సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఎఫ్ 2తో సూపర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ ఆర్మీ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి సీనియర్ నటుడు జగపతి బాబు తప్పుకున్నట్టుగా తెలుస్తోంది.
ఈ విషయంపై చిత్రయూనిట్ స్పందించకపోయినా జగపతి బాబుకు బదులు ప్రకాష్‌రాజ్‌ను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. షూటింగ్‌లో పాల్గొనేందుకు కాశ్మీర్ వెళ్లిన జగ్గుభాయ్ తన పాత్రను ముందుగా చెప్పినట్టుగా తెరకెక్కించకపోవటంతో ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై చిత్రయూనిట్ ఎలాంటి ప్రకటనా చేయలేదు.
Comments
Please login to add a commentAdd a comment