సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో జగపతిబాబు నటించడం లేదని సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. మహేష్, జగపతి బాబు మధ్య విభేదాల కారణంగానే ఆయన సినిమా నుంచి తప్పుకున్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం తెలుగు సినీపరిశ్రమలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దీంతో సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలపై జగపతిబాబు స్పందించారు. తనకు మహేష్‌తో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని.. అవన్నీ తప్పుడు వార్తలని కొట్టిపారేశారు.
ఈ మేరకు శుక్రవారం ఆయన సోషల్ మీడియాలో ఓ వీడియోను విడుదల చేశారు. ‘సినీ పరిశ్రమ అనేది నాకు కుటుంబంతో సమానం. వారి గురించి మాట్లాడటం సరికాదు. కానీ నాపై వస్తున్న తప్పుడు కథనాల మూలంగా 33 ఏళ్ల సినీ జీవితంతో తొలిసారి వివరణ ఇస్తున్నా. మహేష్ బాబు సినిమా నుంచి నన్ను తప్పించారంటూ వార్తలు వస్తున్నాయి. అవన్నీ తప్పుడు వార్తలు. మహేష్ సినిమా కోసం రెండు చిత్రాలను కూడా వదులుకున్నాను. ఈ క్యారెక్టర్ అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పటికీ నాకు చేయాలని ఉంది. కానీ కొన్ని అనుకోని సంఘటన మూలంగా ఆ చిత్రంలో నటించడం కుదరటంలేదు. సోషల్ మీడియాలో వస్తున్నదంతా అసత్యం. మహేష్‌కి, చిత్ర యూనిట్‌కి ఆల్ ద బెస్ట్’’ అంటూ జగపతిబాబు వివరణ ఇచ్చారు. అయితే జగపతిబాబు స్థానంలో ప్రకాశ్‌రాజ్‌ను తీసుకున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment