
మహేశ్‌బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. ఇందులో ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ పాత్ర చేస్తున్నారు మహేశ్‌బాబు. ఈ చిత్రంలో రష్మికా మండన్నా కథానాయికగా నటిస్తున్నారు. ఇప్పటివకే విడుదలైన ప్రచార గీతం, మహేశ్ బాబు, విజయశాంతి ఫస్ట్ లుక్ పోస్టర్లు హైలైట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే మహేశ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అన్ని ఎదురు చూస్త్ను టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ నెల 22న ‘సరిలేరు నీకెవ్వరు’టీజర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.
ఇప్పటికే మేజర్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. దీంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులను త్వరగా కంప్లీట్ చేసుకొని ప్రమోషన్స్ భారీగా చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఒక్కొ అస్త్రాన్ని సంధించి అభిమానులకు సినిమాపై అంచనాలు పెరిగేలా చేయాలని భావిస్తోంది. దీనిలో భాగంగా ఈ సినిమా టీజర్‌ను అనిల్ రావిపూడి బర్త్‌డే సందర్భంగా ఈ నెల 23న విడుదల చేయాలనే ఆలోచనలో చిత్రబృందం ఉందని తాజా సమాచారం. అంతేకాకుండా ఈ నెల చివర్లో మూవీ కొత్త పోస్టర్‌ను విడుదల చేస్తారనే టాక్ కూడా నడుస్తోంది. డిసెంబర్ మొదటివారంలో ఓ పాటను విడుదల చేస్తారని టాలీవుడ్ టాక్. ‘దిల్’ రాజు, రామబ్రహ్మం సుంకర, మహేశ్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు.
Witness Major Ajay Krishna on Nov 22nd @ 5:04 PM 💥#SarileruNeekevvaruTeaser
— AK Entertainments (@AKentsOfficial) November 19, 2019
Superstar @urstrulyMahesh @AnilRavipudi @AnilSunkara1 @vijayashanthi_m @iamRashmika @RathnaveluDop @ThisIsDSP @AKentsOfficial @GMBents @SVC_official #SarileruNeekevvaruTeaserOnNov22nd pic.twitter.com/1KFfq5DcbE