మహేశ్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. ఆరోజే సినిమా రిలీజ్‌ | SSMB28: Mahesh Babu Movie Release Date Out | Sakshi
Sakshi News home page

Mahesh Babu: చేతిలో సిగరెట్‌తో సూపర్‌స్టార్‌.. ఫ్యాన్స్‌ దిల్‌ఖుష్‌..

Published Sun, Mar 26 2023 6:54 PM | Last Updated on Sun, Mar 26 2023 6:56 PM

SSMB28: Mahesh Babu Movie Release Date Out - Sakshi

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు- త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో సినిమా పడితే అభిమానులకు పూనకాలు రావాల్సిందే! వీరి కాంబినేషన్‌లో ఇప్పటికే అతడు, ఖలేజా సినిమాలు రాగా ముచ్చటగా మూడోసారి జతకట్టారిద్దరూ. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. హారిక అండ్‌ హాసినీ క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా గురించి అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చింది చిత్రయూనిట్‌. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 13న విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు స్పెషల్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేసింది. ఇందులో సూపర్‌ స్టార్‌ చేతిలో సిగరెట్‌ పట్టుకుని స్టైలిష్‌గా నడుస్తున్నాడు.

ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ మూవీకి తమన్‌ సంగీతం అందిస్తున్నాడు. కాగా ఈ సినిమాకి ‘అడవిలో అర్జునుడు’, ‘ఆమె కథ’, ‘అమ్మ కథ’ అనే టైటిల్స్‌ ప్రచారంలో ఉన్నాయి. అయితే ఉగాది పండుగ సందర్భంగా ఈ నెల 22న ఈ మూవీ టైటిల్‌ను అధికారికంగా రిలీజ్‌ చేయనున్నారంటూ జోరుగా ప్రచారం నడిచింది. కానీ అది నిజం కాలేదు. మరి ఈ చిత్ర టైటిల్‌ ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement