
'మీరెవరో మాకు తెలియదు.. కానీ మిమ్మల్ని కాపాడడం మా బాధ్యత' అంటూ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు పలికే పవర్‌ఫుల్ డైలాగ్‌తో శుక్రవారం 'సరిలేరు నీకెవ్వరు' సినిమా టీజర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ సినిమాలో మహేశ్‌బాబు మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో నటిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో రష్మిక మండన్నకథానాయికగా నటించగా, లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి, ప్రకాష్ రాజ్,రాజేంద్ర ప్రసాద్‌లు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లు, బర్త్‌డే టీజర్, టైటిల్ సాంగ్ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా రిలీజ్ చేసిన 1.26 నిమిషాల నిడివి గల టీజర్ ఆద్యంతం ఆకట్టుకునేలా సాగింది. దిల్ రాజు, మహేశ్‌బాబు, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. కాగా, ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో కమర్షియల్ అంశాలతో పాటు అంతర్లీనంగా ఒక మేసేజ్ అందిస్తున్నట్లు టీజర్ ద్వారా చిత్ర బృందం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment