సూపర్‌స్టార్ మహేశ్‌బాబు సినిమా వస్తుందంటే చాలు అభిమానులు సంతోషంతో ఎగిరి గంతేస్తుంటారు. అలాంటిది ఆయన మాస్ మసాలా సినిమాతో వస్తున్నాడంటే వారి ఆనందానికి అవధులు ఉండవు. మహేశ్‌బాబు ప్రధాన పాత్రలో నటించిన గుంటూరు కారం నేడే(జనవరి 12న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పేరుకు తగ్గట్లే సినిమాలో ఘాటు ఎక్కువే ఉందనుకున్నారు అభిమానులు. సోషల్ మీడియాలో టాక్ చూస్తుంటే వారి ఆశలపై నీళ్లు చల్లినట్లే కనిపిస్తోంది.
మిక్స్‌డ్ టాక్..
మహేశ్ నటనకు వంక పెట్టాల్సిన పని లేదు కానీ కొన్నిచోట్ల సీన్లు, డైలాగులు పేలవంగా ఉండటం, కథ కూడా బలహీనంగా ఉండటంతో సినిమాకు మిక్స్‌డ్ టాక్ వస్తోంది. అయితే అభిమానులు మాత్రం ఆ కుర్చీని మడతపెట్టి సాంగ్ సహా ఫైటింగ్ సీన్స్‌ను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో మహేశ్ తన ఫ్యామిలీతో కలిసి శుక్రవారం నాడు హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్‌లో గుంటూరు కారం సినిమా చూశాడు. భార్య నమ్రత, తనయుడు గౌతమ్, కూతురు సితార అతడి వెంట ఉన్నారు.
థియేటర్‌లో మహేశ్‌బాబు
అలాగే దర్శకుడు త్రివిక్రమ్, రచయిత వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్‌రాజు.. మహేశ్‌తో కలిసి థియేటర్లో సినిమా వీక్షించారు. థియేటర్‌లో అభిమాన హీరో కనిపించడంతో ఫ్యాన్స్ సంతోషంతో కేకలు పెట్టారు. అయితే మహేశ్, త్రివిక్రమ్, వంశీ ముఖాల్లో చిరునవ్వే కనిపించడం లేదని అభిమానులు ఫీలవుతున్నారు. మహేశ్‌ను అలా దిగాలుగా చూడలేకపోతున్నామంటూ కామెంట్లు చేస్తున్నారు.
Superstar @urstrulyMahesh at sudarshan 35mm 😍🔥 #GunturKaaram pic.twitter.com/vbVwvWVWo8
— Mahesh Fans Campaign ™ (@ursMFC) January 12, 2024
Actor Mahesh Babu Arrived At Sudharshan Theatre For Watching His Movie With Fans#GunturKaaramOnJan12th #GunturKaaram #MaheshBabu pic.twitter.com/njfKeMAX29
— Pawar Dilip Kumar Choudhary (@DkpChoudhary) January 12, 2024
చదవండి: గుంటూరు కారం ఓటీటీ పార్ట్‌నర్ ఇదే! సినిమా సత్తాను బట్టి..
Comments
Please login to add a commentAdd a comment