హీరో జగపతి బాబు క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా విభిన్నమైన పాత్రలతో దూసుకుపోతున్నారు. ఒకప్పుడు హీరోగా అలరించిన ఆయన ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌లో సైతం అలరిస్తున్నారు. తాజాగా మహేశ్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో SSMB28 సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ చిత్రంలో జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. అద్భుతమైన పాత్రలను క్రియేట్ చేసే దర్శకుల్లో త్రివిక్రమ్ ఒకరు. గతంలో ఆయన దర్శకత్వంలో అరవింద సమేత సినిమాలో నటించాను.
చదవండి: అప్పుడే ఓటీటీలోకి లారెన్స్ 'రుద్రుడు' మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే..
ఇప్పుడు దానికంటే భిన్నంగా, వైల్డ్‌గా పవర్‌ఫుల్‌గా SSMB28లో కనిపిస్తాను అంటూ వెల్లడించారు జగపతి బాబు. ఈ సినిమాతో పాటు పుష్ప-2, సలార్ వంటి పాన్ ఇండియా సినిమాల్లోనూ నటిస్తున్నారు జగపతి బాబు. అంతేకాకుండా బాలీవుడ్‌లోనూ మరో మూడు ప్రాజెక్టులకు సైన్ చేసినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment