
మహేశ్‌బాబు అభిమానులకు గుడ్ న్యూస్. ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా టీజర్ విడుదల తేదీ నేడు వెల్లడి కానుంది. ఈరోజు సాయంత్రం 6.30 గంటలకు టీజర్ తేదీ వెల్లడిస్తామని ప్రకటించి చిత్రయూనిట్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. దీంతో #UnlockSLNTeaserDate, #SarileruNeekevvaruTeaser హాష్‌ట్యాగ్‌లు ట్విటర్‌లో ట్రెండింగ్‌లో నిలిచాయి. టీజర్ లోడ్ అవుతోందంటూ దర్శకుడు అనిల్ రావిపూడి ఇంతకుముందే ట్విటర్ ద్వారా వెల్లడించారు.
‘ఎఫ్2’ తర్వాత అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో మహేశ్‌బాబుకు జంటగా రష్మిక మందాన నటిస్తున్నారు. సీనియర్ నటి విజయశాంతి కీలకపాత్ర పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. దిల్ రాజు సమర్పణలో జీఎంబీ, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బేనర్స్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాను జనవరి 12న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment