
మహేశ్‌బాబు
రైలు ప్రయాణం చేస్తున్నారు మహేశ్‌బాబు. ఒంటరిగా కాదు రష్మికా మండన్నాతో. చికుబుకు రైలులో ఆడిపాడతారో, తియ్యని కబుర్లు చెప్పుకుంటారో లేక మహేశ్‌బాబు విలన్లను రప్ఫాడిస్తారో తెలియాలంటే వచ్చే సంక్రాంతి వరకూ ఆగాల్సిందే. మహేశ్‌బాబు, రష్మికా మండన్నా జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’లోనే ఈ ట్రైన్ సీన్ ఉంది.
యూనిట్ సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో వేసిన ట్రైన్ సెట్‌లో ప్రస్తుతం కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మహేశ్, రష్మికలతో పాటు చిత్రంలోని కీలక తారాగణం ఈ షెడ్యూల్‌లో పాల్గొంటారు. వచ్చే నెల 10 వరకూ హైదరాబాద్ షెడ్యూల్ జరుగుతుందని తెలిసింది. ఇందులో మహేశ్‌బాబు ఆర్మీ ఆఫీసర్ పాత్ర చేస్తున్నారు. విజయశాంతి కీలక పాత్ర చేస్తున్న విషయం తెలిసింవే. ‘దిల్’ రాజు, అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.
మహేశ్ హంబుల్: గత ఏడాది థియేటర్ బిజినెస్‌లోకి అడుగుపెట్టిన మహేశ్‌బాబు లేటెస్ట్‌గా దుస్తుల బ్రాండ్‌లోకి అడుగుపెట్టారు. ‘హంబుల్’ పేరుతో మొదలుపెట్టిన క్లాతింగ్ లైన్‌ను ఆగస్ట్ 7న ప్రారంభించబోతున్నారు.