Bhumika
-
సమాజానికి ప్రతిబింబం
ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘యుఫోరియా’. ఈ మూవీతో విఘ్నేశ్ గవిరెడ్డి టాలీవుడ్‌కి హీరోగా ఎంట్రీ ఇస్తుండగా, నటి ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. సారా అర్జున్, నాజర్, రోహిత్, లిఖిత యలమంచలి, పృథ్వీరాజ్ అడ్డాల, కల్పలత, సాయి శ్రీనికా రెడ్డి ఇతర పాత్రలు పోషించారు. గుణ హ్యాండ్ మేడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నీలిమ గుణ నిర్మాణంలో గుణశేఖర్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని ప్రకటించి, మహా శివరాత్రి సందర్భంగా ‘యుఫోరియా’ మేకింగ్ వీడియోను విడుదల చేశారు. ‘‘నేటి సమాజాన్ని ప్రతిబింబించేలా ట్రెండీ టాపిక్ నేపథ్యంలో సాగే చిత్రం ‘యుఫోరియా’. ఇప్పటికే విడుదల చేసిన మూవీ టైటిల్ గ్లింప్స్, కాన్సెప్ట్ వీడియో అందర్నీ ఆకట్టుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలనుప్రారంభించాం. త్వరలోనే ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సమర్పణ: రాగిణి గుణ, సంగీతం: కాల భైరవ, కెమేరా: ప్రవీణ్ కె. పోతన్. -
ఫ్యామిలీ ట్రిప్‌లో భూమిక చావ్లా.. శ్రీలంకలో చిల్ అవుతూ! (ఫోటోలు)
-
నాడు చిరంజీవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడో ప్రముఖ లాయర్
'జై చిరంజీవ' చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా వెండితెరకు పరిచయమైన శ్రియా శర్మ గుర్తుందా..? ఆ సినిమాతో ఆమెకు భారీగా అవకాశాలు వచ్చాయి. ఒకే ఒక్క చిత్రంతో ఎనలేని గుర్తింపు తెచ్చుకుంది. దీనికి ప్రధాన కారణం జై చిరంజీవా చిత్రంలో ఆమె మెగాస్టార్‌కు మేనకోడలిగా నటించడమే అని చెప్పవచ్చు. మరుసటి ఏడాదే 'నువ్వు నేను ప్రేమ'(సిల్లును ఒరు కాదల్) మూవీలో యాక్ట్ చేసింది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో బాల నటిగా రాణించింది. 'చిల్లర్ పార్టీ' సినిమాకు గానూ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా జాతీయ అవార్డు అందుకుంది. మహేశ్‌బాబు- శ్రీనువైట్ల కాంబినేషన్లో వచ్చిన దూకుడు మూవీలో సమంత చెల్లెలిగా నటించి ఆకట్టుకుంది. రచ్చ, తూనీగ తూనీగ, ఎటో వెళ్లిపోయింది మనసు చిత్రాల్లో టీనేజ్ గర్ల్‌గా కనిపించింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన జై చిరంజీవ సినిమాలో భూమిక, సమీరారెడ్డి కీలక పాత్రల్లో నటించారు. మెగాస్టార్ మేనకోడలిగా శ్రియా శర్మ నటించింది. తన చిన్ని చిన్ని మాటలతో, చిలిపి చేష్టలతో అలరించిన ఈమె చిరును మావయ్యా.. అంటూ ప్రేమగా పిలిచేది. ఈ మూవీలో చలాకీ నటనతో అందరి మనసులు దోచిన ఈ పాప వయసు ఇప్పుడు 26 ఏళ్లు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా మొదలైన తన ప్రయాణం హీరోయిన్గా తన మొదటి చిత్రం గాయకుడుతో ఎంట్రీ ఇచ్చింది. బిగ్‌బాస్ ఫేం అలీ రెజా ఇందులో హీరోగా నటించాడు. ఇది అంతగా విజయం సాధించలేదు. ఆ తర్వాత శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించిన నిర్మల కాన్వెంట్లో హీరోయిన్గా చేసింది. ఈ సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది కానీ అవకాశాలు మాత్రం పెద్దగా రాలేదు. 2016లో నిర్మలా కాన్వెంట్ రిలీజవగా ఆ తర్వాత మరే సినిమాలో కనిపించలేదు శ్రియా శర్మ. కానీ పలు వాణిజ్య ప్రకటనల్లో కనిపించింది. న్యాయవిద్యను అభ్యసించిన శ్రియా శర్మ ప్రస్తుతం పెద్దపెద్ద కార్పోరేట్ కంపెనీలకు అడ్వకేట్‌గా కొనసాగుతుంది. View this post on Instagram A post shared by Shriya Sharma (@shriyasharma9) -
సల్మాన్ ఖాన్ తో గ్లోబర్ స్టార్ రామ్ చరణ్ లుంగీ డాన్స్
-
తెలుగు + హిందీ = కిసీ కా భాయ్.. సల్మాన్ సరికొత్త ప్రయోగం
-
మహేష్, భూమిక హీరో హీరోయిన్లుగా కొత్త చిత్రం
యువ నటులు మహేష్, భూమిక హీరో హీరోయిన్లుగా ఓ చిత్రం తెరకెక్కుతుంది. సి.హెచ్ సుజాత నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంతో సజ్జా కుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. గోల్డెన్ సినీ క్రియషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1 గా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ గోల్డెన్ టెంపుల్ లో ప్రారంభం అయింది. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ సుజాత మాట్లాడుతూ.. ‘మా బ్యానర్ గోల్డెన్ సినీ క్రియషన్స్ లో ప్రొడక్షన్ నెం.1 చిత్రాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. డైరక్టర్ కుమార్ చెప్పిన కథ నచ్చి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం’అని అన్నారు. ‘మంచి సినిమా చేస్తాడని నిర్మాతలు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకుంటాను’ అని దర్శకుడు కుమార్ అన్నారు. ‘ఈ సినిమాతో సుజాత, కుమార్‌లకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను’అని సీనియర్ ప్రొడ్యూసర్ రామరాజు అన్నారు. షూటింగ్ ప్రారంభోత్సవంలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ శోభన్ బాబు, విలయిల్ ఫిలిప్స్ థామస్ పాల్గొన్నారు. -
భూమిక ఇంగ్లీషులో భయంకరంగా తిట్టింది: నిర్మాత ఎంఎస్ రాజు
MS Raju Says Bhumika Serious On Fighter In Okkadu Shooting: ఒక్కడు, వర్షం, నువ్ వస్తానంటే నేనొద్దంటాన వంటి తదితర బ్లాక్‌బస్టర్ హిట్స్ ఇచ్చిన ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు. నిర్మాతగా ఎన్నో అవార్డులు అందుకున్న ఆయన 2008లో వచ్చిన 'వాన' సినిమాతో డైరెక్టర్‌గా మారారు. తర్వాత తూనిగ తూనిగ (2012), డర్టీ హరీ (2020) చిత్రాలతో దర్శకుడిగా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. తాజాగా ఆయన డైరెక్ట్ చేసిన చిత్రం '7 డేస్ 6 నైట్స్'. ఈ మూవీ జూన్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఎంఎస్ రాజు, ఆయన తనయుడు, హీరో సుమంత్ అశ్విన్ ఒక టాక్ షోలో పాల్గొన్నారు. ఈ ప్రోగ్రామ్‌లో అప్పట్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన భూమిక గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఒక్కడు సినిమా షూటింగ్ సమయంలో ఫైటర్‌పై భూమిక సీరియస్ అయిందన్న విషయం గురించి హోస్ట్ అడిగాడు. అందుకు సమాధానంగా 'నేను, మహేశ్ బాబు, భూమిక పక్కపక్కన కూర్చున్నాం. ఒక్కసారిగా భూమిక పైకి లేచింది. ఏం తిట్టిందో తెలియదు. ఇంగ్లీషులో ఏదో తిట్టింది. అదేదో భయంకరంగా ఉంది.' అని ఎంఎస్ రాజు తెలిపారు. చదవండి: పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్.. ఇప్పుడు మరో నటుడితో ప్రేమాయణం ఆ పాత్ర నాకు నచ్చలేదు.. కానీ ఒప్పుకున్నా: సత్యరాజ్ -
కళ: త్రీ ఇన్ వన్... నెంబర్‌వన్!
కథలు కంచికి పోతాయో లేదో తెలియదుగానీ...కాసేపు ఆలోచిస్తే మన దగ్గరికే నడిచొస్తాయి అని చిత్ర చరిత్ర చెబుతూనే ఉంది. ఒక చిత్రం మొదలు కావాలంటే డైరెక్టర్ బౌండ్ స్క్రిప్ట్‌తో రంగంలోకి దిగుతాడు. ఈ చిత్రం విషయంలో మాత్రం అలా జరగలేదు. ‘ఈ సబ్జెక్ట్ అనుకుంటున్నాను. మీరు మీ అనుభవాలు చెప్పండి చాలు స్క్రిప్ట్ రాసుకుంటాను’ అన్నాడు డైరెక్టర్ దేవాశిష్ మహ్కిజ. అన్నపూర్ణ సోని, భూమిక దూబె, ఈప్సిత చక్రవర్తి... అనే ఈ ముగ్గురు మహిళలు తమ అనుభవాలను చెప్పడమే కాదు రచన సహకారం అందించి, నటించి చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లారు. దేశీయంగానే కాదు, అంతర్జాతీయస్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకున్న లఘు చిత్రం చీపటాకదుంప. 24 నిమిషాల నిడివిగల ఈ హిందీ షార్ట్‌ఫిల్మ్ తెగ నవ్విస్తుంది. అయితే ఇదేమీ హాస్యచిత్రం కాదు. నవ్విస్తూనే ఆలోచనలు రేకెత్తించే చిత్రం. ధర్మశాల ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ చిత్రం ఇటీవల ‘జెండర్ సెన్సిటివిటీ’ అవార్డ్ గెలుచుకుంది. ‘పురుషులు ఇలాంటి దుస్తులు ధరించాలి. స్త్రీలు ఇలాంటి దుస్తులు మాత్రమే ధరించాలి. పురుషుల నడక ఇలా ఉండాలి. స్త్రీల నడక ఇలా మాత్రమే ఉండాలి....’ ఇలా చెప్పుకుంటూ పోతే జాబితాకు అంతు ఉండదు. ‘జెండర్ సెన్సిటివిటీ’ స్పృహతో మన ఆలోచనల్లో రకరకాల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వీటిని ప్రతిబింబించే చిత్రం ఇది. ‘చీపటాకదుంప’ అనేది దాగుడుమూతల్లాంటి ఒక ఆట. ఈ చిత్రానికి మూలస్తంభాలుగా నిలిచిన ముగ్గురు మహిళల గురించి... మధ్యప్రదేశ్‌లోని బర్త్ అనే చిన్న టౌన్‌కు చెందిన అన్నపూర్ణ సోని జబల్పూర్లో మ్యూజిక్కోర్సు చేసింది. సింగింగ్, డ్యాన్సింగ్, స్కిట్, మైమ్...ఇలా ఎన్నో విద్యల్లో ప్రతిభ చూపేది. స్థానిక ‘వివేచన రంగ్మండల్’ అనే నాటక సంస్థలో చేరిన కొత్తలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (ఎన్ఎస్డీ) గురించి గొప్పగా విన్నది. మొదటి ప్రయత్నంలో విఫలమైంది. రెండో ప్రయత్నంలో సీటు గెలుచుకుంది. ఇక ఆమెకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ముంబై యూనివర్శిటీలో మాస్ మీడియాలో పట్టా పుచ్చుకుంది భూమిక దూబె. ఎన్ఎస్డీ స్టూడెంట్. గొప్ప నాటక దర్శకులతో కలిసి పనిచేసింది. ఎన్నో లఘు చిత్రాలలో నటించింది. అవార్డ్లు గెలుచుకుంది. ‘చీపటాకదుంప’ చిత్రానికి దూబె కో–ప్రొడ్యూసర్, కాస్టింగ్ డైరెక్టర్. ‘నా మీద నాకు నమ్మకాన్ని, ఉత్సాహాన్ని పెంచిన చిత్రం ఇది’ అంటున్న భూమిక దూబె మరిన్ని ప్రయోగాత్మక చిత్రాల్లో నటించాలనుకుంటోంది. ఈప్సిత చక్రవర్తి నటిగానే కాదు స్క్రీన్ రైటర్‌గా కూడా పేరు తెచ్చుకుంది. ఎన్ఎస్డీ స్టూడెంట్. కథలు, నవలలను నాటకాలుగా మలచడం అంటే ఇష్టం. విలియమ్ షేక్స్పియర్ ‘ఎ మిడ్నైట్ సమ్మర్ డ్రీమ్’ను ‘కసుమాల్ సప్నో’గా స్థానికీకరించి రాజస్థాన్‌లో ఇచ్చిన ప్రదర్శనకు అనూహ్యమైన స్పందన వచ్చింది. ‘ఉజాగర్ డ్రామటిక్ అసోసియేషన్’ (ముంబై) అనే థియేటర్ గ్రూప్ వ్యవస్థాపకురాలు. తాజా విషయం ఈ ముగ్గురు ‘చీపటాకదుంప’ దగ్గర మాత్రమే ఆగిపోవాలనుకోవడం లేదు. మహిళలకు సంబంధించిన విభిన్న కోణాలకు కళారూపం ఇవ్వడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఒక్కరి ఆలోచనలు బాగుంటాయి. ఆ ఒక్కరికి మరో ఇద్దరి ఆలోచనలు తోడైతే మరీ బాగుంటాయి అని చెప్పడానికి సంశయం ఎందుకు! -
చెన్నై నుంచి హైదరాబాద్‌కు బైక్‌పై వచ్చేవాణ్ణి
‘జీవితం అంటే ఏంటి? మన లక్ష్యాలను చేరుకునేందుకు ఎంతలా కష్టపడాలి? అనేది ‘ఇదే మా కథ’ చిత్రంలోని సందేశం’’ అని శ్రీకాంత్ అన్నారు. సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమిక, తాన్యా హోప్ ముఖ్య పాత్రల్లో గురు పవన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇదే మా కథ’. జి. మహేష్ నిర్మించిన ఈ సినిమా శనివారం విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ– ‘‘అనుకోకుండా కలిసే నలుగురు బైక్ రైడర్స్ వారి కష్టాలను ఎలా పంచుకున్నారు? ఎలా పరిష్కరించుకున్నారు? అన్నది ‘ఇదే మా కథ’లో ఆసక్తిగా ఉంటుంది. ఇందులో మహేంద్ర పాత్ర చేశాను. 24 ఏళ్ల క్రితం మిస్ అయిన అమ్మాయిని కలుసుకునేందుకు లడఖ్‌కి వెళ్లే పాత్ర నాది. బైక్‌లోనే ఎందుకు వెళ్తాడు? అనేదానికి కూడా ఓ కథ ఉంటుంది. కులుమనాలి నుంచి లడఖ్ వరకు బైక్ మీద షూటింగ్ చేశాం. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో బైక్ మీదే తిరిగేవాణ్ణి. చెన్నై నుంచి హైదరాబాద్‌కు కూడా బైక్ మీదే వచ్చేవాణ్ణి. మామూలుగా బైకర్స్ అంతా ఢిల్లీలో కలుస్తుంటారు. ఈ గ్రూపుల్లో కలిసినవాళ్లు జీవితాంతం ఫ్రెండ్స్‌గా ఉంటుంటారు. వారి జీవిత కష్టాలను కూడా ఈ సినిమాలో చూపించాం’’ అన్నారు. ‘‘సాయితేజ్ క్షేమంగా ఉన్నారు. ఈ రోజు (గురువారం) కూడా తనతో మాట్లాడాను. తను నటించిన ‘రిపబ్లిక్’ పెద్ద హిట్టవ్వాలి’’ అన్నారు శ్రీకాంత్. -
బంగార్రాజు సినిమాలో భూమిక నెగెటివ్ రోల్!
నాగార్జున హీరోగా కల్యాణ్‌కృష్ణ కురసాల దర్శకత్వంలో రూపొందిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ (2016) చిత్రం సూపర్‌హిట్ సాధించింది. ఈ సినిమాలో నాగార్జున పోషించిన బంగార్రాజు క్యారెక్టర్ ఆడియన్స్‌ను బాగా మెప్పించింది. దీంతో నాగ్, కల్యాణ్ కలిసి ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాకు ప్రీక్వెల్‌గా ‘బంగార్రాజు’ సినిమా చేయనున్నారు. ఈ సినిమాలోని ఓ కీలక పాత్రను భూమిక చేయనున్నారట. ఈ పాత్రకు నెగటివ్ షేడ్స్ ఉంటాయని సమాచారం. కాగా నాగార్జున హీరోగా, బాలీవుడ్ నటి దియా మీర్జా హీరోయిన్గా నటించిన చిత్రం ‘వైల్డ్ డాగ్’. ఈ చిత్రంతో అహిషోర్ సాల్మోన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సయామీ ఖేర్, అతుల్ కులకర్ణి, అలీ రెజా, రుద్ర ప్రదీప్ ఇతర పాత్రల్లో నటించారు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 2న విడుదలకానుంది. చదవండి: తెలంగాణ పోరిలా నటించి మెప్పిస్తోందీ హీరోయిన్ -
అలా పిలిస్తే కూత ఆగిపోద్ది!
‘‘నన్నెవడైనా అలా (రేయ్ కార్తి) పిలవాలంటే ఒకటి మా ఇంట్లో వాళ్లు పిలవాలి.. లేదా నా పక్కనున్న ఫ్రెండ్స్ పిలవాలి.. ఎవడు పడితే వాడు పిలిస్తే వాడి కూత ఆగిపోద్ది’.. ‘కబడ్డీ మైదానంలో ఆడితే ఆట.. బయట ఆడితే వేట’ అంటూ గోపీచంద్ చెప్పే డైలాగ్స్‌తో ‘సీటీమార్’ టీజర్ విడుదలైంది. ‘గౌతమ్‌నంద’ చిత్రం తర్వాత హీరో గోపీచంద్, డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘సీటీమార్’. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్‌ని సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ సంపత్ నంది మాట్లాడుతూ– ‘‘కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కుతోన్న స్పోర్ట్స్ యాక్షన్ మూవీ ఇది. మీకు తప్పకుండా నచ్చుతుంది’’ అన్నారు. తమన్నా, భూమిక, దిగంగనా సూర్యవంశీ, పోసాని కృష్ణమురళి, రావు రమేష్, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఎస్. సౌందర్ రాజన్, సంగీతం: మణిశర్మ. -
అందరి కథ
రోడ్డు ప్రయాణం నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇదే మా కథ’. (రైడర్స్ స్టోరి అనేది ఉపశీర్షిక). సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమిక, తాన్యా హోప్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. గురుపవన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్. సుబ్రహ్మణ్యం ఆశీస్సులతో మనోరమ గురప్ప సమర్పణలో గురప్ప పరమేశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై జి.మహేష్ నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ‘ఇదే మా కథ’ ఫస్ట్ లుక్ పోస్టర్ని విడుదల చేశారు. గురుపవన్ మాట్లాడుతూ– ‘‘నేను రైడర్ని. అందుకే ఆ నేపథ్యంలో కథ రాశా. డిసెంబర్లో షూటింగ్ పూర్తి చేస్తాం’’ అన్నారు. ‘‘ఇది మనందరి కథ. చాలా ఎమోషన్స్‌తో ట్రావెల్ అయ్యే స్క్రిప్ట్’’ అన్నారు జి.మహేష్. శ్రీకాంత్ మాట్లాడుతూ– ‘‘చిన్నప్పుడు చాలాసార్లు రైడింగ్‌కి వెళ్లాను. ఒకసారి హైదరాబాద్ నుండి లడక్‌కి కారులో వెళ్లాను. ఇప్పుడు ఈ టీమ్‌తో లడక్ వెళ్లడం ఒక మంచి అనుభూతి’’ అన్నారు. ‘‘బైక్ రైడింగ్ అంటే ఇష్టం కానీ నేను ప్రొఫెషనల్ రైడర్ని కాదు. గురుపవన్ నాకు శిక్షణ ఇచ్చారు’’ అన్నారు సుమంత్ అశ్విన్. ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చిరంజీవి ఎల్. -
రోడ్డు ప్రయాణం
‘‘చాలా రోజుల తర్వాత సినిమా సెట్స్‌పైకి వచ్చాను. త్వరలో మీ అందర్నీ తెరపై కలుసుకుంటాం’’ అని భూమిక అన్నారు. సుమంత్ అశ్వి¯Œ , శ్రీకాంత్, భూమిక, తాన్యా హోప్ ప్రధాన పాత్రల్లో ఓ సినిమా రూపొందుతోంది. గురుపవన్ దర్శకత్వంలో జి. మహేష్ నిర్మిస్తున్నారు. లాక్డౌన్ తర్వాత గురువారం పునఃప్రారంభమైన షూటింగ్లో భూమిక జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘నాలుగు పాత్రల చుట్టూ నడిచే రోడ్ జర్నీ కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. లాక్‌డౌన్‌కు ముందుగానే లడఖ్ షెడ్యూల్‌తో సహా 50 శాతం చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ షూటింగ్ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘భూమిక, శ్రీకాంత్ లాంటి సీనియర్ యాక్టర్లతో కలిసి పనిచేయడం గౌరవంగా భావిస్తున్నా’’ అన్నారు సుమంత్ అశ్విన్. ‘‘ఏడు నెలల తర్వాత మళ్లీ షూటింగ్‌కు రావడం హ్యాపీ’’ అన్నారు శ్రీకాంత్. ఈ చిత్రానికి కెమెరా: సి. రామ్‌ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చిరంజీవి ఎల్, సంగీతం: సునీల్ కశ్యప్. -
సుశాంత్ చాలా హుందాగా ప్రవర్తించేవాడు
‘ఎం.ఎస్. ధోనీ’ చిత్రంలో సుశాంత్‌కి అక్క పాత్ర చేశారు... తన మృతి గురించి తెలిసి... (మధ్యలో అందుకుంటూ)... షాకయ్యాను. నేను వార్తలు చూడలేదు. ఫోన్లో వాట్సప్ మేసేజ్ ద్వారా తెలుసుకున్నాను. సుశాంత్ అలా ఎందుకు చేశాడో అర్థం కావడం లేదు. చిన్న వయసులోనే ఓ ప్రతిభా వంతుడైన యాక్టర్ మనకు దూరం కావడం చాలా బాధాకరం. ► ఆ సినిమా సెట్లో సుశాంత్ డల్‌గా ఉన్న సందర్భాలు కానీ లేదా అతనిలో కుంగుబాటుకు సంబంధించిన లక్షణాలేమైనా కనిపించాయా? సుశాంత్, నేను 9 నుంచి 10 రోజులు మాత్రమే కలసి పని చేశాం. సుశాంత్ చాలా మంచి నటుడు. ఏ సన్నివేశంలోనైనా సుశాంత్ బాగా నటించగలడని నాకు అనిపించింది. కష్టమైన సీన్స్‌కు కూడా పెద్దగా టైమ్ తీసుకునేవాడు కాదు. సెట్లో కొన్నిసార్లు మేడమ్ అని, కొన్నిసార్లు అక్కా అని పిలిచేవాడు. సెట్లో అందరితోనూ హుందాగా ప్రవర్తించేవాడు. నైస్ పర్సన్. మెచ్యూర్డ్. కాకపోతే కాస్త రిజర్డ్వ్‌గా ఉండేవాడు. ► ఈ మధ్య సుశాంత్‌తో మాట్లాడారా? లేదు. అయితే అతన్ని ట్వీటర్లో ఫాలో అవుతున్నాను. కొన్నిసార్లు ట్వీటర్లో అంత యాక్టివ్‌గా కూడా ఉండడు. ఏడాది క్రితం అనుకుంటా.. ట్వీటర్‌కి దూరం అవుతున్నట్లు పేర్కొన్నాడు. ఆ తర్వాత నుంచి ట్వీటర్లో కూడా తనతో టచ్‌లో లేను. ► జీవితాన్ని డీల్ చేయలేని స్థితిలో సుశాంత్ ఉన్నారని అనుకుంటున్నారా? అంత దూరం తన గురించి తెలియదు. అయితే మనందరి జీవితాల్లోనూ ఎత్తుపల్లాలు ఉంటాయి. మనం మానసికంగా బలహీనంగా ఉన్నప్పుడు బంధువులతోనో, మిత్రులతోనే మాట్లాడాలి. అప్పుడు మనం ఆ స్థితి నుంచి బయటకు వస్తాం. ► సుశాంత్‌లా కొందరు యువనటీన టులు ఆత్మహత్య చేసుకున్నారు... యంగ్‌స్టర్స్‌కి మీ సందేశంగా ఏం చెబుతారు? మన జీవితాల్లోని అన్ని రోజులూ ఒకేలా ఉండవు. కష్టనష్టాలు ఉంటాయి. యంగ్‌స్టర్స్ డిప్రెషన్లోకి వెళ్లకుండా ఉండాలంటే ఎక్కువగా ఒంటరిగా గడపకూడదు. స్నేహితులు, బంధువులు, తల్లిదండ్రులతో వారి సమస్యలను డిస్కస్ చేయాలి. పరిష్కారం ఆలోచించాలి. మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పక్కవారి సాయం తీసుకోవచ్చు.. తప్పేం లేదు. ► కష్టాలు చెప్పుకునే వ్యక్తి ఒక్కరు కూడా లేనివాళ్లు ఏం చేయాలి? కొన్నేళ్ల క్రితం ఇలాంటి టాపిక్ ఒకటి వస్తే.. నా దగ్గర ఒక వ్యక్తి ఇలా చెప్పారు. ‘మనసు బాగాలేనివాళ్లు దేని మీదా దృష్టి పెట్టరు. అయితే రెగ్యులర్‌గా చేసినట్లే ప్రతి రోజూ స్నానం చేయాలి.. వ్యాయామం చేయాలి.. ప్రార్థించాలి. రోజులో 45 నిమిషాలు ఇంట్లో కాకుండా బయట గడపాలి. అప్పుడు వాళ్ల మనసు కొంచెం తేలిక అవుతుంది’ అని. ఇలా చేయడం వల్ల ఒకే విషయం మీద దృష్టి మళ్లకుండా కొంచెం మనసుని డైవర్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సుశాంత్‌కి ప్రముఖుల నివాళి సుశాంత్ మంచి ప్రతిభావంతుడు. చాలా తొందరగా వెళ్లిపోయాడు. – మహేశ్‌బాబు చాలా తొందరగా ఓ గొప్ప ప్రతిభావంతుణ్ణి కోల్పోయాం. – ఎన్టీఆర్ నటుడిగా ఉన్నత స్థాయికి వెళ్లాల్సిన సుశాంత్ ఇంత తొందరగా మరణించాడని తెలిసి షాకయ్యాను. – రామ్‌చరణ్ కెరీర్లో చాలా దూరం ప్రయాణించాల్సిన సుశాంత్ ఇంత తొందరగా మనల్ని వదిలి వెళ్లడం బాధగా ఉంది. – ప్రకాశ్‌రాజ్ ‘చిచోరే’ సినిమా సెట్స్‌లో సుశాంత్‌ని కలిశాను. సినిమా పూర్తయ్యేసరికి తను నాకో బ్రదర్‌లా దగ్గరయ్యాడు. హిందీలో నాకది మొదటి సినిమా అయినా ఆ భావనను తను ఎప్పుడూ నాకు కలిగించలేదు. నేను నా సోదరుడిని మిస్ అవుతున్నాను. – నవీన్ పొలిశెట్టి వ్యక్తిగతంగా సుశాంత్ నాకు తెలియదు. కానీ అతని సినిమాలు చూస్తే నాకు అర్థమయ్యింది. అతను ఎంత మంచి నటుడో. ఎవరి హృదయంలో ఏ బాధ దాగి ఉందో కనిపెట్టలేం. మానసికంగా ఎవరైనా బలహీనంగా ఉంటే దయచేసి మీ బంధువులు, మిత్రులు, తల్లిదండ్రులు.. ఇలా మీరు నమ్మకం ఉంచిన ఎవరితోనైనా సరే మీ భావాలను పంచుకుని మీ బాధను తగ్గించుకోండి. – అనిల్ కపూర్ సుశాంత్ నన్ను చాలా ఇష్టపడే వ్యక్తి. యాక్టింగ్‌లో అతని ఎనర్జీ, అందమైన చిరునవ్వు బాగుంటాయి. సుశాంత్ మరణం నన్ను బాధించింది. బాగా మిస్ అవుతున్నాను. – షారుక్ ఖాన్ సుశాంత్ మరణవార్త విని షాకయ్యాను. మాటలు రావడం లేదు. మంచి ప్రతిభావంతుడ్ని కోల్పోయాం. – అక్షయ్ కుమార్ ‘సోంచరియా’ చిత్రం కోసం అతనితో కలిసి నటించిన రోజులు ఇంకా నా కళ్ల ముందే కదులుతున్నాయి. మా ఇంట్లో నా చేతి వంట తినాలని సుశాంత్ నాతో ఓ సందర్భంలో చెప్పాడు. అది నెరవేరనందుకు బాధగా ఉంది. – మనోజ్ భాజ్‌పాయ్ గత ఏడాదిగా నీతో నేను సరిగా టచ్‌లో ఉండనందుకు నన్ను నేను నిందించుకుంటున్నాను. నీ భావాలను పంచుకునేందుకు నీ జీవితంలో ఎవరైనా ఉంటే బాగుండేదని అనుకున్నాను. – కరణ్ జోహార్ మంచి నటుడు, నా స్నేహితుడిని కోల్పోయాను. – నవాజుద్దీన్ సిద్ధిఖీ ‘ధోని’ సినిమా షూటింగ్లో నీతో (సుశాంత్) గడిపిన సరదా సంఘటనలు నాకు గుర్తుకొస్తున్నాయి. అవి జ్ఞాపకాలుగా ఉండిపోతాయి. నీ మరణం నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. – కియారా అద్వానీ నేను హీరోయిన్గా నటించిన నా తొలి సినిమాలో సుశాంత్ నా కో స్టార్. సుశాంత్ మరణ వార్త విని నా హృదయం బద్దలైంది. – వాణీకపూర్ మరికొందరు సెలబ్రిటీలు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మరణంపై స్పందించి, అతని ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. -
కంటిని నమ్మొద్దు
రెండేళ్ల క్రితం నాని ‘ఎమ్సీఏ’ (మిడిల్‌క్లాస్ అబ్బాయి) చిత్రంతో ఫుల్‌లెంగ్త్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్‌ను స్టార్ట్ చేశారు భూమిక. గత ఏడాది తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం ‘యు–టర్న్’, ‘సవ్యసాచి’ చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించారు. ఇప్పుడు మళ్లీ తమిళంలో మరో సినిమా చేయడానికి అంగీకరించారు. ఉదయనిధి స్టాలిన్ హీరోగా తమిళంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కన్నై నంబాదే’. (కంటిని నమ్మొదు అని అర్థం) మారన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ఆత్మిక కథానాయికగా నటిస్తున్నారు. ఈ థ్రిల్లింగ్ మూవీలోనే ఓ కీలక పాత్ర చేయనున్నారు భూమిక. ‘‘సినిమాలో మంచి ఎమోషనల్ కంటెంట్ ఉంది. సినిమాకు భూమిక పాత్ర హైలైట్‌గా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమా కాకుండా మరికొన్ని సినిమాలకు భూమిక కథలు వింటున్నారట. -
పట్టా పుచ్చుకున్న తెనాలి రామకృష్ణ
సందీప్ కిషన్ ఫుల్లుగా నవ్వించడానికి రెడీ అయ్యారు. మరి.. సినిమా టైటిల్ ‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్’ అంటే నవ్వులే నవ్వులు కదా. సందీప్, హన్సిక జంటగా సోమవారం ఈ సినిమా హైదరాబాద్‌లో మొదలైంది. జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో భూమిక ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. శ్రీ నీలకంఠేశ్వర స్వామి క్రియేషన్స్ పై ఇదుమూరి శ్రీనివాసులు సమర్పణలో అగ్ర హారం నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత అనిల్ సుంకర క్లాప్ ఇవ్వగా, మరో నిర్మాత భోగవల్లి ప్రసాద్ స్క్రిప్ట్ అందజేశారు. ‘‘రెగ్యులర్ షూటింగ్‌ని జనవరిలో ప్రారంభిస్తాం. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు నిర్మాతలు. మురళీ శర్మ, వరలక్ష్మీ శరత్‌కుమార్, వెన్నెల కిశోర్ తదితరులు నటించనున్న ఈ చిత్రానికి సంగీతం: శేఖర్ చంద్ర,కెమెరా: శ్యామ్ కె. నాయుడు, కథ–స్క్రీన్‌ప్లే: రాజసింహ టి., స్క్రీప్లే: విక్రమ్రాజ్, గోపాలకృష్ణ, మాటలు: నివాస్, భవానీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సీతారామరాజు మల్లెలు, కో–ప్రొడ్యూసర్: రూప జగదీష్, మహేశ్వర రెడ్డి. -
వెలుగుతున్న క్యారెక్టర్లు
కొన్ని క్యారెక్టర్లు వెన్నముద్దల్లా తెల్లటి కాంతిలీనుతాయి.కొన్ని క్యారెక్టర్లు కలర్ అగ్గిపుల్లల్లా రంగులు చిమ్ముతాయి. కొన్ని పాముబిళ్లల్లా పైకి లేస్తాయి. కొన్ని విష్ణుచక్రాల్లా గిర్రున తిరిగి... భూచక్రాల్లా నేలంతా దున్ని...ఢామ్ ఢామ్మున పేలే హీరో హీరోయిన్లతోపాటు ఇలాంటి క్యారెక్టర్లూ ఉంటేనే దీపావళి. 2018 కొందరికి బెస్ట్ క్యారెక్టర్లు ఇచ్చి బ్లెస్ చేసింది. బ్రైట్‌గా వెలిగించింది. ఇదిగోండి ఆ బ్రైట్ స్టోరీ. సినిమా అంటేనే దీపావళి. తెర మీద వెలుగుల ఝరి. ప్రేక్షకుడిని ఎంటర్టైన్ చేయడానికి దర్శక– నిర్మాతలు నటీనటులు, సాంకేతిక నిపుణులు అనే మందుగుండు సామగ్రిని తీసుకొని చీకటి నిండిన సినిమా హాళ్లలో వెలుగును నింపే ప్రయత్నం చేస్తుంటారు. సినిమా బాగా వెలగాలంటే హీరో అనే టెన్ థౌజండ్ వాలా, హీరోయిన్ అనే ఆకాశజువ్వతో పాటు సపోర్టు కోసం కాకరపువ్వొత్తులు, మతాబులు, భూచక్రాలు వంటి క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉండాల్సిందే. హీరో హీరోయిన్ల గురించి ఎప్పుడూ మాట్లాడుకుంటూనే ఉంటాం. కానీ ఈసారి క్యారెక్టర్ ఆర్టిస్టులుగా వెలిగినవారిని చర్చిద్దాం. ఈ సంవత్సరం మంచి పాత్రలు చేసి నేల టపాకాయల్లా పేలి సందడి చేసిన వారు వీరంతా. వీళ్లు నవ్వించారు. ఏడ్పించారు. ఆలోచింప చేశారు. సినిమాలకు బలం చేకూర్చారు. కథకు ఒక క్యారెక్టర్ తెచ్చిన క్యారెక్టర్ ఆర్టిస్టులు వీరు. భూమిక చక్రం ‘అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా’... అని కుర్రకారు భూమిక అందానికి ఐస్ అయ్యారు గతంలో. ‘ఒక్కడు’, ‘సింహాద్రి’, ‘వాసు’, ‘జై చిరంజీవ’ వంటి హిట్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి. ‘అనసూయ’ వంటి థ్రిల్లర్‌ను ఒంటి చేత్తో సక్సెస్ చేసిన నటి ఆమె. పెళ్లి తర్వాత కొన్నాళ్లు విరామం తీసుకున్నా తెలుగు ప్రేక్షకులు ఆమెను మర్చిపోలేదు. అందుకే నాని ‘ఎంసీఏ’తో కమ్‌బ్యాక్ ఇస్తే చప్పట్లు కొట్టారు. ఆ సినిమాలో భూమిక సీరియస్‌గా ఉండే ఆఫీసర్‌గా, మరిదిని అభిమానంగా చూసుకునే వదినలా నటించి మెప్పించారు. ఆమె ఇమేజ్ ఆ క్యారెక్టర్‌కు బలం అయ్యింది. ఆ తర్వాత ‘యూ టర్న్’లో ఘోస్ట్ పాత్రను పోషించారామె. తన జీవితాన్ని, తన బిడ్డ జీవితాన్ని కోల్పోయిన దుఃఖంలో దెయ్యంగా మారి ఆమె దుర్మార్గులను శిక్షిస్తారు. తాజాగా ‘సవ్యసాచి’లో నాగచైతన్య అక్క పాత్రను పోషించారు. భూచక్రం తక్కువ సేపు తిరిగినా ఎక్కువ స్పీడుతో వెలుగుతుంది. తాను ఉన్నది తక్కువ సేపే అయినా సినిమాలకు కావలసినంత వెలుగు ఇస్తున్నారు భూమిక. రావు రాకెట్ ‘వాణ్ణలా వదిలేయకండిరా... ఎవరికన్నా చూపించండిరా’ అనే రావు రమేష్ డైలాగ్ పెద్ద హిట్. ఇప్పుడు ఆయన తోటి నటులు తెర మీద ఆయన పండిస్తున్న పాత్రలను చూసి ‘అతడలా రెచ్చిపోతుంటే వదిలేయకండిరా... ఎలాగైనా ఆపండిరా’ అని అనుకుంటూ ఉంటారు. తండ్రి రావుగోపాలరావు పెద్ద నటుడే అయినా ఆ పేరు కంటే తన టాలెంటే ఎక్కువ ఉపయోగపడింది రావు రమేష్‌కు. ‘కొత్త బంగారు లోకం’, ‘పిల్ల జమీందార్’, ‘అత్తారింటికి దారేది’ సినిమాల్లో ఆయన వేసిన క్యారెక్టర్లు మెరిశాయి. ఆయన్నే దృష్టిలో పెట్టుకుని ‘సినిమా చూపిస్త మావా’ వంటి కథలు రాసుకున్నారు. ఈ ఏడాది ‘అజ్ఞాతవాసి’లో విలనిజమ్‌తో నవ్వులు పూయించి, ‘ఛల్ మోహన్ రంగా’, ‘రాజుగాడు’, ‘దేవదాస్’ సినిమాలతో ఎట్రాక్ట్ చేసి, నటుడిగా రాకెట్ వేగంలో దూసుకెళుతున్నారు. ‘ఆర్ఎక్స్ 100’, ‘అరవింద సమేత’ సినిమాల్లో ఆయన పాత్రలు ఆ సినిమాలకు కీలకంగా మారాయి. . ఇప్పుడీ బాంబుని తమిళనాడు దర్శకులు దిగుమతి చేసుకోవడానికి శ్రద్ధ చూపిస్తున్నారు. ‘సాగసం’ అనే తమిళ చిత్రంలో రావు రమేశ్ విలన్‌గా నటిస్తున్నారు. నవ్వుల మతాబు జంధ్యాల వెలిగించిన నవ్వుల మతాబు నరేశ్. ‘శ్రీవారికి ప్రేమలేఖ’, ‘చిత్రం భళారే విచిత్రం’ వంటి సూపర్‌హిట్ కామెడీ సినిమాలు నరేశ్ ఖాతాలో ఉన్నాయి. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారాక కొంతకాలం ఆయన స్ట్రగుల్ అయినా రెండు మూడేళ్లుగా ఆయన కెరీర్ గ్రాఫ్ చాలా ఉత్సాహకరంగా ఉంది. ఈ ఏడాది ఎక్కువ శాతం నవ్వులు పూయించిన నటుడు నరేశ్ అనే అనొచ్చు. ‘సమ్మోహనం’ చిత్రంలో నట పిచ్చి ఉన్న హౌస్ ఓనర్ పాత్రలో నరేశ్ పేల్చిన నవ్వులకు థియేటర్ పకపకలాడింది. ‘ఛలో’, ‘తొలిప్రేమ’, ‘ఛల్‌మోహన్ రంగ’, ‘దేవ దాస్’, ‘అరవింద సమేత’లో ఆయన చేసిన పాత్రలన్నీ అలరించాయి. కేవలం నవ్వించడమే కాకుండా ‘రంగస్థలం’ సినిమాలో ఎమోషనల్ సీన్స్ చేసి ఆడియన్స్ కళ్లలో నీళ్లు తెప్పించారు నరేశ్. బిజీ బాంబ్ ఈ ఏడాది దాదాపు రెండు నెలలకోసారి స్క్రీన్ మీద కనిపించిన బాంబు మురళీ శర్మ. ఈ బాంబుని ఒక్కో దర్శకుడు ఒక్కోలా స్క్రీన్ మీద పేల్చారు. జనవరి టు నవంబర్ సుమారు పది సినిమాల్లో వెలుగు నింపారు మురళీ శర్మ. ‘అజ్ఞాతవాసి’లో కామెడీ శర్మగా, ‘భాగమతి’, ‘టచ్ చేసి చూడు’ చిత్రాల్లో పోలీస్ ఆఫీసర్‌గా, ‘అ!’ చిత్రంలో మాంత్రికుడిగా, ‘విజేత’ సినిమాలో బాధ్యతగల తండ్రిగా, ‘శైలజా రెడ్డి అల్లుడు’, ‘దేవదాస్’ చిత్రాల్లోనూ మెప్పించారు. ఈ ఏడాది ఎక్కువగా దర్శక– నిర్మాతలు పేల్చిన టపాసుల్లో మురళీ శర్మ ఒకరు. – ఇన్పుట్స్: గౌతమ్ మల్లాది మా అమ్మ నా టార్చ్ బేరర్ ‘డీజే’లో రొయ్యలనాయుడు పాత్రను చూసి మా అమ్మగారు.. ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మీ నాన్న గారు చేసిన పాత్రను కంటిన్యూ చేసి శభాష్ అనిపించుకున్నావు. ఇక నీకు తిరుగులేదు’ అన్నారు. ఆ రోజు ఆమె ఆనందాన్ని చూసిన నేను ‘ఇక చాలు’ అనుకున్నాను. నా డైరెక్టర్స్ ఎన్నో మంచి పాత్రలను నాకిచ్చి ప్రోత్సహించారు. ‘అ ఆ’ చిత్రంలోని క్లైమాక్స్ చేసినప్పుడు దర్శకుడు త్రివిక్రమ్‌గారు ‘ఇది ఐకానిక్ సీన్ అవుతుందండి’ అన్నారు. ‘శత్రువులు ఎక్కడో ఉండరు.. మనతో పాటే మన చెల్లెళ్ల రూపంలో, కూతుళ్ల రూపంలో మన మధ్యే తిరుగుతుంటారు’ అన్న తర్వాత ‘ఇప్పుడేం చేద్దాం అంటే.. చేసేదేముంది ఇక పిసుక్కోవటమే..’ అనే సీన్లోని డైలాగ్ ఇది. ఇప్పటికీ ఎక్కడికెళ్లినా అందరూ పిసుక్కోవటమే అంటూ నేను చెప్పిన డైలాగ్‌ను నాకే చెప్తుంటారు. అలాగే శ్రీకాంత్ అడ్డాల అన్ని సినిమాల్లోనూ చాలా మంచి రోల్స్ చేశాను. హరీష్ శంకర్ తన సినిమాలలో చాలా స్పెషల్‌గా క్యారెక్టర్‌ను నా కోసం తయారు చేస్తారు. ఒక నటుడికి ఇంత కన్నా ఆనందం ఏముంటుంది. – రావు రమేశ్ డబుల్ సౌండ్ బాంబు హీరోగా తెలుగు, తమిళ రాష్ట్రాల్లో డబుల్ సౌండ్ చేస్తున్న నటుడు ఆది పినిశెట్టి. ఈ ఏడాది ‘రంగస్థలం’, ‘యు టర్న్’ సినిమా విజయాలలో భాస్వరం వత్తిలా కీలక పాత్రలు పోషించారు.. ‘రంగస్థలం’లో ఆయన మరణాన్ని చూసి రెండు తెలుగు రాష్ట్రాలు కళ్లల్లో నీళ్లు నింపుకున్నాయి. ‘యు టర్న్’లో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తుంటే జరుగుతున్న హత్యలను ఇతను ఛేదించగలడు అని ధైర్యం తెచ్చుకుంది. హ్యాపీ స్పేస్‌లో ఉన్నాను ఎన్ని పాత్రలు చేసినా ఆర్టిస్ట్ ఆకలి అనేది తీరదు. వచ్చిన పాత్రను సంతృప్తికరంగా చేయడంతో పాటు ఇంతకు ముందు రిపీట్ అయినట్టు కాకుండా చేసేందుకు జాగ్రత్త పడుతుంటాను. 2018 చాలా సంతృప్తికరమైన సంవత్సరం. సాధారణంగా నేను నా దర్శకులందరితో కలిసిపోతాను. తెలుగు ప్రేక్షకులు నా పాత్రలను ఆదరిస్తున్న తీరు చూస్తుంటే ఇంతకు మించి ఏం కోరుకోను? అనిపిస్తుంది. సంవత్సరానికి 10 సినిమాలు చేస్తున్నాను అంటే తీరిక లేకుండా పని చేయాలి. కానీ నేను పని చేసే టీమ్ వల్ల ప్రత్యేకమైన వెకేషన్ కూడా అవసరం ఉండటం లేదు. అంత బావుంటుంది పని చేసే వాతావరణం. మంచి మంచి పాత్రలు రాస్తున్నారు దర్శకులు. అన్నీ తిరస్కరించడానికి వీలు లేనటువంటి పాత్రలే. వచ్చే నెల విడుదల కానున్న శర్వానంద్ ‘పడిపడి లేచె మనసు’లో కూడా చాలా భిన్నమైన పాత్ర పోషిస్తున్నాను. నేను ఎప్పుడూ మిమ్మల్ని (ప్రేక్షకులు) ఆనందింపజేయాలి, నన్ను మీరు ఆదరించాలి. ఇదెప్పుడూ ఇలానే సాగాలని కోరుకుంటున్నాను. – మురళీ శర్మ ఇంటింటా ఈశ్వరీ రజనీకాంత్.. హైడ్రోజన్ బాంబ్. అలాంటి పెను పేలుడు పదార్థం పక్కన నిలబడి, ఫ్రేమ్‌లో గెలవడం చాలా కష్టం. కానీ ‘కాలా’లో రజనీతో సమానంగా కొన్నిసార్లు డామినేట్ చేసి మంచి మార్కులు కొట్టేశారు ఈశ్వరీ రావు. ఇరవై ఏళ్ల క్రితం ‘ఇంటింటా దీపావళి’ చిత్రంతో పరిచయమైన ఈశ్వరీ రావు బాపు దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్ సరసన ‘రాంబంటు’ సినిమాలో హీరోయిన్గా నటించారు. తమిళంలోనూ ఆమె హీరోయిన్ వేషాలు వేశారు. అయితే అప్పుడు రాని గుర్తింపు ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వచ్చింది. ‘కాలా’లో కరికాలన్ భార్య చిట్టెమ్మగా, ‘అరవింద సమేత వీర రాఘవ’లో ఫ్యాక్షనిస్ట్ బసిరెడ్డి భార్యగా కనిపించిన ఈ నటి ‘అర్జున్‌రెడ్డి’ తమిళ రీమేక్‌లో పని మనిషి పాత్ర చేశారు. తెలుగులో నిడివి తక్కువ ఉన్న ఈ పాత్రను తమిళంలో దర్శకుడు బాలా పెంచి ముఖ్యమైనదిగా మలిచారు. ఈశ్వరీ రావు ఇమేజ్ ఏ విధంగా ఉందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. -
కొత్తవాళ్లు ఎలా చేస్తారో అనుకున్నా
‘‘యు టర్న్’ టీమ్ అంతా ఫ్రెండ్సే. ఓ ఫ్యామిలీలాగా కలిసిపోయి ఈ సినిమా చేశాం. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. ‘లూసియా’ సినిమాతో దర్శకుడు పవన్‌కుమార్‌కి పెద్ద ఫ్యాన్ అయ్యాను’’ అని సమంత అన్నారు. ఆమె లీడ్ రోల్లో, ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్, భూమిక ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘యు టర్న్’. శ్రీనివాస చిట్టూరి, రాంబాబు బండారు నిర్మిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను శుక్రవారం విడుదల చేశారు. సమంత మాట్లాడుతూ – ‘‘అందరం సిన్సియర్‌గా చేసిన ప్రయత్నం ‘యు టర్న్’. నిర్మాతలు కొత్తవాళ్లు ఎలా చేస్తారో అనుకున్నా. కానీ, వాళ్లు చక్కగా డీల్ చేశారు. మా ప్రయత్నాన్ని అందరూ సపోర్ట్ చేస్తారని భావిస్తున్నా’’ అన్నారు. ‘‘సమంత మంచి నటే కాదు.. మంచి మనిషి కూడా. నా చిత్రాల్లో మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చిన చిత్రమిది’’ అన్నారు ఆది పినిశెట్టి. ‘‘ఒకప్పుడు సమంతకు, ఇప్పటి సమంతకు చాలా తేడా కనపడుతోంది. నటిగా ఇంకా ఎదిగింది’’ అన్నారు రాహుల్ రవీంద్రన్. ‘‘ఇంత మంచి సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇవ్వడం హ్యాపీగా ఉంది. ఈ జర్నీ చాలా విషయాలను నేర్పింది. సమంతగారు మంచి నటి. ఆవిడతో పనిచేయడం హ్యాపీ’’ అన్నారు పవన్‌కుమార్. -
స్క్రీన్ టెస్ట్
1. మహేశ్‌బాబు ఏ సంవత్సరంలో పుట్టారో కనుక్కోండి? ఎ) 1974 బి)1976 సి)1975 డి)1979 2. మహేశ్‌బాబును ‘రాజకుమారుడు’ చిత్రంతో హీరోగా పరిచయం చేసిన నిర్మాత ఎవరు? ఎ) యం.యస్. రాజు బి) సి. అశ్వనీదత్ సి) మంజుల డి) అల్లు అరవింద్ 3. ‘నానీ’ చిత్రంలో మహేశ్‌బాబు సరసన నటించిన బాలీవుడ్ బ్యూటీ ఎవరో తెలుసా? ఎ) అమీషా పటేల్ బి) సోనాలీ బింద్రే సి) బిపాసా బసు డి) ప్రీతీ జింటా 4. ‘ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు..’ అని మహేశ్ చెప్పిన డైలాగ్ ఏ సినిమాలోనిది? ఎ) అతడు బి) ఖలేజా సి) పోకిరి డి) సైనికుడు 5. మహేశ్‌బాబు తనని తాను మొదటిసారి స్క్రీన్ మీద చూసుకున్న చిత్రం ‘నీడ’. ఏ దర్శకుడు మహేశ్‌ను అరంగేట్రం చేశారో తెలుసా? ఎ) దాసరి నారాయణరావు బి) కె. మురళీ మోహన్‌రావు సి) కోడి రామకృష్ణ డి) కృష్ణ 6. రాక్‌స్టార్ పాత్రలో మహేశ్‌బాబు నటించిన చిత్రం ‘1 నేనొక్కడినే’. ఆ చిత్రానికి కెమెరామెన్ ఎవరో తెలుసా? ఎ) కేకే సెంథిల్ కుమార్ బి) మధి సి) ఛోటా.కె. నాయుడు డి) రత్నవేలు 7. మహేశ్‌బాబు నటి నమ్రతను ఏ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు పెళ్లి చేసుకున్నారో తెలుసా? ఎ) వంశీ బి) ఒక్కడు సి) మురారీ డి) అతడు 8. మహేశ్‌బాబు ‘పోరాటం’, ‘గూఢచారి 117’ సినిమాల్లో బాలనటుడిగా నటించారు. ఈ రెండు చిత్రాలకు దర్శకుడెవరు? ఎ) కోడి రామకృష్ణ బి) ఎ. కోదండ రామిరెడ్డి సి) కేయస్ఆర్ దాస్ డి) కె.బాపయ్య 9. ఈ దర్శకుడు మహేశ్‌బాబుకు క్లోజ్ ఫ్రెండ్. మహేశ్‌బాబు ఫ్యామిలీతో విదేశాలకు విహార యాత్రలకు వెళ్లినప్పుడు ఈ దర్శకునికి మాత్రమే ఎంట్రీ ఉంటుంది. ఎవరా దర్శకుడు తెలుసా? ఎ) పూరి జగన్నాథ్ బి) మెహర్ రమేశ్ సి) శివ కొరటాల డి) త్రివిక్రమ్ 10. ‘శ్రీమంతుడు’ సినిమాలో చేసిన పాత్ర ఇన్సిపిరేషన్‌తో మహేశ్‌బాబు ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఆ గ్రామం తెలంగాణా ప్రాతంలోని ఏ జిల్లాలో ఉందో తెలుసా? ఎ) మహబూబ్ నగర్ బి) అదిలాబాద్ సి) వరంగల్ డి) రంగారెడ్డి 11. మహేశ్‌బాబు ఇప్పటి వరకూ ఎన్ని సినిమాలకు వాయిస్ ఓవర్ అందించారో కనుక్కోండి? ఎ) 2 బి) 1 సి) 6 డి) 4 12. మహేశ్‌బాబు తన కెరీర్లో ఒకే ఒక్క దర్శకునితో మూడు సినిమాల్లో నటించారు. ఆ దర్శకుడెవరు? ఎ) శ్రీకాంత్ అడ్డాల బి) పూరి జగన్నాథ్ సి) శ్రీను వైట్ల డి) గుణశేఖర్ 13. మహేశ్ నటించిన ‘శ్రీమంతుడు’, ‘భరత్ అనే నేను’.. ఈ రెండు సినిమాల్లోని పాటలన్నీ రాసిన రచయిత ఎవరో తెలుసా? ఎ) శ్రీమణి బి) రామజోగయ్య శాస్త్రి సి) సిరివెన్నెల డి) చంద్రబోస్ 14. ‘పోకిరి’ సినిమాలోని ‘గల గల పారుతున్న గోదారిలా...’ పాటను పాడిన సింగర్ పేరేంటి? ఎ) హేమచంద్ర బి) నిహాల్ సి) సింహా డి) కార్తీక్ 15. బెస్ట్ డెబ్యూ హీరో, బెస్ట్ హీరో, స్పెషల్ జ్యూరీ అన్ని కేటగిరీలకు కలిపి మహేశ్‌బాబు మొత్తం ఎన్ని నందులను అందుకున్నారో తెలుసా? ఎ) 4 బి) 8 సి) 6 డి) 9 16. మహేశ్‌బాబుని ట్వీటర్లో దాదాపు 68లక్షల మంది ఫాలో అవుతున్నారు. ఆయన ట్వీటర్ హ్యాండిల్ ఏంటో తెలుసా? ఎ) మీ మహేశ్ బి) యువర్స్ మహేశ్ సి) మహేశ్ డి) యువర్స్ ట్రూలీ మహేశ్ 17. మహేశ్ కెరీర్లో ఇద్దరు హీరోయిన్లతో మాత్రమే రెండుసార్లు నటించారు. ఆ ఇద్దరిలో ఓ హీరోయిన్ త్రిష. మరి రెండో హీరోయిన్ ఎవరు? ఎ) నమ్రతా శిరోద్కర్ బి) భూమిక సి) తమన్నా డి) సమంతా 18. మహేశ్‌బాబు స్కూలింగ్ చెన్నైలో జరిగింది. అదే స్కూల్లో చదువుకున్న తన జూనియర్ తమిళ సినిమాలో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో. ఆ హీరో ఎవరో కనుక్కోండి? ఎ) సూర్య బి) విజయ్ సి) ధనుష్ డి) కార్తీ 19. ప్రస్తుతం మహేశ్‌బాబు నటిస్తున్న ‘మహర్షి’లో కీలక పాత్ర చేస్తున్న కామెడీ హీరో ఎవరు? ఎ) ‘అల్లరి’ నరేశ్ బి) రాజేంద్రప్రసాద్ సి) సునీల్ డి) సప్తగిరి 20 మహేశ్‌బాబు బాలనటుడిగా నటించిన ఈ స్టిల్ ఏ సినిమాలోనిది? ఎ) నీడ బి) కొడుకు దిద్దిన కాపురం సి) బాలచంద్రుడు డి) పోరాటం మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) సి 2) బి 3) ఎ 4) సి 5) ఎ 6) డి 7) డి 8) ఎ 9) బి 10) ఎ 11) డి 12) డి 13) బి14) బి 15) బి 16) డి 17) డి 18) డి 19) ఎ 20) బి నిర్వహణ: శివ మల్లాల -
ఫారిన్ పోదాం
సవ్యసాచి తన గమ్యాన్ని చేరుకోవడానికి జస్ట్ కొంచెం దూరంలోనే ఉన్నాడు. ఈ ప్రయాణంలో అతను ఎదుర్కొన్న సవాళ్లేంటో తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే అంటున్నారు చందు మొండేటి. నాగచైతన్య, నిధీ అగర్వాల్ హీరో, హీరోయిన్లుగా దర్శకుడు చందు మొండేటి తెరకెక్కిస్తున్న చిత్రం ‘సవ్యసాచి’. మాధవన్, భూమిక ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యర్నేని, వై. రవిశంకర్, మోహన్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇందులో నాగచైతన్య యాడ్ ఫిల్మ్ మేకర్‌గా కనిపించనున్నారు. రెండు చేతులను ఒకే సామర్థ్యంతో ఉపయోగించగలిగే సవ్యసాచిలా నాగచైతన్య రోల్ ఉంటుందని తెలిసిన విషయమే. ఈ సినిమా షూటింగ్ లాస్ట్ షెడ్యూల్లో ఉంది. ‘‘టాకీ పార్ట్ ఆగస్ట్ 8తో కంప్లీట్ చేస్తాం. ఒక సాంగ్‌ను ఫారిన్లో షూట్ చేయనున్నాం. అది ఆగస్ట్ 15కల్లా పూర్తవుతుంది. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్, సిజీ వర్క్స్ అన్నీ కూడా సెప్టెంబర్ 15 లోపు కంప్లీట్ చేస్తాం. త్వరలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేయాలనుకుంటున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఇదిలా ఉంటే, నాగచైతన్య హీరోగా మారుతి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ‘శైలజారెడ్డి అల్లుడు’ ఆగస్టు 31న విడుదల కానుంది. -
స్క్రీన్ టెస్ట్
1. ఇప్పుడు మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న ఓ సినిమాకు నిర్మాతలు సి.అశ్వనీదత్, ‘దిల్’ రాజు. ఈ చిత్రానికి దర్శకుడెవరో తెలుసా? ఎ) సుకుమార్ బి) వంశీ పైడిపల్లి సి) త్రివిక్రమ్ డి) బోయపాటి శ్రీను 2. భారతదేశం గర్వించదగ్గ నిర్మాతల్లో ఏయం రత్నం ఒకరు. ఆయన ఏ హీరోయిన్‌కు మేకప్‌మేన్‌గా పని చేశారో తెలుసా? ఎ) విజయశాంతి బి) రాధిక సి) రాధ డి) శ్రీదేవి 3. ‘అందాల రాక్షసి’ సినిమా ద్వారా హీరోగా పరిచయమైన ఈ నటుడు ఇప్పుడు కెప్టెన్ కుర్చీలో కూర్చుని ‘చి.ల.సౌ’ అనే సినిమా ద్వారా దర్శకునిగా మారారు. ఎవరతను? ఎ) నవీన్ చంద్ర బి) హను రాఘవపూడి సి) రాహుల్ రవీంద్రన్ డి) అరుణ్ అదిత్ 4. తమిళ దర్శకుడు బాలా దర్శకత్వంలో ‘నాచ్చియార్’ అనే చిత్రం రూపొందింది. ఈ చిత్రాన్ని తెలుగులో ‘ఝాన్సీ’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఝాన్సీ పాత్రలో నటించిన నటి ఎవరో కనుక్కోండి? ఎ) త్రిష బి) జ్యోతిక సి) శ్రియ డి) అంజలి 5. ‘మృగం’ అనే డబ్బింగ్ చిత్రంలో నటించిన నటుడు ఇప్పుడు తెలుగులో మంచి ప్రామిసింగ్ ఆర్టిస్ట్. ఎవరు? ఎ) ఆర్య బి) భరత్ సి) శ్యామ్ డి) ఆది పినిశెట్టి 6. జయం, నిజం, వర్షం చిత్రాల విలన్‌గా నటించారీయన. ఈ హీరో నటించిన 25వ చిత్రం ఇటీవల విడుదలైంది. ఎవరా నటుడు? ఎ) నితిన్ బి) గోపీచంద్ సి) రామ్ డి) తరుణ్ 7. ‘బిVŠ బాస్’ మొదటి సీజన్ విజేత శివబాలాజీ. ఆయన తన మొదటి సినిమాలో ఏ హీరోతో కలిసి పనిచేశారో తెలుసా? ఎ) అల్లు అర్జున్ బి) నవదీప్ సి) ‘అల్లరి’ నరేశ్ డి) రవితేజ 8. నితిన్ హీరోగా నటిస్తున్న ‘శ్రీనివాస కళ్యాణం’ చిత్రంలో హీరోయిన్ ఎవరో తెలుసా? ఎ) రాశీ ఖన్నా బి) ప్రణీత సి) లావణ్యా త్రిపాఠి డి) నివేథా థామస్ 9 తమిళంలోనూ, తెలుగులోనూ ఈ ఆర్టిస్ట్‌ని ‘ఇతను మావాడంటే మావాడు’ అని ఓన్ చేసుకున్నారు. ఆ నటుడెవరో? ఎ) ఎన్టీఆర్ బి) ఏయన్నార్ సి) యస్వీఆర్ డి) కాంతారావు 10. ‘వెన్నెల్లో ఆడపిల్ల’ నవలను రచించింది యండమూరి. ఆ నవల ఆధారంగా తీసిన చిత్రంలో హీరో ఎవరో గుర్తుందా? ఎ) శ్రీకాంత్ బి) తరుణ్ సి) జేడీ చక్రవర్తి డి) వడ్డే నవీన్ 11. ‘సీతారాముల కల్యాణం చూతము రారండి’ అనే పాట ‘సీతారామ కల్యాణం’ చిత్రంలోనిది. ఆ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించింది ఎవరో తెలుసా? ఎ) ఘంటసాల బి) కె.వి.మహదేవన్ సి) గాలి పెంచల నరసింహారావు డి) సాలూరి రాజేశ్వరరావు 12. ‘ఛత్రపతి’ చిత్రంలో ‘గుండుసూది గుండుసూది’ అనే పాటకు స్వరాలు సమకూర్చి, గొంతు కలిపింది యం.యం.కీరవాణి. ఆయనతో పాటు గొంతు కలిపిన లేడీ సింగర్ ఎవరో ఓ సారి గుర్తుపడదామా? ఎ) గీతామాధురి బి) శ్రావణ భార్గవి సి) సునీత డి) ప్రణవి 13. దర్శకుడు సుకుమార్ లెక్చరర్ అని చాలామందికి తెలుసు. ఆయన ఏ సబ్జెక్ట్ టీచ్ చేసేవారో తెలుసా? ఎ) మ్యాథ్స్ బి) సోషల్ సి) తెలుగు డి) ఇంగ్లీష్ 14. రీసెంట్గా తనకు క్యాన్సర్ వ్యాధి వచ్చిందని సోషల్ మీడియా ద్వారా తెలియచేసిన నటి ఎవరు? ఎ) మనీషా కోయిరాల బి) సోనాలీ బింద్రే సి) గౌతమి డి) మమతా మోహన్‌దాస్ 15. నాగచైతన్య నటిస్తున్న ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రంలో అల్లుడు నాగచైతన్య అయితే అత్తగా నటిస్తున్న నటి ఎవరో తెలుసా? ఎ) భూమిక బి) నదియా సి) వాణీ విశ్వనాథ్ డి) రమ్యకృష్ణ 16. జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల తన చిన్న కుమారునికి నామకరణం చేశారు. ఆ నందమూరి చిన్నారికి ఏ పేరు పెట్టారో తెలుసా? ఎ) అభయ్ రామ్ బి) భార్గవ రామ్ సి) శౌర్య రామ్ డి) తారక్ రామ్ 17. ప్రభాస్ నటిస్తున్న ‘సాహో’ చిత్రంలో ఓ హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ ‘శ్రద్ధాకపూర్’ నటిస్తున్నారు. మరో బాలీవుడ్ నటి కూడా నటిస్తున్నారు. ఎవరామె? ఎ) ఎవెలిన్ శర్మ బి) అనుష్కా శర్మ సి) ఆలియా భట్ డి) దీపికా పదుకోన్ 18. ‘మిణుగురులు’ చిత్రానికి దర్శకత్వం వహించి, పలు అవార్డులు అందుకున్న దర్శకుడు అయోధ్య కుమార్. ఆయన దర్శకత్వంలో ఇప్పుడు ‘24 కిసెస్’ అనే చిత్రం రానుంది. ఆ చిత్రంలో నటిస్తున్న హాట్ బ్యూటీ ఎవరో తెలుసా? ఎ) కృతీ కర్భందా బి) హెబ్బా పటేల్ సి) రష్మికా మండన్నా డి) నందితా రాజ్ 19. ఈ ఫోటోలోని ప్రముఖ హీరోయిన్ ఎవరో తెలుసా? ఎ) షావుకారు జానకి బి) అంజలీదేవి సి) భానుమతి డి) బి. సరోజాదేవి 20. ఈ కింది ఫోటోలో ముద్దుగా బొద్దుగా ఉన్న ఇప్పటి టాప్ బాలీవుడ్ హీరోయిన్ ఎవరో కనుక్కోండి? ఎ) ఆలియా భట్ బి) సన్నీ లీయోన్ సి) పరిణీతీ చోప్రా డి) సోనాక్షీ సిన్హా మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) బి 2) ఎ 3) సి 4) బి 5) డి 6) బి 7) ఎ 8) ఎ 9) సి 10) ఎ 11) సి 12) సి 13) ఎ 14) బి 15) డి 16) బి 17) ఎ 18) బి 19) సి 20) ఎ నిర్వహణ: శివ మల్లాల -
జ్ఞాపకాల గుర్తులు
సిల్వర్ స్క్రీన్‌పై భూమిక కథానాయికగా మంచి మార్కులు కొట్టేశారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆరిస్ట్గానూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. కానీ భూమికలో ఓన్లీ యాక్టింగ్ ప్రతిభ మాత్రమే ఉందనుకుంటే పొరపాటే. స్కూబా డైవింగ్ కూడా బాగా చేస్తారు. ‘‘రీసెంట్గా స్కూబా డైవింగ్ చేసా. ఈ ఎక్స్‌పీరియన్స్‌ను ఫుల్‌గా ఎంజాయ్ చేశాను. ఆ జ్ఞాపకాల గుర్తులు’’ అంటూ స్కూబా డైవింగ్ చేసిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారామె. ఇక సినిమాల విషయానికొస్తే... చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా నటిస్తున్న ‘సవ్యసాచి’, సమంత లీడ్ రోల్ చేసిన ‘యు టర్న్’ సినిమాలోనూ భూమిక నటిస్తున్నారు. -
సిక్సర్
రయ్ రయ్ మంటూ కెరీర్లో దూసుకెళ్తున్నారు సమంత. అయితే ఈ ఏడాది ఆమె కెరీర్లో సమ్‌థింగ్ స్పెషల్ అనే చెప్పవచ్చు. ఆల్రెడీ ‘రంగస్థలం’, ‘మహానటి’(తమిళంలో ‘నడిగయర్ తిలగం’), ‘ఇరంబుదురై’ (తెలుగులో ‘అభిమన్యుడు’) సినిమాలతో సిల్వర్ స్క్రీన్‌పై మెరిసిన ఈ బ్యూటీ తాజాగా ‘యు టర్న్’ సినిమాలో తన షూటింగ్‌ను కంప్లీట్ చేశారు. పవన్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, భూమిక, రాహుల్ రవీంద్రన్ కూడా ముఖ్య తారలుగా నటిస్తున్నారు. శ్రీనివాస్ చిట్టూరి నిర్మాత. ‘‘ఇంకో సినిమా (యు టర్న్) షూటింగ్‌ను కంప్లీట్ చేశా. ఇక డబ్బింగ్ స్టార్ట్ చేయాలి’’ అన్నారు సమంత. ఈ సినిమాకు సోమవారం నుంచి సమంత డబ్బింగ్ చెప్పనున్నారు. తమిళంలో శివకార్తీకేయన్ హీరోగా ‘సీమరాజా’, విజయ్‌సేతుపతి, ఫాహద్ ఫాజిల్ నటించిన ‘సూపర్ డీలక్స్’ సినిమాలను కూడా కంప్లీట్ చేశారు సమంత. ఈ సినిమాలు కూడా ఈ ఏడాదిలోనే రిలీజ్ కానున్నాయి. షూటింగ్ ఎప్పుడు ప్రారంభమయ్యాయన్నది పక్కన పెడితే ఈ ఏడాది ఇప్పటి వరకూ సమంత అరడజను సినిమాల షూటింగ్‌ను కంప్లీట్ చేసి సిక్సర్ కొట్టారు. ‘నిన్నుకోరి’ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత, నాగచైతన్య ఓ సినిమా చేయనున్నారు. సో.. ఈ సినిమానే సమంత నెక్ట్స్ చిత్రం అని ఊహిస్తున్నారు సినీ లవర్స్. -
పోలీస్‌స్టేషన్‌కు యు టర్న్
