తమన్నా వచ్చేది ‘మైండ్‌ బ్లాక్‌’లో కాదు | Sarileru Neekevvaru Telugu Movie Party Song Promo Release Date Fix | Sakshi
Sakshi News home page

మహేశ్‌తో తమన్నా జతకట్టింది ఈ పాటలో

Published Sat, Dec 28 2019 12:13 PM | Last Updated on Sat, Dec 28 2019 12:14 PM

Sarileru Neekevvaru Telugu Movie Party Song Promo Release Date Fix - Sakshi

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు హీరోగా క్రేజీ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మికా మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకుని పోస్ట్‌ ప్రొడక్షన్స్‌ పనులు శరవేగంగా జరుపుకుటుంది ఈ చిత్రం. అయితే మహేశ్‌ బాబు ఫ్యాన్స్‌కు న్యూఇయర్‌ కానుకగా ఓ సూపర్‌ గిప్ట్‌ ఇచ్చేందుకు చిత్ర బృందం భారీ ప్లాన్‌ చేస్తోంది. డిసెంబర్‌ 30(సోమవారం)న డాంగ్‌ డాంగ్‌ అంటూ సాగే పార్టీ సాంగ్‌ను విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. అంతేకాకుండా ఈ పార్టీ సాంగ్‌కు సంబంధించిన ప్రోమోను శనివారం సాయంత్రం 07:02 గంటలకు విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించాయి. 

కాగా, ఈ పాటలో మహేశ్‌తో కలిసి మిల్కీ బ్యూటీ తమన్నా డ్యాన్స్‌ చేశారు. శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీలో ఇటీవలే ఈ పాట షూటింగ్‌ కూడా పూర్తయిందని టాక్‌. అయితే ‘సరిలేరు నీకెవ్వరు’లో తమన్నా ఓ ఐటమ్‌ సాంగ్‌ చేయనుందని షూటింగ్‌ ప్రారంభంనుంచి వార్తలు వస్తున్నాయి. అయితే తొలుత విడుదలైన ‘మైండ్‌బ్లాక్‌’పాటనే తమన్నా నటించిన ఐటమ్‌ సాంగ్‌ అని అందరూ భావించారు. కానీ తాజాగా విడుదల చేసిన పోస్టర్‌ ప్రకారం తమన్నా నర్తించింది ఈ పాటలోనే అని స్పష్టమైంది. ఇక ‘పర్‌ఫెక్ట్‌ పెయిర్‌..పర్‌ఫెక్ట్‌ మూవీ..బ్లాస్ట్‌ మ్యూజిక్‌.. కంప్లీట్‌ విజువల్‌ ట్రీట్‌.. పండగ మూడ్రోజుల ముందే వస్తోంది’అంటూ రామజోగయ్య శాస్త్రి ట్వీట్‌ చేశారు. 

ఇప్పటికే విడుదలైన పాటలతో దేవిశ్రీ ప్రసాద్‌ తన మార్క్‌ చూపించుకోగా.. తాజాగా పార్టీ సాంగ్‌తో సంగీత శ్రోతలను ఉర్రూతలూగించేందుకు సిద్దమయ్యాడు. గత సోమవారం విడుదలైన ‘హీ ఈజ్ సో క్యూట్’నెట్టింట్లో తెగ హల్‌చల్‌ చేస్తోంది. ఈ సినిమాలోని 5 పాటలను వారానికి ఒకటి చొప్పున 5 సోమవారాలు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇది వరకే ప్రకటించిన విషయం తెలిసిందే. రామబ్రహ్మం సుంకర, ‘దిల్‌’ రాజు, మహేశ్‌బాబు నిర్మించిన ఈ చిత్రంలో విజయశాంతి, రాజేంద్రప్రసాద్‌, ప్రకాష్‌ రాజ్‌ కీలక పాత్రలు పోషించారు. 

చదవండి: 
అమితాబ్‌ ఫస్ట్‌‌.. టాప్‌-10లో మహేష్‌
మన దగ్గర బేరాల్లేవమ్మా...: మహేశ్‌

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement