Sarileru Neekevvaru: Highlight Scene at Konda Reddy Buruju Center Set at Ramoji Film City - Sakshi
Sakshi News home page

హిస్టరీ రిపీట్‌ చేస్తాం: అనిల్‌ రావిపూడి

Published Mon, Sep 23 2019 11:00 AM | Last Updated on Mon, Sep 23 2019 3:53 PM

Anil Ravipudi Reveal First Still Of Mahesh At Konda Reddy Burugu Set - Sakshi

మహర్షి సినిమాతో సూపర్‌ హిట్ అందుకున్న టాలీవుడ్ సూపర్‌ స్టార్ మహేష్‌ బాబు ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటిస్తున్నాడు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్‌రాజు, అనిల్‌ సుంకరలతో కలిసి మహేష్ బాబు స్వయంగా నిర్మిస్తున్నాడు. ఆర్మీ ఆఫీసర్‌ అజయ్‌ కృష్ణ పాత్రలో మహేష్ బాబు కనిపించనున్నాడు. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈసినిమాను సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. కొన్ని రోజులుగా ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లోని ఫిలింసిటీలో జరుగుతోంది. సుమారు 4కోట్ల వ్యయంతో ఈ సెట్‌ను వేశారని తెలిసింది. కర్నూలు కొండారెడ్డి బురుజు సెంటర్‌ సెట్‌లో కొన్ని కీలకఘట్టాలు తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలోని కొండారెడ్డి బురుజు సెంటర్‌ వద్ద మహేశ్‌కు సంబంధించిన స్టిల్‌ను దర్శకుడు అనిల్‌ రావిపూడి రివీల్‌ చేశాడు. 

‘16 ఏళ్ల క్రితం ఈ కట్టడం(కొండారెడ్డి బురుజు) సిల్వర్ స్క్రీన్ మీద రికార్డును క్రియేట్ చేసింది(ఒక్కడు సినిమాతో). ఇప్పుడు అదే కట్టడం వద్ద అంతకుమించి హిట్ కోసం సిద్ధమవుతున్నాం. మా ప్రొడక్షన్ డిజైనర్ ఏఎస్ ప్రకాష్ గారు ఈ కట్టడాన్ని అద్భుతంగా రూపొందించారు. కర్నూల్ కొండారెడ్డి బురుజును ఆయన ఫిలిం సిటీకి తీసుకొచ్చారు’’ అంటూ అనిల్ రావిపూడి ట్వీట్‌ చేశాడు. అంతేకాకుండా ఆ లోకేశన్‌లో మహేశ్‌ దిగిన పోటోను కూడా జత చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో తెగ వైరల్‌ అవుతోంది. ‘ఒక్కడు’ సినిమాలో కొండా రెడ్డి బురుజు సెంటర్‌లో ప్రకాష్‌ రాజ్‌తో ఫైట్‌ చేశారు మహేశ్‌బాబు. ఆ సినిమాలో ఆ సీన్‌ ఓ హైలైట్‌గా నిలిచింది. ఇక ఇప్పుడు అదే కట్టడాన్ని మరోసారి మహేష్ కోసం రీ క్రియేట్ చేశారు. సుమారు దశాబ్ద కాలం తర్వాత సీనియర్‌ నటి విజయశాంతి ‘సరి లేరు నీకెవ్వరు’ తో రీఎంట్రీ ఇవ్వనుండటంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement