ఫైనల్‌కొచ్చేశారు | SARILERU neekevvaru SHOOTING ALMOST COMPLETED | Sakshi
Sakshi News home page

ఫైనల్‌కొచ్చేశారు

Published Tue, Oct 22 2019 2:24 AM | Last Updated on Tue, Oct 22 2019 2:24 AM

SARILERU neekevvaru SHOOTING ALMOST COMPLETED - Sakshi

మహేశ్‌బాబు

‘సరిలేరు నీకెవ్వరు’ షూటింగ్‌ తుది దశకు చేరుకుంది. చివరి షెడ్యూల్‌ మినహా షూటింగ్‌ పూర్తయిందని చిత్రబృందం తెలిపింది. మహేశ్‌బాబు హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్‌ సుంకర, ‘దిల్‌’ రాజు, మహేశ్‌బాబు నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మికా మందన్నా కథానాయిక. విజయ శాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇటీవలే ఓ షెడ్యూల్‌ను ప్రత్యేకంగా వేసిన ఇంటి సెట్‌లో పూర్తి చేశారు. కథానుసారం ఇది విలన్‌ (ప్రకాశ్‌ రాజ్‌) ఇల్లు అని సమాచారం. ఈ సెట్‌ రూపొందించడానికి రెండున్నర కోట్లు ఖర్చు చేశారట. త్వరలో చివరి షెడ్యూల్‌ ప్రారంభం కానుంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజ్‌ కానున్న ఈ సినిమాకు సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: రత్నవేలు.

అసురన్‌ బావుంది
ధనుష్‌ హీరోగా వెట్రిమారన్‌ రూపొందించిన తమిళ చిత్రం ‘అసురన్‌’. ఇటీవల  విడుదలైన  ఈ సినిమాను చూసిన మహేశ్‌ ఆ సినిమాను అభినందిస్తూ ట్వీట్‌ చేశారు. ‘‘అసురన్‌’ సినిమా చాలా నిజాయతీగా అనిపించింది. అద్భుతంగా ఉంది. టీమ్‌కి నా అభినందనలు’’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement