంత లాభం వచ్చింది. ఇంకా ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేస్తుందన్న విషయాన్ని ఇప్పుడే చెప్పలేం. ఈ సంక్రాంతికి ఇంత మంచి రెవెన్యూ ఇచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు. ‘‘సంక్రాంతి పండగ ముగిసిపోయింది. కానీ పండక్కి విడుదలైన సినిమాలకు సంక్రాంతి ఇంకా నడుస్తూనే ఉంది. మహేశ్‌గారి కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అంటే మామూలు విషయం కాదు. అనిల్ కష్టానికి తగిన ప్రతిఫలం మా అందరికీ వచ్చింది. మేము ఊహించిన కలెక్షన్స్ కన్నా ఎక్కువ కలెక్షన్స్ వస్తున్నాయి. తెలుగు ఇండస్ట్రీలోనే బెస్ట్ సంక్రాంతి అంటూ కొందరు డిస్ట్రిబ్యూటర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి సంక్రాంతిలో మా సినిమా ఉండటం సంతోషంగా ఉంది’’ అన్నారు అనిల్ సుంకర. ‘‘సంక్రాంతికి బాక్సాఫీస్ దద్దరిల్లిపోయింది. ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాన్ని మహేష్‌గారి కెరీర్లోనే పెద్ద హిట్‌గా నిలిపిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇంకా మూడు వారాల రన్ ఉంది. సినిమాలో కొత్తగా 90సెకన్లు ఉండే ఓ సీన్‌ను జోడించబోతున్నాం. దాంతో ఇంకొంచెం నవ్వులు బోనస్‌గా లభిస్తాయి. సినిమాను మళ్లీ చూడాలనుకునేవారికి, కొత్తగా చూడాలనుకునేవారి కోసం ఈ సీన్‌ను యాడ్ చేస్తున్నాం. ఎప్పుడు యాడ్ చేస్తామనేది త్వరలో చెబుతాం’’ అన్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. -
అయ్య బాబోయ్ అసలు కలెక్షన్లు ఆగట్లా..
సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్‌స్టార్ మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలో చిత్ర బృందం వరంగల్‌లో ‘బ్లాక్‌బస్టర్ కా బాప్’ పేరుతో విజయోత్సవ సభ నిర్వహించింది. అంతేకాకుండా కలెక్షన్లకు సంబంధించిన వివరాలను చిత్ర బృందం ఎప్పటికప్పుడూ సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడిస్తూనే ఉంది. తాజాగా ఈ చిత్రం వారం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా షేర్ వసూలు చేసిందని ప్రకటించింది. అలాగే కలెక్షన్లు ఇంకా కొనసాగుతున్నాయని పేర్కొంది. అలాగే ఈ చిత్రానికి సంబంధించిన రెండు ప్రోమోలను చిత్రబృందం విడుదల చేసింది. అందులో ఒకదానిలో ప్రకాశ్ రాజ్‌తో మహేష్ అయ్య బాబోయ్.. ఫ్లో ఆగట్లేదని పలికే సన్నివేశాన్ని చూపించారు. ఈ వీడియోను ట్విటర్లో పోస్ట్ ఏకే ఎంటర్టైన్మెంట్స్.. ‘అయ్య బాబోయ్ అసలు కలెలక్షన్లు ఆగట్లా..’ అని పేర్కొంది. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా అనిల్ సుంకర, దిల్ రాజు, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మించారు. రష్మిక మందన్నా హీరోయిన్గా నటించగా విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్, ప్రకాశ్‌రాజ్, సంగీత కీలక పాత్రల్లో నటించారు. Ayya baboi asalu collections aagatlaa.. 😉 🤩 Never Before Ever After Blockbuster #SarileruNeekevvaru latest promo - https://t.co/vHT2tbBFww#BlockBusterKaBAAP Super ⭐ @urstrulyMahesh @AnilRavipudi @AnilSunkara1 @vijayashanthi_m @iamRashmika @ThisIsDSP — AK Entertainments (@AKentsOfficial) January 19, 2020 -
నేను తీసుకున్న మంచి నిర్ణయం సరిలేరు నీకెవ్వరు చేయటమే
‘‘నా కెరీర్లో నేను తీసుకున్న మంచి నిర్ణయం ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా చేయటమే. 20 ఏళ్ల కెరీర్లో ఇంత అద్భుతమైన స్పందనను నేనెప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయలేదు. నాన్న అభిమానులు, నా అభిమానుల తరఫున దర్శకుడు అనిల్‌కి థ్యాంక్స్’’ అన్నారు మహేశ్‌బాబు. సంక్రాంతి కానుకగా ఈ నెల 11న విడుదలైన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. మహేశ్‌బాబు, రష్మిక జంటగా ‘దిల్’ రాజు సమర్పణలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రానికి మహేశ్‌బాబు కూడా ఓ నిర్మాతగా వ్యవహరించారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయశాంతి ప్రత్యేక పాత్రలో నటించారు. ‘బ్లాక్‌బస్టర్ కా బాప్’ పేరుతో జరిగిన కార్యక్రమంలో ఈ సినిమా 100 కోట్ల షేర్ పోస్టర్‌ను చిత్రం డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మహేశ్‌బాబు మాట్లాడుతూ– ‘‘అనిల్ రావిపూడి ఈ సినిమాలో ఎన్నో మంచి డైలాగులు రాశారు. కానీ, ‘రమణా.. లోడెత్తాలిరా’ అనే డైలాగ్ మాత్రం బీభత్సంగా పేలింది. కథ వినగానే దేవిశ్రీ ప్రసాద్ మాస్ సాంగ్ చేయటానికి మంచి అవకాశం ఉందని ముందే చెప్పారు. అలా వచ్చిందే ‘మైండ్ బ్లాంక్’ సాంగ్. ‘కొడుకు దిద్దిన కాపురం’ చిత్రంలో విజయశాంతి గారితో నటించాను. ఆ సినిమా పెద్ద హిట్. ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్‌బస్టరో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఈ సంక్రాంతిని ఎప్పటికీ మరచిపోను. నాలుగైదేళ్లుగా నా అభిమానులు, ప్రేక్షకులు కొత్త మహేశ్‌ను కోరుకుంటున్నారు. అది ఈ సినిమాతో సాధ్యం చేసిన నిర్మాత అనిల్ సుంకరగారికి థ్యాంక్స్’’ అన్నారు. విజయశాంతి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాని ‘బ్లాక్‌బస్టర్ కా బాప్‌గా నిలిపిన ప్రేక్షకులకు నమస్కరిస్తున్నాను. సైనికుల తల్లిదండ్రుల బాధ ఏంటో అనిల్ ఈ చిత్రంలో సందేశాత్మకంగా చూపించారు. మహేశ్‌బాబుతో పని చేయటం కంఫర్ట్‌గా ఉంటుంది. ఈ సినిమాలో చేసిన భారతి పాత్ర నా కెరీర్‌కి ఎంతో ప్రత్యేకం. రాములక్కా.. మళ్లీ సినిమాలు చేయండి అని అడుగుతున్నారు. ఈ రాములక్క సినిమా చేయాలంటే సబ్జెక్ట్ బాగుండాలి, పాత్ర దద్దరిల్లాలి’’ అన్నారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ– ‘‘మహర్షి’ సినిమా సక్సెస్ మీట్లో అన్నాను... మహేశ్ సార్ నా సినిమా వల్ల మీ ముఖంలో నవ్వురావాలి, మిమ్మల్ని ఆనందంగా చూడాలి అని. సినిమా విడుదలైన రోజు నుండి నేను ఆయనతోనే ఉంటున్నాను. ఆయన ఎంతో సంతోషంగా ఉంటున్నారు. బాబు బ్యాటింగ్ మొదలయ్యింది, ఫస్ట్ వీక్ 100 కోట్లు కలెక్ట్ చేసింది’’ అన్నారు. ‘‘మహేశ్‌తో ఇలాంటి జోనర్లో సినిమా చేయాలని ఎప్పటినుండో అనుకుంటున్నా. ఎవరూ ఊహించని విధంగా ఆయన నటన ఉంది. అనిల్ రావిపూడికి థ్యాంక్స్’’ అన్నారు దేవిశ్రీ ప్రసాద్. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, యం.ఎల్.ఏ వినయ్ భాస్కర్, వరంగల్ సీపీ రవీందర్‌తో పాటు నటుడు రాజేంద్రప్రసాద్, నిర్మాతలు ‘దిల్’ రాజు, అనిల్ సుంకర, దర్శకులు వంశీ పైడిపల్లి, ఫైట్ మాస్టర్స్ రామ్–లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
నా ఫేవరెట్ కో స్టార్ ఆమే: మహేష్ బాబు
సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన టాలీవుడ్ సూపర్‌స్టార్... ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా సూపర్‌హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో మహేష్ చిత్ర బృందంతో కలిసి శుక్రవారం తెల్లవారుజామున తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం అదే రోజు రాత్రి.. హన్మకొండలో చిత్రం విజయోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. అయితే సినిమా విడుదలకు ముందు, తర్వాత తాను పాల్గొన్న మూవీ ప్రమోషన్లలో చిన్నారులు ఆద్య, సితారకు ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రత్యేమని మహేశ్ బాబు పేర్కొన్నారు. ‘‘నా చిట్టితల్లులకు ఇంటర్వ్యూ ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. నాకు ఇంతకు మించిన సంతోషం ఏం ఉంటుంది! వాళ్ల ఎనర్జీ, స్టైల్ సూపర్. వాళ్లిద్దరికీ నా ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉంటాయి’’ అని ఇంటర్వ్యూ వీడియోను ట్విటర్లో షేర్ చేశారు. కాగా మహేశ్ బాబు ముద్దుల తనయ సితార, దర్శకుడు వంశీ పైడిపల్లి కుమర్తె ఆద్య కలిసి ‘ఏ అండ్ ఎస్’ అనే పేరుతో యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్న సంగతి తెలిసిందే. విభిన్న పోస్టులతో ఫాలోవర్స్‌ను పెంచుకుంటున్న ఈ చిచ్చర పిడుగులు.. ఇటీవల సరిలేరు నీకెవ్వరు సినిమా హీరోయిన్ రష్మిక మందన్నను ఇంటర్వ్యూ చేశారు. ఇక తాజాగా మహేశ్ బాబును తమ ఛానెల్‌కు ప్రత్యేక అతిథిగా ఆహ్వానించి సూపర్‌స్టార్ అభిమానుల మనసు దోచుకున్నారు. కాగా ఇంటర్వ్యూలో భాగంగా సితార, ఆద్య అడిగిన పలు ప్రశ్నలకు మహేశ్ బాబు సమాధానమిచ్చారు. ఈ ఏడాదిలో జనవరి 11 తనకు ప్రత్యేకమైన రోజని... ఆర్మీ జవానుగా నటించడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. ఇక తన సహనటుల్లో చాలా మంది ఫేవరెట్ యాక్టర్లు ఉన్నారని.. అయితే ప్రస్తుతానికి ఫేవరెట్ కోస్టార్ రష్మిక అని మహేశ్ సరదాగా వ్యాఖ్యానించారు.(‘రష్మికను ఓ ఆటాడుకున్న సితార’) సరిలేరు నీకెవ్వరు : మూవీ రివ్యూ Being interviewed by my lil girls has been the best part of my promotions so far💞💞 Such a pleasure...what more can I ask for! Love their energy & style!!! ❤❤❤ Way to go Aadya and Sitara 🤗🤗 Love & blessings to both!https://t.co/Eb4n3ifmCB — Mahesh Babu (@urstrulyMahesh) January 18, 2020 -
మహేశ్‌బాబుకు జన నీరాజనం..
సాక్షి, హన్మకొండ: హన్మకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో శుక్రవారం రాత్రి నిర్వహించిన “సరిలేరు నీకెవ్వరు’ విజయోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. సూపర్‌స్టార్ మహేష్‌బాబు, హీరోయిన్ రష్మిక, లేడీ అమితాబ్ విజయశాంతి, సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్, దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు దిల్ రాజు, అనిల్ సుంకర, నటులు రాజేంద్రప్రసాద్ అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9గంటల వరకు మూడు గంటల పాటు సాగిన వేడుకల్లో సత్య బృందం నృత్యాలు, సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్ సమకూర్చిన పాటలతో గాయకులు అభిమానులను ఉర్రూతలూగించారు. అందరికీ ధన్యవాదాలు తనపై అభిమాన వర్ష కురిపించిన ప్రతి ఒక్కరికి హీరో మహేష్‌బాబు ధన్యవాదాలు తెలిపారు. కేవలం ఐదు సినిమాలకే దర్శకత్వం వహించిన అనిల్ రావిపూడి అన్ని సూపర్ డూపర్ హిట్లను ఇవ్వడం సంతోషకర విషయం అన్నారు. అంచనాలకు మించి బ్లాక్ బస్టర్ కా బాప్‌గా సినిమాను ఆదరించిన అభిమాన దేవుళ్లకు రుణపడి ఉంటానని తెలిపారు. భవిష్యత్‌లో కూడా మంచి సందేశాత్మకమైన చిత్రాలే కాకుండా అభిమానులకు నచ్చే విధంగా తీస్తానని హీరో అన్నారు. మంచిగున్నారా... హీరోయిన్ రష్మిక మాట్లాడుతూ ‘హలో వరంగల్.. మంచిగున్నారా’ అంటూనే సినిమాలోని అర్థమవుతుందా అనే డైలాగ్‌ను చెప్పడంతో అభిమానులు కేరింతలు కొట్టారు. శ్రీముఖి వ్యాఖ్యాతగా వ్యవహరించిన సభకు వేలాదిగా అభిమానులు హాజరుకాగా జేఎన్ఎస్ కిక్కిరిసిపోయింది. సినీ పరిశ్రమను వరంగల్ కు గుంజుకురండి రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ ‘సినిమాలు అనగానే విజయవాడ, వైజాగ్‌కు వెళ్తున్నారు.. అలా కాకుండా సిని పరిశ్రమను వరంగల్ అడ్డాగా గుంజుకురావాలి’ అని సినీ ప్రముఖులను ఉద్దేశించి కోరారు. అందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆశీస్సులతో తన వంతుగా సహకరిస్తానని అన్నారు. కాగా నిర్మాత దిల్ రాజు తన ప్రసంగంలో సినీ పరిశ్రమను వరంగల్‌కు గుంజుకురావడం కష్టమైనదేనని చెప్పారు. చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, డాక్టర్ టి.రాజయ్య, నగర పోలీసు కమిషనర్ వి.రవీందర్, గ్రేటర్ మేయర్ గుండా ప్రకాశ్‌రావుతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. కాగా, సభ అనంతరం చిత్ర యూనిట్ సభ్యులు పర్వతగిరిలో మంత్రి దయాకర్‌రావు స్వగృహానికి వెళ్లారు. చదవండి: నెవ్వర్ బిఫోర్ సంక్రాంతి -
వరంగల్ లో ’సరిలేరు నీకెవ్వరు‘ విజయోత్సవ సభ
-
లాభాల్లోకి ఎంటరైన సరిలేరు..
సాక్షి, హైదరాబాద్ : సంక్రాంతికి విడుదలైన మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు బ్లాక్‌బస్టర్ కా బాప్ రేంజ్‌లోనే వసూళ్లనూ రాబడుతోంది. ఆరు రోజులకే ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ఈవెన్ సాధించడంతో పాటు పలు ప్రాంతాల్లో డిస్ర్టిబ్యూటర్లకు లాభాలను పంచుతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సరిలేరు పండుగ సినిమాల నుంచి పోటీని తట్టుకుంటూ కేవలం ఆరురోజుల్లోనే ఏపీ, తెలంగాణల్లో రూ 112.60 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. మహేష్ బాబు సినిమాల్లో తొలివారం అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా రికార్డు సృష్టించింది. అన్ని ఏరియాల్లోనూ ప్రిన్స్ మూవీ నాన్ బాహుబలి 2 రికార్డులను కైవసం చేసుకుని సంక్రాంతి ఛాంపియన్‌గా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో రూ 75.70 కోట్లకు థియేట్రికల్ హక్కులను విక్రయించగా ఆరు రోజుల్లోనే మూవీ రూ 77.94 కోట్ల షేర్‌ను రాబట్టి బయ్యర్లకు లాభాలను పంచింది. చదవండి : రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో మహేశ్ బృందం.. -
శ్రీవారిని దర్శించుకున్న మహేష్ అండ్ టీమ్..
సాక్షి, తిరుపతి : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌బాబు తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు ఈ సంక్రాంతికి విడుదలై కలెక్షన్ల వర్షం కురుపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యం మహేష్ చిత్ర బృందంతో కలిసి శుక్రవారం తెల్లవారుజామున తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారిని దర్శించుకున్నవారిలో మహేష్, నమ్రత, వారి పిల్లలు, విజయశాంతి, దిల్ రాజు, అనిల్ రావిపూడి, రాజేంద్రప్రసాద్, అనిల్ సుంకర, వంశీ పైడిపల్లి, ఆది శేషగిరిరావు ఉన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికీ ఆశీర్వచనాలు అందజేశారు. శ్రీవారి దర్శనం కోసం గురువారం రాత్రే సరిలేరు నీకెవ్వరు చిత్ర బృందం తిరుమల చేరుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఈ చిత్రం విజయోత్సవ సభ శుక్రవారం సాయంత్రం హన్మకొండలోని జేఎన్ఎస్లో జరగనుంది. ఇందుకోసం శ్రేయాస్ మీడియా భారీ ఏర్పాట్లు చేసింది. సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుందని నిర్వాహకులు తెలిపారు. -
రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో మహేశ్ బృందం..
సరిలేరు నీకెవ్వరు చిత్రం విజయవంతం కావడంతో చిత్రబృందం మంచి జోష్‌లో ఉంది. సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు చిత్ర బృందం గురువారం తిరుమల వెళ్లింది. హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానశ్రయం చేరుకున్న చిత్రబృందంతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. అక్కడి నుంచి వారు రోడ్డు మార్గంలో తిరుమల వెళ్లారు. తిరుమల వెళ్లినవారిలో మహేశ్ బాబు, నమ్రత, వారి పిల్లలు, విజయశాంతి, దిల్ రాజు, అనిల్ రావిపూడి, రాజేంద్రప్రసాద్, అనిల్ సుంకర, వంశీ పైడిపల్లి ఉన్నారు. రేపు వేకువజామున సరిలేరు నీకెవ్వరు చిత్రబృందం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. -
మహేశ్ బాబుకు అనిల్ ఫ్యామిలీ మెసేజ్..
అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా నటించిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి అనిల్‌కు అవకాశం కల్పించినందుకు ఆయన కుటుంబ సభ్యులు మహేశ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పండగ ముందుగానే బ్లాక్‌బస్టర్‌కా బాప్ ఇచ్చారని అన్నారు. మహేశ్ కుటుంబానికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. మహేశ్ ఈ చిత్రంలో డ్యాన్స్‌లు ఇరగదీశారని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను మహేశ్ సతీమణి నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అలాగే అనిల్ కుటుంబానికి నమ్రత కృతజ్ఞతలు తెలిపారు. బిగ్గెస్ట్ బ్లాక్బాస్టర్ ఇచ్చినందుకు అనిల్‌కు ధన్యవాదాలు చెప్పారు. కాగా, మహేశ్, రష్మిక జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. దాదాపు 13 ఏళ్ల తర్వాత లేడి అమితాబ్ విజయశాంతి ఈ చిత్రంతో వెండితెరపై రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రంలో మహేశ్, విజయశాంతిల మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. View this post on Instagram My director @anilravipudi 's family !! Thankyou all for the sweetest message 🙏🙏😍 Anil sir ,Thank you for giving us the biggest blockbuster in #SarileruNeekevaru 😍😍 We at @gmbents and @urstrulymahesh are grateful and humbled by ur love, sincerity and passion🤗🤗 Looking forward to another blockbuster soon enough 🙏🙏🙏🙏 A post shared by Namrata Shirodkar (@namratashirodkar) on Jan 14, 2020 at 7:58am PST -
మీకోసం.. మహేశ్‌బాబుని తీసుకొచ్చాం!
‘సరిలేరు నీకెవ్వరు’ షూటింగ్లో ఎంత బిజీగా ఉన్నారో.. ఆ సినిమా రిలీజ్ అయ్యాక అంతకుమించి బిజీగా ఉన్నారు హీరో మహేశ్‌బాబు! ‘నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్’ అంటూ.. ఫ్యాన్స్.. స్క్రీన్ మీద సంక్రాంతి చేసుకుంటుంటే.. ‘ఇది నాకు మెమొరబుల్ సంక్రాంతి’ అని మహేశ్ బాబు.. మూవీ హిట్‌ని టీమ్‌తో కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నారు! సంక్రాంతికి పంట ఇంటికి వస్తుంది. మేము మీకోసం.. సంక్రాంతిని పండిస్తున్న మహేశ్‌బాబుని తీసుకొచ్చాం. హ్యాపీ సంక్రాంతి. ►హ్యాపీ సంక్రాంతి మహేశ్‌బాబు గారు. ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రానికి మంచి స్పందన వస్తోంది. ఎలా అనిపిస్తోంది మీకు? చాలా సంతోషంగా ఉంది. షూటింగ్ సమయంలో ఈ సినిమా హిట్ కొడుతుందని అనుకున్నాను కానీ ఇంత పెద్ద స్థాయిలో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుందని ఊహించలేదు. అభిమానుల్లో చూస్తున్న ఆనందం.. నా సంతోషాన్ని రెట్టింపు చేసింది. ‘ఇలా కదా మహేశ్‌బాబును చూడాలని మేము అనుకున్నది’ అని ఒక్కొక్కరు అంటుంటే చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. ఈ క్రెడిట్‌ను అనిల్ రావిపూడికి ఇస్తాను. నా క్యారెక్టర్లో వేరియేషన్స్ ఉండటం, కామెడీ టైమింగ్ ఇవన్నీ బాగా కుదిరాయి. ►మీలాంటి సూపర్‌స్టార్ హీరోకు యువ దర్శకుడైన అనిల్ రావిపూడితో సినిమా ఎందుకు చేయాలనిపించింది? ‘సరిలేరునీకెవ్వరు’ సినిమాకు ముందు కొంతకాలంగా సిరీయస్ పాత్రలు చేశాను. దీంతో ఇందుకు భిన్నంగా అభిమానులకు నచ్చేలా ఏదైనా మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ చేయాలనుకున్నాను. ఆ సమయంలో అనిల్ చెప్పిన ఈ కథ బాగా నచ్చింది. అనిల్ ఇదివరకు దర్శకత్వం వహించిన సినిమాలు చూశాను. నచ్చాయి. ‘ఎఫ్ 2’ ఇంకా బాగా నచ్చింది. అనిల్ కథ నేరేషన్ ఇచ్చిన తర్వాత రెండు నెలల్లో బ్రౌండ్ స్క్రిప్ట్‌తో వచ్చాడు. ఐదు నెలల్లో షూటింగ్ పూర్తి చేశాం. అనిల్ మంచి డైలాగ్స్ రాశాడు. సినిమాలోని ట్రైన్ ఎపిసోడ్ ప్రేక్షకులకు బాగా కనెకై్టపోయింది. ఆర్మీ బ్యాక్ డ్రాప్ సన్నివేశాలను కూడా అనిల్ బాగా డిజైన్ చేశాడు. కశ్మీర్ షెడ్యూల్ టీమ్ అందరి ఎఫర్ట్. అక్కడి సైనికులు అందించిన సహకారం మర్చిపోలేం. ►సినిమాలో విజయశాంతిగారి సన్నివేశాలు చాలా ఎమోషనల్‌గా ఉన్నాయి. సినిమాలోని భారతి పాత్రకు విజయశాంతిగారు తప్ప ఇంకెవ్వరు న్యాయం చేయలేరనిపించింది. ఈ సినిమాను ఒప్పుకుని నటించినందుకు ఆమెకు థ్యాంక్స్. కొన్నేళ్ల క్రితం ‘కొడుకుదిద్దిన కాపురం’ సినిమాలో విజయశాంతిగారితో చేశాను. అప్పుటికి ఇప్పటికీ ఆమె ఏం మారలేదు. ►సినిమా విడుదలైనప్పుడు కలెక్షన్స్ గురించి ఆలోచిస్తారా? కలెక్షన్స్‌ను పట్టించుకోవాలి. డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, నిర్మాతలు సంతోషంగా ఉండాలి. అందుకే నంబర్స్ అనేవి చాలా ముఖ్యమని నేను భావిస్తాను. ►కెరీర్ మొదట్లో ఉన్నప్పటితో పోల్చి చూసినప్పుడు సినిమా కథల ఎంపిక గురించి మీ ఆలోచన ఎలా ఉంది? ముందుగా నేను సినిమా చేయాలంటే స్క్రిప్ట్ నన్ను బాగా ఎగై్జట్ చేయాలి. నిజానికి ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం ఈ ఏడాది తర్వాత చేయాల్సిన సినిమా. కథ బాగా నచ్చడంతో వెంటనే చేశాను. ఒక మంచి నిర్ణయం తీసుకున్నాను అనిపించింది. ఇలాంటివి ఇంకా తీసుకుంటే నా కెరీర్‌కు, కానీ నా అభిమానులకు, సినిమా ట్రెండ్‌కు ఇంకా బాగుంటుందనిపిస్తోంది. ఎప్పుడూ కమిట్మెంట్కు కట్టుబడి ఉంటాను. పండక్కి ఒక సినిమా రావాలి. ఫ్యాన్స్‌కు ఓ సినిమా చేయాలనే స్వార్థంతో ఈ సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా చేయడం మా అందరికీ మంచిదైంది. చాలా సంతోషంగా ఉంది. ►ఓ కొత్తరకం సినిమాకు ఓకే చెప్పాలన్నప్పుడు మీ స్టార్డమ్ గురించి ఆలోచిస్తారా? తెలుగు సినిమా చాలా పెద్దదైపోయింది. ప్రేక్షకులు, అభిమానులు, ట్రెండ్, మార్కెట్ వంటి అంశాలను కూడా దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేయాలి. ఒక పెద్ద సినిమా చేయడం అనేది చాలా బాధ్యతతో కూడుకున్న పని. కేవలం కథ నచ్చింది కదా అని ఈ రోజుల్లో సినిమాలు చేయలేం. అన్ని కోణాల్లో ఆలోచించి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలి. ►సోషల్ మీడియాను మీరు ఫాలో అవుతారా? సోషల్ మీడియాను అంతగా ఫాలో కాను. నాకు కష్టపడి పనిచేయడం ఇష్టం. ఇంటికి వెళ్లి పిల్లలతో సరదాగా ఆడుకోవడం ఇష్టం. ►ఈ ఏడాది సంక్రాంతి సెలబ్రేషన్స్‌ను ఎలా ప్లాన్ చేశారు? ఈ ఏడాది మాకు ఈ నెల 11నే (‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం విడుదలైన రోజు) సంక్రాంతి వేడుకలు మొదలయ్యాయి. ప్రతి రోజూ స్నేహితులతో ఇంట్లో పార్టీలు జరుగుతున్నాయి. అందరం కళకళలాడిపోతున్నాం. ఇది నా మోస్ట్ మెమొరబుల్ సంక్రాంతి. ►దేవుణ్ని నమ్ముతారా? నేను దేవుణ్ని బాగా నమ్ముతాను. ఇటీవలే షిరిడీ, తిరుపతి వెళ్లొచ్చాను. నమ్రతకు కూడా దైవభక్తి ఉంది. ►దర్శకులతో మీ బాండింగ్ ఎలా ఉంటుంది? నేను డైరెక్టర్స్ యాక్టర్‌ని. వారితో నేను ఎమోషనల్‌గా కనెక్ట్ కాలేకపోతే సినిమా చేయలేను. నేను ఎవరితో సినిమా చేస్తే ఆ సినిమా దర్శకుడితో నాకు ఓ భావోద్వేగంతో కూడిన ప్రయాణం తప్పక ఉంటుంది. నా దర్శక–నిర్మాతలతో నేను చాలా స్నేహపూర్వకంగా ఉంటాను. ►ఒక నిర్మాతగా మీ బ్యానర్లో ఎలాంటి సినిమాలను ప్రేక్షకులకు అందించాలనుకుంటున్నారు? మంచి కంటెంట్ ఉన్న సినిమాను మా బ్యానర్ లో తప్పకుండ ప్రొడ్యూస్ చేస్తాను. డిఫరెంట్ సినిమాలను నిర్మించాలనుకుంటున్నాను. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ విస్తృతి పెరుగుతోంది. నెట్‌ఫ్లిక్స్ వంటివారు పెద్ద పెద్ద హాలీవుడ్ స్టార్స్‌తో సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం హీరోగా నా దృష్టి అంతా వెండితెరపైనే. ►పాన్–ఇండియా సినిమా ఎప్పుడు చేస్తారు? మనం పాన్–ఇండియా సినిమాయే చేయాలి అంటే కుదరదు. మనం చేసే సినిమాకు యూనివర్సిల్ అప్పీల్ ఉండి, అది ఒక పెద్ద సినిమా అయి భాషపరమైన హద్దులు దాటి, అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తే అది నా దృష్టిలో పాన్–ఇండియా సినిమా. భవిష్యత్‌లో రాజమౌళిగారితో సినిమా ఉంది. ►ఇండస్ట్రీలో పెద్ద హీరోల మధ్య పోటీ గురించి ఏమంటారు? ఇండస్ట్రీలో పోటీ ఉండాలి. అప్పుడే ప్రేక్షకుల వద్దకు మంచి మంచి సినిమాలు వెళ్తాయి. కానీ ఆ పోటీ మంచి వాతావరణంలో ఉండాలి. ►మీరు చిన్న సినిమాలను బాగా ప్రొత్సహిస్తున్నారు? బేసిగ్గా నేను సినిమా లవర్నీ. భాషతో సంబంధం లేకుండా ఏ సినిమా విడుదల అయినా చూస్తాను. నచ్చితే ట్వీట్ చేస్తాను. షూటింగ్ లేకపోతే ఐదారు సినిమాలు చూస్తాను. సినిమాలు అంటే నాకు అంత ఇష్టం. యాక్టింగ్ తప్ప నాకు ఇంకేం తెలియదు. నాకు వందేళ్లు వచ్చేంతవరకు సినిమాల్లో నటిస్తూనే ఉంటాను. ►మీ తర్వాతి చిత్రం గురించి? వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ‘మహర్షి’ చిత్రం కాస్త సందేశాత్మకంగా ఉంది. నెక్ట్స్ మేం ఇద్దరం చేయబోయే సినిమా మంచి కమర్షియల్ ఫార్మాట్లో ఉంటుంది. ►నాన్నగారు(సూపర్‌స్టార్ కృష్ణ) సినిమా చూసి ఏమన్నారు? ఇప్పటివరకు నీ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అన్నారు. నీ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అన్నారు. డైరెక్టర్ అనిల్‌ను ఓసారి కలవాలన్నాను అని చెప్పు అన్నారు. ఈ సమయంలో ఆయన ముఖంలో నవ్వు చూసి చాలా సంతోషపడ్డాను. ►మీ పిల్లల స్పందన మీకు సంతోషాన్ని ఇచ్చిందా? ఎప్పుడు నా సినిమాలను నా ఇంట్లోని హోమ్ థియేటర్లో చూస్తాను. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాను కూడా చూశాను. పిల్లలు (కుమారుడు గౌతమ్, కూతురు సితార) బాగా ఎంజాయ్ చేశారు. సాధారణంగా గౌతమ్ సినిమాను రెండోసారి చూడడు. కానీ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాను మళ్లీ చూద్దామని నాతో కలిసి రెండోసారి కూడా చూశాడు. చాలా గర్వంగా ఫీలయ్యాను. నిజానికి గౌతమ్, సితారలతో సమయం గడపుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. భార్య నమ్రత, కుమారుడు గౌతమ్, కూతురు సితారతో మహేశ్‌బాబు ►మీ సక్సెస్ జర్నీలో నమ్రత (మహేశ్‌బాబు సతీమణి) పాత్ర గురించి ఏమని చెబుతారు? నా సక్సెస్ జర్నీలో నా భార్య నమ్రత పాత్ర చాలా ప్రధానమైనది. ఎవరికైనా ఇల్లు అనేది చాలా ముఖ్యం. ఇల్లు బాగుంటే మనం బాగుంటాం. అది నేను నమ్ముతాను. ఇంత కష్టపడి మనం ఇంటికి వెళితే ఒక ప్రశాంతతో కూడిన వాతావరణం ఇంట్లో ఉండాలి. ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతుణ్ని. నమత్ర అన్నీ విషయాలు బాగా చూసుకుంటుంది. ►‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో మీ డ్యాన్స్‌లు అదిరిపోయాయని ప్రేక్షకులు అంటున్నారు! (నవ్వుతూ) ఈ సినిమాలో డ్యాన్సులు బాగా చేశానని ప్రేక్షకులు అంటున్నారు. ఆ క్రెడిట్ దర్శకుడు అనిల్‌కు, శేఖర్ మాస్టర్‌కు, సంగీత దర్శకుడు దేవీలది. షూటింగ్ సగంలో ఉన్నప్పుడే నాకు తెలిసింది. ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని. షూటింగ్ సమయంలో అనిల్‌కు మేసేజ్ చేశాను... ఈ సినిమాలో బాగా డ్యాన్స్ చేస్తానని. కానీ ప్రేక్షకుల నుంచి ఈ రేంజ్లో స్పందన వస్తుందనుకోలేదు. నా కెరీర్లో ‘మైండ్‌బ్లాక్’ సాంగ్‌కు మంచి స్పందన వచ్చింది. మిగతా పాటలు కూడా ప్రేక్షకులను మెప్పించాయి. -
శేఖర్ మాస్టర్‌కు మహేశ్ బాబు బంపర్ ఆఫర్..
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు హీరోగా క్రేజీ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని దిల్‌రాజు, అనిల్ సుంకర, మహేశ్ బాబులు నిర్మించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్‌తో దూసుకపోతోంది. అంతేకాకుండా కలెక్షన్న సునామీ సృష్టిస్తోంది. చిత్రం విడుదలైన ఈ మూడు రోజుల్లోనే దాదాపు వంద కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసినట్లు సమాచారం. ఇంకా పండగ సమయం ఉన్నందున మరిన్ని భారీ వసూళ్లు చేసే అవకాశం ఉంది. దీంతో మూవీ గ్రాండ్ సక్సెస్‌ను చిత్ర యూనిట్ తెగ ఎంజాయ్ చేస్తోంది. ఇక సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుండటంతో చిత్రయూనిట్ రోజుకొక ప్రొమో, ప్రమోషన్ వీడియోలతో హల్చల్ చేస్తోంది. దీనిలో భాగంగా సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలను డైరెక్టర్ అనిల్ రావిపూడి మహేశ్‌కు చదివి వినిపించాడు. అభిమానులు అడిగిన ప్రశ్నలన్నింటికి మహేశ్ కూల్‌గా సమాధానమిచ్చాడు. దీనిలో భాగంగా చిత్ర విశేషాలను, విజయాన్ని ఎలా ఆస్వాదిస్తున్నాడో వివరించాడు. తదుపరి చిత్రంలో పోకిరి మహేశ్ అటిట్యూడ్ అండ్ ఇంటెన్స్ కావాలని ఓ అభిమాని కోరగా.. దానికి సమాధానంగా కచ్చితంగా భవిష్యత్‌లో గొప్ప చిత్రాలను చేద్దామని, పోకిరిని మించి చేద్దామని తెలిపాడు. అంతేకాకుండా ఈ సినిమాలో మైండ్ బ్లాక్ సాంగ్‌లో శేఖర్ మాస్టర్ డ్యాన్స్ కంపోజ్ బాగా చేశారని, ఇక నుంచి ప్రతీ సినిమాకు అతడినే కొరియోగ్రఫర్‌గా పెట్టుకోవాలని మరో ఫ్యాన్ సూచించాడు. తప్పకుండా తన చిత్రంలో కనీసం రెండు పాటలకు శేఖర్ మాస్టర్‌తో కలిసి పనిచేస్తామని మహేశ్ మాటిచ్చాడు. పూర్తి విశేషాల కోసం కింది వీడియోను చూడండి. చదవండి: సరిలేరు నీకెవ్వరు : మూవీ రివ్యూ వందకోట్ల క్లబ్బులో సరిలేరు -
వందకోట్ల క్లబ్బులో సరిలేరు
హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు తాజామూవీ ‘సరిలేరు నీకెవ్వరు’ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. సంక్రాంతి పండుగ వేళ ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించేలా తెరకెక్కిన ఈ సినిమా తొలి మూడురోజుల్లోనే వందకోట్ల మార్క్‌ను దాటేసింది. బ్లాక్‌బస్టర్ కా బాప్‌గా బాక్సాఫీస్ వద్ద హల్చల్ చేస్తున్న ఈ సినిమా మూడు రోజుల్లో 103 కోట్ల రియల్ గ్రాస్ వసూలు చేసిందని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు మహేశ్‌బాబుతో కూడిన సరిలేరు నీకెవ్వరు పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ సినిమా తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.46.77 కోట్ల షేర్ సాధించిన విషయం తెలిసిందే. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో రూ.32.77 కోట్ల షేర్ రాబట్టినట్లు సమాచారం. ఇక, రెండోరోజు శనివారం సుమారు 20 కోట్ల వరకు ఈ సినిమా రాబట్టిందని అంటున్నారు. మొత్తానికి తొలిమూడురోజుల్లోనే ఈ సినిమా వందకోట్లు వసూలు చేసిందని చిత్రయూనిట్ వెల్లడించింది. సూపర్ స్టార్ మహేశ్ బాబు, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమాతో లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి 13ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. భరత్ అనే నేను, మహర్షి వంటి హిట్స్ తర్వాత మహేశ్ నటిస్తున్న సినిమా కావడం.. పటాస్ నుంచి ఎఫ్2 వరకు కమర్షియల్ పంథాలో సినిమాలు తీస్తూ హిట్స్ ఇస్తున్న అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయడంతో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో పెద్దగా కథ లేకపోయినా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే అంశాలపై దర్శకుడు అనిల్ బాగా ఫోకస్ చేశాడని రివ్యూలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పండుగ సీజన్లో బాక్సాఫీస్ వద్ద ‘సరిలేరు నీకెవ్వరు’ భారీగానే వసూళ్లు రాబట్టినట్టు ట్రెడ్ అనలిస్టులు విశ్లేషిస్తున్నారు. -
లేడీ అమితాబ్ ‘కిక్’ మాములుగా లేదుగా..
దాదాపు పదమూడేళ్ల తరువాత వెండితెరపై రీ ఎంట్రీ ఇచ్చారు లేడీ అమితాబ్ విజయశాంతి. సరిలేరు నీకెవ్వరు చిత్రంలో పవర్ఫుల్ పాత్రలో తనదైన నటనతో ఆకట్టుకున్నారు. ప్రొఫెసర్ భారతిగా అభిమానులను అలరించారు. తాజాగా ఈ చిత్రం షూటింగ్ సందర్భంగా విజయశాంతి చేసిన ఓ ఫీట్‌ను దర్శకుడు అనిల్ రావిపూడి ట్విటర్లో షేర్ చేశారు. ఆమె బ్రహ్మాజికి కిక్ ఇస్తున్న.. స్లో మోషన్ వీడియోను ఆయన అభిమానులతో పంచుకున్నారు. దానిని మాస్టర్ కిక్ అని పేర్కొన్నారు. అలాగే అందరికీ భోగి శుభాకాంక్షలు తెలిపారు. దీనిపై బ్రహ్మాజీ స్పందిస్తూ ‘కిక్ ఎవరికీ’ అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. అనిల్ పోస్ట్‌పై నెటిజన్లు ‘వావ్ సూపర్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. సంక్రాంతి కానుకగా విడుదలైన జనవరి 11న విడుదలైన సరిలేరు నీకెవ్వరు చిత్రం హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రంలో మహేశ్, విజయశాంతిల మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలెట్‌గా నిలిచాయి. After 13 years..... What a come back @vijayashanthi_m madam.... MASTER KICK 💥💥💥💥💥🤗🤗🤗🤗 భోగి శుభాకాంక్షలు pic.twitter.com/6X9qXLzclR — Anil Ravipudi (@AnilRavipudi) January 14, 2020 చదవండి : సరిలేరు నీకెవ్వరు : మూవీ రివ్యూ రాములమ్మ మళ్లీ ఏడిపించింది అంటున్నారు -
వసూళ్ల వరద
అగ్ర రాజ్యం అమెరికాలో తెలుగు సినిమాలు సందడి చేస్తున్నాయి. సంక్రాంతికి విడుదలైన సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురంలో సినిమాలు అమెరికా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్నాయి. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ‘దర్బార్’ కూడా అంచనాలకు తగ్గినట్టు వసూళ్లు రాబడుతోంది. ఈ మూడు సినిమాలు కలిసి ఇప్పటికే 31 కోట్ల రూపాయలు వసూలు చేసి సత్తా చాటాయి. దర్బార్ ఐదో రోజుల్లో రూ.10.11 కోట్లు సాధించగా, ‘సరిలేరు నీకెవ్వరు’ మూడు రోజుల్లోనే రూ.11.51 కోట్లు రాబట్టింది. ‘అల.. వైకుంఠపురంలో’ రెండు రోజుల్లేనే రూ.9.92 కోట్లు సాధించి దూసుకెళుతోంది. ఈ దక్షిణాది సినిమాలు కలిపి అమెరికా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాయని ప్రముఖ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. ఇక అమెరికా వీకెండ్ బాక్సాఫీస్ చార్ట్‌లో మన దేశానికి చెందిన ఐదు సినిమాలు చోటు దక్కించుకోగా, ‘అల.. వైకుంఠపురంలో’ సినిమా టాప్‌లో నిలవడం విశేషం. జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘అల.. వైకుంఠపురంలో’ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 45 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్టు తెలుస్తోంది. ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ తొలిరోజు రూ.46.77 కోట్ల షేర్ సాధించినట్టు సమాచారం. ‘అల.. వైకుంఠపురములో’ మూవీ రివ్యూ సరిలేరు నీకెవ్వరు : మూవీ రివ్యూ దర్బార్ : మూవీ రివ్యూ ఛపాక్ : మూవీ రివ్యూ -
రాములమ్మ మళ్లీ ఏడిపించింది అంటున్నారు
‘‘సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాం అంటారే.. అలా సరైన సమయంలో సినిమాల నుంచి విరామం తీసుకున్నా.. మళ్లీ సరైన సమయంలో తెరపైకి వచ్చా. ‘సరిలేరు నీకెవ్వరు’ లో నా పాత్రకు మంచి స్పందన వస్తోంది. అనేక మంది ఫో¯Œ చేసి అభినందిస్తున్నారు. మిగతా భాషల పరిశ్రమల నుంచి కూడా ప్రశంసలు వస్తున్నాయి. మహిళలకు బాగా నచ్చింది. మహిళలు ఫో¯Œ చేసి ‘రాములమ్మా.. మళ్లీ ఏడిపించావ్’ అంటున్నారు.. మగవాళ్లూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు’’ అని విజయశాంతి అన్నారు. మహేశ్‌బాబు, రష్మిక మందన్నా జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ‘దిల్’ రాజు సమర్పణలో అనీల్ సుంకర, మహేశ్ బాబు నిర్మించిన ఈ సినిమా శనివారం విడుదలైంది. పదమూడేళ్ల విరామం తర్వాత ఈ చిత్రంలో ప్రొఫెసర్ భారతి పాత్రలో నటించిన విజయశాంతి విలేకరులతో పంచుకున్న విశేషాలు... ► చాలా ఏళ్ల నుంచి అనేక మంది సినిమా చేయమని అడిగారు. రాజకీయాల్లో తీరిక లేకుండా ఉండటం వల్ల నటించాలనే ఆలోచన రాలేదు. ఆ సమయంలో సినిమా, రాజకీయాలంటూ ఇబ్బంది పడలేను. గతంలోనూ అనిల్ రావిపూడిగారు ఓ సినిమా కోసం సంప్రదించినప్పుడు చేయలేను అని చెప్పాను. మహేశ్ బాబు హీరో అని, ‘సరిలేరు నీకెవ్వరు’ కి అడిగినప్పుడు కథ విన్నాను.. నచ్చడంతో చేశా.. ఇప్పుడు ప్రేక్షకులకూ నచ్చింది. సంక్రాంతికి రియల్ బ్లాక్ బస్టర్ మూవీ ఇది. ► గ్యాప్ తర్వాత మళ్లీ కెమెరా ముందుకు రావడం కొత్తగా అనిపించలేదు.. నటిగా నలభై ఏళ్ల అనుభవం చూశాను. మనతో నటించే ఆర్టిస్టులు మారారు కానీ సినిమా ఎప్పటికీ ఒకటే. నటనలో అదే పట్టు ఉంటుంది. సినిమా పరిశ్రమను మిస్ అవుతున్నాననే భావన కలగలేదు. ఇన్నేళ్లు హీరోయి¯Œ గా పరిశ్రమలో నిలదొక్కుకోవడం అంటే సులువు కాదు.. చాలా పెద్ద విషయమది. తెలుగమ్మాయిగా, ఏళ్లపాటు ఒక స్థాయిని కాపాడుకుంటూ సినిమాలు చేయడం ఒక చరిత్ర సృష్టించడమే. లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్టుగానో, మరో పాత్రలకో వెళ్లిపోవాల్సిన పరిస్థితి వచ్చేది. దేవుడు ఎక్కడో నాకు మేలు చేశాడు, ప్రేక్షకులు ఆదరించారు. ► భారతి పాత్ర హుందాగా సాగుతుంది.. ఎక్కువగా తక్కువగా చేయకూడదు. ఆరంభం నుంచి చివరిదాకా ఒకేలా కనిపించాలి. తన బాధను బయ టపెట్టకుండా మనసులోనే దాచుకుంటుంది. విల¯Œ తో మాట్లాడేటప్పుడు తక్కువ డైలాగులున్నా సూది పెట్టి గుచ్చుతున్నట్లు ఉంటుంది. ఓవర్‌గా యాక్ట్ చేయడానికి లేదు. ప్రకాష్ రాజ్‌తో కళ్లలోకి చూస్తూ ‘ఏంటి భయమేస్తుందా? అడగటం వంటి డైలాగ్‌లు ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయాయి. ► కృష్ణగారి కుటుంబంతో నాకు ఏదో అనుబంధం ఉందనుకుంటా. ఈ బంధాన్ని దేవుడు నిర్ణయించినట్లు అనిపిస్తుంది. మహేశ్‌తో రీఎంట్రీ సినిమా చేస్తాననుకోలేదు.. ఆశ్చర్యం వేస్తోంది. ‘కొడుకు దిద్దిన కాపురం’ సినిమా చేస్తున్నప్పుడు మహేశ్ చిన్న పిల్లాడు. ఇప్పుడు సూపర్‌స్టార్ అయ్యాడు కదా! ఎలా ఉంటాడో అనుకున్నా. కానీ, తొలిరోజు నాతో మాట్లాడిన తీరు, చూపించిన అభిమానం చూసి నా భయాలన్నీ పోయాయి. కొన్ని రోజుల తర్వాత సరదాగా మాట్లాడేవాడు. ► ఒక్కొక్క సినిమాకు ఒక్కో తరహా పాత్ర దక్కుతుంటుంది. ‘ప్రతిఘటన’ సినిమాలో నేను నేరుగా ఏదీ చేయను.. చివరలో మాత్రం విల¯Œ ను గొడ్డలితో నరికి చంపేస్తాను. ‘సరిలేరు నీకెవ్వరు’ మహేశ్ సినిమా. హీరోతో పాటు నా పాత్ర కథలో సమాంతరంగా సాగుతుంటాయి. ఓ సన్నివేశంలో భారతి పాత్రకు సెల్యూట్ చేస్తాడు మహేశ్. నటిగా నాకు ఓ స్థాయి ఉండటం వల్లే హీరో సెల్యూట్ చేస్తే ప్రేక్షకులకు నచ్చింది.. వేరే వాళ్లు నటిస్తే వాళ్లు ఒప్పుకోరు. ► అందరూ బాధ్యతగా ఉండాలన్న ఒక మంచి విషయాన్ని ఈ చిత్రంలో దర్శకులు చెప్పారు. అది విన్నప్పుడు నిజమే కదా! అనిపించింది. ప్రతి ఒక్కరికీ బాధ్యత ఉండాలి, సమాజాన్ని మనమే తీర్చిదిద్దాలి, ఆరోగ్యకరమైన వాతావరణం తీసుకురావాలి. మహిళలకు గౌరవం ఇవ్వాలి, మహిళల పట్ల క్రూరంగా ప్రవర్తించడం మన సంప్రదాయం కాదు కదా? అదే విషయాన్ని అనిల్ రావిపూడి చక్కగా చెప్పారు. ► ఈ సినిమాలో నటించకూడదని తొలుత అనుకున్నా. అనిల్ పట్టుబట్టి నాతో సినిమా చేయించారు.. ఆయనకేదో లెక్క ఉండి ఉంటుంది.. అది సరిగ్గా రీచ్ అయ్యింది. ఇందుకు అనిల్‌గారికి కృతజ్ఞతలు. దర్శకులకు ఒక ఆలోచన ఉంటుంది.. కొడితే బంతి బౌండరీ దాటుతుంది. అన్ని పాత్రలకు సరిపోయే నటీనటులను ఎంచుకున్నారు. రాజకీయాల్లో ఒత్తిడితో బీపీ వస్తుంటుంది.. సినిమా చేస్తున్నప్పుడు మనశ్శాంతిగా, హాయిగా ఉంది. ► మన దగ్గరున్న పేరున్న దర్శకులకు అనిల్ తక్కువేమీ కాదు. నలభై ఏళ్ల అనుభవంతో చెబుతున్నా.. అనిల్ గొప్ప దర్శకుడు అవుతాడు. ఇంత భారీ సినిమాని చాలా కూల్‌గా, ఒత్తిడి లేకుండా, గందరగోళం లేకుండా వేగంగా చిత్రీకరించారు. తను తీసిన ‘పటాస్, రాజా ది గ్రేట్, ఎఫ్2 ’ సినిమాలు చూశాను.. మంచి మానవీయత, సెంటిమెంట్ ఉంది. ఆయనకు రాములమ్మ కథ ఇచ్చినా తెరకెక్కించగలరు. నాతో ‘కర్తవ్యం, ప్రతిఘటన’ లాంటి హీరోయి¯Œ ఓరియంటెడ్ సినిమా చేయమని అనిల్‌ను కోరుతున్నా. ► ఇప్పటిదాకా 60 మంది హీరోలతో కలిసి పనిచేశాను. నాతో కలిపి 61 మంది అనుకోండి. 90వ దశకంలోనే నేను అత్యధిక పారితోషికం తీసుకున్నా. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో హీరో తర్వాత నాదే ఎక్కువ పారితోషికం. నటిగా ఎంతోమందికి స్ఫూర్తినివ్వడం నా అదృష్టం. ‘కర్తవ్యం’ సినిమా చూసి, అనేక మంది మహిళలు పోలీసు వృత్తిలోకి వచ్చారు.. మగవాళ్లు స్ఫూర్తిపొందారు. ‘రౌడీ ఇ¯Œ స్పెక్టర్’ చిత్రంలో ఆటోరాణి, ‘భారతరత్న’ చిత్రంలో సైనిక అధికారిగా నటించాను. ఇవన్నీ ప్రభావవంతమైన పాత్రలు. కొంతమంది మినీ విజయశాంతి అని పేర్లు పెట్టుకున్నారు కూడా. నాకు ఇంత పేరు తీసుకొచ్చిన ప్రజలకు రుణపడి ఉంటా. రాజకీయాల్లో ఉన్నా, సినిమాల్లో ఉన్నా ప్రజలు బాగుండాలని కోరుకుంటా. ► ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ప్రీరిలీజ్ కార్యక్రమంలో చిరంజీవిగారిని కలవడం గొప్ప అనుభూతి. ఆయన రాజకీయాల ప్రస్తావన తీసుకొస్తారని ఊహించలేదు. ఆయన మనసులోని సందేహాలన్నీ ఆ వేదికపై తీరిపోయాయి. రాజకీయాల్లో మా మధ్య కొంత దూరం పెరిగింది.. ఆ రోజు కార్యక్రమంలో అది సమసిపోయింది. ► సాధారణ పాత్రలు వస్తే చేయను. అలాంటి పాత్రలు చేసి ప్రేక్షకుల్లో నాకున్న గౌరవాన్ని తగ్గించుకోలేను. రొటీ¯Œ అత్త పాత్రలు లాంటివి అస్సలు అంగీకరించను. బలమైన, శక్తిమంతమైన పాత్రలు వస్తే ఏడాదికి ఒక్కటైనా చాలు ఒప్పుకుంటా. నేను ఎక్కువగా తినను, వ్యాయామం చేస్తుంటాను. ఈ సినిమా కోసం కొంత జాగ్రత్తలు తీసుకుని బరువు తగ్గాను. మనసు నిర్మలంగా ఉంటుంది కాబట్టి అది మొహంలో కనిపిస్తుంటుంది అంతే. -
నువ్వు తీస్కో నాన్న.. హీరోలా ఉంటావు
సాక్షి, హైదరాబాద్ : జీ సినీ తెలుగు అవార్డుల వేడుక ఇటీవల హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. 2019 ఏడాదికిగాను ఈ అవార్డులు ప్రదానం చేశారు. నాచురల్ స్టార్ నానికి ‘జెర్సీ’ సినిమాకుగాను ఫేవరెట్ యాక్టర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కింది. నాని తండ్రి ఘంటా రాంబాబు కొడుకు తరఫున నటి జీవిత చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నారు. ఈ విషయమై నాని ట్విటర్లో ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ‘నువ్వు తీస్కో నాన్న. నువ్వు అవార్డు తీసుకుంటే హీరోలా ఉంటావు’ అని పేర్కొన్నారు. అదేవిధంగా ఈ విజయం ‘జెర్సీ’ దర్శకుడు గౌతం తిన్ననూరిదని, జెర్సీకి ఏ విజయం దక్కినా అదే గౌతంకే దక్కుతుందని పేర్కొన్నారు. ఇక, ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన సరిలేరు నీకెవ్వరు, అల.. వైకుంఠపురములో సినిమాల గురించి స్పందిస్తూ.. ‘ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ అదరగొట్టారంటే.. బాక్సాఫీస్ వద్ద ఈ ఏడాది గొప్పగా ఉండబోతుందనే భరోసా కలుగుతోంది. రెండు సినిమాల చిత్రబృందాలకు అభినందనలు. రాబోయే చిత్రాలకు ఆల్‌ది బెస్ట్’ అని పేర్కొన్నారు. Nuvvu theesko Nanna .. nuvvu award theesukuntuntey hero la vuntavu :) This is yours @gowtam19 .. every win for #Jersey is yours 🤗#ZeeCineAwardsTelugu2020 pic.twitter.com/VNaCrRBS9F — Nani (@NameisNani) January 12, 2020 -
సరిలేరు సూపర్‌హిట్: థాంక్స్ చెప్పిన మహేశ్
సంక్రాంతి కానుకగా విడుదలైన సరిలేరు నీకెవ్వరు సినిమా సూపర్‌హిట్ టాక్‌తో దూసుకుపోతుండటంతో.. ఆ సినిమా హీరో మహేశ్‌బాబు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. ‘సరిలేరు నీకెవ్వరు సినిమాకు బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్ ఇచ్చారు. అందుకు ప్రతి ఒక్కరికీ థాంక్స్’ అంటూ ట్వీట్ చేసిన మహేశ్.. అభిమానులతో ట్విటర్లో క్వశ్చన్-అన్వర్ సెషన్ కోసం ఎదురుచూస్తున్నానని, తనను ప్రశ్నలు అడగాలని కోరారు. ఇక, మహేష్ బాబు తాజామూవీ ‘సరిలేరు నీకెవ్వరు’ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి పండుగ వేళ ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించేలా తెరకెక్కిన ఈ సినిమా భారీ వసూళ్లు రాబడుతోంది. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుండటంతో చిత్రయూనిట్ రోజుకొక ప్రొమో, ప్రమోషన్ వీడియోలతో హల్చల్ చేస్తోంది. తాజాగా ‘బ్లాక్‌బస్టర్‌కా బాప్’ చిత్రయూనిట్ ప్రొమో వీడియోలను విడుదల చేసింది. సూపర్ స్టార్ మహేశ్ బాబు, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమాతో లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి 13ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చారు. భరత్ అనే నేను, మహర్షి వంటి హిట్స్ తర్వాత మహేశ్ నటిస్తున్న సినిమా కావడం.. పటాస్ నుంచి ఎఫ్2 వరకు కమర్షియల్ పంథాలో సినిమాలు తీస్తూ హిట్స్ ఇస్తున్న అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయడంతో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాపై భారీ అంచనాల మధ్య విడుదలైంది. Thank you all for the BLOCKBUSTER response🙏🏻 #SarileruNeekevvaru Looking forward to this Q & A session...shoot them :) pic.twitter.com/ImODfE8G4i — Mahesh Babu (@urstrulyMahesh) January 13, 2020 -
తగ్గని జోష్.. ‘సరిలేరు’కు భారీ వసూళ్లు!
హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు తాజామూవీ ‘సరిలేరు నీకెవ్వరు’ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. సంక్రాంతి పండుగ వేళ ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించేలా తెరకెక్కిన ఈ సినిమా భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఓపెనింగ్స్ భారీ స్థాయిలో ఉండటంతో తర్వలోనే ‘సరిలేరు నీకెవ్వరు’ వందకోట్ల మార్క్‌ను దాటేసే అవకాశముందని అంటున్నారు. తొలిరోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.46.77 కోట్ల షేర్ సాధించిన విషయం తెలిసిందే. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో రూ.32.77 కోట్ల షేర్ రాబట్టినట్లు సమాచారం. ఇక, రెండోరోజు శనివారం సుమారు 20 కోట్ల వరకు ఈ సినిమా రాబట్టిందని అంటున్నారు. మొత్తానికి తొలిమూడురోజుల్లోనే ఈ సినిమా వందకోట్లకు చేరువగా వచ్చిందని అంటున్నారు. అధికారిక లెక్కలు వస్తే.. తొలి మూడురోజుల్లో ఈ సినిమా వందకోట్ల మార్క్‌ను దాటిందా? లేదా? అన్నది తెలిసే అవకాశముంది. మరోవైపు ఈ సినిమాకు భారీ వసూళ్లు దక్కుతుండటంతో రోజుకొక ప్రొమో, ప్రమోషన్ వీడియలతో ఈ చిత్రయూనిట్ హల్చల్ చేస్తోంది. తాజాగా ‘బ్లాక్‌బస్టర్‌కా బాప్’ ప్రొమో వీడియోను చిత్రయూనిట్ విడుదల చేసింది. సూపర్ స్టార్ మహేశ్ బాబు, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమాతో లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి 13ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. భరత్ అనే నేను, మహర్షి వంటి హిట్స్ తర్వాత మహేశ్ నటిస్తున్న సినిమా కావడం.. పటాస్ నుంచి ఎఫ్2 వరకు కమర్షియల్ పంథాలో సినిమాలు తీస్తూ హిట్స్ ఇస్తున్న అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయడంతో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో పెద్దగా కథ లేకపోయినా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే అంశాలపై దర్శకుడు అనిల్ బాగా ఫోకస్ చేశాడని రివ్యూలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పండుగ సీజన్లో బాక్సాఫీస్ వద్ద ‘సరిలేరు నీకెవ్వరు’ భారీగానే వసూళ్లు రాబట్టినట్టు ట్రెడ్ అనలిస్టులు విశ్లేషిస్తున్నారు. -
‘సరిలేరు నీకెవ్వరు’ థాంక్స్ మీట్
-
సరిలేరు నీకెవ్వరు సక్సెస్ మీట్
-
‘సరిలేరు నీకెవ్వరు’ తొలిరోజు కలెక్షన్స్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా మూవీ ‘సరిలేరు నీకెవ్వరు’ రికార్డ్ కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా శనివారం (జనవరి 11న) విడుదలైన సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ షోలకు ప్రభుత్వాలు అనుమతి ఇవ్వడంతో బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిసింది. రికార్డు స్థాయిలో ఈ సినిమా ఓపెనింగ్స్ రాబట్టినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రూ.32.77 కోట్ల షేర్ రాబట్టినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రూ.46.77 కోట్ల షేర్ సాధించినట్టు చిత్రబృందం ప్రకటించింది. (చదవండి : సరిలేరు నీకెవ్వరు : మూవీ రివ్యూ) నైజాంలో రూ. 8.66 కోట్లు, సీడెడ్‌లో రూ. 4.15 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.4 కోట్లు, కృష్ణాలో రూ. 3.07 కోట్లు, గుంటూరులో రూ. 5.15 కోట్లు, తూర్పుగోదావరిలో రూ. 3.35 కోట్లు, పశ్చిమగోదావరిలో రూ. 2.72 కోట్లు, నెల్లూరులో రూ. 1.27 కోట్ల షేర్ వసూలైనట్టు సినీ పీఆర్వో బీఏ రాజు తన ట్వీట్లో పేర్కొన్నారు. అంతేకాదు విదేశాల్లో సైతం ఈ సినిమా దద్దరిల్లిపోతుందట. మొత్తంగా చూసుకుంటే తొలిరోజే ‘సరిలేరు నీకెవ్వరు’ రికార్డు స్థాయిలో వసూలు చేసినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రష్మిక మందన హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు సమర్పణలో మహేశ్, అనిల్ సుంకరలు నిర్మించారు. విజయశాంతి, ప్రకాష్‌రాజ్, రాజేంద్రప్రసాద్, సంగీత, కౌముది తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. #SarileruNeekevvaru Day 1 shares RECORD BREAKING OPENINGS 💥 Nizam8.66Crs Ceeded 4.15Crs UA 4.4Crs Krishna 3.07Crs Guntur 5.15Crs East 3.35crs West 2.72crs Nellore 1.27Crs Total AP/TS Share on Day1 32.77 Crs 🤟🏻🥁 👌 🌟 @urstrulyMahesh#BoxOfficeKaBaap 🤙🏽 pic.twitter.com/S6SOzyjFoc — BARaju (@baraju_SuperHit) January 12, 2020 -
సరిలేరు నీకెవ్వరు : మూవీ రివ్యూ
మూవీ: సరిలేరు నీకెవ్వరు జానర్: కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ నటీనటుల: మహేశ్‌బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్‌రాజ్, రాజేంద్రప్రసాద్, సంగీత సంగీతం: దేవిశ్రీప్రసాద్ దర్శకత్వం: అనిల్ రావిపూడి నిర్మాతలు: రామబ్రహ్మం సుంకర, దిల్‌రాజు, మహేశ్‌బాబు సంక్రాంతి పండుగ సీజన్లో ఆడియెన్స్‌ను ఎంటర్టైన్ చేయడానికి వచ్చిన మరో బిగ్ మూవీ ‘సరిలేరు నీకెవ్వరు’. సూపర్ స్టార్ మహేశ్ బాబు, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమాతో లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి 13ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చారు. భరత్ అనే నేను, మహర్షి వంటి హిట్స్ తర్వాత మహేశ్ నటిస్తున్న సినిమా కావడం.. పటాస్ నుంచి ఎఫ్2 వరకు కమర్షియల్ పంథాలో సినిమాలు తీస్తూ హిట్స్ ఇస్తున్న అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయడం.. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్గా టీజర్, ట్రైలర్, పాటలు ఆకట్టుకోవడం.. సంక్రాంతి సీజన్లో వస్తుండటంతో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సరదాల పండుగ వేళ వస్తున్న ఈ బొమ్మ అదిరిపోవడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి బాక్సాఫీస్ బరిలో సరిలేని జోరుతో ఈ బొమ్మ నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్ అనిపించుకుందా.. కథ: కర్నూలు వైద్యకళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేసే భారతి (విజయశాంతి) చాలా నిక్కచ్చి, నిజాయితీగల వ్యక్తి. తప్పును ఎప్పుడూ రైట్ అని టిక్ చేయదు. ఆమె పెద్ద కుమారుడు ఆర్మీలో పనిచేస్తూ దేశం కోసం అమరుడవుతాడు. రెండో తనయుడు కూడా ఆర్మీలోనే ఉంటూ ఓ ఆపరేషన్‌లో గాయపడి.. చావుబతుకుల మధ్య ఉంటాడు. ఓవైపు కూతురికి పెళ్లి నిశ్చయమై.. ఆర్మీలోని కొడుకు రాక కోసం భారతి ఎదురుచూస్తున్న సమయంలో ఇలాంటి విషాదవార్తను చేరవేయాల్సి రావడంతో.. నైతిక కట్టుబాటుగా మేజర్ అజయ్ (మహేశ్‌బాబు)ను దగ్గరుండి పెళ్లి చేయించి.. ఈ వార్త చేరవేయాల్సిందిగా ఆర్మీ అధికారులు కర్నూలుకు పంపిస్తారు. అప్పటికే తన బాబాయి కొడుకు రవి మర్డర్ నేపథ్యంలో కర్నూలులో స్థానిక మినిష్టర్ నాగేంద్ర (ప్రకాశ్‌రాజ్) వల్ల భారతి చిక్కుల్లో పడుతుంది. తన కుటుంబం ప్రాణాలను కాపాడుకునేందుకు పరిగెడుతోంది. ఈ క్రమంలో శక్తిమంతుడైన నాగేంద్ర నుంచి భారతిని అజయ్ ఎలా కాపాడారు. ఈ మర్డర్ మిస్టరీని ఛేదించి ఎలా మంత్రిని మార్చాడు అన్నది మిగతా కథ.. నటీనటులు: సూపర్‌స్టార్ మహేశ్‌బాబు మరోసారి తన మ్యాజిక్‌ను తెరపై చూపాడు. ఎప్పటిలాగే తన హ్యాండ్సమ్ లుక్‌తో, సెటిల్డ్ యాక్టింగ్‌తో ప్రేక్షకులను చూపు తిప్పుకోనివ్వకుండా చేశాడు. కామిక్ టైమింగ్‌తో అలరించడమే కాదు యాక్షన్ పార్టులోనూ మహేశ్ దుమ్మురేపాడు. మహేశ్ ఎంట్రీ సీన్, తమన్నాతో ‘డాంగ్ డాంగ్ సాంగ్’లో ఎనర్జిటిక్ స్టెప్పులు, ఆర్మీ ఆపరేషన్ సీన్.. ‘మైండ్ బ్లాంక్’ పాటలో మాస్ స్టెప్పులతో ఇలా తనదైన పర్ఫార్మెన్స్తో మహేశ్ అలరించాడు. ఫస్టాప్‌లో రైలు జర్నీ సీన్లలోనూ పంచ్ డైలాగులు, కామెడీ సీక్వెన్‌తో నవ్వించాడు. కొండారెడ్డి బురుజు వద్ద ఇంటర్వెల్ బ్యాంగ్ సీన్లో యాక్షన్ పార్టు, మహేశ్ హీరోయిజం ఎలివేషన్ షాట్లు ఫ్యాన్స్ ను అలరిస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ పవర్‌ఫుల్‌గా ఉండటం ఫ్యాన్స్‌కు కిక్కు ఇస్తుంది. అల్లురి సీతారామరాజు సినిమాలోని సీన్‌ను సందర్భానుసారం వాడుకోవడం, సూపర్‌స్టార్ కృష్ణను గుర్తుచేయడం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అయితే, సెకండాఫ్ వచ్చేసరికి కథ పెద్దగా ఏమీ లేదని తేలిపోవడంతో మహేశ్ పాత్ర కొంచెం స్లో అయిపోతోంది. ఇక, చాలాకాలం తర్వాత తెరపై మీద కనిపించిన విజయశాంతి భారతిగా పవర్ఫుల్ పాత్రలో అలరించారు. ఆమె సహజమైన అభినయం, డైలాగ్ డెలివరీ సినిమాకు ఒకింత నిండుతనం తెచ్చాయి. నిజాయితీగా గల ప్రొఫెసర్‌గా, ఆర్మీలో కొడుకులను కోల్పోయిన తల్లిగా ఆమె అభినయం ప్రేక్షకుల్లో గౌరవభావాన్ని, కంటతడిని పెట్టిస్తాయి. ఇక, హీరోయిన్గా రష్మిక మందన్నా మహేశ్ సరసన తనదైన ఎనర్జిటిక్ యాక్టింగ్‌తో అలరించింది. మీకు ఏమైనా అర్థమవుతుందా.. ఐ యామ్ ఇంప్రెస్డ్.. వంటి పంచ్ డైలాగులతో నవ్వించింది. ‘హి ఈజ్ సో’ క్యూట్ పాటలో అందంగా కనిపించిన రష్మిక.. ‘మైండ్ బ్లాక్’ పాటలో.. మాసీలుక్తో గ్లామరస్ డోస్‌ను పెంచిందని చెప్పాలి. ఇక, మినిస్టర్ నాగేంద్రగా విలన్ పాత్రలో కనిపించిన ప్రకాశ్ తన పాత్ర మేరకు అలరించారు. తనదైన యాక్టింగ్‌తో ప్రకాశ్ రాజ్ మెప్పించినప్పటికీ.. సినిమా క్లైమాక్స్ వెళ్లేసరికి నాగేంద్ర పాత్ర అనేక మలుపులు తిరుగుతుంది. ఇక, రాజేంద్రప్రసాద్, కౌముది, సంగీత, రావు రమేశ్, హరితేజ తదితర నటులు తమ పరిధి మేరకు మెప్పించారు. విశ్లేషణ: పక్కా కమర్షియల్ సినిమాలు తీస్తూ.. వరుస హిట్స్ అందుకుంటున్న అనిల్ రావిపూడి మరోసారి పూర్తిగా తన ఫార్మెట్‌లోనే ‘సరిలేరు నీకెవ్వరు’ను తీశాడు. తన సినిమాల్లో ఉండే అన్ని దినుసులు ఈ సినిమాలోనూ జోడించాడు. హీరో-హీరోయిన్లతో కామెడీ చేయించడం, క్యాచీ పదాలు, పంచ్ డైలాగులతో ఇలా తనకు తెలిసిన అన్ని మాస్-మసాలా అంశాలు సినిమాలో ఉండేలా చూసుకున్నాడు. ఈ విషయంలో ఫస్టాప్ వరకు సక్సెస్ అయిన డైరెక్టర్.. సెకండాఫ్ వచ్చేసరికి ఎప్పటిలాగే కథను లైట్‌గా తీసుకున్నాడనే అభిప్రాయం కలుగుతుంది. సెకండాఫ్‌లో భారతి ఎందుకు కష్టాల్లో పడిందనే అంశాన్ని అంత గ్రిప్పింగ్‌గా, స్ట్రాంగ్‌గా అనిల్ చెప్పలేకపోయాడు. ఈ సినిమాలో జోడించిన మర్డర్ మిస్టరీ ఇన్వేస్టిగేషన్, దాని వెనుక ఉన్న నాగేంద్ర కరప్షన్ ఇలాంటి అంశాలు కొత్తగా ఉండకపోగా.. రోటిన్ అనిపించి బోర్ కొడతాయి. సెకండాప్ మొదట్లోనే ప్రకాశ్ రాజ్‌ను మహేశ్ ఢీకొనడంతో.. విలన్ పాత్ర వీక్ అవుతోంది. అయితే, కథపై అంతగా శ్రద్ధపెట్టకపోయినా.. ఎప్పటిలాగే కామెడీ, ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే అంశాలపై అనిల్ ఫోకస్ చేశాడు. దేశం కోసం ప్రాణాలర్పించిన జవాన్‌కు నివాళులర్పించే సీన్, తల్లి (విజయశాంతి) భావోద్వేగం కంటతడి పెట్టిస్తాయి. డైలాగులు అక్కడక్కడ పేలి.. ప్రేక్షకులతో ఈల వేయించినా.. కొన్ని డైలాగుల రిపిటేషన్ కనిపిస్తుంది. మరికొన్నిసార్లు క్యాచీ వర్డ్స్‌ను ఫోర్స్డ్గా పెట్టినట్టు అనిపిస్తోంది. ఇక, సీఎం, మంత్రులను బంధించి.. హీరో లెంగ్తీ లెక్చర్ ఇవ్వడం బాగానే ఉన్నా.. మరీ అవుట్ ఆఫ్ లాజిక్ అనిపిస్తోంది. కథ పెద్దగా లేకపోయినా.. ఇలాంటి అంశాలు, భారీ భారీ డైలాగులతో సెంకడాఫ్‌ను మరీ లెంగ్తీగా చేసిన ఫీలింగ్ కలుగుతోంది. అయితే, మహేశ్ ఫ్యాన్స్ ఎంటర్టైన్ చేసే అంశాలు ఉండటం, యాక్షన్‌పార్ట్ నీట్‌గా బాగుండటం, దేవీశ్రీ ప్రసాద్ ఇచ్చిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ కావడంతో ఈ సంక్రాంతి సీజన్లో ఇది సూపర్‌స్టార్ అభిమానులు అలరించే కమర్షియల్ ఎంటర్టైనర్గా నిలిచే అవకాశముంది. సినిమాటోగ్రఫీ చక్కగా ఉండటంతోపాటు సినిమా నిర్మాణ విలువలు రిచ్ ఉన్నాయి. అయితే, ఎడిటింగ్ విషయంలో మరింత కత్తెరవేసి.. క్రిస్ప్‌గా ప్రజెంట్ చేస్తే బాగుండేదన్న ఫీలింగ్ రాకపోదు. ప్లస్ పాయింట్స్ మహేశ్‌బాబు యాక్టింగ్, కామెడీ విజయశాంతి పాటలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఫస్టాప్ మైనస్ పాయింట్స్ కథ పెద్దగా లేకపోవడం సెంకడాఫ్ లెంగ్తీగా ఉండటం - శ్రీకాంత్ కాంటేకర్ -
‘సరిలేరు నీకెవ్వరు’: బొమ్మ దద్దరిల్లడం పక్కా!
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు హీరోగా క్రేజీ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు సమర్పణలో మహేశ్, అనిల్ సుంకరలు నిర్మించారు. సంక్రాంతి కానుకగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ టాక్‌తో దూసుకపోతోంది. శుక్రవారం అర్దరాత్రి నుంచే ప్రత్యేక షోలు మొదలయ్యాయి. అంతేకాకుండా ఓవర్సీస్లో ప్రీమియర్ షోలు పడిపోయాయి. దీంతో సినిమా చూసిన ప్రేక్షకుల తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రత్యేక, ప్రీమియర్ షోలు చూసిన ప్రతీ ఒక్కరు చెబుతున్న మాట దూకుడు మహేశ్ ఈజ్ బ్యాక్ అని. ఈ మధ్య కాలంలో మహేశ్ వరుసగా సందేశాత్మక చిత్రాలు చేస్తుండటంతో అయన నుంచి మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ను ఫ్యాన్స్ ఆశించారు. అయితే అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ తో మహేశ్ అభిమానులు వారికి కావాల్సింది లభించింది. కేవలం మహేశ్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు సినీ ప్రేక్షకుడు కూడా ఈ సినిమాను మెచ్చుకుంటున్నారు. ప్రధానంగా ఫస్టాఫ్ మొత్తం ఎక్కడ బోర్ కొట్టకుండా సాగిందని, ఇంటర్వెల్ బ్యాంగ్ అదరిపోయిందని అంటున్నారు. ముఖ్యంగా మహేశ్ లుక్స్ మార్వలెస్ అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ప్రథమార్థంలో వచ్చే కశ్మీర్ అందాలు, మహేశ్ యాక్షన్ సీన్స్, ఆర్మీ నేపథ్యంలో వచ్చే సంఘటనలు ప్రేక్షకులను కట్టిపడేసినటేకల అందరూ చెబుతున్నారు. ఇక సుదీర్ఘంగా సాగిన ట్రైన్ ఎపిసోడ్ పిచ్చెక్కించిందని కామెంట్ చేస్తున్నారు. హీరోయిన్ రష్మిక మందన అండ్ గ్యాంగ్‌తో పాటు బండ్ల గణేశ్ ట్రైన్ ఎపిసోడ్లో చేసే కామెడీ సూపరో సూపర్ అంటున్నారు. ‘ఒక్క మూడు నెలలు అర్మీలో పని చేస్తే నేను అనే ఫీలింగ్ పోయి నేషన్ అనే ఫీలింగ్ మొదలవుతుంది’, ‘దేశం విలువ మీరు పడిపోయే రూపాయిలో చూస్తారు.. నేను ఎగిరే జెండాలో చూస్తాను’ అని రచయిత అందించిన మాటలు రోమాలు నిక్క బొడిచేలా ఉన్నాయని అంటున్నారు. ఇక ఫస్టాఫ్ సరద సరదాగా సాగిపోగా.. సెకండాఫ్‌లో అసలు యాక్షన్ పార్ట్ మొదలవుతుందని చెబుతున్నారు. సెకండాఫ్‌లో ప్రకాష్ రాజ్, విజయశాంతి, మహేశ్ బాబుల మధ్య వచ్చే సీన్స్ సినిమాను ఎక్కడికో తీసుకపోతుందని పేర్కొంటున్నారు. ఇక యాక్షన్ సీన్స్‌ను ఫైట్ మాస్టర్ రామ్-లక్ష్మణ్‌లు కొత్తగా కంపోజ్ చేశారని, మైండ్ బ్లాక్ సాంగ్ కైతే ఆడియన్స్ సీట్లలో ఎవరూ కూర్చోలేదని ఎగిరి గంతేశారని, అదేవిధంగా ఈ పాటలో మహేశ్ వేసిన మాస్ స్టెప్స్ అదరహో అన్నట్టు ఉన్నాయని పేర్కొంటున్నారు. ఓవరాల్‌గా ఇప్పటివరకు పబ్లిక్ టాక్, ట్విటర్ రివ్యూల ప్రకారం పండగకు ‘సరిలేరు నీకెవ్వరు’ బొమ్మ దద్దరిల్లడం పక్కా అని తెలుస్తోంది. -
ట్రెండింగ్‌లోకి రాగానే వాళ్లే సారీ చెబుతారు
‘‘మనం చేస్తున్న ప్రతి పనికీ అవార్డు వస్తుందన్న గ్యారంటీ లేదు. అలా అని వస్తేనే గొప్ప అనడం లేదు. అవార్డుల విషయంలో నా దృష్టిలో రెండు కోణాలు ఉన్నాయి. మన పని బయటకు వచ్చి ప్రేక్షకులందరికీ నచ్చినప్పుడు దాన్ని మించిన అవార్డు లేదు. అలాగే మన పనిని ఒకరు గుర్తించి పిలిచి అవార్డు ఇస్తున్నప్పడు దాన్నొక గొప్ప గౌరవంగా నేను భావిస్తాను. ఈ గౌరవం నా బాధ్యతను పెంచుతుంది’’ అన్నారు దేవిశ్రీ ప్రసాద్. మహేశ్‌బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఇందులో రష్మికా మందన్నా కథానాయిక. ‘దిల్’ రాజు సమర్పణలో అనిల్ సుంకర, మహేశ్‌బాబు నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఈ చిత్ర సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ చెప్పిన విశేషాలు.. ► మహేశ్‌బాబుగారితో నేను ఐదు (1: నేనొక్కడినే (2014), శ్రీమంతుడు (2015), భరత్ అనే నేను (2018), మహర్షి (2019), సరిలేరు నీకెవ్వరు (2020)) సినిమాలు చేశాను. చాలా సంతోషంగా ఉంది. నేనే కాదు...మహేశ్‌గారితో పని చేసిన ఎవరైనా ఆయనతో మళ్లీ మళ్లీ చేయాలనుకుంటారు. మహేశ్‌గారితో సినిమాలు చేసిన దర్శకులందరితో నేను పని చేయడం వల్ల ఈ విషయం నాకు తెలిసింది. ఆయన డైరెక్టర్స్ యాక్టర్. ఒక్కసారి కథ విని, ఆయన ఓకే అంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా అండగా ఉంటారు. అంతపెద్ద స్టార్ మనపై నమ్మకం ఉంచినప్పుడు మనకు తెలియకుండానే మన పనిపై మనకు గౌరవం పెరుగుతుంది. మహేశ్ గారిది చిన్నపిల్లల మనస్తత్వం. ఏదైనా పాట లేదా సన్నివేశం నచ్చినప్పడు చాలా ఎగై్జటింగ్‌గా ఉంటారు. ఆ ఎగై్జట్‌మెంట్ వచ్చినప్పుడు ఆయన్ను పట్టుకో వడం కష్టం. ఆ లక్షణం చిరంజీవిగారిలోనూ చూశాను. ► ఇదివరకు మహేశ్‌గారికి నేను సంగీతం అందించిన సినిమాల్లో ఎక్కువగా ఆయన సందేశంతో కూడుకున్న బాధ్యతాయుతమైన పాత్రలు చేశారు. కానీ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో వాణిజ్య అంశాలు పుష్కలంగా ఉన్నాయి. దీంతో మంచి మాస్ సాంగ్స్ ఇస్తానని ఈ సినిమా ప్రారంభోత్సవం రోజున మహేశ్ అభిమానులకు ప్రామిస్ చేశాను. అన్నట్లుగానే మంచి పాటలు కుదిరాయి. ఈ సినిమాకే కాదు..దాదాపు నేను చేసిన అన్ని సినిమాలకు మొదటి సిట్టింగ్స్‌లోనే ట్యూన్స్ ఫైనలైజ్ అయ్యాయి. ఈ విషయంలో నేను కాస్త లక్కీ. ► అనిల్ రావిపూడిగారి ‘ఎఫ్ 2’ సినిమాకు నేను సంగీతం అందించాను. చాలా క్లారిటీ ఉన్న దర్శకుడు. భవిష్యత్‌లో మంచి స్థాయికి వెళతాడు. ‘సరిలేరు నీకెవ్వరు’ కథను మొదట నాకు అనిల్ చెప్పినప్పుడు చాలా బాగా నచ్చింది. కథ విన్నప్పుడే ఈ సినిమా పాటల గురించి ఆలోచించుకున్నాను. ఎందుకంటే కథ ప్రకారం నేను పాటలు ఇవ్వడానికి ఇష్టపడతాను. అలాగే ఇస్తూ వస్తున్నాను. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో కూడా సందర్భానుసారంగానే పాటలు వస్తాయి. ఈ సినిమాలోని సైనికుల యాంథమ్ సాంగ్‌కు నేను లిరిక్స్ రాశాను. సైనికులంటే నాకు విపరీతమైన అభిమానం. వారికి నివాళిగా ఉండాలని ఈ సాంగ్ చేశాం. మహేశ్‌గారు కూడా మెచ్చుకున్నారు. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. అలాగే ‘సూర్యుడివో..చంద్రుడివో’, ‘డాంగ్ డాంగ్’ పాటలకు కూడా మంచి స్పందన లభించింది. అందుకు ప్రేక్షకులకు థ్యాంక్స్. ఇక ‘మైండ్‌బ్లాక్’ సాంగ్‌లో మహేశ్‌గారి డ్యాన్స్ సూపర్బ్. ఆయన డ్యాన్స్ చూసి మేమందరం షాకయ్యాం. మహేశ్‌గారి కామెడీ టైమింగ్ బాగుంటుంది. అప్పుడప్పుడు ఆయన సరదాగా వెటకారంగా మాట్లాడుతుంటారు. ‘మైండ్ బ్లాక్’ సాంగ్‌లో అలా మహేశ్ వాయిస్ పెట్టాం. ► విజయశాంతిగారితో మా నాన్నగారు (రచయిత సత్యమూర్తి) పనిచేశారు. ఇప్పుడు నేను ఆమెతో ఈ సినిమాకు పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో మహేశ్, విజయశాంతిగార్ల మధ్య సన్నివేశాలు భలేగా ఉంటాయి. అలాగే మహేశ్, ప్రకాష్‌రాజ్‌గార్ల సన్నివేశాలు కూడా ప్రేక్షకులను అలరిస్తాయి. ► నా పాటలు బాగున్నాయో లేదో నా టీమ్‌ని నిర్మొహమాటంగా చెప్పమంటాను. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంటోంది. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అయితే నా పాటలపై నిజాయతీగా చెప్పేవారి అభిప్రాయాలను గౌరవిస్తాను. ఏవైనా పొరపాట్లు ఉంటే మళ్లీ జరగకుండా జాగ్రత్తపడతా. ఈ సందర్భంగా ఓ విషయం చెబుతాను.‘బాహుబలి’ సినిమా నా అంచనాల తగ్గట్లు లేదు’ అని నాతో ఎవరో అన్నారు. ఆ తర్వాత ‘బాహుబలి’ ఎక్కడికి వెళ్లింది? అంటే కొందరు భారీ అంచనాలు పెట్టుకుంటారు. మొదట్లో కాస్త నిరుత్సాహపడతారు. కాస్త ట్రెండింగ్‌లోకి రాగానే ఆ తర్వాత వాళ్లే సారీ చెబుతారు. ► సంగీతంపై నాకున్న ప్రేమవల్ల హీరోగా చేయలేకపోతున్నానేమో. తమిళ, తెలుగు భాషల్లో ఓ ద్విభాషా చిత్రం చేద్దామనుకుంటున్నా. ∙‘ఆర్య, ఆర్య 2’ చిత్రాల తర్వాత అల్లు అర్జున్, సుకుమార్, నా కాంబినేషన్లో మరో సినిమా వస్తుంది. ఈ చిత్రానికి 3 పాటలు కంపోజ్ చేశా. ‘గుడ్‌లుక్ సఖి’, ‘రంగ్ దే’, ‘ఉప్పెన’ చిత్రాలకు మ్యూజిక్ అందించబోతున్నాను. ఓ హిందీ సినిమా చేయబోతున్నా. -
‘రష్మికను ఓ ఆటాడుకున్న సితార’
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు గారాల పట్టి సితార, డైరెక్టర్ వంశీ పైడిపల్లి కుమర్తె ఆద్య వీరిద్దరూ కలిసి ‘ఏ అండ్ ఎస్’ అనే యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. తొలుత త్రీ మార్కర్ ఛాలెంజ్ అంటూ తొలి వీడియో పోస్ట్ చేసిన వీర్దిదరూ.. అనంతరం పలు ఆసక్తికర వీడియోలను పోస్ట్ చేస్తూ ఫాలోవర్స్‌ను పెంచుకున్నారు. అంతేకాకుండా డిఫరెంట్ కంటెంట్ వీడియోలతో పాటు ఆద్యంతం వినోదభరితంగా, విజ్ఞానభరితంగా సాగే వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. తాజాగా సితార, ఆద్యలు ఇద్దరూ కలిసి క్యూట్ హీరోయిన్ రష్మిక మందనను ఇంటర్వ్యూ చేశారు. ఈ క్రమంలో ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్ర విశేషాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇక మహేశ్ సైతం ఈ వీడియోను తన ట్విటర్లో పోస్ట్ చేస్తూ ఈ ముగ్గురి ఎనర్జీ, ఉత్సాహం తనను ఆశ్చర్యపరిచిందని ట్వీట్లో పేర్కొన్నాడు. మహేశ్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని అనిల్ సుంకర, దిల్ రాజు, మహేశ్ బాబులు ముగ్గురు కలిసి నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా రేపు(శనివారం) విడుదల కానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్లు సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తున్నాయి. దీంతో సినిమా హిట్టు సాధించడం ఖాయమని టాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. విజయశాంతి, ప్రకాష్‌రాజ్, రాజేంద్రప్రసాద్, సంగీత, కౌముది తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. Next gen kids !! Their bubbling energy n enthusiasm never ceases to amaze me 😍😍!! @iamRashmika you are equally amazing 👏👏 Loved the banter !! Rock on, you girls! 👍👍👍 https://t.co/vHNIc232Kt — Mahesh Babu (@urstrulyMahesh) January 10, 2020 -
విచిత్రమైన జోన్లో ఉన్నాం
‘‘అనిల్ రావిపూడి ‘ఎఫ్ 2’ సినిమా చేస్తున్నప్పుడు ‘సరిలేరు నీకెవ్వరు’ కథని నాకు 40 నిమిషాలు చెప్పాడు.. ఎగ్జైటింగ్‌గా అనిపించింది. అయితే ‘మహర్షి’ తర్వాత వేరే సినిమా కమిట్మెంట్ ఉంది.. దాని తర్వాత చేద్దామన్నాను.. తను కూడా ‘ఎఫ్ 2’ తర్వాత వేరే సినిమా చేస్తాను.. ఆ తర్వాత ఇద్దరం చేద్దాం సార్ అన్నాడు. కానీ, ‘ఎఫ్ 2’ సినిమా చూశాక ‘సరిలేరు నీకెవ్వరు’ ఈ సమయంలో నేను చేయడం కరెక్ట్ అనిపించింది. అనిల్‌కి చెప్పగానే చాలా సంతోషంగా ఒప్పుకున్నాడు’’ అని మహేశ్‌బాబు అన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేశ్‌బాబు, రష్మిక మందన్నా జంటగా విజయశాంతి కీలక పాత్రలో నటించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ‘దిల్’ రాజు సమర్పణలో రామబ్రహ్మం సుంకర, మహేశ్‌బాబు నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా మహేశ్‌బాబు విలేకరులతో చెప్పిన విశేషాలు. ► ‘శ్రీమంతుడు’ సినిమా నుంచి నేను అన్నీ సందేశాత్మక చిత్రాలే చేస్తున్నా. వాణిజ్య అంశాలతో కూడిన ‘దూకుడు’ లాంటి వినోదాత్మక చిత్రం రావాలని నా అభిమానులు కోరుకున్నారు.. నాక్కూడా చేయాలనిపించింది. జూలైలో ఈ సినిమా స్టార్ట్ చేసి, డిసెంబరులో పూర్తి చేశాం. ఐదు నెలల్లో సినిమా పూర్తి చేశాం. ఈ సినిమా ఈ టైమ్‌లో చేయడం నా కెరీర్లో తీసుకున్న మంచి నిర్ణయమని అనుకుంటున్నాను. ► సినిమా చాలా బాగా వచ్చింది.. బొమ్మ (సినిమాని ఉద్దేశించి) దద్దరిల్లిపోతుంది. నేను, నిర్మాతలు, డైరెక్టర్‌తో పాటు యూనిట్ అంతా హిట్ సాధించబోతున్నామనే పూర్తి నమ్మకంతో ఉన్నాం. సినిమాని మా టీమ్‌తో పాటు కొంతమంది చూశారు. మేము ఏదైతే ఫీల్ అయ్యామో సినిమా చూసినవాళ్లు కూడా అలాగే ఫీల్ అవడం చాలా సంతోషంగా అనిపించింది. తొలి రోజు షూటింగ్ నుంచి ఈ రోజు వరకూ అదే వైబ్స్ ఫీలయ్యాం. దీన్ని బట్టి చూస్తే ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అవుతుందనే వైబ్స్ కనిపిస్తున్నాయి. ► ‘బిజినెస్ మేన్’ సినిమా తర్వాత నేను త్వరగా చేసిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. కథ అనుకున్నప్పడు జూన్‌లో స్టార్ట్ చేసి సంక్రాంతికి విడుదల చేద్దామనుకున్నాం.. ఎందుకంటే ఇది పర్ఫెక్ట్ సంక్రాంతి సినిమా.. అందుకే జూలైలో సినిమా స్టార్ట్ చేసి, పూర్తయ్యేవరకూ నాన్‌స్టాప్‌గా పనిచేశాం. ఇందులో నేను ఆర్మీ మేజర్ పాత్ర చేస్తుండటంతో మేకోవర్ కోసం ఓ నెల టైమ్ పట్టింది. ఈ పాత్ర కోసం 6 కిలోలు బరువు తగ్గాను. ► టీమ్ చక్కగా కుదిరితే సినిమాలు త్వరగా పూర్తవుతాయి.. కొన్ని సినిమాలు అలా కుదురుతాయి.. మరికొన్ని మన చేతుల్లో ఉండవు. అన్నీ ఐదు నెలల్లోనే పూర్తి కావాలంటే ఎలా? మంచి క్వాలిటీ కావాలి కదా? అయితే ‘సరిలేరు నీకెవ్వరు’కు అన్నీ కుదిరాయి.. పైగా సంక్రాంతి లక్ష్యంగా పెట్టుకున్నాం కాబట్టి వచ్చాం. ► ఈ చిత్రంలో నాది బాధ్యతగల ఆర్మీ మేజర్ పాత్ర. ఇష్టం వచ్చినట్లు చేయలేం.. దాన్ని అనిల్ చక్కగా తెరకెక్కించాడు. ఇప్పటివరకూ అనిల్ తీసిన సినిమాలు ఒక ఎత్తు.. ఈ సినిమా వేరే ఎత్తు. ఈ సినిమాతో దర్శకుడిగా పది రెట్లు పెరుగుతాడు. అంత బాగా తీశాడు ఈ సినిమాని. ► నేను ఒక్కసారి డైరెక్టర్‌కి సరెండర్ అయిపోతే వాళ్లు చెప్పినట్లు చేస్తా. ‘దూకుడు’ తర్వాత మళ్లీ అంత వాణిజ్య అంశాలున్న చిత్రమిది. అలాగని ‘దూకుడు’లా ఉండదు.. ఫ్రెష్‌గా ఉంటుంది. ఈ క్రెడిట్ అంతా అనిల్‌దే. నా గత సినిమాలను చూసి ఈ పాత్రని అనిల్ తీర్చిదిద్దారు. ఈ సినిమాలో ఓ మాస్ సాంగ్ ఉండాలనేది అనిల్ కోరిక.. పైగా ఈ చిత్రంలో ఆ పాటకి అవకాశం ఉండటంతో పెట్టాం. ఇప్పటి వరకూ నేను చేసిన సినిమాలు ఒక ఎత్తు అయితే ఈ సినిమా మరో ఎత్తు. నా అభిమానులు, ప్రేక్షకులు కొత్త మహేశ్‌ను చూస్తారు. ► విజయశాంతిగారితో ‘కొడుకు దిద్దిన కాపురం’ సినిమా తర్వాత, దాదాపు 30 ఏళ్లకు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా చేశాను. సెట్లో తొలిరోజు ఆమెను కలవగానే ‘కొడుకు దిద్దిన కాపురం’ షూటింగ్ నిన్ననే జరిగినట్టు అనిపించింది. ఈ సినిమా ఒప్పుకున్నందుకు ఆమెకు థ్యాంక్స్.. ఎందుకంటే ఈ సినిమాలోని భారతి పాత్ర ఆమె తప్ప ఇంకెవ్వరూ చేయలేరు. పదేళ్ల తర్వాత సంగీతగారు ఇందులో నటించారు. ఆమెను అనిల్ ఒప్పించి తీసుకొచ్చారు. ► కృష్ణగారి సర్ప్రైజ్ ఏంటో సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది. ప్రేక్షకులు తప్పకుండా థ్రిల్ ఫీల్ అవుతారు. ఈ సినిమాలో సైనికులపై వచ్చే థీమ్ సాంగ్ అంటే నాకు ఇష్టం. ఈ చిత్రంలో చాలా సర్ప్రైజ్ అంశాలున్నాయి.. ప్రేక్షకుల స్పందన కోసం వేచి చూస్తున్నా. ఈ పాత్ర చేస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేశాను.. ఈ మధ్య కాలంలో అంత సరదాగా ఎప్పుడూ ఉండలేదు. సినిమా స్టార్ అయిన నాలుగో రోజు నుంచే సరదాగా ఉన్నా. ► ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాకి అడ్వాన్స్ తీసుకోకుండా చేశానని కాదు కానీ, ఈ సినిమా ఐదు నెలల్లో చేయాలనుకున్నాం.. ఎలా ఉంటుంది? బడ్జెట్ ఎంత? అనుకోలేదు. నేను కూడా ఈ సినిమాకి ఓ నిర్మాత కావడంతో అడ్వాన్స్ తీసుకోలేదు. ఒక నిర్మాతగా నేను తీసుకున్న నిర్ణయమది. నేను తీసుకున్న గొప్ప నిర్ణయాల్లో ఇది కూడా ఒకటి. భవిష్యత్తులో అందరూ ఇలాగే చేస్తే ఓ సినిమాకి ఆర్థికంగా చాలా మిగులుతుంది. ► ఒకే రోజు రెండు సినిమాలు విడుదలవడం మంచిది కాదు.. రెవెన్యూ షేర్ అయిపోతుంది. ‘అల.. వైకుంఠపురములో...’ మరుసటి రోజు విడుదలకు ఒప్పుకున్నందుకు నిర్మాతలకు థ్యాంక్స్. హీరోలెప్పుడూ థియేటర్ల గురించి పట్టించుకోరు.. సోలో రిలీజ్ కావాలని అంటారంతే. డబ్బులు నా ఒక్కడికే వస్తే ఎలా? సినిమా కొన్నవారికి కూడా రావాలి కదా? సంక్రాంతి కాబట్టి మూడు నాలుగు పెద్ద సినిమాలు విడుదలవుతున్నాయంతే. ఈసారి ఒకేరోజు కాకుండా ఇండస్ట్రీ వారు మాట్లాడుకుని గ్యాప్‌తో విడుదల చేస్తున్నారు. ► నాన్నగారికి (కృష్ణ) ‘దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు’ ఇవ్వాలని చిరంజీవిగారు కోరడం సంతోషాన్నిచ్చింది. ఆ మరుసటి రోజు నాన్నగారిని కలిసినప్పుడు.. ‘చిరంజీవి బాగా మాట్లాడారు.. నా తరఫున థ్యాంక్స్ చెప్పు’ అన్నారు. చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్లు చేయించేందుకు రెండు ఫౌండేషన్లు పని చేస్తున్నాయి. వాటికి నా వంతు సహాయం అందిస్తున్నా. భవిష్యత్‌లో పెద్దగా చేస్తా. ► ప్రయోగాలు, వైవిధ్యమైన సినిమాలు అనుకోవడానికి బాగుంటాయి. కానీ, 125 నుంచి 130 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నప్పుడు అన్ని యాంగిల్స్ చూడాలి.. ఫ్రెష్‌గా ఉండాలి.. పైగా పెద్ద హీరోలందరం ఒక విచిత్రమైన జోన్లో ఉన్నాం.. అన్నీ ఉండాలి.. లేకుంటే మార్కెట్‌కి ఇబ్బంది. అన్నీ కుదిరితే చిన్న సినిమా చేయొచ్చు. ► దేవిశ్రీ ప్రసాద్ పాటలు ఎలాగూ బాగా ఇస్తాడు.. నేపథ్య సంగీతం చాలా బాధ్యతగా చేస్తాడని నా భావన. నేపథ్య సంగీతంలో మంచి అనుభవం గతంలో మణిశర్మగారికి ఉండేది.. ఇప్పుడు దేవిశ్రీకి ఉంది. ఇప్పటికి 25 సినిమాలు చేశాను.. ఇంకా కొత్తగా ఏం చేయాలి? ఏం చేయొచ్చు? అని ఆలోచిస్తుంటా. ► మా సినిమా నుంచి ముందు అనుకున్న కెమెరామేన్ తప్పుకున్నప్పుడు రత్నవేలుగారికి ఫోన్ చేయగానే గంట సమయం తీసుకుని ఓకే అన్నారు. తను లేకుంటే ఇంత స్పీడ్‌గా సినిమా పూర్తవ్వదు.. రామ్–లక్ష్మణ్ మాస్టర్స్ ఫైట్స్ ఇరగ్గొట్టేశారు. ► ‘కేజీఎఫ్’ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ని కలిశాను.. కొన్ని స్టోరీ లైన్స్ విన్నా.. ఆ మాత్రానికే సినిమా ఫిక్స్ అయిపోదుగా? -
నన్ను మోసిన ప్రతి మెట్టూ నాకు ముఖ్యమే
‘‘మనం చేసే పని నచ్చేవారు వందలో అరవై నుంచి డెబ్బై మంది మాత్రమే ఉంటారు. ముప్పై మంది మనం ఏం తీసినా తిడతారు. అందుకే 70 మంది కోసమే సినిమా తీయాలి. నా సినిమాల కథలను ఏ కొందరో విమర్శించారని నేను పక్కకు పోయి ఓ ప్రయోగాత్మక సినిమా తీస్తే... అదేంటీ అనిల్ రావిపూడి అతని బలమైన జానర్‌ను వదిలేసి ఇలాంటి సినిమా తీశాడు? అనే వార్తలు వస్తాయి. నేను చేసిన ప్రతి సినిమా ఆ హీరోల కెరీర్లో వన్నాఫ్ ది బెస్ట్ ఫిలింసే’’ అన్నారు అనిల్ రావిపూడి. మహేశ్‌బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘దిల్’ రాజు సమర్పణలో అనిల్ సుంకర, మహేశ్‌బాబు నిర్మించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ సినిమా ఈ నెల 11న విడుదలవుతున్న సందర్భంగా అనిల్ రావిపూడి చెప్పిన విశేషాలు. ► ‘సుప్రీమ్’ సినిమా కోసం జోధ్‌పూర్ నుంచి హైదరాబాద్‌కు ట్రైన్లో వస్తున్నప్పుడు ఒక సైనికుడిని కలిశాను. ఆయనతో మాట్లాడినప్పుడు సైనికులు ఏయే పరిస్థితుల్లో ఎలా ఉంటారో తెలుసుకున్నాను. ఆ సంఘటనల నుంచి ప్రేరణ పొంది ‘సరిలేరు నీకెవ్వరు’ కథ రాసుకున్నాను. ‘ఎఫ్ 2’ సినిమా సమయంలో మహేశ్‌బాబుగారికి ఈ కథ చెప్పాను. క్యారెక్టరైజేషన్ బాగా నచ్చి, నాపై నమ్మకం ఉంచి అవకాశం ఇచ్చారు. ఈ సినిమాను మహేశ్‌గారి నమ్మకానికి నేను ఇచ్చే బహుమతిగా భావిస్తున్నా. మహేశ్‌గారి టైమింగ్ బాగుంటుంది. దర్శకులకు ఆయన పూర్తి స్వేచ్చ ఇస్తారు. దర్శకులకు కావాల్సింది వచ్చేంత వరకు కష్టపడుతూనే ఉంటారు. మహేశ్‌గారికి నేను కాదు.. ఆయన నా కెరీర్‌కు ప్లస్. విజయశాంతిగారు మొదట్లో చేయనన్నారు. ఒకసారి కథ వినమన్నాను. కథ విన్నాక భారతి పాత్ర చేయడానికి ఆమె ఒప్పుకున్నారు. ఆమె కోసమే ఈ పాత్ర రాశాను. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన పాటల పట్ల దర్శకుడిగా పూర్తి సంతృప్తిగా ఉన్నాను. నిర్మాతలు ‘దిల్’ రాజు, అనిల్ సుంకరగారు సహకరించారు. ► దేశభక్తి, వినోదం అనే అంశాలను ఒకేసారి డీల్ చేయడం కాస్త కష్టంతో కూడుకున్న పనే. కానీ దాన్నే హీరోగారి చేత ఎంటర్టైనింగ్గా ఎలా చెప్పించాం అనేది సినిమాలో ఆసక్తికరంగా ఉంటుంది. బోర్డర్ నుంచి అజయ్‌కృష్ణ (మహేశ్ పాత్ర పేరు) అనే ఆర్మీ ఆఫీసర్ ఓ బాధ్యతతో కర్నూలు వస్తాడు. ఒక యుద్ధ వాతావరణం నుంచి సాధారణ ప్రజల మధ్యలోకి వచ్చిన అతనికి ప్రజలు అమాయకులుగా కనిపిస్తారు. ఎందుకంటే సరిహద్దుల్లో శత్రువులు వేరు, సమాజంలోని శత్రువులు వేరు. వీరందరూ బాధ్యతతో ఉండాలనేది అజయ్‌కృష్ణ వ్యక్తిత్వం. యుద్ధంలో శత్రువును చంపడం కాదు. శత్రువును మార్చడం ముఖ్యమని మా సినిమా చెబుతుంది. ఇందులో వచ్చే ఆర్మీ ఎపిసోడ్ చాలా కీలకం. క్లైమాక్స్ సన్నివేశాలు కూడా ప్రేక్షకులను మెప్పిస్తాయి. ► ప్రస్తుతం నా సినిమా ప్రయాణం బాగానే సాగుతోంది. అయితే నన్ను మోసిన ప్రతి మెట్టూ నాకు ముఖ్యమే. ‘పటాస్’ సినిమాతో దర్శకుడిగా కల్యాణ్‌రామ్‌గారు అవకాశం ఇచ్చారు. ‘సుప్రీమ్’తో సాయిధరమ్ తేజ్, ‘రాజా ది గ్రేట్’కి రవితేజగారు, ‘ఎఫ్ 2’కి వెంకటేష్, వరుణ్‌తేజ్ గార్లు వీరందరు నన్ను ఇంతదూరం తీసుకువచ్చారు. ఇప్పుడు సూపర్‌స్టార్ మహేశ్‌గారితో సినిమా చేశాను కాబట్టి నేను ఏదో గొప్ప అని ఊహించుకోవడం లేదు. నేను వచ్చిన దారి నాకు గుర్తు ఉంది. ► ఏ దర్శకుడికైనా అతని ప్రయాణంలో ఏదో సందర్భంలో ఫ్లాప్ వస్తుంది. మనకు తెలియకుండానే ఆ తప్పు జరిగిపోతుంది. కానీ ఆ తప్పుని ఎంత దూరంలో జరుపుకుంటామనేది మన చేతుల్లో ఉంటుంది. ఆ తప్పు తొందరగా జరగకూడదని ప్రయత్నిస్తున్నాను. నేను తీసిన ప్రతి సినిమా సూపర్‌హిట్ అవుతుందని నేను చెప్పలేను. ► చిరంజీవిగారితో సినిమా చేసే అవకాశం వస్తే ఎగిరి గంతేస్తా. బాలకృష్ణగారితో సినిమా చేయాల్సింది. కుదర్లేదు. భవిష్యత్‌లో ఉండొచ్చు. ‘ఎఫ్ 2’ సీక్వెల్ ఆలోచన ఉంది. ప్రస్తతానికి నా తర్వాతి చిత్రం గురించి ఇంకా ఏమీ అనుకోలేదు. -
సర్.. ఆరోజు పార్టీ చేసుకుందాం: నమ్రత
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు.. ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ టీం ఫుల్ జోష్‌లో ఉంది. క్రేజీ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఆదివారం సాయంత్రం ఘనంగా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేసి చిత్ర బృందానికి మరింత బూస్ట్‌నిచ్చారు. ఈ సందర్భంగా మూవీ టీం ఒక్కచోట చేరి పార్టీ చేసుకున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ఫొటోలను మహేష్ బాబు సతీమణి నమ్రత సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. ‘బ్లాక్‌బస్టర్ దిశగా అడుగులు వేస్తూ.. చరిత్ర సృష్టించబోతున్న సరిలేరు నీకెవ్వరు టీంతో గత రాత్రి... అయితే మా డీవోపీ రత్నవేలును మిస్సవుతున్నాం. మరేం పర్లేదు సర్.. 11న ఇంతకంటే పెద్ద పార్టీ చేసుకుందాం’ అంటూ నమ్రత ఫొటోలను షేర్ చేశారు. ఇందులో మహేష్ కుటుంబంతో పాటు... డైరెక్టర్ అనిల్ రావిపూడి, రామజోగయ్య శాస్త్రి, విజయశాంతి, తమన్నా, రష్మిక మందన్న, మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్‌తో పాటుగా మహేష్‌కు.. మహర్షి వంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చిన దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా ఉన్నాడు. కాగా ఈ సరిలేరు నీకెవ్వరులో ప్రత్యేక గీతంలో నర్తించిన తమన్నా సైతం పార్టీకి సంబంధించిన ఫొటోలను షేర్ చేయడంతో.. అవి నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఇక ‘దిల్’ రాజు సమర్పణలో రామబ్రహ్మం సుంకర, మహేశ్‌బాబు నిర్మించిన ఈ సినిమా.. జనవరి 11న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. View this post on Instagram #girlssquadgoals We are made of sugar , spice and everything nice, love you two my cuties #sitara #aadhya @namratashirodkar @urstrulymahesh @directorvamshi A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) on Jan 5, 2020 at 11:27am PST -
అందర్నీ టార్చర్ పెట్టాను!
‘‘నేను చాలా సెటిల్డ్ యాక్టర్‌ని. ‘డియర్ కామ్రేడ్’ సినిమాలో చాలా ఎమోషనల్‌గా నటించాను. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో ఫుల్ ఎనర్జీ ఉన్న పాత్ర చేశాను. ప్రస్తుతం అన్ని రకాల పాత్రలు చేస్తూ ప్రయోగాలు చేస్తున్నాను’’ అన్నారు రష్మికా మందన్నా. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా తెరకెక్కిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఇందులో రష్మిక కథానాయిక. ‘దిల్’ రాజు సమర్పణలో రామబ్రహ్మం సుంకర, మహేశ్‌బాబు నిర్మించారు. ఈ నెల 11న ఈ చిత్రం విడుదలవుతున్న సందర్భంగా రష్మికా చెప్పిన విశేషాలు. ► దర్శకుడు అనిల్‌గారు కథ చెప్పినప్పుడు చాలా బాగా నచ్చింది. ఆయన కథను మొత్తం యాక్ట్ చేసి చూపిస్తారు. ఈ సినిమాలో నా పాత్ర ఇలా వచ్చి అలా వెళ్లిపోయేది కాదు. నా పాత్రకో ముగింపు కూడా ఉంటుంది. సినిమాలో మంచి ఫీల్ ఉంది. మహేశ్‌బాబుగారు, విజయశాంతిగారితో కలసి యాక్ట్ చేయడం బోనస్. ► ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో నా పాత్ర చాలా డ్రమాటిక్‌గా ఉంటుంది. హీరో వెంటపడి అల్లరి చేసే పాత్ర నాది. చాలా హైపర్ యాక్టివ్. ఫుల్ లెంగ్త్ నవ్వించే పాత్ర నాది. ట్రైన్ ఎపిసోడ్లో మహేశ్‌బాబు పాత్రను నా పాత్ర చాలా టార్చర్ పెడుతుంది. ఈ సినిమాలోనే కాదు సెట్లోనూ అందర్నీ టార్చర్ పెట్టాను. సెట్లో అందరూ కామ్‌గా ఉంటే అందర్నీ డిస్ట్రబ్ చేస్తుంటాను. అదే నా బలం అనుకుంటున్నాను (నవ్వుతూ). ఈ సినిమాకు డబ్బింగ్ చెప్పుకునేటప్పుడు ‘మరీ అంత టార్చర్ పెట్టకే’ అని అనుకున్నాను. ► ఈ సినిమా ట్రైలర్లో కనిపించినంత హైపర్‌గా నిజజీవితంలో ఉండను. మా దర్శకుడు చెప్పినట్లు చేశాను. మీరు చేసి చూపించండి, దాన్ని కాపీ కొడతాను అని చెప్పి కాపీ కొట్టేశా. కాపీ అంటే పూర్తి కాపీ కాదు. ఆయన చెప్పినదానికి కొంచెం నా స్టయిల్ జత చేసి నటించాను. ► విజయశాంతిగారితో నాకు ఎక్కువ సన్నివేశాలు లేవు. మొదట్లో ఆమెతో మాట్లాడాలంటే కొంచెం టెన్షన్ పడ్డాను. ఆమెను లేడీ అమితాబ్ అంటారు కదా. అలాగే సీనియర్ యాక్టర్ అని చిన్న భయం ఉండేది. కానీ సెట్లో ఆమె ఎనర్జీ చూసి ఫ్యాన్ అయిపోయాను. చాలా పాజిటివ్‌గా ఉంటారు. కేరళలో షూటింగ్ అప్పుడు మేం ఫ్రెండ్స్ అయిపోయాం. రెండు రోజులు మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఇప్పుడు ఫోన్ చేసి కూడా విసిగిస్తున్నా. త్వరలోనే మేమిద్దరం కలసి ఓ సినిమా చేస్తాం (నవ్వు). ► ఈ సినిమాలోని ‘మైండ్ బ్లాక్..’ సాంగ్‌లో డ్యాన్స్ హైలైట్‌గా ఉంటుంది. నాకు డ్యాన్స్ అంతగా రాదేమో అని మా టీమ్ అనుకున్నారు. ప్రేక్షకులు ఎలా ఎంజాయ్ చేస్తారో అని ఎదురు చూస్తున్నాను. ► వచ్చే నెలలో ‘భీష్మ’ విడుదల అవుతుంది. సుకుమార్– అల్లు అర్జున్ కాంబినేషన్లో హీరోయిన్గా చేయబోతున్నాను. రెండు మూడు నెల్లలో ఈ సినిమా ప్రారంభం అవుతుంది. మిగతావి చర్చల్లో ఉన్నాయి. -
ఏదో తెలిసో.. తెలియకో టంగ్ స్లిప్పై..
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఆదివారం సాయంత్రం ఘనంగా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ వేడుకలో సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ తనదైన శైలిలో ప్రసంగిస్తూ నవ్వులు కురిపించాడు. ఈ సినిమాలో తాను బ్లేడ్ గణేష్ పాత్ర పోషించానని, కానీ, ఈ సినిమా తర్వాత దయచేసి ఎవరూ తనను బ్లేడ్ గణేష్ అని పిలువద్దని వేడుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గెలువకపోతే బ్లేడుతో గొంతు కోసుకుంటానని ప్రకటించి అప్పట్లో బండ్ల గణేష్ సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై పరోక్షంగా స్పందిస్తూ.. ‘ఏదో తెలిసో తెలియకో టంగ్ స్లిప్ అయ్యాను. అందరూ కలిసి ఎర్రీ బీప్ అంటున్నారు కాబట్టి.. బండ్ల గణేష్‌గానే మీ అందరి ముందు ఉండాలని కోరుకుంటున్నా. ఈ సినిమాలో పది నిమిషాలు నేనుకూడా చింపేసా. ఇకముందు కూడా సినిమాల్లో యాక్ట్ చేస్తా. సినిమాలు తీస్తా. సినిమానే నా జీవితం. ఇంకా వేరేవాటితో నాకు సంబంధం లేదు. అమ్మతోడు.. 30 ఏళ్ల నుంచి సినిమాల్లోనే ఉన్నాను. ఇంకో 30 ఏళ్లూ ఇక్కడే ఉంటాను’అని చెప్పుకొచ్చారు. సూపర్‌స్టార్ మహేశ్‌బాబు సినిమా ఈవెంట్‌కు చిరంజీవి రావడం ఆయన సంస్కారానికి నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు. మహేశ్, చిరు అన్నదమ్ములుగా నటిస్తే చూడాలని ఉందన్నారు. చిరంజీవి మళ్లీ యాక్ట్‌చేయాలని బలంగా కోరుకున్నది తానేనని, కానీ ఆయన ఇప్పుడు తనను మరిచిపోయి అన్ని సినిమాలు వాళ్ల అబ్బాయికే చేస్తున్నారని సరదాగా వ్యాఖ్యానించారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేశ్‌బాబు తీసిన ఈ సినిమా రూ. 250 కోట్లు కలెక్ట్‌చేయాలని, అన్ని రికార్డులు చెరిపేయాలని కోరుకున్నారు. -
‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ వేడుక
-
కృష్ణగారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వాలి
‘‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాన్ని ఐదు నెలల్లో షూటింగ్ పూర్తి చేసి, ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి నన్ను పిలవగానే ఆశ్చర్యం వేసింది.. షాక్ తిన్నాను.. ఆనందం వేసింది. ప్రతి హీరో, ప్రతి డైరెక్టర్ ఇంత స్పీడ్‌గా, క్వాలిటీగా సినిమాలు చేస్తే ఇండస్ట్రీకి ఇంతకంటే ఇంకేం కావాలి.. అందరూ ఇలాగే చేయాలి.. అప్పుడే ఈ పరిశ్రమ పదికాలాల పాటు పచ్చగా ఉంటుంది.. ప్రతి ఒక్కరికీ ఉపాధి ఉంటుంది.. థియేటర్స్ కళకళలాడుతుంటాయి’’ అని చిరంజీవి అన్నారు. మహేశ్‌బాబు, రష్మిక మందన్నా జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ సినిమాలో విజయశాంతి కీలకపాత్ర చేశారు. ‘దిల్’ రాజు సమర్పణలో రామబ్రహ్మం సుంకర, మహేశ్‌బాబు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ‘సరిలేరు నీకెవ్వరు మెగా సూపర్ ఈవెంట్’లో ముఖ్య అతిథి చిరంజీవి మాట్లాడుతూ– ‘‘అందరి అభిమానుల మధ్య ఇలాంటి ఆరోగ్యకరమైన వాతావరణం కావాలి.. ఇదే నేను ఎప్పటి నుంచో కోరుకుంటున్నా.. ఈరోజు నిరూపించినందుకు అభినందిస్తున్నా. మహేశ్ ఎంతో ప్యాషనేట్‌గా ఉంటాడు.. ముద్దొచ్చేలా ఉంటాడు.. బిడ్డలాంటి అనుభూతి. ఎప్పుడూ తనలో చెరగని చిరునవ్వు ఉంటుంది. ఆ నవ్వు వెనకాల చిన్న చిలిపితనం కూడా ఉంటుంది.. దొంగ(నవ్వుతూ). ‘సరిలేరు నీకెవ్వరు’ పూర్తయ్యే వరకూ మహేశ్ ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోలేదంటే దాని వల్ల నిర్మాతలకి ఎన్నో కోట్లు, వడ్డీ డబ్బులు మిగులుతాయి.. అది మంచి ఆరోగ్యకరమైన సంప్రదాయం. నేను కూడా సినిమా పూర్తయ్యాకే డబ్బు తీసుకునేవాణ్ణి. దాన్నిప్పుడు రామ్‌చరణ్ కూడా ఆచరిస్తున్నాడు. మహేశ్కూడా అలా చేసి, నిర్మాతలకి వెన్నుదన్నుగా నిలబడటం గ్రేట్.. ఈ రోజుల్లో అది అవసరం. షూటింగ్ డేస్ పెరగడం వల్ల బడ్జెట్ వృథా అయిపోతోంది.. నా తర్వాతి చిత్రాన్ని కొరటాల శివ కూడా 80నుంచి 99 రోజుల్లోనే పూర్తి చేస్తానని మాటిచ్చాడు.. అలా చేయకుంటే మర్యాదగా ఉండదు(నవ్వుతూ). మన సౌత్ ఇండియాలోనే సీనియర్ మోస్ట్ యాక్టర్ కృష్ణగారు.. అలాంటి వ్యక్తికి దక్కాల్సిన గౌరవం ఇంకా దక్కలేదేమో? రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆయనకి ‘దాదా సాహెబ్ ఫాల్కే’ అవార్డు వచ్చేలా నిజాయతీగా కృషి చేయాలి.. ఈ అవార్డు కృష్ణగారికి వచ్చే గౌరవం కాదు.. మనకి వచ్చే గౌరవం.మహేశ్‌తండ్రి కృష్ణగారు అనిపించుకునే స్థాయికి మహేశ్ వస్తుండటం ఆయనకి గర్వకారణం.. చరణ్ విషయంలో నాకూ అంతే. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే అనీల్ సుంకర, ‘దిల్’ రాజు లాంటి నిష్ణాతులున్నారు. ఈ సినిమాతో పాటు సంక్రాం తికి విడుదలవుతున్న ‘అల వైకుంఠపురములో.., మా ఫ్రెండ్ రజనీ ‘దర్బార్’తో పాటు విడుదలవుతున్న అన్ని సినిమాలూ సూపర్‌డూపర్ హిట్స్ అవ్వాలి.. సినిమా పరిశ్రమ బాగుండాలి.. వాటి దర్శక–నిర్మాతలు బాగుండాలి’’ అన్నారు. మహేశ్‌బాబు మాట్లాడుతూ– ‘‘ఒక్కడు’ సినిమా చూసిన చిరంజీవిగారు నాకు ఫోన్ చేశారు. ఆ తర్వాత కలిసి రెండు గంటలు మాట్లాడుకున్నాం. అప్పుడు ఆయన చెప్పిన మాటలు నాకు స్ఫూర్తినిచ్చాయి. ‘అర్జున్’ సినిమా షూటింగ్లో మా సెట్‌కు వచ్చి, ఆ సెట్‌ను చూసి నీలాంటి వారు ఇండస్ట్రీలో ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇంకా ముందుకు తీసుకుకెళ్లాలని చెప్పిన మాటలు గుర్తున్నాయి. ‘పోకిరి’లో నా నటన గురించి , సినిమా గురించి రెండు గంటలు మాట్లాడారు.. మీరు ఎప్పటికీ నాకు స్ఫూర్తి సార్. ‘భరత్ అనే నేను, మహర్షి’ రిలీజ్ అయినప్పుడు అభినందనలు చెబుతూ తొలి ఫోన్ కాల్ ఆయన నుంచే వచ్చింది.. జనవరి 11న కూడా మొదటి కాల్ మీ నుంచే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ‘కొడుకుదిద్దిన కాపురం’ సినిమా తర్వాత, దాదాపు 30 ఏళ్ల తర్వాత విజయశాంతిగారితో ‘సరిలేరు నీకెవ్వరు’ చేశాను. చిరంజీవిగారిలో, విజయశాంతిగారిలో మంచి క్రమశిక్షణ ఉండేది. ఈ సినిమాలోని భారతి పాత్ర విజయశాంతిగారు తప్ప ఇంకెవ్వరూ చేయలేరు. నా కెరీర్లోనే ఈ సినిమా షూటింగ్ చాలా తొందరగా పూర్తయిందంటే ఒక కారణం అనిల్ రావిపూడి. జనవరి 11న మీకు(అభిమానులు) కానుక ఇవ్వబోతున్నాం.. ఈ సినిమా ఫలితం కోసం ఎదురుచూస్తున్నా’’ అన్నారు. విజయశాంతి మాట్లాడుతూ– ‘‘1979 నుంచి 2020 వరకూ లాంగ్ జర్నీ. అందరితో కలిసి నడిచాను.. నన్ను ఈ స్థాయికి తీసుకెళ్లిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. తెలుగు చిత్రసీమకు నన్ను పరిచయం చేసింది హీరో కృష్ణగారు, విజయనిర్మలగారు. నా సక్సెస్ఫుల్ హీరో కృష్ణగారని చెప్పుకుంటాను. సినిమాల్లోకి నా రీ–ఎంట్రీ మహేశ్‌తో కావడం ఆశ్చర్యంగా ఉంది. మహేశ్ అబ్బాయి వచ్చినా తనతోనూ యాక్ట్ చేస్తాను. వెయ్యి మంది పిల్లలకు గుండె ఆపరేషన్ చేయిస్తున్న మహేశ్ సినిమాలోనే కాదు.. బయట కూడా సూపర్‌స్టారే. చిరంజీవిగారు, నేను ఎన్నో సినిమాలు కలిసి చేశాం.. అవన్నీ ఇప్పుడు గుర్తొచ్చాయి’’అన్నారు. అనీల్ సుంకర మాట్లాడుతూ– ‘‘చిరంజీవిగార్ని చూసి మేమంతా నేర్చుకోవాలి.. మే 31న కృష్ణగారి పుట్టినరోజున ప్రారంభించిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం విడుదల జనవరి 11న అని ఫిక్స్ అయ్యాం.. ఆ రోజున అద్భుతం జరుగుతుంది. ఈ సినిమా మహేశ్‌గారి అభిమానులతో పాటు, అన్నివర్గాల వారికీ నచ్చుతుంది. ఈ సినిమాతో మహేశ్‌బాబుపై అభిమానం పదింతలు పెరుగుతుంది. ఈ సినిమా తెలుగువాళ్లందరూ తలెత్తుకుని తిరిగేలా ఉంటుంది’’ అన్నారు. నిర్మాత ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ– ‘‘నేను ముప్పై ఏళ్ల క్రితం తీసిన సినిమా ‘కొడుకు దిద్దిన కాపురం’. ఆరోజునే ఇంతటి పాపులారిటీని సంపాదించుకున్నాడు మహేశ్. ఆ సినిమాలో కృష్ణ, విజయశాంతి, మోహన్‌బాబు గార్లవంటి పెద్ద నటుల మధ్య 14ఏళ్ల వయసులోనే నటించి లిటిల్ స్టార్ అనిపించుకుని ఈ రోజు సూపర్‌స్టార్ అయ్యాడు. ఏ సినిమా అయినా మొదలు పెట్టేముందు బడ్జెట్, షెడ్యూల్, రిలీజ్ విషయాలు క్రమశిక్షణతో చేస్తే చిత్ర పరిశ్రమ కలకాలం నిలబడుతుంది.. అది హీరోల సహకారం లేకుంటే అవదు. ‘సరిలేరు నీకెవ్వరు’ ఆల్‌టైమ్ ఇండస్ట్రీ రికార్డులు తేవాలి’’ అన్నారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘‘అందరివాడు’ చిరంజీవిగారు ఇక్కడ ఉండటం సంతోషంగా ఉంది. నేను చాలా అదృష్టవంతుణ్ణి. ఎందుకంటే మహేశ్‌బాబుగారితో ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’, ఇటీవల ‘మహర్షి’, ఇప్పుడు ‘సరిలేరు నీకెవ్వరు’.... మన కాంబినేషన్ హ్యాట్రిక్.. ఫిక్స్ సార్ (మహేశ్‌ను ఉద్దేశిస్తూ). ‘పటాస్’ తర్వాత అనిల్ మాతో నాలుగు సినిమాలు చేశారు. మా బ్యానర్‌కు మంచి సినిమాలు ఇస్తున్నాడు. థ్యాంక్స్ అనిల్. ఈ సక్సెస్ ఇలాగే కంటిన్యూ కావాలని కోరుకుంటున్నాను. అనిల్ సుంకరగారితో కలిసి ఈ చిత్రం చేయడం హ్యాపీ. దేవిశ్రీ కాంబినేషన్లో మా బ్యానర్లో ఇది 12వ సినిమా. 1999లో ‘శత్రువు’ సినిమా షూటింగ్ సమయంలో విజయశాంతిగారిని చూశాను. మా భాగస్వామ్యం ఉన్న సినిమాతో ఆమె రీ ఎంట్రీ అవడం చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ– ‘‘పొద్దున్నే నాకు కొడుకు పుట్టాడు.. సాయత్రం ఈ వేడుక. ఇలాంటి రోజు.. నెవర్ బిఫోర్... ఎవర్ ఆఫ్టర్. స్వయంకృషితో, కష్టంతో మనం ఎలా ఎదగాలో నేర్పిన పేరు చిరంజీవిగారు. 40 ఏళ్లుగా వింటున్న పేరు అది. మనిషిలో ఒక కళ పుట్టడానికి ఒక కనెక్షన్ ఉంటుంది.. నాలో కళ పుట్టడానికి కారణం చిరంజీవిగారే. ‘సరిలేరు నీకెవ్వరు’ కథ విన్న మహేశ్‌గారు ‘షేక్ హ్యాండ్ ఇస్తూ సినిమా చేస్తున్నాం’ అని చెప్పిన క్షణాల నుంచి ఇప్పుడు ఈ ఫంక్షన్ జరుగుతున్నప్పటి వరకు సాగిన ఈ ప్రయాణంలోని ముఖ్యమైన క్షణాలను నా జీవితంలో మర్చిపోలేను. ఎందుకంటే అంత గొప్ప అవకాశం ఇచ్చారాయన. డబ్బింగ్ అయిపోయి సినిమా పూర్తయిన తర్వాత.. ‘బ్రదర్...నా లైఫ్‌లో చాలా పెద్ద పెద్ద సక్సెస్‌లను చూశాను. నువ్వు ఎదుగుతున్నావ్.. ‘సరిలేరు నీకెవ్వరు’ సక్సెస్‌ని నువ్వు ఎంజాయ్ చేయ్’ అంటూ మెసేజ్ చేసిన మహేశ్‌గారికి థ్యాంక్స్.. మీరు ఇచ్చిన దానికి నేను ఏం ఇవ్వగలను.. ఒక మంచి హిట్ ఇచ్చి తిరిగి ఇవ్వాలనుకుంటున్నాను. ట్రైలర్లో మహేశ్‌గారు చెప్పినట్లు బొమ్మ దద్దరిల్లి పోద్ది. ఈ సినిమాలో చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి. ఈ చిత్రంలో సూపర్‌స్టార్ కృష్ణగారు కూడా ఉన్నారు. దానికి దేవిశ్రీ ఎలాంటి ఆర్ఆర్ ఇచ్చారో సినిమాలో చూడండి. ఈ సినిమా స్టార్ట్ కావడానికి ఒక కారణమైన నమ్రతగారికి థ్యాంక్స్. ‘దిల్’ రాజు, అనీల్ సుంకరగార్లకు థ్యాంక్స్’’ అన్నారు. దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ – ‘‘చిరంజీవిగారిని, మహేశ్‌గారిని ఒకే ఫ్రేమ్‌లో చూడటం చాలా సంతోషంగా ఉంది. మహేశ్‌బాబుగారు సూపర్‌స్టారే కాదు. ఆయనకు సూపర్‌స్టార్ లాంటి హృదయం కూడా ఉంది. ఈ సినిమాలో మహేశ్‌గారి పెర్ఫార్మెన్స్ మైండ్బ్లాకింగ్గా ఉంటుంది. విజయశాంతిగారితో మా నాన్నగారు(రచయిత సత్యమూర్తి) పనిచేశారు. ఈ సినిమాకు ఆమెతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది. అనీల్ సుంకర, ‘దిల్’ రాజుగార్లకు థ్యాంక్స్’’ అన్నారు. హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ– ‘‘చిరంజీవిగారు, మహేశ్‌బాబులకు ఓ కథ రాసి, వారి కాంబినేషన్లో సినిమా తీయాలని అనిల్ రావిపూడిగారిని కోరుతున్నా. మీరు అలా చేస్తే ఆ కాంబినేషన్ సౌండ్ ఇండియా మొత్తం వినిపిస్తుంది.. బాక్సాఫీస్ రేంజ్ హాలీవుడ్ సినిమాకి దీటుగా ఉంటుందని నమ్ముతున్నా. ఈ రోజు నేను ఇక్కడ నిల్చొని మాట్లాడుతున్నానంటే, మహేశ్‌లాంటి వ్యక్తిని మనకిచ్చిన సీనియర్ సూపర్‌స్టార్ కృష్ణ మావయ్యకి థ్యాంక్స్’’ అన్నారు. ఈ వేడుకలో రష్మిక మందన్నా, తమన్నా, నిర్మాతలు రవిశంకర్, పి.కిరణ్, రామ్ ఆచంట, గోపీ ఆచంట, దర్శకులు వంశీ పైడిపల్లి, మెహర్ రమేశ్, కొరటాల శివ, శ్రీనువైట్ల, ఫైట్ మాస్టర్స్ రామ్–లక్ష్మణ్, నటుడు బండ్ల గణేశ్, నటీమణులు సంగీత, హరితేజ, కౌముది, పల్లవి డోరా, పాటల రచయితలు రామజోగయ్యశాస్త్రి, శ్రీమణి, గాయని మధుప్రియ తదితరులు పాల్గొన్నారు. విజయశాంతిని ఒక్కమాట కూడా అనలేదు ఈ సందర్భంగా విజయశాంతితో తనకున్న అనుబంధాన్ని చిరంజీవి పంచుకుంటూ– ‘‘రాజకీయాలు శత్రువులను పెంచుతుంది.. మా సినీ మాత, సినీ పరిశ్రమ స్నేహితుల్ని, స్నేహాన్ని పెంచుతుంది. కొన్ని పరిస్థితుల్లో విజయశాంతి నన్ను కామెంట్ చేసినా, తనపై నాకు ఉన్న ప్రేమ, సెంటిమెంట్ వల్ల ఒక్కమాట కూడా నేను తిరిగి అనలేదు.. నాకు మనసు రాదు.. ఎందుకంటే మా విజయశాంతి.. ఇన్నేళ్లు మా మధ్య గ్యాప్ వచ్చింది.. రాజకీయాలన్నది శాశ్వతం కాదు.. కొన్నాళ్లే.. ఇన్నేళ్లకు నా ఫ్రెండ్‌ని(విజయశాంతి) మళ్లీ కలిసేలా చేసినందుకు మహేశ్‌కి థ్యాంక్స్’’ అన్నారు. చిరంజీవి, విజయశాంతి, మహేశ్‌బాబు -
‘చుట్టూ వంద మంది.. మధ్యలో ఒక్కడు’
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరోగా క్రేజీ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని అనిల్ సుంకర, దిల్ రాజు, మహేశ్ బాబులు నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 11న వస్తున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో అంగరంగవైభవంగా జరుగుతోంది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిరంజీవితో పాటు డైరెక్టర్స్ కొరటాల శివ, వంశీ, శ్రీనువైట్ల, టాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు, నటీనటులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ ప్రీరిలీజ్ ఈవెంట్లో అతిరథుల సమక్షంలో ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. అద్యంతం కామెడీగా సాగిన ఈ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. రష్మిక అండ్ గ్యాంగ్ అల్లరి, మహేశ్ మ్యానరిజం సూపరో సూపర్. ‘ఇలాంటి ఎమోషన్స్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్’, ‘మియావ్ మియావ్ పిల్లి.. మిల్స్ బాబుతో పెళ్లి’, ‘15ఏళ్ల ప్రొఫెషనల్ కెరీర్లో తప్పును రైటని కొట్టలేదు..’,‘‘చుట్టూ వంద మంది.. మధ్యలో ఒక్కడు’అంటూ ట్రైలర్లో వచ్చే డైలాగ్‌లు హైలెట్‌గా నిలిచాయి. ఇక ఆఖర్లో మహేశ్ చెప్పే లాస్ట్ డైలాగ్ ‘చిన్న బ్రేక్ ఇస్తున్నా.. తర్వాత బొమ్మ దద్దరిల్లిపోద్ది’ ట్రైలర్‌కు హైలెట్‌గా నిలిచింది. -
నమ్రతా హార్ట్ టచింగ్ మెసేజ్... వైరల్
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు సతీమణి, నటి, నిర్మాత నమ్రతా శిరోద్కర్ తన ఇన్‌స్టాలో చేసిన ఓ పోస్ట్ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా ఆ ఫోటో సోషల్‌మీడియాల్ వైరల్ అవుతోంది. ఫోటోతో పాటు తన మనసులోని అంతరంగిక భావాలను జోడించి ఓ సందేశాన్ని సైతం పోస్ట్ చేశారు. నమ్రత పోస్ట్ చేసిన ఆ ఉద్వేగభరిత పోస్ట్ అందరి హృదయాలను హత్తుకుంటోంది. ఇంతకీ ఆ ఫోటోలో ఏముందంటే కృష్ణ, మహేశ్, గౌతమ్‌లు ఒకే విధంగా, ఒకేరకమైన క్యాస్టూమ్స్ అందంగా అంతకుమించి హుందాగా ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటో చూపరుల మది దోచేస్తోంది. ఈ ఫోటోతో పాటు ‘వీరే నా సూపర్ హీరోలు. వీరే నా బలం. ఈ ముగ్గురితో నా జీవితం సంపూర్ణమైంది. నా మీద ఈ ముగ్గురు చూపిస్తున్న ప్రేమ, గౌరవాలకు నేను కృతజ్ఞురాలిని. ఇప్పటికీ ఈ ముగ్గురు నాకెన్నో కొత్త విషయాలు నేర్పిస్తున్నందుకు ఆనందంగా ఉంది’అంటూ నమ్రతా హార్ట్ టచింగ్ మెసేజ్ పోస్ట్ చేశారు. ఇక మహేశ్ బాబు హీరోగా క్రేజీ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అనిల్ సుంకర, దిల్ రాజు, మహేశ్‌బాబులు నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల కానున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు (ఆదివారం) హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరగనుంది. ఇక ‘మహర్షి’ వంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత మహేశ్ చేస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలతో ఈ సినిమాపై అంచనాలు పీక్స్‌కు వెళ్లాయి. ఇక దాదాపు దశాబ్దం తర్వాత విజయశాంతి సినిమాల్లోకి ‘సరిలేరు నీకెవ్వరు’తో రీఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, సంగీత, కౌముది, రఘుబాబు, జయప్రకాష్ రెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. View this post on Instagram My 3 super heroes ❤️❤️❤️life has come a full circle ⭕️ #gratitude for what these men do for me !! Greatful for these men who bring me each time a different learning 🤗🤗blessed to have them as my pillars of strength🙏🙏 A post shared by Namrata Shirodkar (@namratashirodkar) on Jan 4, 2020 at 11:02am PST -
మహేశ్ అభిమానులకు నిరాశ
మచిలీపట్నం : సంక్రాంతి సంబురాల పేరిట మచిలీపట్నంలో నిర్వహించిన ఓ టీవీ షోకు వచ్చిన సినీ హీరో మహేష్‌బాబును చూసే అవకాశం అభిమానులకు దక్కలేదు. టీవీ షోలో పాల్గొనేందుకు మహేష్‌బాబు మచిలీపట్నంలోని ఆంధ్ర జాతీయ కళాశాలలో ఏర్పాటు చేసిన వేదిక వద్దకు శనివారం సాయంత్రం చేరుకున్నారు. కానీ ఇదే సమయంలో వర్షం పడటంతో సంబరాల్లో పాల్గొనకుండానే ఆయన వెనుదిరిగారు. ఆయన వెళ్లిన కొద్దిసేపటికి వర్షం తగ్గింది. రాత్రికి యధావిధిగా టీవీ షో నిర్వహించారు. కాగా, మహేష్ సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగటంతో అధిక సంఖ్యలో అభిమానులు ఏజే కళాశాల ప్రాంగణానికి చేరుకున్నారు. కానీ మహేష్ బాబు వెళ్లిపోయారని తెలియటంతో అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు. కాగా, మహేశ్ తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరగనుంది. ఈ చిత్రం జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
‘సరిలేరు నీకెవ్వరూ’ ఈవెంట్, ట్రాఫిక్ మళ్లింపు
సాక్షి, హైదరాబాద్ : ఎల్బీ స్టేడియంలో ఆదివారం సాయంత్రం 7 నుంచి రాత్రి 10 గంటల వరకూ ‘సరిలేరు నీకెవ్వరూ’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండటంతో పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపు చేపట్టనున్నారు. ఆ సమయంలో ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా వాహనాల మళ్లింపు ఉంటుందని నగర ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ అనిల్‌కుమార్ శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఏఆర్ పెట్రోల్ పంప్, అబిడ్స్, గన్‌ఫౌండ్రీ, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, కింగ్‌కోఠి, లిబర్టీ, రవీంద్రభారతి నుంచి ఎల్బీ స్టేడియం మీదగా వెళ్లే వాహనాలకు ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయన్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. ముఖ్య అతిథిగా చిరంజీవి కాగా మహేశ్ బాబు హీరోగా తెరకెక్కిన ‘సరిలేరు నీకెవ్వరూ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి అతిథిగా హాజరు కానున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రష్మికా మందన్నా కథానాయికగా నటించారు. ‘దిల్’ రాజు, అనిల్ సుంకర, మహేశ్‌బాబు నిర్మించారు. ‘సరిలేరు నీకెవ్వరు’ సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల కానుంది. -
సమస్యలను పరిష్కరించడమే గిల్డ్ టార్గెట్
మహేశ్‌బాబు ‘సరిలేరు నీకెవ్వరు’, అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో చిత్రాలు ఈ నెల 11, 12 తేదీల్లో విడుదల కానున్నాయి. అయితే ఈ చిత్రాల విడుదల తేదీలపై రెండు మూడురోజులుగా చిన్న అస్పష్టత ఏర్పడింది. విడుదల తేదీలు మారే అవకాశం ఉందనే వార్తలు వినిపించాయి. కానీ ‘ప్రొడ్యూసర్స్ గిల్డ్’ చొరవతో ఈ సినిమాలు ముందు ప్రకటించిన తేదీల్లోనే రిలీజ్ కానున్నాయి. ఈ విషయాన్ని తెలియజేయడానికి ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో నిర్మాత కె.ఎల్. దామోదర ప్రసాద్ మాట్లాడుతూ – ‘‘చర్చల అనంతరం సినిమా విడుదల తేదీలపై క్లారిటీ వచ్చింది. కారణాలు ఏమైనా కావచ్చు. సమస్యలకు పరిష్కారం దొరకడమే ముఖ్యం. ఈ రోజు జరిగిన మీటింగ్‌లో అందరూ పాజిటివ్‌గానే స్పందించారు’’ అన్నారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ – ‘‘గతంలో జరిగిన ‘ప్రొడ్యూసర్స్ గిల్డ్’ మీటింగ్‌లో నిర్మాతలతో మాట్లాడి ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాన్ని 11వ తేదీన, అల వైకుంఠపురములో చిత్రాన్ని 12న విడుదల చేయాలనుకున్నాం. అయితే కొన్ని పరిణామాల మధ్య ‘అల వైకుంఠపురములో’ జనవరి 10 లేదా 11న విడుదల అవుతుందని వార్తలు వచ్చాయి. దాంతో మరోసారి గిల్డ్‌లో చర్చలు జరిగాయి. పెద్ద సినిమాలు విడుదలవుతున్నప్పుడు అందరూ బావుండాలనే ఉద్దేశంతో ముందు అనుకున్న తేదీలకే సినిమాలు విడుదల చేయడానికి నిర్మాతలను ఒప్పించాం. ఇండస్ట్రీలో ఇలాంటి సమస్యలు వస్తే పరిష్కరించడానికి గిల్డ్ ముందుంటుంది. ఎందుకు కన్ఫ్యూజన్ వచ్చింది అనేది పక్కన పెడితే సమస్యను పరిష్కరించడమే గిల్డ్ టార్గెట్’’ అన్నారు. నిర్మాత రాజీవ్ రెడ్డి కూడా పాల్గొన్నారు. -
‘నో కన్ఫ్యూజన్.. చెప్పిన డేట్‌కే వస్తున్నారు’
-
‘నో కన్ఫ్యూజన్.. చెప్పిన డేట్‌కే వస్తున్నారు’
సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ‘అల.. వైకుంఠపురములో’ వంటి భారీ చిత్రాలు సంక్రాంతి బరిలో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ రెండు చిత్రాలపై సినీ ప్రేక్షకుల్లో హై ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి. అభిమానుల అంచనాలకు తగ్గట్టు ఈ చిత్రాలకు సంబంధించిన టీజర్లు, పాటలు కూడా ఓ రేంజ్లో ఉన్నాయి. అయితే సంక్రాంతి రేసులో నువ్వా-నేనా అన్నట్లు ఉన్న ఈ చిత్రాల విడుదల తేదీపై గందరగొళం ఏర్పడింది. ముందుగా అనుకున్న ప్రకారం జనవరి 11న మహేశ్ సినిమా, జనవరి 12న బన్ని చిత్రం విడుదల కావాలి. అయితే న్యూఇయర్ విషెస్ తెలుపుతూ రిలీజ్ చేసిన ‘అల.. వైకుంఠపురములో’ చిత్ర పోస్టర్లో రిలీజ్ డేట్ కనిపించలేదు. అయితే ఈ సినిమా విడుదల తేదీని మార్చాలని నిర్మాతలు భావించారని దీంతో బన్ని మూవీ కూడా జనవరి 11నే వస్తుందని సోషల్ మీడియా వేదికగా జోరుగా ప్రచారం జరిగింది. దీంతో అటు సూపర్ స్టార్.. ఇటు బన్ని అభిమానుల్లో ఆయోమయం ఏర్పడింది. దీంతో ఇరు చిత్రాల నిర్మాతలు కూర్చొని మాట్లాడుకొని ఈ సమస్యను పరిష్కరించుకున్నారు. ముందుగా అనుకున్న ప్రకారమే జనవరి 11న ‘సరిలేరు నీకెవ్వరు’ , 12న అల.. వైకుంఠపురములో రిలీజ్ అవుతున్నట్లు ఇరు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. దీంతో అభిమానుల్లో కన్ఫ్యూజన్ వీడింది. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ‘సమస్య సాల్వ్ అయింది. ముందు అనుకున్న డేట్స్ ప్రకారమే సరిలేరు నీకెవ్వరు (జనవరి 11న), అల.. వైకుంఠపురములో (జనవరి12న) సినిమాలు వస్తున్నాయి. ఈ రెండింటితో పాటు మరో నాలుగు సినిమాలు సంక్రాంతికి వస్తున్నాయి. అన్నీ బాగా ఆడాలి’ అని దిల్ రాజు ఆకాంక్షించాడు. ‘అప్పుడప్పుడు కొన్ని సమస్యలు వస్తాయి. ఈ సమస్యను ప్రొడ్యూసర్స్ గిల్డ్స్ పరిష్కరించింది. . అందరూ కన్వీన్స్ అయ్యారు. హ్యపీగా వారు ముందనుకున్న ప్రకారమే ఆ రెండు సినిమాలు విడుదల కానున్నాయి’అని మరో నిర్మాత దామోదర ప్రసాద్ పేర్కొన్నారు. ఇక రిలీజ్ తేదీపై ఏర్పడిన ఈ సమస్యకు ప్రొడ్యూసర్స్ గిల్డ్స్‌లో పరిష్కారం లభించింది. చదవండి: ‘సామజవరగమన’.. మరింత ‘అందం’గా! ‘డీజే దించుతాం.. సౌండ్ పెంచుతాం’ -
అవకాశాలు ముఖ్యం కాదు
సినిమా: నాకు అవకాశాలు ముఖ్యంకాదు అని చెప్పుకొచ్చింది నటి రష్మిక. టాలీవుడ్లో చాలా తక్కువ కాలంలో ఎక్కువ క్రేజ్‌ను సంపాధించుకున్న కన్నడ నటి ఈ బ్యూటీ. తొలి రోజుల్లోనే ప్రేమలో ఓలలాడడం, విడిపోవడం వంటి వాటితో వార్తల్లోకి ఎక్కిన రష్మిక ఇప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్లలో ఒకరిగా రాణిస్తోంది. నిజానికి తెలుగులో ఈ అమ్మడు నటించిన నాలుగే చిత్రాలు తెరపైకి వచ్చాయి. వాటిలో ఛలో చిన్న చిత్రంగా విడుదలై మంచి సక్సెస్‌ను అందుకుంది. ఆ తరువాత నటించిన గీతాగోవిందం చిత్రమే రష్కిక కేరీర్‌ను పెద్ద మలుపు తిప్పింది. ఆ తరువాత నటించిన డియర్ కామ్రేడ్, దేవదాస్ చిత్రాలు యావరేజ్‌గానే ఆడాయి. అయినా క్రేజ్ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం మహేశ్‌బాబుతో నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రంపై చాలా అంచనాలు ఉన్నాయి. ఇక తమిళంలో డియర్ కామ్రేడ్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం పెద్దగా ఆడక పోయినా రష్మికకు ఇక్కడ కార్తీతో సుల్తాన్ చిత్రంలో నటించే లక్కీ ఛాన్స్ వరించింది. ఈ చిత్రం కనుక హిట్ అయితే కోలీవుడ్‌లోనూ ఈ అమ్మడికి పట్ట పగ్గాలుండవు. కాగా ఇటీవల నటి రష్మిక ఒక భేటీలో పేర్కొంటూ విజయం ఎప్పుడూ ఉత్సాహాన్నిస్తుందన్నారు. అలాగని హిట్ అయిన చిత్రాలను, ప్లాప్ అయిన చిత్రాలను తాను వేర్వేరుగా చూడనని చెప్పింది. తనకు రెండూ సమానమేనని అంది. వాస్తవానికి సక్సెస్ అయిన చిత్రాల కారణంగా మరిన్ని అవకాశాలు రావచ్చునని, ఇంకా బాగా డబ్బు సంపాధించుకోవచ్చునని అంది. అయితే తన దృష్టిలో డబ్బు, అవకాశాలు ముఖ్యం కాదని అంది. ఆ చిత్రాల్లో తన శ్రమ ఎంత? వాటి ద్వారా ఏం నేర్చుకున్నాను అన్నదే ముఖ్యం అని చెప్పింది. సరైన ఫలం చేకూరలేదంటే మన శ్రమ వృథా అయ్యిందనే బాధ ఉంటుందని అంది. అయితే అవి నేర్పించిన విషయాలతో మనసును సర్ధి చెప్పుకోవాలని చెప్పుకోవాలంది. ఇకపోతే పారితోషికం విషయంలో హీరోహీరోయిన్ల మధ్య తారతమ్యాలు ఉండవచ్చునేమోగానీ, ఫలితాలు హీరోలపై ఎంత ప్రభావం చూపుతాయో, అంత ప్రభావాన్నీ హీరోయిన్లపై చూపుతాయని చెప్పింది. ఒక్కో సమయంలో హీరోలను మాత్రమే ఎక్కువ బాధించే అవకాశం ఉంటుందని రష్మిక చెప్పుకొచ్చింది. అయినా ఈ సక్సెస్, ప్లాప్‌ల గొడవ ఇప్పుడెందుకు ప్రస్థావిస్తుందో? భవిష్యత్‌లో ప్లాప్‌లు వస్తాయనే ముందు జాగ్రత్తలో భాగంగా రిష్మిక ఇలా ఏకరువు పెట్టడం లేదు కదా! ఏదేమైనా వినేవాళ్లుంటే ఏదైనా చెబుతారిలాంటోళ్లు. -
అంతా రెడీ
ఎప్పటిలాగే ఈ సంక్రాంతి పండగ ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి ముస్తాబు అవుతోంది. సినిమాలు కూడా రెడీ అవుతున్నాయి. పండగ బరిలో ఉన్న ‘సరిలేరు నీకెవ్వరు, అల.. వైకుంఠపురములో’ చిత్రాల సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. మహేశ్‌బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఇందులో రష్మికా మందన్నా కథానాయికగా నటించారు. రాజేంద్ర ప్రసాద్, విజయశాంతి, ప్రకాష్‌రాజ్ కీలక పాత్రలు చేశారు. ‘దిల్’ రాజు సమర్పణలో అనిల్ సుంకర, మహేశ్‌బాబు నిర్మించిన ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు ముగిశాయి. యు/ఎ సర్టిఫికెట్ లభించింది. ఈ సినిమా నిడివి 2గంటల 46 నిమిషాలని తెలిసింది. ఇక ‘జులాయి (2012), సన్నాఫ్ సత్యమూర్తి (2015)’ చిత్రాల తర్వాత అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అల.. వైకుంఠపురములో..’. ఇందులో పూజాహెగ్డే కథానాయికగా నటించారు. సుశాంత్, నివేదా పేతురాజ్, టబు, జయరామ్, మురళీ శర్మ, సముద్రఖని కీలక పాత్రల్లో నటించారు. అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ నిర్మించిన ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్రానికి కూడా యు/ఎ సర్టిఫికెట్ లభించింది. ఈ చిత్రం నిడివి 2గంటల 36 నిమిషాలని తెలిసింది. ఈ రెండు చిత్రాలు కాకుండా పండగకి సందడి చేయబోతున్న చిత్రాలు మూడు నాలుగు వరకూ ఉన్నాయి. -
ఈ కటౌట్‌కు సాటి లేదు!
-
ఈ కటౌట్‌కు సాటి లేదు!
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్‌బాబు తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఈ సినిమా ప్రిరీలిజ్ వేడుకను ఈనెల 5న ఎల్బీ స్టేడియంలో భారీ ఎత్తున నిర్వహించనున్నారు. సంక్రాంతికి విడుదలవుతున్న ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో అప్పుడే ధియేటర్ల వద్ద అభిమానుల సందడి మొదలైంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పెట్టిన మహేశ్‌బాబు 50 అడుగుల కటౌట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలోని వెంకట పద్మావతి ధియేటర్ వద్ద పెట్టిన కటౌట్లు కూడా అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల పాటు ఒడిశాలోనూ ప్రచారం పర్వం ఊపందుకోవడం విశేషం. అందరినీ అలరించేలా సినిమా ఉంటుందని చిత్రయూనిట్ నమ్మకంగా చెబుతోంది. -
సెన్సార్ పూర్తిచేసుకున్న ‘సరిలేరు నీకెవ్వరు’
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా క్రేజీ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన హీరోయిన్గా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. గురువారం సెన్సార్ బోర్డు సభ్యులు ఈ చిత్రాన్ని వీక్షించి ఎలాంటి సీన్లు కట్ చేయకుండా యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చారని చిత్ర బృందం ప్రకటించింది. దాదాపు 160 నిమిషాల నిడివి గల ఈ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ అందరినీ ఆకట్టుకునేవిధంగా, మహేశ్ ఇమేజ్ను దృష్టిలో పెట్టుకుని దర్శకుడు తెరకెక్కించారని చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. అంతేకాకుండా మహేశ్-అనిల్ రావిపూడి కాంబినేషన్లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా ‘సరిలేరు నీకెవ్వరు’ నిలవడం ఖామయని జోస్యం చెబుతున్నారు. మామూలుగానే మహేశ్ సినిమా అంటే అభిమానుల్లో అంచనాలు ఓ రేంజ్లో ఉంటాయి. ఈ అంచనాలకు తోడు ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్లతో సినిమాపై హై ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి. ఇక ఈ చిత్రంతో టాలీవుడ్ లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో విజయశాంతి పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారని సమాచారం. రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, సంగీత, కౌముది తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. అనిల్ సుంకర, ‘దిల్’ రాజు, మహేశ్‌బాబు నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల కానుంది. చదవండి: ‘డీజే దించుతాం.. సౌండ్ పెంచుతాం’ నెట్టింట్లో రచ్చరచ్చ.. దేవిశ్రీనా మజాకా! -
సరిలేరు నీకెవ్వరు
-
పండక్కి మరో పండగలా మా సినిమా ఉంటుంది
మహేశ్ హోస్ట్ చేస్తున్న ఫంక్షన్‌కు మెగాస్టార్ చిరంజీవిగారు అతిథిగా వస్తున్నారు. అందుకే మా ప్రీ–రిలీజ్ వేడుకను ‘మెగాసూపర్ ఈవెంట్’ అంటున్నాం. ఇటీవల జరిగిన మహేశ్ ఫ్యాన్స్ ఫొటోషూట్ మొదటిరోజు మేం ఊహించినదానికంటే చాలా ఎక్కువమంది అభిమానులు వచ్చారు. దాంతో చిన్న తొక్కిసలాట చోటు చేసుకుంది. తర్వాతి రోజు కార్యక్రమం సజావుగా సాగింది. చిరంజీవి, మహేశ్‌గార్ల క్రేజ్‌ని దృష్టిలో ఉంచుకునే మెగాసూపర్ ఈవెంట్‌కు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. పోలీసుల సహకారం ఉంది. ►మహేశ్‌బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మికా మందన్నా కథానాయికగా నటించారు. అనిల్ సుంకర, ‘దిల్’ రాజు, మహేశ్‌బాబు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో అనిల్ సుంకర చెప్పిన విశేషాలు. మహేశ్‌బాబుగారితో నేను అసోసియేట్ అయిన నాలుగో చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. 2019 జూలై 5న ఈ సినిమా షూటింగ్ ప్రారంభించాం. దాదాపు 140 రోజులు షూటింగ్ చేశాం. కశీ్మర్ షెడ్యూల్ అద్భుతంగా ముగిసింది. మాకు మంచి సపోర్ట్ లభించింది. అందుకే అనుకున్న సమయానికి సినిమాను విడుదల చేయగలుగుతున్నాం. ఈ చిత్రంలోని ట్రైన్ ఎపిసోడ్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుం ది. సంక్రాంతికి విడుదల చేయాలని టీమ్ అందరూ కష్టపడి పనిచేశారు. ఈ సినిమాను నిరి్మంచినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నా. ►ఇదివరకు సోల్జర్స్ బ్యాక్‌డ్రాప్‌లో వచి్చన సినిమాలకు ఈ చిత్రం భిన్నంగా ఉంటుంది. ఇప్పటివరకు వెండితెరపై రాని, మనం ఊహించని కథ ఇది. కర్నూలు ‘కొండారెడ్డి బురుజు’ సెట్ సన్నివేశాలను కథలో భాగంగానే షూట్ చేశాం. ‘ఒక్కడు’ సినిమాతో ఈ సీన్స్‌కు ఏ పోలిక ఉండదు. మహేశ్‌బాబుగారి కెరీర్లో వన్నాఫ్ ది బెస్ట్ హిట్స్‌గా ఈ సినిమా నిలిచిపోతుందన్న నమ్మకం ఉంది. ఈ సినిమా మహేశ్ ఫ్యాన్స్‌కు పెద్ద పండగలా, ఈ సంక్రాంతి పండక్కి మరో పండగలా ఉంటుంది. ►మహేశ్ యాక్టింగ్‌లో మరో యాంగిల్ చూస్తారు. మేజర్ అజయ్‌కృష్ణ పాత్రలో ఆయన అద్భుతంగా నటించారు. మహేశ్ క్యారెక్టర్లో డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి. ఆడియన్స్ థ్రిల్ అవుతారు. దాదాపు 13ఏళ్ల తర్వాత విజయశాంతిగారు నటించారు. ఈ చిత్రంలో మహేశ్–విజయశాంతి కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి. వీరిద్దరూ స్క్రీన్‌పై ఉన్నప్పుడు ప్రేక్షకులు ఈలలు వేస్తారు. చప్పట్లు కొడతారు. ఈ రెండూ చేయనప్పుడు కన్నీళ్లు పెడతారు. ►కథలో ఎంటర్టైన్మెంటే కాదు మంచి ఎమోషన్ కూడా ఉంది. అనిల్ రావిపూడి ఎంటర్టైన్మెంట్ సినిమాలే కాదు మరో రకమైన సినిమాలు కూడా తీయగలడని ఈ సినిమాతో నిరూపితమవుతుంది. అలా అని సినిమాలో వినోదం లేదని కాదు. అనిల్ డైరెక్షన్లో కొత్త కోణాన్ని చూస్తారు. దేవిశ్రీప్రసాద్ మంచి సంగీతం అందించారు. విజువల్స్ పరంగా పాటలకు ఇంకా మంచి స్పందన వస్తుంది. ఈ సినిమాకు ‘దిల్’ రాజు సమర్పకులుగా ఉండటం ప్లస్ పాయింట్. డిస్ట్రిబ్యూషన్‌కు మరింత హెల్ప్ అవుతుంది. తొలుత ఈ సినిమాను జనవరి 12న రిలీజ్ చేయాలనుకున్నాం. కానీ ప్రొడ్యూసర్స్ గిల్డ్ సలహా మేరకు జనవరి 11న విడుదల చేస్తున్నాం. -
‘డీజే దించుతాం.. సౌండ్ పెంచుతాం’
దేవిశ్రీ ప్రసాద్ అదిరే బీట్ ఇవ్వగా.. రామజోగయ్యశాస్త్రి పార్టీ సాంగ్‌కు కావాల్సిన లిరిక్స్ అందించగా.. నకాష్ అజీజ్, లవిత లోబో సూపర్ ఎనర్జీతో పాటను ఆలపించగా.. శేఖర్ మాస్టర్ కొత్త స్టెప్పులు కంపోజ్ చేయగా.. మహేశ్-తమన్నాలు అదిరిపోయే డ్యాన్స్‌లతో పిచ్చెక్కించారు. ఇది కదా అసలు సిసలు మహేశ్ బాబు ఫ్యాన్స్ కోరుకునేది. న్యూఇయర్ కానుకగా మహేశ్ ఫ్యాన్స్‌కు కావాల్సిన ఫుల్ ధూంధాం సాంగ్ వచ్చేసింది. ఇక డాంగ్ డాంగ్ పార్టీ సాంగ్‌తో బ్యాంగ్ బ్యాంగ్ అంటూ న్యూఇయర్‌కు గ్రాండ్ వెల్కమ్ చెప్పడానికి రెడీ అవుతున్నారు సరిలేరు నీకెవ్వరు టీం. మహేశ్‌బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈచిత్రాన్ని రామబ్రహ్మం సుంకర, ‘దిల్’ రాజు, మహేశ్‌బాబులు నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలవుతున్న ఈ చిత్రంపై హై ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే విడుదలైన సినిమా పాటలు, టీజర్‌తో అంచనాలు పీక్స్‌కు తీసుకెళ్లాయి. తాజాగా ‘సరిలేరు నీకెవ్వరు’ నుంచి చివరి లిరికల్ సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పాటకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ప్రోమో సోషల్ మీడియాను షేక్ చేస్తుండగా.. తాజాగా ఫుల్ లిరికల్ సాంగ్‌ను కొద్దిసేపటి క్రితమే చిత్ర బృందం విడుదల చేసింది. ‘డీజే దించుతాం.. సౌండ్ పెంచుతాం’, ‘లెట్స్ పార్టీ విత్ దిస్ సాంగ్.. గుర్తుండిపోవాలి లైఫ్ లాంగ్’, ‘వాటే స్కిన్ టోను.. నచ్చావే గ్లామర్ క్వీన్.. నిన్ను చూసి దిల్ మె గిర్రుమంది రొమాంటిక్ టోను’, ‘నువ్వు పక్కనున్న కిక్కు చాలు అదే చంద్రయాను’ అంటూ పాటలో వచ్చే లిరిక్స్ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ పాటతో సంగీత అభిమానులు ఉర్రూతలూగుతున్నారు. ఇక దాదాపు దశాబ్దం తర్వాత ఈ సినిమాతో లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి రీఎంట్రీ ఇవ్వనున్న విషయం తెలిసిందే. రాజేంద్రప్రసాద్, ప్రకాష్‌రాజ్, సంగీత తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు జరుపుకుంటోంది. మహేశ్ కూడా తన పాత్రకు డబ్బింగ్ చెప్పేశాడు. -
అది ఐటమ్ సాంగ్ కాదు : మహేశ్‌బాబు
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, రష్మికా మందన్నా జంటగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. డిసెంబర్‌లోని ప్రతి సోమవారం ఈ చిత్రంలోని ఒక్కో పాట విడుదల చేస్తూ వస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో చివరి పాట ‘డాంగ్ డాంగ్’ సాంగ్ వీడియో ప్రోమోను విశాఖ ఉత్సవ్ వేదికగా విడుదల చేశారు. ఈ సాంగ్‌లో మహేశ్, తమన్నాల డ్యాన్స్ హైలెట్‌గా నిలిచింది. ఈ వీడియోకు ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన వస్తోంది. అయితే ఈ వీడియోపై మహేశ్ స్పందిస్తూ.. ‘మా డైరక్టర్ చెప్పినట్టు ఇది ఐటమ్ సాంగ్ కాదు.. ఇది పార్టీ సాంగ్’ అని మహేశ్ పేర్కొన్నారు. ఎప్పటిలాగే దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన మ్యూజిక్ అందించారని పేర్కొన్నారు. ఈ సినిమాతో లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి చాలా రోజుల తరువాత వెండితెరపై రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ‘దిల్’ రాజు, అనిల్ సుంకర, మహేశ్‌బాబు నిర్మించిన ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్‌రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జనవరి 5న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరగనున్న ఈ చిత్రం ప్రీ–రిలీజ్ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి అతిథిగా రాబోతున్నారు. -
విశాఖ ఉత్సవ్‌లో ‘సరిలేరు నీకెవ్వరు’ సందడి
-
బాబా సన్నిధిలో మహేశ్‌బాబు
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు షిర్టీ సాయిబాబాను దర్శించుకున్నారు. ఫ్యామిలీతో కలిసి షిర్డీ వెళ్లిన మహేశ్.. బాబా ఆశీస్సులు తీసుకున్నారు. వారి వెంట దర్శకుడు మెహర్ రమేశ్ కూడా ఉన్నారు. త్వరలో మహేశ్ తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే తన పాత్రకు డబ్బింగ్ చెప్పేసిన మహేశ్.. వారం రోజుల పాటు ఫ్యామిలీతో గడపాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగానే ఆయన షిర్డీ ఆలయానికి వెళ్లారు. అలాగే మరో వారం రోజుల తర్వాత మహేవ్.. ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రమోషన్స్‌తో బిజీ అయిపోతారు. మహేశ్‌బాబు సరసన రష్మికా మందన్నా నటించిన ఈ చిత్రంలో విజయశాంతి కీలక పాత్ర చేశారు. హైదరాబాద్‌లో జనవరి 5న ఈ చిత్రం ప్రీ–రిలీజ్ వేడుక జరగనుంది. ‘దిల్’ రాజు, అనిల్ సుంకర, మహేశ్‌బాబు నిర్మించిన ఈ చిత్రం జనవరి 11న విడుదల కానుంది. -
నెట్టింట్లో రచ్చరచ్చ.. దేవిశ్రీనా మజాకా!
దేవిశ్రీప్రసాద్ మరోసారి తన మ్యాజిక్ చూపించాడు. పార్టీ సాంగ్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఈ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ తాజాగా మరోసారి తన మార్క్ పార్టీ సాంగ్‌తో దుమ్ములేపాడు. ఇప్పటివరకు ఎన్నో ఐటమ్, పార్టీ సాంగ్‌లను అందించిన దేవి తాజాగా ‘డాంగ్ డాంగ్’ సాంగ్‌తో ముఖ్యంగా యూత్‌ను ఉర్రూతలూగిస్తున్నాడు. టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. డిసెంబర్లో ప్రతి సోమవారం ఒక్కో పాటను రిలీజ్ చేస్తూ ఇప్పటివరకు నాలుగు పాటలను రిలీజ్ చేసింది. చివరి పాటను రేపు(సోమవారం) విడుదల చేయనున్నారు. అయితే ఈ పాటకు సంబంధించిన చిన్న వీడియో ప్రోమోను శనివారం సాయంత్రం విడుదల చేశారు. ఈ వీడియోలో మహేశ్, తమన్నాల డ్యాన్స్ హైలెట్‌గా నిలిచింది. పాట ఎంత బాగుందో అంతకుమించి డ్యాన్స్ ఫార్మెషన్స్, మహేశ్-తమన్నాల స్టెప్పులు అదిరిపోయాయి. దీంతో ప్రస్తుతం ఆ చిన్న వీడియో ప్రోమో నెట్టింట్లో రచ్చరచ్చ చేస్తోంది. దేవిశ్రీ ఈజ్ బ్యాక్ అని కొందరు కామెంట్ చేస్తుండగా.. మహేశ్-తమన్నాలు స్టెప్పులు సూపర్బ్ అంటూ మరికొందరు పేర్కొంటున్నారు. ఈ ప్రోమో విడుదల సందర్భంగా అనిల్ రావిపూడి ఓ వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశాడు. ‘అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. సరిలేరు నీకెవ్వరు పాటలను ఇంత బాగా ఆదరించిన ప్రేక్షకులందరికీ మా కృతజ్ఞతలు. అలాగే దేవిశ్రీప్రసాద్‌కు నా స్పెషల్ థ్యాంక్స్. చాలా మంచి పాటలు ఇచ్చారు. ఈ నెలలో ప్రతీ సోమవారం ఒక్కొపాటతో మీ ముందుకు వచ్చాం. ప్రతీ పాటను మీరు అద్భుతంగా రిసీవ్ చేసుకుని, టిక్‌టాక్‌లలో వీడియోలు చేస్తూ ట్రెండ్ చేశారు. చాలా సంతోషంగా ఉంది. అలాగే గత సోమవారం వచ్చిన డిఫరెంట్ ఆంథమ్ సాంగ్‌ను కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఈ సోమవారం ఆల్బమ్‌లో చివరి పాటగా ఓ పార్టీ సాంగ్ రాబోతుంది. కొంతమంది సినీ స్టార్స్‌ను తీసుకెళ్లి, ఆర్మీతో ఇంట్రాక్ట్ చేయిస్తుంటారు. దానిని స్పూర్థిగా తీసుకుని ఈ సినిమాలో తమన్నా కూడా ఓ సినీ స్టార్‌గా వచ్చి ఆర్మీతో కలిసి సందడి చేస్తారు. ఇది కేవలం సరదా పాట మాత్రమే. ఐటమ్ సాంగ్ కాదు. ఈ పాట కూడా మిమ్మల్ని అలరిస్తుందని ఆశిస్తున్నా. ఈ ఏడాది సంక్రాంతికి ‘ఎఫ్2’ తో మంచి విజయాన్ని అందించారు. రాబోయే సంక్రాంతికి అంతే వినోదంతో మహేశ్‌బాబు సరికొత్త పాత్రతో అలరించబోతున్నారు’అంటూ అనిల్ రావిపూడి ఆ వీడియోలో పేర్కొన్నాడు. Director @AnilRavipudi about the blockbuster #MassMBMonday's and the power packed party song #DaangDaang 🤙🏼 Daang Daang Song Promo will be launched today at Visakha Utsav 🔥 Super⭐@urstrulyMahesh @AnilSunkara1 @ThisIsDSP @tamannaahspeaks @RathnaveluDop @ramjowrites pic.twitter.com/0ZR085gGbR — AK Entertainments (@AKentsOfficial) December 28, 2019 మహేశ్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈచిత్రాన్ని రామబ్రహ్మం సుంకర, ‘దిల్’ రాజు, మహేశ్‌బాబులు నిర్మించారు. ఇక ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్, టీజర్, పాటలతో సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. దాదాపు దశాబ్దం తర్వాత ఈ సినిమాతో లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి రీఎంట్రీ ఇవ్వనున్న విషయం తెలిసిందే. రాజేంద్రప్రసాద్, ప్రకాష్‌రాజ్, సంగీత తదితరలు నటిస్తున్న ఈ చిత్రానికి రత్నవేలు సినిటోగ్రఫీ అందిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ పొడక్షన్స్ పనులు జరుపుకుంటోంది. మహేశ్ కూడా తన పాత్రకు డబ్బింగ్ చెప్పేశాడు. సంక్రాంతి కానుకగా జనవరి 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురాబోతుంది. చదవండి: జనవరి 5న కలుస్తానంటున్న రష్మిక సూపర్‌స్టార్ ఈవెంట్‌కు మెగాస్టార్ -
విశాఖకు సినీ పరిశ్రమ
మహారాణిపేట(విశాఖ దక్షిణ): విశాఖకు సినీ పరిశ్రమ రావాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయమని రాష్ట్ర పర్యాటక శాఖమంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. విశాఖ ఉత్సవ్‌లో భాగంగా మహేష్‌బాబు నచించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో ఓ పాటను మంత్రి శ్రీనివాసరావు విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విశాఖలో సినీ పరిశ్రమ రావడానికి అన్ని మౌలిక సదుపాయాలు, ప్రాంతాలు, పర్యాటక అందాలు ఉన్నాయన్నారు. పెందుర్తి ఎమ్మెల్యే అన్నెంరెడ్డి అదీప్‌రాజ్ మాట్లాడుతూ సరిలేరు నీకెవ్వరు సినిమా విజయవంతం కావాలని కోరారు. నిర్మాత అనిల్ సుంకరి మాట్లాడుతూ ఈ సినిమాను జనవరి 11న విడుదల చేస్తున్నామన్నారు. విశాఖ ఉత్సవ్ పురస్కరించుకుని సి నిమాలో ఓ పాటను విడుదల చేసినట్టు తెలిపారు. నటుడు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ భీమిలి, అరకు తదితర ప్రాంతాల్లో అందాలు ఎంతో అద్భుతంగా ఉంటాయన్నారు. నిర్మాత శిరీష్, వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్, నాయకులు కొయ్య ప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు. అలరించిన దేవిశ్రీ ఆట.. పాట విశాఖ ఉత్సవ్ భాగంగా ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సంగీత విభావరి అలరించింది. పాటలు పాడి.. స్టెప్పులు వేసి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ప్రముఖ యాంకర్ సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించి, కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించారు. ప్రధాన వేదికపై ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. శ్రావ్య, మానస, ధర్మేష్ నృత్యాలు బాగా నచ్చాయి. -
చిన్న బ్రేక్
ఒక సినిమా చేసేటప్పుడు వర్క్ మూడ్‌లో ఉండే మహేశ్‌బాబు అది పూర్తి కాగానే హాలిడే మూడ్‌లోకి వెళ్లిపోతారు. ఇప్పుడు ఆ మూడ్‌లోనే ఉన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేశ్‌బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ షూటింగ్ ఇటీవల పూర్తయింది. ఆ వెంటనే తన పాత్రకు డబ్బింగ్ చెప్పేశారు మహేశ్. దాంతో రిలీఫ్ అయిపోయారు. ఫ్యామిలీతో చిన్న హాలిడే ట్రిప్ ప్లాన్ చేశారని సమాచారం. జస్ట్ వారం రోజులు ఫ్యామిలీతో రిలాక్స్ అయి, ఆ తర్వాత ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రమోషన్స్‌తో బిజీ అయిపోతారు. మహేశ్‌బాబు సరసన రష్మికా మందన్నా నటించిన ఈ చిత్రంలో విజయశాంతి కీలక పాత్ర చేశారు. హైదరాబాద్‌లో జనవరి 5న ఈ చిత్రం ప్రీ–రిలీజ్ వేడుక జరగనుంది. ‘దిల్’ రాజు, అనిల్ సుంకర, మహేశ్‌బాబు నిర్మించిన ఈ చిత్రం జనవరి 11న విడుదల కానుంది. -
‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా స్టిల్స్
-
తమన్నా వచ్చేది ‘మైండ్ బ్లాక్’లో కాదు
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరోగా క్రేజీ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు శరవేగంగా జరుపుకుటుంది ఈ చిత్రం. అయితే మహేశ్ బాబు ఫ్యాన్స్‌కు న్యూఇయర్ కానుకగా ఓ సూపర్ గిప్ట్ ఇచ్చేందుకు చిత్ర బృందం భారీ ప్లాన్ చేస్తోంది. డిసెంబర్ 30(సోమవారం)న డాంగ్ డాంగ్ అంటూ సాగే పార్టీ సాంగ్‌ను విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. అంతేకాకుండా ఈ పార్టీ సాంగ్‌కు సంబంధించిన ప్రోమోను శనివారం సాయంత్రం 07:02 గంటలకు విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించాయి. కాగా, ఈ పాటలో మహేశ్‌తో కలిసి మిల్కీ బ్యూటీ తమన్నా డ్యాన్స్ చేశారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఇటీవలే ఈ పాట షూటింగ్ కూడా పూర్తయిందని టాక్. అయితే ‘సరిలేరు నీకెవ్వరు’లో తమన్నా ఓ ఐటమ్ సాంగ్ చేయనుందని షూటింగ్ ప్రారంభంనుంచి వార్తలు వస్తున్నాయి. అయితే తొలుత విడుదలైన ‘మైండ్‌బ్లాక్’పాటనే తమన్నా నటించిన ఐటమ్ సాంగ్ అని అందరూ భావించారు. కానీ తాజాగా విడుదల చేసిన పోస్టర్ ప్రకారం తమన్నా నర్తించింది ఈ పాటలోనే అని స్పష్టమైంది. ఇక ‘పర్ఫెక్ట్ పెయిర్..పర్ఫెక్ట్ మూవీ..బ్లాస్ట్ మ్యూజిక్.. కంప్లీట్ విజువల్ ట్రీట్.. పండగ మూడ్రోజుల ముందే వస్తోంది’అంటూ రామజోగయ్య శాస్త్రి ట్వీట్ చేశారు. ఇప్పటికే విడుదలైన పాటలతో దేవిశ్రీ ప్రసాద్ తన మార్క్ చూపించుకోగా.. తాజాగా పార్టీ సాంగ్‌తో సంగీత శ్రోతలను ఉర్రూతలూగించేందుకు సిద్దమయ్యాడు. గత సోమవారం విడుదలైన ‘హీ ఈజ్ సో క్యూట్’నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తోంది. ఈ సినిమాలోని 5 పాటలను వారానికి ఒకటి చొప్పున 5 సోమవారాలు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇది వరకే ప్రకటించిన విషయం తెలిసిందే. రామబ్రహ్మం సుంకర, ‘దిల్’ రాజు, మహేశ్‌బాబు నిర్మించిన ఈ చిత్రంలో విజయశాంతి, రాజేంద్రప్రసాద్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. చదవండి: అమితాబ్ ఫస్ట్.. టాప్-10లో మహేష్ మన దగ్గర బేరాల్లేవమ్మా...: మహేశ్ THE.....PARTY SONG DAANG DAANG ...promo Today 7:02pm 🔥🔥🔥🔥 The perfect pair..perfect moves..blast music..complete visual treat👍 పండగ మూడ్రోజులు ముందే వస్తాంది 💕 Super⭐@urstrulyMahesh @AnilRavipudi @AnilSunkara1 @SVC_official @ThisIsDSP @tamannaahspeaks @RathnaveluDop pic.twitter.com/BalmFuBrhi — Ramajogaiah Sastry (@ramjowrites) December 28, 2019 -
మహేశ్ అభిమానుల ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: సినీ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్స్పై హీరో మహేశ్‌బాబు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హీరో మహేశ్‌బాబుతో ఫొటో దిగడానికి రమ్మని తమను తీవ్రంగా అవమానించారని మండి పడుతున్నారు. స్టార్ హీరోకు తగినట్టుగా ఏర్పాట్లు చేయలేదని వాపోయారు. మహేశ్‌బాబుతో ఫొటో దిగాలనుకుంటే గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీకి రావాలని నిర్వాహకులు ఆన్లైన్లో ప్రచారం చేయడంతో తెలుగు రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల నుంచి అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నిర్వాహకులు సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో తోపులాట జరిగి పలువురు అభిమానులు గాయపడ్డారు. ఇద్దరికి కాళ్లు విరిగినట్టు తెలుస్తోంది. బౌన్సర్లు దురుసుగా వ్యవహరించారని, తమపై చేయి చేసుకున్నారని ఫ్యాన్స్ ఆరోపించారు. తమను ఎందుకు కొట్టారో అర్థం కావడం లేదని వాపోయారు. అభిమానులను కొట్టాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. రైళ్లో సీట్లు దొరక్కపోయినా రాత్రంతా ప్రయాణం చేసి 30 మందితో కలిసి వచ్చామని, ఇక్కడి వచ్చాక తమను కొట్టి తరిమేశారని ఒక అభిమాని వాపోయాడు. ఎవరి పైరవీలు వాళ్లవి జరుగుతున్నాయని ఆరోపించాడు. కార్యక్రమం రసాభాసగా మారడంతో బ్యారికేడ్లు విరిగిపోయాయి. కోపంతో అభిమానులు కుర్చీలు విరగొట్టారు. అయితే అనుమతి తీసుకుంటే భద్రతా ఏర్పాట్లు చేసేవాళ్లమని పోలీసులు చెబుతున్నారు. అనుమతి తీసుకోకుండా కార్యక్రమం చేపట్టిన నిర్వాహకులపై చందానగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. (మహేశ్ ఫొటోషూట్‌లో తొక్కిసలాట..రభస)