
‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలోని 'మైండ్ బ్లాక్' సాంగ్ ఫుల్ వీడియోను చిత్ర యూనిట్ శనివారం విడుదల చేసింది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మహేష్ బాబు సరసన రష్మిక మందాన హీరోయిన్‌గా నటించింది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చగా.. మైండ్ బ్లాక్ పాట మాస్ బీట్‌తో ప్రేక్షకుల్ని హుషారెత్తించింది. సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. దీంతోపాటు సినిమా విడుదలై 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ స్పెషల్ వీడియోను సైతం చిత్ర యూనిట్ ప్రేక్షకులకు అందించింది. మహేష్ బాబు గురించి ప్రకాశ్ రాజ్‌కు అజయ్ చెబుతున్న వీడియో అది.
‘కర్నూలు కొండారెడ్డి బురుజుకాడ అల్లూరి సీతారామరాజును చూసినా అన్నా. చుట్టూ 50 మంది. చేతిలో కత్తిలే.. గొడ్డలిలే.. ఎట్టా నిలబడినాడో.. అచ్చం ఈయన లెక్నే రొమ్మిరిసి.. (అల్లూరి సీతారామరాజు గెటప్‌లో ఉన్న కృష్ణను చూపిస్తూ) అని అజయ్ చెప్పిన నేపథ్యాన్ని పవర్‌ఫుల్‌గా చూపించారు. ఇక ‘సరిలేరు నీకెవ్వరు’ విజయం తనకు మరో సంక్రాంతిని అందించిందని దర్శకుడు అనిల్ రావిపూడి అన్నారు. అద్భుతమైన విజయం ప్రసాదించింన ప్రేక్షక దేవుళ్లూ.. సరిలేరూ మీకెవ్వరూ! అని ఆయన ట్వీట్ చేశారు. మహేష్‌తో ఉన్న ఫొటోను షేర్ చేశారు. ఇదిలాఉండగా.. సూపర్‌స్టార్ మహేష్ అభిమానులు ఈ సినిమా విజయాన్ని పురస్కరించుకుని సోషల్ మీడియా వేదికగా.. మహేష్ పోస్టర్లను షేర్ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. #SarileruNeekevvaru, #50DaysOfBBSLN అనే హ్యాష్‌ట్యాగ్‌లు ట్విటర్‌లో ట్రెండింగ్‌లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment