okkadu
-
ఈ సినిమాతో మహేష్ కు సెంటిమెంట్ గా మారిన కర్నూలు కొండారెడ్డి బురుజు
-
ఒక్కడు మూవీ పాటల గురించి సంగీత దర్శకుడు మణి శర్మ
-
‘ఒక్కడు’లో మహేశ్ చెల్లెలు ఇప్పుడెలా ఉంది? ఏం చేస్తుంది?
చైల్డ్ ఆర్టిస్ట్‌లుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్లుగా ఎదిగినవారు చాలామంది టాలీవుడ్లో ఉన్నారు. రాశి, శ్రీదేవి, మీనా లాంటి హీరోయిన్లు.. చైల్డ్ ఆర్టిస్టులుగా ఎంట్రీ ఇచ్చిన వారే. అయితే చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసిన అందరూ హీరోయిన్గా మారుతారని గ్యారెంటీ లేదు. పెద్దయ్యాక సినిమాలకు గుడ్‌బై చెప్పి, పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేసేవాళ్లు కూడా ఉన్నారు. అలాంటివారిలో ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ నిహారిక కూడా ఒక్కరు. నిహారిక అంటే ఎవరు గుర్తుపట్టరు కానీ ఆమె నటించిన ఓ సినిమా పేరు చెబితే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు. గుణశేఖర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ‘ఒక్కడు’ సినిమా గుర్తింది కదా? ఈ మూవీలో ‘ఒరేయ్ అన్నయ్యా..’ అంటూ మహేశ్‌ను ఆటపట్టించిన అల్లరి చెల్లి ఆశ గుర్తొచ్చిందా? ఆ అల్లరి పిల్లనే బేబీ నిహారిక. ఆమె అప్పుడు బేబీ కానీ ఇప్పుడు మాత్రం..ఇద్దరు పిల్లల తల్లి. వెంకటేశ్ ‘ప్రేమించుకుందాం రా’, మోహన్ బాబు ‘యమజాతకుడు’తో పాటు పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన నిహారిక.. ‘ఒక్కడు’ చిత్రం తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైంది. సినిమాల్లో అవకాశాలు వచ్చినా కూడా చదువుపైనే దృష్టి సారించింది.పదేళ్ల క్రితం పొలిటికల్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది.ఇప్పుడు ఆమెకు ఇద్దరు పిల్లలు. అసలు నిహారిక సినిమాలకు ఎందుకు దూరంగా ఉన్నారు? ఒక్కడు మూవీ ఆఫర్ ఎలా వచ్చింది? ఆమెది ప్రేమ వివాహామా? లేదా పెద్దలు కుదిర్చిన పెళ్లా? ప్రస్తుతం నిహారిక ఏం చేస్తున్నారు? మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందా? తదితర విషయాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోపై ఓ లుక్కేయండి. -
భూమిక ఇంగ్లీషులో భయంకరంగా తిట్టింది: నిర్మాత ఎంఎస్ రాజు
MS Raju Says Bhumika Serious On Fighter In Okkadu Shooting: ఒక్కడు, వర్షం, నువ్ వస్తానంటే నేనొద్దంటాన వంటి తదితర బ్లాక్‌బస్టర్ హిట్స్ ఇచ్చిన ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు. నిర్మాతగా ఎన్నో అవార్డులు అందుకున్న ఆయన 2008లో వచ్చిన 'వాన' సినిమాతో డైరెక్టర్‌గా మారారు. తర్వాత తూనిగ తూనిగ (2012), డర్టీ హరీ (2020) చిత్రాలతో దర్శకుడిగా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. తాజాగా ఆయన డైరెక్ట్ చేసిన చిత్రం '7 డేస్ 6 నైట్స్'. ఈ మూవీ జూన్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఎంఎస్ రాజు, ఆయన తనయుడు, హీరో సుమంత్ అశ్విన్ ఒక టాక్ షోలో పాల్గొన్నారు. ఈ ప్రోగ్రామ్‌లో అప్పట్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన భూమిక గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఒక్కడు సినిమా షూటింగ్ సమయంలో ఫైటర్‌పై భూమిక సీరియస్ అయిందన్న విషయం గురించి హోస్ట్ అడిగాడు. అందుకు సమాధానంగా 'నేను, మహేశ్ బాబు, భూమిక పక్కపక్కన కూర్చున్నాం. ఒక్కసారిగా భూమిక పైకి లేచింది. ఏం తిట్టిందో తెలియదు. ఇంగ్లీషులో ఏదో తిట్టింది. అదేదో భయంకరంగా ఉంది.' అని ఎంఎస్ రాజు తెలిపారు. చదవండి: పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్.. ఇప్పుడు మరో నటుడితో ప్రేమాయణం ఆ పాత్ర నాకు నచ్చలేదు.. కానీ ఒప్పుకున్నా: సత్యరాజ్ -
ఆటలతో ఆకట్టుకున్న హిట్ సినిమాలివే!
కోడి రామ్మూర్తి బయోపిక్ రానుంది. పి.వి.సింధు ఆటను బిగ్ స్క్రీన్ మీద చూస్తాం. పుల్లెల గోపిచంద్ బయోపిక్‌లో ఆయన్ను పోలిన నటుడు ఎవరో? ఆటను సినిమాగా చెప్పడం కూడా పెద్ద ఆట. బాల్ వెళ్లి సూటిగా తాకినట్టుగా ప్రేక్షకుడికి తాకితేనే హిట్టు. లేకుంటే అంతే. చాలాకాలం స్పోర్ట్స్‌ను పట్టించుకోని ఇండియన్ సినిమా నేడు వరుస పెట్టి స్పోర్ట్స్ మూవీలు తీస్తోంది. ఒలింపిక్స్ ఇచ్చే ఉత్సాహంతో మరిన్ని తీయనుంది కూడా. అసలు ఇంతకు ముందు ఏం స్పోర్ట్స్ మూవీస్ వచ్చాయి.. ఇక మీదట ఏం రానున్నాయి మనకు తెలియాలి... ఎస్... తెలియాలి... జమీందారు కూతురైన హీరోయిన్– బంగ్లా లాన్లో బాడ్మింటన్ బ్యాట్ పట్టుకుని, ఫ్రెండ్స్‌తో రెండు బాల్స్ ఆడి, అప్పుడే కారులో వచ్చిన తండ్రి వైపు పరిగెత్తుకుంటూ వచ్చి ‘డాడీ’ అనడం వరకే మన సినిమాల్లో ఆటలు కనిపించేవి. సినిమాలో ఆట ఎప్పుడైనా ఒక భాగమే తప్ప ఆటే సినిమా కావడం ఏమిటి ఎవరు చూస్తారు అని మన వాళ్లు ఆ జానర్‌ని ఔట్ చేసి కోర్ట్ బయట ఎప్పుడో కూచోబెట్టారు. కాని ఆ రోజులు ఎప్పుడో పోయాయి. ఇప్పుడు ఆటే కథ. ఆటే క్లయిమాక్స్. ఆటే హీరో. ఆటగాడే హీరో. నీవు లేని నేను లేను శోభన్‌బాబు నటించిన ‘మంచి మనుషులు’లో స్కేటింగ్ కనిపిస్తుంది. ఆ తర్వాత ‘గంగ–మంగ’ సినిమాలో శోభన్‌బాబు, వాణిశ్రీ ‘గాలిలో పైరగాలిలో’ అని పాట స్కేటింగ్ చేస్తారు. ‘గండికోట రహస్యం’ సినిమాలో ఎన్.టి.ఆర్ కబడ్డీ ఆడటం, ‘యుగపురుషుడు’లో కరాటే చేయడం తప్ప ఆటల ప్రస్తావన మనకు లేదు. విలువిద్య ఉంది కాని సినిమా విలువిద్యలో ఒకరు ఆగ్నేయాస్త్రం వేస్తే ఒకరు వరుణాస్త్రం వేస్తారు. రెండు ఆకాశంలో గంటసేపు ప్రయాణించి ఢీకొంటాయి. ఇలాంటివి ఒలింపిక్స్ వారు ఒప్పుకోరు. కాలం మారి చిరంజీవి వచ్చి ‘ఇంటిగుట్టు’లో మిక్స్డ్ కబడ్డీ ఆడాడు నళినితో. ఆ తర్వాత ‘విజేత’లో ఫుట్‌బాల్ గోల్ కీపర్‌గా కనిపించాడు. మెల్లగా ఆటల బంతి దొర్లడం మొదలెట్టింది. ఆట మార్చిన అశ్వని 1991లో తెలుగులో ‘అశ్వని’ వచ్చింది. జాతీయ స్థాయిలో పరుగుల రాణిగా నిలిచిన అశ్వని నాచప్ప జీవితం స్ఫూర్తితో ఆమెనే హీరోయిన్గా పెట్టి ‘ఉషాకిరణ్ మూవీస్’ తీసిన ఈ సినిమా ఒక సంచలనం అని చెప్పాలి తెలుగులో. ఒక పేదింటి అమ్మాయి కూడా క్రీడాకారిణి కావచ్చు అని చెప్పిన కథ ఇది. ఆట నేపథ్యంలో పూర్తి సినిమా తీయవచ్చని నిరూపించింది. కాని ఆ స్థాయి కథ లేదా ఆ వాతావరణం ఏర్పడలేక పోయింది. పవన్ కల్యాణ్ ‘తమ్ముడు’ ఆ తర్వాత కిక్ బాక్సింగ్‌ని నేపథ్యంగా తీసుకుంది. పూరి జగన్నాథ్ వచ్చి ‘అమ్మా నాన్న తమిళమ్మాయి’లో కూడా అదే కిక్ బాక్సింగ్‌ని తీసుకున్నాడు. హీరో పంచ్ విసిరే ఆటలే ఆటలుగా మనకు ఉన్నాయి. ఎందుకంటే ఈత కొట్టే హీరో కంటే పంచ్ కొట్టే హీరోకు హిట్ కొట్టే చాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కొండారెడ్డి బురుజు దగ్గర ‘ఒక్కడు’ 2003లో వచ్చిన ‘ఒక్కడు’ సినిమా ఒక సూపర్ డూపర్ హిట్ కథకు ఆటను నేపథ్యంగా తీసుకోవచ్చని మరోసారి గట్టిగా ఇండస్ట్రీకి చెప్పింది. ఇందులో మహేశ్ బాబు కబడ్డీ ప్లేయర్‌గా కనిపిస్తాడు. దీనికి కొద్దిగా ముందు వచ్చిన శ్రీహరి ‘భద్రాచలం’ తైక్వాన్డును కథగా తీసుకున్నప్పటికీ పూర్తి విజయం మాత్రం ‘ఒక్కడు’ సొంతం చేసుకుంది. ఆ తర్వాత రెగ్యులర్‌గానే స్పోర్ట్స్ కథలు కనిపిస్తూ వచ్చాయి. ‘బీమిలి కబడ్డీ జట్టు’ (కబడ్డీ), ‘గోల్కొండ్ హైస్కూల్’ (క్రికెట్), ప్రకాష్ రాజ్ ‘ధోని’ (క్రికెట్), ‘మళ్లీ మళ్లీ ఇది రానిరోజు’ (అథ్లెట్), ‘సై’ (రగ్బీ)... ఇవన్నీ ఆటలను చూపినవే. హీరో నాని క్రికెట్ నేపథ్యంలో ‘జెర్సీ’ చేసి పెద్ద హిట్ అందుకుంటే నాగ చైతన్య కూడా అదే క్రికెట్ నేపథ్యంలో ‘మజిలీ’ చేసి విజయం సాధించాడు. విజయ్ దేవరకొండ ‘డియర్ కామ్రెడ్’లో క్రికెట్, సందీప్ కిషన్ ‘ఏ1ఎక్స్‌ప్రెస్’లో హాకీ ఆటలు ప్రేక్షకుల్ని గ్రౌండ్స్‌లోకి తీసుకెళ్లాయి. అన్నింటికి మించి మహిళా బాక్సింగ్‌ను తీసుకుని వెంకటేశ్ హీరోగా, రితికా మోహన్ సింగ్ హీరోయిన్గా వచ్చిన ‘గురు’, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్గా మహిళా క్రికెట్‌ను తీసుకుని వచ్చిన ‘కౌసల్యా క్రిష్ణమూర్తి’, మహిళా ఫుట్‌బాల్‌ను తీసుకుని విజయ్ హీరోగా వచ్చిన ‘బిగిల్’ క్రీడల్లోనే కాదు సినిమాల్లో కూడా మహిళల విజయాన్ని చూపించాయి. వరుస కట్టిన సినిమాలు ఇక మీదట కూడ బోలెడు స్పోర్ట్స్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. బాక్సింగ్ నేపథ్యంలో విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ రానుంది. కీర్తి సురేశ్ హీరోయిన్గా ‘గుడ్‌లక్ సఖీ’ (షూటింగ్), నాగ శౌర్య హీరోగా ‘లక్ష్య’ (విలువిద్య) రానున్నాయి. ఇవి కాకుండా కోడి రామ్మూర్తి, పి.వి.సింధు, పుల్లెల గోపీచంద్, కరణం మల్లీశ్వరి, విశ్వనాథన్ ఆనంద్‌ల బయోపిక్‌లు వరుసలో ఉన్నాయి. ఇక తమిళం నుంచి డబ్ అయిన తాజా సినిమా ‘సార్పట్టా’ కాలం వెనక్కు వెళ్లి మన దేశీయులు ఆడిన బాక్సింగ్‌లో పల్లె పౌరుషాలు పట్టుదలలు ఏ విధంగా ఉంటుందో చూపింది. అసలు గతాన్ని తవ్వుకుంటూ వెళితే ఎన్ని స్పోర్ట్స్ డ్రామాలు దొరుకుతాయో కదా. ఓడటం తెలిసినవాడే గెలవడం నేరుస్తాడు. ఆటల్లో ఉంటేనే ఓడటం గెలవడం ఓడినా గెలిచినా సాధన కొనసాగించడం తెలుస్తాయి. మనిషిని మానసికంగా శారీరకంగా తీర్చిదిద్దడంలో ఆటను మించింది లేదు. ఆటలో ఉండే ఉద్వేగం కూడా మనిషిని ఆకర్షిస్తుంది. సెల్‌ఫోన్‌ను అంటుకుపోతున్న నేటి తరాన్ని క్రీడామైదానం వైపు తరమాలంటే బయట, బడులలో, సినిమాల్లో ఎంత క్రీడా వాతావరణం కనిపిస్తే అంత మేలు. క్రీడలకు జయం. ఒలింపిక్స్‌లో ఉన్న భారతీయులకు జయం. ఈ ఒలింపిక్స్ జరిగినన్నాళ్లు అంతటా క్రీడా వాతావరణమే ఉంటుంది. ఒకవైపు ఆటలూ చూడొచ్చు. చూడని స్పోర్ట్స్ సినిమాలనూ చూడొచ్చు. నిజంగా ఇది క్రీడా వీక్షణ సమయమే. ‘లగాన్’ నుంచి సిక్సర్లే 2001లో ఏ ముహూర్తాన బాలీవుడ్లో ‘లగాన్’ వచ్చిందో అక్కడ స్పోర్ట్స్ సినిమాలు హిట్ మీద హిట్ కొడుతూనే ఉన్నాయి. బ్రిటిష్ కాలమేంటి... అక్కడ పన్ను పెంచడమేంటి... దానిని ఎదుర్కొనడానికి పల్లెటూరివాళ్లు బ్రిటిష్ వారితో క్రికెట్ ఆడటం ఏంటి... అసలా కథను తీయడం ఎలా సాధ్యం. దర్శకుడు అశితోష్ గొవారికర్ తీశాడు. సినిమా దేశాన్నే కాదు ప్రపంచాన్నే ఆకర్షించింది. మన తెలుగువాడు నగేశ్ కుకునూర్ మూగ, చెవిటి ఆటగాడి కథను తీసుకుని అద్భుతంగా తీసిన ‘ఇక్బాల్’ ఒక గ్రామీణ క్రికెట్ బౌలర్ కథను చెప్పింది. ఆ తర్వాత మహిళా హాకీని తీసుకు షారూక్ ఖాన్ ‘చక్‌దే ఇండియా’ తీస్తే సూపర్‌డూపర్ హిట్ అయ్యింది. వయసు మీరిన కోచ్ పాత్రలో షారూక్ కనిపించడానికి సిద్ధమయ్యి మరీ హిట్ కొట్టాడు. పరుగుల నేపథ్యంలో ఇర్ఫాన్ ఖాన్ హీరోగా ‘పాన్‌సింగ్ తోమార్’, మిల్కా సింగ్ ఆత్మ కథ ‘భాగ్ మిల్కా భాగ్’, ‘మేరీ కోమ్’, ‘ధోని’, ‘సైనా’, ‘సుల్తాన్’... ఇవన్నీ ఉద్వేగపూరిత క్రీడా అనుభవాన్ని ఇచ్చాయి. మహిళా కుస్తీ నేపథ్యంలో ఆమిర్ ఖాన్ ‘దంగల్’ రికార్డుల చరిత్రను తిరగరాసింది. ఇక 1983 వరల్డ్ కప్ నేపథ్యలో ‘1983’ రానుంది. ఫర్హాన్ ఖాన్ బాక్సర్‌గా ‘తూఫాన్’ తాజాగా విడుదలైంది. మిథాలి రాజ్ బయోపిక్ ‘శభాష్ మితూ’ వరుసలో ఉంది. ‘మైదాన్’ (ఫుట్‌బాల్) కూడా. -
నమ్రత పోస్టుపై హర్ట్ అయిన నిర్మాత..
సూపర్‌స్టార్ మహేష్‌బాబు నటించిన ‘ఒక్కడు’ సినిమా విడుదలై శుక్రవారానికి 18 ఏళ్లు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మహేష్ భార్య నమ్రతా శిరోద్కర్ ఒక్కడు సినిమాను గుర్తు చేసుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ‘మహేష్ సినిమాల్లో ఒక్కడు క్లాసిట్ హిట్. మళ్లీ మళ్లీ చూడలనించే సినిమా.. ఒక్కడు నాకు ఆల్‌టైమ్ ఫేవరెట్ అని పేర్కొన్నారు. ఇక్కడి వరకు అంతా బానే ఉన్నా ఈ పోస్టు ప్రస్తుతం చర్చకు దారి తీసింది. పోస్టులో.. చిత్రయూనిట్ సభ్యులైన మహేష్, భూమిక, గుణశేఖర్, ప్రకాష్ రాజ్, ఫైట్ మాస్టర్ విజయన్, మణిశర్మ ఇలా అందరి పేర్లను నమ్రత ప్రస్తావించింది. అయితే వీరిలో నిర్మాత ఎమ్ఎస్ రాజును మాత్రం మర్చిపోయింది. చదవండి: మహేష్ సినిమాకు 18 ఏళ్లు.. నమ్రత కామెంట్ View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) తాజాగా ఈ విషయాన్ని గమనించిన నిర్మాత ఎమ్ఎస్ రాజు నమ్రత ట్వీట్‌పై స్పందించారు. ఒక్కడు సినిమా గురించి పేర్కొనే సమయంలో నమ్రత తన పేరును ప్రస్తావించలేదని ఎమ్ఎస్ రాజు హర్ట్ అయ్యారు. తనకు దక్కాల్సిన గౌరవం దక్కలేదన్న కారణంతో అప్సెట్ అయ్యారు. ఈ మేరకు ట్విటర్లో ‘ పొరపాట్లు జరుగుతుంటాయి బాబు. నమ్రతగారు ఒక్కడు గురించి మాట్లాడుతూ నా పేరును మర్చిపోయారు. అయినా నాకు సంతోషమే. ఈ సినిమా ఆమెకు ఫెవరెట్ మూవీ అయినందుకు. గుడ్‌లక్’ అంటూ ట్వీట్ చేసి మహేష్‌ను ట్యాగ్ చేశారు. మరి ఎమ్ఎస్ రాజు ట్వీట్‌ను మహేష్ చూస్తాడా.. దీనిపై నమ్రత స్పందిస్తుందో లేదో తెలియాలంటే వేచి చూడాలి. ఇదిలా ఉండగా ఈ ట్వీట్‌ను చూసిన నెటిజన్లు మాత్రం మీరు లేకుండా ఒక్కడు సినిమా లేదు సార్.. ఇంతటి గొప్ప సినిమాను అందించనందుకు కృతజ్ఞతలు అని కామెంట్ చేస్తున్నారు. @urstrulyMahesh Mistakes do happen babu...namratha garu forgot my name on Instagram while addressing 18 yrs of Okkadu...but I am happy it's her favorite classic...good luck — MS Raju (@MSRajuOfficial) January 15, 2021 -
మహేష్ సినిమాకు 18 ఏళ్లు.. నమ్రత కామెంట్
సూపర్ స్టార్ మహేష్‌బాబు నటించిన ‘ఒక్కడు’ సినిమా విడుదలై నేటికి 18 సంవత్సరాలు పూర్తవుతోంది. మహేష్ బాబు, భూమిక చావ్లా ప్రధాన పాత్రలో 2003 జనవరి 15న విడుదలైన ఈ సినిమా ఆ ఏడాది సంక్రాంతికి వచ్చిన సినిమాలన్నింటినీ మించిన బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించాడు. ప్రకాష్ రాజ్ పవర్ఫుల్ విలన్ పాత్రలో నటించాడు. అప్పటివరకూ మహేష్ బాబు కెరీర్లో రాజకుమారుడు, మురారి లాంటి హిట్లు వచ్చినా మొదటి బ్లాక్ బస్టర్ హిట్‌గా ఒక్కడు నిలిచింది. ఈ సినిమా వచ్చి 18 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మహేష్ సతీమణి నమ్రతా శిరోద్కర్ ఇన్స్టాగ్రామ్ ద్వారా స్పందించారు. మహేష్ నటించిన సినిమాల్లో ఒక్కడు క్లాసిక్ హిట్ అని, ఎక్కువ సార్లు చూసే చిత్రమని కొనియాడారు. అంతేగాక తన ఆల్‌టైమ్ ఫేవరెట్ అని పేర్కొన్నారు. చదవండి: సుకుమార్-మహేష్ కాంబినేషన్లో మరో సినిమా? ఇక సినిమాలో కబడ్డీ ఆటగాడిగా మహేష్ కనిపించాడు. అప్పటి వరకు ఎప్పుడూ కబడ్డీ ఆడని మహేష్ ఈ సినిమా కోసం కొన్ని రోజులు కబడ్డీ నేర్చుకొని ఆ పాత్ర పోషించాడు. ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించిన చార్మినార్ సెట్ కోసం హైదరాబాదు శివార్లలోని గోపన్నపల్లె గ్రామంలో నిర్మాత రామానాయుడికి ఉన్న ఓ పదెకరాల ఖాళీస్థలాన్ని వాడారు. ఈ సెట్ నిర్మాణానికి రూ.కోటి డెబ్భై లక్షలు ఖర్చయింది. ఈ సినిమాకు ముందుగా ‘అతడే ఆమె సైన్యం’ అనే టైటిల్‌ను అనుకున్నారు కానీ అప్పటికే ఈ పేరుతో ఎవరో ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ చేయించుకున్నారు. దాంతో టైటిల్‌ను ఒక్కడుగా మార్చారు. ఈ సినిమా తమిళం, కన్నడ, హిందీ, బెంగాలీ భాషల్లో రీమేక్‌గా విడుదలైంది. తమిళంలో విజయ్, త్రిష జంటగా గిల్లి పేరుతో రీమేక్ చేసారు. అక్కడ ఈ సినిమా భారీ విజయాన్ని దక్కించుకుంది. ఇదే సినిమాను కన్నడంలోకి పునీత్ రాజ్ కపూర్, అనురాధా మెహతా జంటగా అజయ్ పేరిట రీమేక్ చేయగా ఇది అంతగా విజయవంతం కాలేదు. చదవండి: ‘సర్కారు వారి పాట’పై స్పందించిన రేణు దేశాయ్ View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
‘ఒక్కడు’కు మించి హిట్ సాధిస్తాం
మహర్షి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో నటిస్తున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్‌రాజు, అనిల్ సుంకరలతో కలిసి మహేష్ బాబు స్వయంగా నిర్మిస్తున్నాడు. ఆర్మీ ఆఫీసర్ అజయ్ కృష్ణ పాత్రలో మహేష్ బాబు కనిపించనున్నాడు. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్న ఈసినిమాను సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. కొన్ని రోజులుగా ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లోని ఫిలింసిటీలో జరుగుతోంది. సుమారు 4కోట్ల వ్యయంతో ఈ సెట్‌ను వేశారని తెలిసింది. కర్నూలు కొండారెడ్డి బురుజు సెంటర్ సెట్లో కొన్ని కీలకఘట్టాలు తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలోని కొండారెడ్డి బురుజు సెంటర్ వద్ద మహేశ్‌కు సంబంధించిన స్టిల్‌ను దర్శకుడు అనిల్ రావిపూడి రివీల్ చేశాడు. ‘16 ఏళ్ల క్రితం ఈ కట్టడం(కొండారెడ్డి బురుజు) సిల్వర్ స్క్రీన్ మీద రికార్డును క్రియేట్ చేసింది(ఒక్కడు సినిమాతో). ఇప్పుడు అదే కట్టడం వద్ద అంతకుమించి హిట్ కోసం సిద్ధమవుతున్నాం. మా ప్రొడక్షన్ డిజైనర్ ఏఎస్ ప్రకాష్ గారు ఈ కట్టడాన్ని అద్భుతంగా రూపొందించారు. కర్నూల్ కొండారెడ్డి బురుజును ఆయన ఫిలిం సిటీకి తీసుకొచ్చారు’’ అంటూ అనిల్ రావిపూడి ట్వీట్ చేశాడు. అంతేకాకుండా ఆ లోకేశన్లో మహేశ్ దిగిన పోటోను కూడా జత చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో తెగ వైరల్ అవుతోంది. ‘ఒక్కడు’ సినిమాలో కొండా రెడ్డి బురుజు సెంటర్లో ప్రకాష్ రాజ్‌తో ఫైట్ చేశారు మహేశ్‌బాబు. ఆ సినిమాలో ఆ సీన్ ఓ హైలైట్‌గా నిలిచింది. ఇక ఇప్పుడు అదే కట్టడాన్ని మరోసారి మహేష్ కోసం రీ క్రియేట్ చేశారు. సుమారు దశాబ్ద కాలం తర్వాత సీనియర్ నటి విజయశాంతి ‘సరి లేరు నీకెవ్వరు’ తో రీఎంట్రీ ఇవ్వనుండటంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. 16 years ago, this location became iconic on the silver screen. Now we are back to the same location. This time we aim to make it bigger. Our production designer A.S prakash garu recreated the location spectacularly.The man who brought Kurnool Kondareddy Buruju to Ramoji FilmCity pic.twitter.com/OcAaWEA8K1 — Anil Ravipudi (@AnilRavipudi) September 23, 2019 -
ఇవ్వాళ శుక్రవారం!
అజయ్ మొహంలో ఎక్కడా భయం కనబడటం లేదు. ప్రశాంతంగా కూర్చొని సిగరెట్ కాలుస్తున్నాడు. చుట్టూ అతని ఫ్రెండ్స్. కొద్దిసేపంతా నిశ్శబ్దం. ‘‘అమ్మో అరేయ్! ఆ ఓబులురెడ్డి మామూలు మనిషి కాదు’’ నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతూ ఫ్రెండ్స్ గ్యాంగ్‌లోని ఒకతనన్నాడు. ‘‘ఓబుల్‌రెడ్డి అంటే.. కొంపదీసి శివారెడ్డి తమ్ముడు కాదు కదా!’’ ఇంకొకతను.‘‘శివారెడ్డా? ఆడెవడు?’’ అజయ్ మాటల్లో ఒక నిర్లక్ష్యం కనిపిస్తోంది.‘‘మీ నాన్నకు మొగుడు. హోమ్ మినిష్టర్. ఈ స్టేట్ మొత్తం ఆడి గుప్పిట్లో ఉంది. వాళ్ల నుండి తప్పించుకోవడం ఇంపాజిబుల్ రా..’’ ఫ్రెండ్ భయపెడుతూ చెప్పాడు. ‘‘సర్లే! నువ్వెలాగూ ఆ అమ్మాయిని పంపించేశావు కదా.. కొన్నాళ్లు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది..’’ కొనసాగించాడు ఆ ఫ్రెండ్. అజయ్ ఆలోచనల్లో పడ్డాడు. చాలాసేపటికి నోరువిప్పాడు – ‘‘ఏంటి పంపించేది? పాస్‌పోర్ట్, వీసా దొరకాలి కదా..’’ ‘‘అంటే.. ఆ అమ్మాయి ఇంకా ఇక్కడే..’’ ఫ్రెండ్ భయపడుతూ కూర్చున్నచోటునే నిలబడి అజయ్‌ని చూస్తూ, సగం మాటే పలికాడు.‘‘మా ఇంట్లోనే.. నా రూమ్ వార్డ్‌రోబ్‌లో ఉంది.’’ అన్నాడు అజయ్. ఫ్రెండ్స్ షాక్‌తో అజయ్‌ను చూస్తూండిపోయారు. పోలీసులు అప్పటికే అమ్మాయిని వెతికే పనిలో పడిపోయారు. హోమ్ మినిష్టర్ తమ్ముడు ఓబుల్‌రెడ్డి ఆ అమ్మాయి ఎక్కడుందో తెలిసేవరకూ స్నానం కూడా చేయనని బురద అంటిన బట్టలనే కట్టుకొని ఉన్నాడు. ఓబుల్‌రెడ్డికి ఆ అమ్మాయంటే పిచ్చి ప్రేమ. అతనొక పేరుమోసిన ఫ్యాక్షనిస్ట్. ఆ అమ్మాయి కోసమే రెండు హత్యలు చేసినవాడు. అలాంటి ఓబుల్‌రెడ్డిని పట్టపగలు నడిరోడ్డు మీద, అదీ కొండారెడ్డి బురుజు దగ్గర ఒక్కదెబ్బతో నేలకొరిగేలా చేశాడు అజయ్. అజయ్ వెనకాలే వెళ్లి నిల్చుంది ఆ అమ్మాయి. పేరు స్వప్న. ఓబుల్‌రెడ్డి ఆమెకు వరుస అవుతాడు. మనసు పడ్డాడు. కానీ ఆమెకు అతనంటే ఇష్టం లేదు. పారిపోవాలి. అమెరికాలో ఉన్న చుట్టాల దగ్గరకు పారిపోవాలి. ఈ ఊరు, ఓబుల్‌రెడ్డి.. అన్నీ దాటుకొని పారిపోవాలి. అజయ్ వెనకాలే నిల్చున్న ఆమెకు అతనొక్కడే ఇప్పుడు ధైర్యం. ఆ ఒక్కడే ఆమెను ఊరు దాటించాలి. అజయ్ ఇల్లు. వార్డ్‌రోబ్‌లో స్వప్న లేదు. అజయ్‌కి భయం పెరిగిపోయింది. పోలీసులకు విషయం తెలిసి ఆమెను తీసుకెళ్లిపోయారా? రూమంతా వెతికాడు. ఇల్లంతా వెతికాడు. పక్కన సందులో, ఇంటి వెనుక.. అంతటా వెతికాడు. స్వప్న చివరికి కనిపించింది.. అజయ్ రూమ్‌లోనే, చిన్న చిన్న బొమ్మల మధ్య బొమ్మలాగా. ఊపిరి పీల్చుకున్నాడు. స్వప్నకి అజయ్ ఇప్పుడొక నమ్మకం. ఆమెను దేశం దాటించగల ఒక్కడు అజయే! అజయ్ స్వప్నకు పాస్‌పోర్ట్ సంపాదించేందుకు కష్టపడుతూనే ఉన్నాడు. అదేమీ చిన్న విషయం కాదు. అదీ స్వప్నను బయటకు తీసుకెళ్లలేని ఈ పరిస్థితుల్లో! స్వప్నకి ఇల్లు గుర్తొచ్చింది. చుట్టూ అజయ్, అతని ఫ్రెండ్స్, అతని చెల్లి ఉన్నా కూడా స్వప్న ఒంటరిగా ఫీలయింది. ఏడ్వడం మొదలుపెట్టింది. అజయ్ ఆమెకు దగ్గరగా వచ్చి కూర్చొని, ‘‘ఇవ్వాళ ఏం వారం?’’ అనడిగాడు. మళ్లీ వెంటనే, చిన్నగా నవ్వి, ‘‘వారాలు, తేదీలు నీకేం గుర్తుంటాయ్! ఇవ్వాళ శుక్రవారం. ఫ్రైడే. సో, ఇవ్వాళ నువ్వు ఏడ్వకూడదు. కావాలంటే రేపు ఏడువు. నిన్న కూడా ఏడ్చినట్టున్నావ్..’’ అన్నాడు. స్వప్న చిన్నగా నవ్వింది. ఆరోజు నుంచీ ఆమెను కాపాడుకోవడంతో పాటు నవ్వించడమూ అజయ్‌తో పాటు అతని ఫ్రెండ్స్ అందరికీ ఒక పని. రోజులు గడుస్తున్నాయి. స్వప్న అమెరికా వెళ్లడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆమెను పట్టుకోవడం పోలీసుల వల్ల కాలేదని ఓబుల్‌రెడ్డి స్వయంగా రంగంలోకి దిగాడు. స్వప్న ఎక్కడుందో వాళ్లకు తెలిసిపోయింది. కానీ అప్పటికే స్వప్నను మరో సేఫ్ ప్లేస్‌కి మార్చాడు అజయ్. ఇప్పుడు ఆ సేఫ్ ప్లేస్లోనుంచి స్వప్నను ఎయిర్‌పోర్ట్‌కు తీసుకెళ్లాలి. ‘‘ఓ పక్క పోలీసులు.. మరోపక్క ఓబుల్‌రెడ్డి మనుషులు.. సిటీ మొత్తం వాళ్లే. మన ఏరియాలో అయితే చెప్పనక్కర్లేదు. ఈ అమ్మాయిని ఇప్పుడు ఎయిర్‌పోర్ట్‌కు కాదు, ముందసలు ఇక్కణ్నుంచి తీసుకెళ్లడమే కష్టం..’’ అజయ్ ఫ్రెండ్ గ్యాంగ్‌లోని ఒకతను మొత్తం సిట్యుయేషన్ చెప్పాడు. అజయ్ కాసేపు ఆలోచించి ఒక ప్లాన్ గీశాడు. ఫ్రెండ్స్‌కి ఆ ప్లాన్ చెప్తూ – ‘‘ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ అమ్మాయి ఇక్కణ్నుంచి బయల్దేరాలి!’’ అన్నాడు. స్వప్నకు మాత్రం తన ప్రపంచం ఇదేనని తెలుస్తోంది. ఆమెకు అజయ్‌ని, ఈ ప్రపంచాన్నీ వదిలిపోవాలని లేదు.‘‘నే వెళ్లిపోతున్నా కదా! బాధగా లేదా?’’ అడిగింది స్వప్న, అజయ్ అన్ని ఏర్పాట్లూ చేస్తూండడం చూసి. ‘‘బాధేముంది?సంతోషించాల్సిన విషయమేగా!’’ ‘‘నాకైతే చాలా బాధగా ఉంది. మిమ్మల్ని, మీ ఇంటిని, ఫ్రెండ్స్‌ని విడిచిపెట్టాలంటే నావల్ల కావడం లేదు.’’ ‘‘అలా అయితే నాక్కూడా బాధగానే ఉంది. నువ్వెళ్లిపోతున్నావ్ కదా.. ఈ ఛేజ్‌లు, టెన్షన్లు, అడ్వెంచర్లు ఇవేవీ ఉండవు. అయినా ఇప్పుడింత టెన్షన్లో ఈ కబుర్లు అవసరమా?’’ అంటూ స్వప్న బ్యాగ్ సర్దినిల్చున్నాడు అజయ్. అజయ్ ప్లాన్‌ను ఫ్రెండ్స్ సరిగ్గా అమలుపరిచారు. స్వప్నను ఎయిర్‌పోర్ట్‌కు తీసుకొచ్చాడు అజయ్. ఇంకాసేపట్లో ఆమె ఎక్కాల్సిన ఫ్లైట్ టేకాఫ్ అవుతుంది. స్వప్న తన అమ్మా, నాన్నలను కూడా కలిసేలా ప్లాన్ చేశాడు అజయ్. స్వప్నకు జాగ్రత్తలన్నీ చెప్పి, బై చెప్పేసి ఇంటికి బయలుదేరుతున్నాడు అజయ్. బండి స్టార్ట్ చేస్తున్నాడు. గట్టిగా కిక్ కొడుతూ బండి స్టార్ట్ చేస్తూ అన్నాడు – ‘‘స్వప్న.. రా కూర్చో!’’. అజయ్ వెనక్కి తిరిగి స్వప్నను చూశాడు. దూరం నుంచి స్వప్న అజయ్‌నే చూస్తూంది. -
అతడే ఆమె సైన్యం
సినిమా వెనుక స్టోరీ - 12 చార్మినార్ దగ్గర కేఫ్‌లో కూర్చుని చాయ్ తాగుతున్నాడు గుణశేఖర్. మద్రాసు నుంచి హైదరాబాద్‌కు సినిమా పని మీద ఎప్పుడొచ్చినా గుణశేఖర్ చార్మినార్ దగ్గరకొచ్చి... ఆ కట్టడం, వాతావరణం చూస్తూ ఓ చాయ్ తాగాల్సిందే. అప్పుడుగాని ట్రిప్ సక్సెస్ అయినట్టు కాదు. గుణశేఖర్ అప్పుడు చెన్నైలో అసిస్టెంట్ డెరైక్టర్. రేపు డెరైక్టరయ్యాక ఈ చార్మినార్ దగ్గరే సినిమా తియ్యాలి. గుణశేఖర్ అలా అనుకోవడం అది ఫస్ట్ టైమ్ కాదు. వందోసారో, నూట పదహారో సారో అయ్యుంటుంది. ‘వెస్ట్ సైడ్ స్టోరీ’... పాపులర్ హాలీవుడ్ మ్యూజికల్ ఫిల్మ్. ఈ సినిమా మీద గుణశేఖర్‌కు లవ్ ఎట్ ఫస్ట్ సైట్. తీస్తే అలాంటి సినిమా తీయాలి. రెండు కుర్ర గ్యాంగ్‌లు... వాటి మధ్య కాంపిటీషన్. ఇక్కడ కూడా గుణశేఖర్ మర్చిపోలేదు... చార్మినార్‌ను. ఆ గ్యాంగ్‌ల మధ్య గొడవను మాత్రం స్ఫూర్తిగా తీసుకొని, తెలుగు నేటివిటీ కథతో చార్మినార్ సాక్షిగా, పాతబస్తీ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా తీస్తే? గుణశేఖర్ రాయడం మొదలుపెట్టాడు. రాస్తూనే ఉన్నాడు. ఎంతకీ తరగదే?! కొన్నేళ్ళ తరువాత... హైదరాబాద్... రామానాయుడు స్టూడియో. ‘చూడాలని వుంది’ రీ-రికార్డింగ్ జరుగుతోంది. దర్శకుడు గుణశేఖర్ ఫుల్ బిజీ. ప్రొడ్యూసర్ అశ్వినీదత్ వచ్చారు. ‘‘సారీ సర్! ఈ రోజు మీ కొత్త సినిమా ఓపెనింగ్‌కి రాలేకపోయాను. వర్క్ బిజీ’’ అంటూ గుణశేఖర్ ఎక్స్ప్లనేషన్. ‘‘ఏం పర్లేదు గుణా’’ అన్నారు అశ్వినీదత్. ‘‘కృష్ణగారబ్బాయ్ మహేశ్‌బాబు ఎలా ఉన్నాడు?’’ ఆసక్తిగా అడిగాడు గుణశేఖర్. ‘‘చాలా బావున్నాడు. నిజంగా ‘రాజకుమారుడు’లాగానే ఉన్నాడు’’ అంటూ పొద్దుటి సినిమా ఓపెనింగ్ గురించి హుషారుగా చెప్పారు అశ్వినీదత్. కారులో ఫొటోషూట్ స్టిల్స్ తెప్పించి, గుణశేఖర్‌కి చూపించారాయన. మహేశ్ ఒక్కో ఫొటో చూస్తుంటే గుణశేఖర్ మైండ్‌లో ఏవేవో ఫ్లాషెస్. చార్మినార్ టాప్ మీద వెన్నెల్లో చందమామను చూస్తూ, సిగరెట్ తాగుతూ ఓ కుర్రాడు. ఆ కుర్రాడు అచ్చం మహేశ్‌బాబులా ఉన్నాడు. నెక్ట్స్ వీక్ వైజయంతి మూవీస్ ఆఫీసు కొచ్చాడు మహేశ్. గుణశేఖర్ అక్కడే ఉన్నాడు. ఇద్దరూ సరదా చిట్‌చాట్. చార్మినార్ బ్యాక్‌డ్రాప్‌లో తాను అనుకుంటున్న స్టోరీలైన్ గురించి చెప్పాడు గుణశేఖర్. మహేశ్ థ్రిల్లయిపోయాడు. ‘‘డెఫినెట్‌గా మనం చేద్దాం సర్! మీరెప్పుడంటే అప్పుడు నేను రెడీ’’ అంటూ ఉత్సాహపడిపోయాడు. ‘మృగరాజు’ ఫ్లాప్. గుణశేఖర్‌కి పెద్ద దెబ్బ. ఆ టైమ్‌లో కూడా గుణశేఖర్ మైండ్‌లో చార్మినారే కనబడుతోంది. ఎస్... ఆ కథకు టైమొచ్చింది. మళ్లీ ఆ కథ మీద కూర్చున్నాడు గుణశేఖర్. ఆ రోజు పేపర్లో బ్యాడ్మింటన్ ప్లేయర్ పుల్లెల గోపీచంద్ ఇంటర్వ్యూ వచ్చింది. వాళ్ల నాన్నగారికి స్పోర్ట్స్ అంటే ఇంట్రస్ట్ లేకపోవడం, గోపీచంద్ ఎన్నో కష్టాలుపడి స్పోర్ట్స్ చాంపియన్‌గా ఎదగడం... ఇదంతా గుణశేఖర్‌కి ఇన్స్పైరింగ్గా అనిపించింది. ఎస్... నా కథలో హీరో కూడా ఇలాంటి వాడే. తండ్రి వద్దంటున్న స్పోర్ట్స్‌లో ఎదగాలనుకుంటాడు. గుణశేఖర్ ఓ నవలలాగా స్క్రిప్టు రాస్తున్నాడు. పేజీలకు పేజీలు... నిర్మాత రామోజీరావు ఆఫీసు... గుణశేఖర్ లైన్ చెబుతుంటే రామోజీ రావు చాలా ఇదైపోయారు. ‘‘చాలా బాగుంది కథ. మనం చేద్దాం. చార్మినార్ని ఇక్కడ ఫిలింసిటీలోనే కన్స్ట్రక్ట్ చేసేద్దాం. ఎన్ని కోట్లు ఖర్చయినా పర్లేదు’’ అని చెప్పేశాడాయన. గుణశేఖర్ ఏళ్లనాటి కల నిజం కాబోతోంది. కానీ అంతలోనే బ్రేక్. రామోజీరావు ప్లేస్‌లో ఎమ్మెస్ రెడ్డి వచ్చారు. ఆయన కూడా యమా ఉత్సాహం. మళ్లీ బ్రేక్. ఏవేవో అవాంతరాలు. పద్మాలయా స్టూడియో... మహేశ్, గుణశేఖర్ ఇద్దరే కూర్చున్నారు. ‘‘నాకు తెలిసి నిర్మాత ఎమ్మెస్ రాజు గారు ఈ ప్రాజెక్ట్‌కి కరెక్ట్’’ మహేశ్‌బాబు ప్రపోజల్. గుణశేఖర్ డబుల్ ఓకే. ఎమ్మెస్ రాజుకి కాల్ వెళ్లింది. ఆయన ‘పద్మాలయా’కొచ్చారు. మహేశ్ డిటెయిల్స్ అన్నీ చెప్పాడు. ‘‘రాజుగారూ! ఈ ప్రాజెక్టు మీకే చేయాలనుకుంటున్నాం. కానీ వన్ కండిషన్. చార్మినార్ సెట్ వెయ్యాలి. ఎందుకంటే రియల్ ‘చార్మినార్’ దగ్గర అన్నాళ్లు షూటింగ్ చేయలేం. ఈ మధ్యే ఎవరో సూసైడ్ చేసుకోవడంతో పైకి కూడా వెళ్లనివ్వడం లేదట’’ చెప్పాడు మహేశ్. ‘‘నేను సెట్ వేయడానికి రెడీ. కానీ నాకు ముందు కథ నచ్చాలి’’ అన్నారు ఎమ్మెస్ రాజు. గుణశేఖర్ కథ చెప్పాడు. ఎమ్మెస్ రాజు ఫుల్ ఖుష్. పేపర్లో అనౌన్స్మెంట్. మహేశ్‌బాబు - గుణశేఖర్ కాంబినేషన్లో ఎమ్మెస్ రాజు సినిమా. ‘యువకుడు’ సినిమాలో భూమిక అప్పుడే ఫ్రెష్‌గా విరబూసిన రోజా పువ్వులా ఉంటుంది. ఆ ఫ్రెష్నెస్సే గుణశేఖర్‌కి నచ్చేసింది. మహేశ్ పక్కన భూమిక ఖరార్. శేఖర్.వి.జోసెఫ్ కెమెరామన్. మ్యూజిక్ డెరైక్టర్ మణిశర్మ. పరుచూరి బ్రదర్స్ డైలాగ్ రైటర్స్. ఆర్ట్ డెరైక్టర్ అశోక్. టీమ్ అంతా ఓకే. ఇక టైటిలే మిగిలింది. ‘అతడే ఆమె సైన్యం’. గుణశేఖర్ ఫస్ట్ నుంచి ఇదే టైటిల్ ఫిక్స్ అయ్యాడు. కానీ ఎవరో రిజిస్టర్ చేసేశారు. ఎంత బతిమాలినా నో చాన్స్. ఇంకో టైటిల్ వెతుక్కోవాల్సిందే. ‘కబడ్డీ’ అని పెడదామా అని ఓ దశలో అనుకున్నారు. ఆఖరికి ‘ఒక్కడు’ అనుకున్నారు. ఒక్కళ్లు కూడా ‘నో’ అనలేదు. హైదరాబాద్ శివార్లలో గోపన్నపల్లెలో రామానాయుడుగారికి పదెకరాల ఖాళీ ల్యాండ్ ఉంది. అక్కడ చార్మినార్ సెట్ వేయాలి. రియల్‌గా చార్మినార్ హైట్ దాదాపు 176 అడుగులు. అందులో చుట్టూ ఉండే నాలుగు మినార్ల హైట్ సుమారు 78 అడుగులు. ఈ కథకు కావాల్సింది ఆ మినార్లే. అంతవరకూ కనబడితే చాలు. కింద నుంచి పైవరకూ అవసరం లేదు. అందుకే కింద బాగా తగ్గించేసి 120 అడుగుల హైట్‌లో సెట్ వర్క్ స్టార్ట్ చేశారు. చార్మినార్, చుట్టూ ఓల్డ్ సిటీ సెటప్... దీనికి అయిదెకరాల ప్లేస్. త్రీ మంత్స్... 300 మంది వర్కర్స్... ఫినిష్ అయ్యేసరికి కోటి డెబ్భై లక్షల బడ్జెట్ తేలింది. ఇంత సెట్లో రోడ్ల సెటప్ లేదు. రోడ్లు కూడా వేయాలంటే బడ్జెట్ ఇంకా పెరిగిపోతుంది. ఆ రోడ్ల వరకూ కంప్యూటర్ గ్రాఫిక్స్‌లో చేయాలని డిసైడైపోయారు. ఓ పక్క సెట్ వర్క్ జరుగుతుంటే మరోపక్క ఇండస్ట్రీలో రకరకాల కామెంట్స్. ‘మృగరాజు’ లాంటి ఫ్లాప్ తీసిన డెరైక్టర్, ‘దేవీపుత్రుడు’ లాంటి ఫ్లాప్ తీసిన ప్రొడ్యూసరూ కలిసి మహేశ్‌తో ఏం సినిమా తీస్తారు? పాపం... మహేశ్ పని గోవిందా! ఇవన్నీ వీళ్లకు వినబడుతూనే ఉన్నాయి. కోపం రాలేదు. ఇంకా కసి పెరిగింది. బ్లాక్‌బస్టర్ తీయాలి. వాళ్ల నోళ్లు మూయించాలి. షూటింగ్ స్టార్ట్. చార్మినార్ సెట్లో షెడ్యూల్. సెట్ నిడివి అర కిలోమీటర్. లైటింగ్ చెయ్యాలంటే 15 జనరేటర్లు కావాలి. మామూలు క్రేన్లు చాలవు. స్ట్రాడా క్రేన్ కావాల్సిందే. కష్టమైనా షూటింగ్ స్పీడ్‌గా జరుగుతోంది. క్లైమాక్స్‌కి మాత్రం చాలా కష్టపడ్డారు. డిసెంబర్ రాత్రిళ్లు... విపరీతమైన చలి... 1000 మంది జూనియర్ ఆర్టిస్టులు... 11 రోజుల షూటింగ్... కబడ్డీ కోసమైతే మహేశ్ నిజం ప్లేయర్‌లానే కష్టపడ్డాడు. ఇంతకు ముందు ఎప్పుడూ కబడ్డీ ఆడింది లేదు. కేవలం ఈ సినిమా కోసం రెండ్రోజులు ట్రైనింగ్ తీసుకున్నాడు. మహేశ్‌కి బూట్లు వేసుకోవడం అలవాటాయె. ఇక్కడేమో బూట్లు లేకుండా ఆడాలి. మోకాళ్లకు దెబ్బలు... విపరీతమైన కాళ్ల నొప్పులు. అయినా భరించాడు. ఎమ్మెస్ రాజుకు ఇలాంటి భారీ వెంచర్లు కొత్త కాదు. కానీ వాటికన్నా భిన్నమైన ప్రాజెక్ట్ ఇది. ఏ మాత్రం తేడా వచ్చినా అవుట్. మొండివాడు రాజు కన్నా బలవంతుడు అంటారు. ఇక్కడ రాజూ ఆయనే. మొండివాడూ ఆయనే. అలా డబ్బులు పోస్తూనే ఉన్నాడు. గుణశేఖర్‌కి ఎంతవరకూ సపోర్ట్‌గా నిలబడాలో అంత వరకూ నిలబడ్డారాయన. ఆ రోజుల్లోనే ఈ సినిమాకు దాదాపు రూ. 13-14 కోట్లు వెచ్చించారు. ఫస్ట్ కాపీ వచ్చింది. ఎమ్మెస్ రాజు, గుణశేఖర్, పరుచూరి బ్రదర్స్ తదితరులు రష్ చూశారు. పరుచూరి బ్రదర్స్‌కు ఎక్కడో ఏదో కొడుతోంది. స్క్రీన్‌ప్లే ఫ్లాష్ బ్యాక్ మోడ్‌లో ఉండటం కరెక్ట్ కాదు. స్ట్రెయిట్ నేరేషన్ చేసేయమన్నారు. వాళ్లకు ‘రష్ కింగ్స్’ అని పేరు. రష్ చూసి బ్రహ్మాండమైన జడ్జిమెంట్ ఇవ్వగలరు. ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్‌తో కూర్చుని 10 నిమిషాల్లో స్ట్రయిట్ నేరేషన్గా మార్చేశాడు గుణశేఖర్. ఇప్పుడందరూ హ్యాపీ. 2003 జనవరి 15. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్... సుదర్శన్ 35 ఎం.ఎం. థియేటర్లో ఫ్యాన్స్‌తో కలిసి మార్నింగ్ షో చూస్తున్నారు సూపర్‌స్టార్ కృష్ణ, మహేశ్‌బాబు, గుణశేఖర్, ఎమ్మెస్ రాజు. ఇంటర్వెల్లోనే రిజల్ట్ తేలిపోయింది. గుణశేఖర్ హ్యాండ్లింగ్ అదుర్స్. ఎమ్మెస్ రాజు మేకింగ్ మార్వలెస్. మహేశ్ కెరీర్లో ఫస్ట్ బ్లాక్‌బస్టర్. అప్పుడు ఆంధ్రాలో కరువు సీజన్. ఇంకోపక్క వరల్డ్‌కప్ హంగామా. ఇండియా ఫైనల్స్‌కు కూడా వెళ్ళింది. ఇంత టెన్షన్ మూమెంట్లో కూడా ‘ఒక్కడు’ క్రియేటెడ్ రికార్డ్స్. వెరీ ఇంట్రెస్టింగ్... * తమిళంలో విజయ్, కన్నడంలో పునీత్ రాజ్‌కుమార్ ఈ సినిమా చేశారు. * ఈ సినిమాతో మహేశ్‌ను హిందీలో లాంచ్ చేద్దామని నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు చాలా ముచ్చటపడ్డారు. కానీ మహేశ్ ఆసక్తి చూపించలేదు. ఆ తర్వాత అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ల కాంబినేషన్లో గుణశేఖర్ దర్శకత్వంలో హిందీలో తీయాలనుకున్నారు అట్లూరి పూర్ణచంద్రరావు. కానీ అదీ కార్యరూపం దాల్చలేదు. ఇటీవలే బోనీకపూర్ తన తనయుడు అర్జున్ కపూర్‌తో ‘తేవర్’గా రీమేక్ చేశారు. - పులగం చిన్నారాయణ -
సూపర్‌స్టార్ ఫ్యామిలీ నుంచి కొత్త వారసుడొస్తున్నాడు!