Prakash Raj Comments On His Role In Sarileru Neekevvaru Movie in Latest Interview - Sakshi
Sakshi News home page

Prakash Raj: మహేశ్‌ సినిమాలో ఆ పాత్రను అయిష్టంగానే చేశా

Published Mon, Jul 18 2022 1:42 PM | Last Updated on Mon, Jul 18 2022 3:31 PM

Prakash Raj Comments On His Role In Sarileru Neekevvaru Movie in Latest Interview - Sakshi

ప్రకాశ్‌ రాజ్‌.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు ఇది. పరిశ్రమలో ప్రకాశ్‌ రాజ్‌కు ప్రత్యేకం స్థానం ఉంది. ఎలాంటి పాత్రలోనైన ఇట్టే ఒదిగిపోయే నటుడు ఆయన. అందుకే ఆయన నటనకు ఫిదా కానీ ప్రేక్షకులు ఉండడనడంలో అతిశయోక్తి లేదు. ఎలాంటి పాత్రెయిన ఆయన ఇమిడిపోయే తీరు ప్రేక్షకులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అలా ఆయనను అందరి చేత విలక్షణ నటుడిగా ప్రశంసలు అందుకుంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఆయన ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహేశ్‌ బాబు చిత్రంలో తనకు నచ్చని పాత్ర చేశానంటూ ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశారు. 

చదవండి: ఈ వారం థియేటర్‌, ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే..

‘ఏ ఆర్టిస్టుకైనా ఒక్కోసారి నచ్చని పాత్రలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి పాత్రల్లో 'సరిలేరును నీకెవ్వరు' సినిమాలో నేను చేసిన పాత్ర ఒకటి. ఆ సినిమాలో అబద్ధాలు చెప్పే రాజకీయనాయకుడి పాత్ర పోషించాను. అయితే నాకు పాత్ర నచ్చకున్న  అయిష్టంగానే చేయాల్సి వచ్చింది. నటులకు కొన్ని సార్లు వారి నిర్ణయాలు.. అభిప్రాయాలతో పనిలేకుండా అలా జరిగిపోతూ ఉంటుంది’ అని చెప్పుకొచ్చారు. కాగా మహేశ్ బాబు హీరోగా చేసిన ఆ సినిమాలో తానును అలాంటి పాత్రను చేయడం అసంతృప్తిగా అనిపించినా, ఆయన నిర్మించిన 'మేజర్' సినిమాలోని పాత్ర తనకు సంతృప్తినిచ్చిందన్నారు. ఇక తన కెరీర్లో 'ఆకాశమంత' .. 'బొమ్మరిల్లు' సినిమాలు తనకు చాలా సంతోషాన్ని కలిగించాయని ఆయన చెప్పారు. 

చదవండి: కొత్త జంట నయన్‌-విఘ్నేశ్‌కు ఓటీటీ షాక్‌! రూ. 25 కోట్ల ఒప్పందం రద్దు?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement