Fans Hilarious Response David Warner Latest Instagram Post Mahesh Babu - Sakshi
Sakshi News home page

David Warner: డేవిడ్‌ వార్నర్‌ ఎన్నాళ్లకెన్నాళ్లకు..

Published Sat, Sep 17 2022 1:52 PM | Last Updated on Sat, Sep 17 2022 3:54 PM

Fans Hilarious Response David Warner Latest Instagram Post  Mahesh Babu - Sakshi

ఆస్ట్రేలియా క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ భారతీయ సినిమాలపై ఉన్న అభిమానం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే వార్నర్‌ ఇప్పటికే చాలా సినిమాల్లోని డైలాగులు, పాటలు, డ్యాన్స్‌లను అనుకరించాడు. అయితే ఈ మధ్యన ఇలాంటి వాటికి కాస్త గ్యాప్‌ ఇచ్చిన వార్నర్‌ తాజాగా మళ్లీ మెరిశాడు.

ఖలేజా సినిమాలోని మహేష్‌ బాబు గెటప్‌తో కనిపించిన వార్నర్‌.. అభిమానులకు ఒక పజిల్‌ విసిరాడు.''నేను ఏ హీరో గెటప్‌లో ఉన్నానో చెప్పుకోండి చూద్దాం'' అని క్యాప్షన్‌ జత చేశాడు. ఇక తెలుగు సినిమా అభిమానులైతే వార్నర్‌ ఏ గెటప్‌లో ఉన్నాడో వెంటనే చెప్పేస్తారు కానీ మిగతా వాళ్లకు కొంచెం కష్టమే. దీనికి సంబంధించిన వీడియో మాత్రం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

అయితే అభిమానులు మాత్రం వార్నర్‌ వీడియోపై వినూత్న కామెంట్స్‌ చేశారు.''చాలా గ్యాప్‌ వచ్చింది.. ఇంతకాలం ఏమైపోయావు.. వార్నర్‌ భయ్యా''.. ''ఎన్నాళ్లకెన్నాళ్లకు డేవిడ్‌ వార్నర్‌''.. ఒక అభిమాని మాత్రం .. ''నేను మహేశ్‌ బాబు ఫ్యాన్‌ను.. ఇప్పుడు చూస్తున్నది వార్నర్‌ బాబు''ను అంటూ పేర్కొన్నారు. ఇక టీమిండియాతో టి20 సిరీస్‌ ఆడేందుకు ఆస్ట్రేలియా రానున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్‌ 20న ఇరుజట్ల మధ్య మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌ ఆరంభం కానుంది. కాగా అక్టోబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టి20 ప్రపంచకప్‌ 2022కు ముందు టీమిండియా, ఆస్ట్రేలియాలకు ఈ సిరీస్‌ మంచి ప్రాక్టీస్‌గా ఉపయోగపడనుంది.

చదవండి: అదరగొట్టారు.. ఎవరీ పంకజ్‌ సింగ్‌, తన్మయ్‌ శ్రీవాత్సవ?

రొనాల్డో చేసిన పనికి యువతి మొహం మాడిపోయింది!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement