
హైదరాబాద్: లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ టిక్‌టాక్ వీడియోలతో అభిమానులను అలరిస్తున్నాడు. ముఖ్యంగా తెలుగు డైలాగ్స్, పాటలతో అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు. బుట్టబొమ్మ, పోకిరి, బాహుబలి డైలాగ్స్‌తో టాలీవుడ్ అభిమానులను మెప్పిస్తున్నాడు. దీంతో ఆయా హీరోల అభిమానులు వార్నర్‌కు పలు విజ్ఞప్తులు చేస్తున్నారు. ఈ క్రమంలో మహేశ్‌బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలోని ‘మైండ్ బ్లాక్’ పాటకు టిక్‌టాక్ చేయాల్సిందిగా ఫ్యాన్స్ కోరుతున్నారు. (ఊపిరి పీల్చుకున్న టిక్‌టాక్)
దీంతో అభిమానుల కోరిక మేరకు ‘మైండ్ బ్లాక్’ పాటకు సంబంధించిన స్టెప్పులతో పార్ట్-1 విడుదల చేశారు. ఈ పాట స్టెప్పుల కోసం చాలా కష్టపడ్డానని, 15 నిడివిగల ఈ టిక్‌టాక్ కోసం 51 సార్లు ప్రయత్నం చేశానని వార్నర్ చెప్పుకొచ్చాడు. అయితే తాజా వార్నర్ టిక్‌టాక్ వీడియో మహేశ్‌తో పాటు ఓవరాల్ టాలీవుడ్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా అభిమానుల కోరిక మేరకు అతడు పడుతున్న కష్టానికి ఫిదా అవుతున్నారు. ఈ పాటకు సంబంధించి మరో టిక్‌టాక్ వీడియో త్వరలోనే విడుదల చేస్తానని వార్నర్ పేర్కొన్నాడు. ప్రస్తుతం వార్నర్ ‘మైండ్ బ్లాక్’ టిక్‌టాక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. (వార్నర్ వీడియోకు రష్మిక ఫిదా)
Attempt 51 haha part 1 of @urstrulyMahesh #mindblock @CandyFalzon pic.twitter.com/AYrRVD3ooX
— David Warner (@davidwarner31) May 30, 2020