
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో నుంచి మొదటి సాంగ్ వచ్చేసింది. ఈ సినిమాలోని 5 పాటలను వారానికి ఒకటి చొప్పున 5 సోమవారాలు రిలీజ్ చేస్తామని ప్రకటించిన చిత్ర యూనిట్.. సోమవారం సాయంత్రం మొదటి పాటను విడుదల చేసింది. మాస్ బీట్‌తో వచ్చిన ఈ పాటలో మహేష్ డైలాగ్స్ ఉన్నాయి.
మహేశ్ అభిమానులకు తగ్గట్టుగా, తనదైన శైలీలో దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్ కట్టాడు. మాస్ బిట్స్‌తో, రైమింగ్ పదాలతో ‘మైండ్ బ్లాంక్’ చేసేశాడు. రెనైనా రెడ్డి, బ్లాజ్ ఆలపించిన ఈ పాటకు శ్రీమణి, దేవీ శ్రీ ప్రసాద్ లిరిక్స్ అందించారు. అప్పుడే ట్రెండింగ్ లోకెళ్ళిపోయిన ఈ ‘మైండ్ బ్లాంక్’ సాంగ్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది.
అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిత్రంలో రష్మిక మండన్నకథానాయికగా నటించగా, లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి, ప్రకాష్ రాజ్,రాజేంద్ర ప్రసాద్‌లు కీలక పాత్ర పోషిస్తున్నారు. దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మించారు. దేవీ శ్రీ సంగీతం అందిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల కానుంది.