Famous Tollywood Celebrities Staying In Rented House In Hyderabad - Sakshi
Sakshi News home page

Tollywood Stars: ఇంద్ర భవనాలు వదిలి.. అద్దెకుంటున్న టాలీవుడ్ స్టార్స్ వీళ్లే..!

Published Sat, Oct 22 2022 9:35 PM | Last Updated on Sun, Oct 23 2022 5:45 PM

Famous Tollywood stars In Rented House In hyderabad - Sakshi

సొంతిల్లు ఉండాలనేది ప్రతి ఒక్కరి కల. మనకు ఓ ఇల్లు ఉంటే చాలా ఆనందంగా ఫీలవుతాం. ఇక టాలీవుడ్‌ ప్రముఖుల ఇళ్ల గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే వారి ఇళ్లు ఇంద్ర భవనాలను తలపిస్తాయి. వారి కోట్లు వెచ్చించి మరీ నచ్చినట్లుగా, చాలా అందంగా భవనాలను నిర్మించుకుంటారు. అన్ని కోట్లు పెట్టి కట్టుకున్న ఇంట్లో అదృష్టంగా భావిస్తారు. కానీ కొందరు ప్రముఖులు సొంత ఇంటిని వదిలి అద్దె ఇళ్లలో ఉంటున్నారు. విలాసవంతమైన భవనాలు వదిలి అద్దెకుంటున్న ఆ టాలీవుడ్ ప్రముఖులు ఎవరో ఓ లుక్కేద్దాం.

మహేష్ బాబు: టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుకి హైదరాబాద్‌లోని  జూబ్లీహిల్స్‌లో అతిపెద్ద భవనం ఉంది. కానీ మన ప్రిన్స్‌ అందులో ఉండటం లేదు. నగరంలోని ఓ కాలనీలో త్రిబుల్ బెడ్ రూమ్ ఇంట్లోకి ఉంటున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు  ఎదురింటిలోనే ఆమె సోదరీ కూడా నివసిస్తున్నారు.

 నాగచైతన్య: కింగ్ నాగార్జున తనయుడు నాగచైతన్య అబిడ్స్ మాల్ వద్ద ఉండే ఓ సాధారణ ఫ్లాట్‌లో నివాసముంటున్నారు. నాగచైతన్య రెండో సినిమా నుంచి ఆ ఇంటికి మకాం మార్చాడు. పెళ్లయిన తర్వాత సమంతతో కలిసి ఆ ఇంట్లోనే ఉన్నారు. అయితే అందుకు ఓ ప్రధాన కారణం ఉందట. నాగచైతన్య తల్లి దగ్గుబాటి లక్ష్మి ఆ ఇంటికి ఇంటీరియర్ డిజైన్ చేసిందన్న సెంటిమెంట్‌ వల్లే ఆ ఇంటిని వదలడం లేదని సమాచారం.

రాజమౌళి: దర్శకధీరుడు రాజమౌళి పెళ్లయినప్పటి నుంచి  మణికొండలో నివాసముంటున్నారు. గతంలో రాజమౌళి ఓ విల్లాలో ఉండేవారు కానీ ఆ తర్వాత అద్దెకి ఇచ్చి మణికొండలోనే త్రిబుల్ బెడ్ రూమ్ ప్లాట్‌లో నివసిస్తున్నారు.

జగపతిబాబు: నగరంలోని అపోలో ఆస్పత్రికి దగ్గరలో జగపతిబాబుకి పెద్ద భవనం ఉంది. కానీ ఆ ఇంటిలో ఆయన ప్రస్తుతం నివసించడం లేదు. కూకట్‌పల్లిలోని ఓ ఫ్లాట్‌లో ఉంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement