
MS Raju Says Bhumika Serious On Fighter In Okkadu Shooting: ఒక్కడు, వర్షం, నువ్ వస్తానంటే నేనొద్దంటాన వంటి తదితర బ్లాక్బస్టర్ హిట్స్ ఇచ్చిన ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు. నిర్మాతగా ఎన్నో అవార్డులు అందుకున్న ఆయన 2008లో వచ్చిన 'వాన' సినిమాతో డైరెక్టర్గా మారారు. తర్వాత తూనిగ తూనిగ (2012), డర్టీ హరీ (2020) చిత్రాలతో దర్శకుడిగా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. తాజాగా ఆయన డైరెక్ట్ చేసిన చిత్రం '7 డేస్ 6 నైట్స్'. ఈ మూవీ జూన్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ క్రమంలో ఎంఎస్ రాజు, ఆయన తనయుడు, హీరో సుమంత్ అశ్విన్ ఒక టాక్ షోలో పాల్గొన్నారు. ఈ ప్రోగ్రామ్లో అప్పట్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన భూమిక గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఒక్కడు సినిమా షూటింగ్ సమయంలో ఫైటర్పై భూమిక సీరియస్ అయిందన్న విషయం గురించి హోస్ట్ అడిగాడు. అందుకు సమాధానంగా 'నేను, మహేశ్ బాబు, భూమిక పక్కపక్కన కూర్చున్నాం. ఒక్కసారిగా భూమిక పైకి లేచింది. ఏం తిట్టిందో తెలియదు. ఇంగ్లీషులో ఏదో తిట్టింది. అదేదో భయంకరంగా ఉంది.' అని ఎంఎస్ రాజు తెలిపారు.
చదవండి: పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్.. ఇప్పుడు మరో నటుడితో ప్రేమాయణం
ఆ పాత్ర నాకు నచ్చలేదు.. కానీ ఒప్పుకున్నా: సత్యరాజ్
Comments
Please login to add a commentAdd a comment