కథానాయిక సమంత పోలీస్‌స్టేషన్‌కి వెళ్లారు. ఏదో కేసు విషయమై ఆమెపై ప్రశ్నలవర్షం కురిపిస్తున్నారట పోలీసులు. వారి ప్రశ్నలకు సమంత ఎలాంటి సమాధానాలిచ్చారన్నది సిల్వర్‌స్క్రీన్‌పై చూడాల్సిందే. కన్నడ హిట్ మూవీ ‘యు–టర్న్’ సినిమాను అదే పేరుతో తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. కన్నడ వెర్షన్‌ను డైరెక్ట్ చేసిన పవన్ కుమార్ దర్శకత్వంలోనే ఈ రీమేక్ రూపొందుతోంది. సమంత, ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్ ముఖ్య తారలుగా నటిస్తున్నారు. సిల్వర్‌స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు. జర్నలిస్ట్ పాత్రలో సమంత, పోలీస్ అధికారిగా ఆది పినిశెట్టి నటిస్తున్నారు. నటి భూమిక ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఓ మీడియా హౌస్ ఆఫీస్‌లో ఇటీవల ఓ షెడ్యూల్‌ను కంప్లీట్ చేసిన ఈ చిత్రబృందం ప్రస్తుతం పోలీస్‌స్టేషన్ సెట్లో సమంతపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ‘‘షూటింగ్ స్పీడ్‌గా జరుగుతోంది. త్వరలో సమంత ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు నిర్మాత. ఈ సినిమాకు కెమెరా: నికేత్. -
గెస్ట్ ఘోస్ట్
సమంత లీడ్ రోల్లో కన్నడ సూపర్ హిట్ ‘యూ–టర్న్’ చిత్రాన్ని ఆ చిత్రదర్శకుడు పవన్ కుమార్ తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సమంత జర్నలిస్ట్‌గా కనిపించనున్నారు. ఇందులో ఘోస్ట్ క్యారెక్టర్ కోసం చిత్రబృందం భూమికను సెలెక్ట్ చేసినట్టు సమాచారం. సెకెండ్ ఇన్నింగ్స్‌లో వదిన, అక్క క్యారెక్టర్స్ చేస్తున్న భూమిక ఇప్పుడు దెయ్యంగా కనిపించనున్నారు. గెస్ట్ రోల్లో కొన్ని నిమిషాల ఘోస్ట్‌గా అప్పియరెన్స్ ఇవ్వనున్నారట భూమిక. తన క్యారెక్టర్ ఒక మేజర్ యాక్సిడెంట్ వల్ల చనిపోవడంతో దెయ్యంగా మారతారు. ఈ యాక్సిడెంట్ చుట్టూనే సినిమా కథ అంతా తిరుగుతుంది. ఈ కేస్‌ను ఇన్వెస్టిగేట్ చేసే పాత్రలో సమంత కనిపిస్తారు. సమంత్ పక్కన రాహుల్ రవీంద్రన్, పోలీస్ పాత్రలో ఆది పినిశెట్టి కనిపించనున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. -
చైతూ సినిమాలో సెంటిమెంటే హైలెట్
అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం సవ్యసాచి. చైతూకి ప్రేమమ్ లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందించిన చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా సీనియర్ హీరోయిన్ భూమిక, హీరో మాధవన్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఈ సినిమాలో మాధవన్ ప్రతినాయకుడిగా నటిస్తుండగా.. భూమిక, నాగచైతన్యకు అక్కగా నటిస్తోంది. సినిమాకు వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలే హైలెట్ గా నిలుస్తాయన్న టాక్ వినిపిస్తోంది. అక్కా తమ్ముళ్ల సెంటిమెంట్ ప్రధానంగా సినిమా తెరకెక్కుతోందన్న ప్రచారం జరుగుతోంది. -
స్క్రీన్ టెస్ట్
► భూమిక చావ్లాతో నటించిన మొదటి తెలుగు హీరో ఎవరో తెలుసా? ఎ) యన్టీఆర్ బి) మహేశ్ బాబు సి) సుమంత్ డి) వెంకటేశ్ ► ‘మిస్టర్’ సినిమా హీరో వరుణ్ తేజ్. ఆ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించారు. ఒక హీరోయిన్ లావణ్య త్రిపాఠి, మరో హీరోయిన్ ఎవరు? ఎ) హెబ్బా పటేల్ బి) ప్రణీత సి) అమలాపాల్ డి) ఆండ్రియా ► నాగార్జున నటించిన ‘శివ’ సినిమాకు మాటల రచయిత ఎవరో తెలుసా? ఎ) యం.వీ.యస్.హరనాథరావు బి) శివనాగేశ్వరరావు సి) తనికెళ్ల భరణి డి) సుద్దాల అశోక్‌తేజ ► బాలీవుడ్ నటి విద్యాబాలన్‌కి ఈ సౌత్ హీరోయిన్ దగ్గరి బంధువు. ఎవరామె? ఎ) ప్రియమణి బి) లక్ష్మీరాయ్ సి) అంజలి డి) గౌతమి ► వెంకటేశ్ నటించిన ‘నువ్వు నాకు నచ్చావు’ చిత్రానికి దర్శకుడెవరు? ఎ) త్రివిక్రమ్ శ్రీనివాస్ బి) కె. విజయభాస్కర్ సి) పి.వాసు డి) సురేశ్‌కృష్ణ ► నటి చార్మి ప్రస్తుతం హీరోయిన్గా కాకుండా ఓ ప్రముఖ దర్శకునితో కలిసి సినిమా ప్రొడక్షన్ కంపెనీని ప్రారంభించారు. ఆ కంపెనీ పేరేంటి? ఎ) పూరిచార్మి క్రియేటివ్స్ బి) పూరి కనెక్ట్స్ సి) పీసీ కనెక్ట్స్ డి) పీసీ క్రియేట్స్ ► ‘మామ మంచు అల్లుడు కంచు’ అనే సినిమా 2015 డిసెంబర్లో రిలీజైంది. మోహన్‌బాబు 23 సంవత్సరాల క్రితం నటించిన ఓ సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందింది. ఏ చిత్రానికి ఈ సినిమా సీక్వెలో చెప్పగలరా ? ఎ) అల్లుడుగారు బి) అసెంబ్లీ రౌడి సి) అల్లరి మొగుడు డి) రౌడీగారి పెళ్లాం ► ప్రముఖ యాంకర్ సుమ గతంలో ఓ ప్రముఖ దర్శకుని చిత్రంలో హీరోయిన్గా నటించింది. ఎవరా దర్శకుడు? ఎ) కె.రాఘవేంద్రరావు బి) దాసరి నారాయణరావు సి) కోడి రామకృష్ణ డి) ఎ. కోదండరామిరెడ్డి ► శ్రీదేవి, కమల్‌హాసన్ కలిసి ఎన్ని సినిమాల్లో నటించారో తెలుసా? ఎ) 15 బి) 19 సి) 23 డి) 27 ► ప్రభాస్–అనుష్కల కాంబినేషన్లో ఇప్పటివరకు ఎన్ని సినిమాలు వచ్చాయో తెలుసా? ఎ) 7 బి) 3 సి) 5 డి) 4 ► హృదయం ఎక్కడున్నది.. హృదయం ఎక్కడున్నది నీ చుట్టునే తిరుగుతున్నది... అనే పాటను కంపోజ్ చేసిన సంగీత దర్శకుడెవరో తెలుసా? ఎ) దేవా బి) హారిస్ జయరాజ్ సి) యువన్ శంకర్ రాజా డి) విశాల్ శేఖర్ ► హీరోలు రానా, శర్వానంద్‌లకు ఈ ప్రముఖ హీరో స్కూల్‌మేట్. ఎవరా హీరో? కనుక్కోండి చూద్దాం? ఎ) యన్టీఆర్ బి) రామ్‌చరణ్ సి) విజయ్ దేవరకొండ డి) అల్లరి నరేశ్ ► అంతకుముందు చాలా సినిమాల్లో క్యారెక్టర్స్ చేసినప్పటికీ రామ్‌గోపాల్ వర్మ ‘ఐస్‌క్రీమ్’ సినిమా ద్వారా పేరు తెచ్చుకున్న నటి ఎవరు? ఎ) అవికా గోర్ బి) తేజస్విని మడివాడ సి) శ్రీముఖి డి) ఈషా రెబ్బా ► అక్కినేని నాగేశ్వరరావు నటించిన ‘దసరాబుల్లోడు’ చిత్రానికి దర్శకత్వం వహించిందెవరు? ఎ) వి.మధుసూదనరావు బి) కె.వి.రెడ్డి సి) వి.బి.రాజేంద్రప్రసాద్ డి) కె.విశ్వనాథ్ ► నాగార్జున ట్విట్టర్ ఐడీ ఏంటో కనుక్కోండి ? ఎ) ఐయామ్ నాగార్జున బి) నాగార్జున సి) దిస్ ఈజ్ నాగార్జున డి) ఐయామ్ నాగ్ ► ఈ నటి అసలు పేరు సుజాత. అప్పటికే ఆ పేరుతో ఓ నటి ఉండటం వల్ల ఆమె స్క్రీన్ నేమ్ మారిపోయింది . ఆ నటి ఎవరో తెలుసా? ఎ) జయసుధ బి) జయప్రద సి) దివ్యవాణి డి) రంభ ► తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించినంత వరకు ‘నంది’ అనేది చాలా ప్రతిష్టాత్మకమైన అవార్డు. ఈ అవార్డులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ సంవత్సరం నుంyì ప్రారంభించిందో తెలుసా? ఎ) 1975 బి) 1964 సి) 1979 డి) 1993 ► చిరంజీవి నటించిన ‘పసివాడిప్రాణం’ చిత్రంలో ‘పదహారేళ్ల వయసు పడిపడిలేచె మనసు’ అనే పాట ఉంటుంది. ఇప్పుడు ‘పడిపడి లేచె మనసు’ అనే టైటిల్‌తో ఓ సినిమా రాబోతోంది. ఆ సినిమా హీరో ఎవరు? ఎ) నాని బి) నిఖిల్ సి) నాగచైతన్య డి) శర్వానంద్ ► ఈ ఫోటోలోని ఇప్పటి హీరో ఎవరో కనుక్కోండి? ఎ) శర్వానంద్ బి) కల్యాణ్‌రామ్ సి) అజిత్ డి) మాధవన్ ► అక్కినేని, సావిత్రి నటించిన ఈ ఫోటో ఏ సినిమాలోనిదో కనుక్కోండి? ఎ) మనుషులు మమతలు బి) మిస్సమ్మ సి) గుండమ్మకథ డి) డాక్టర్ చక్రవర్తి మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) సి 2) ఎ 3) సి 4) ఎ 5) బి 6) సి 7) సి 8) బి 9) డి 10) డి 11) బి 12) బి 13) బి 14) సి 15) ఎ 16) ఎ) 17) బి 18) డి) 19) ఎ 20) ఎ నిర్వహణ శివ మల్లాల -
సవ్యసాచి వస్తున్నాడు
సేమ్ వపర్. రైట్ హ్యాండ్‌కి ఎంత పవర్ ఉందో.. సేమ్ పవర్ లెఫ్ట్ హ్యాండ్‌కి కూడా ఉందతనికి. మరి ఈ ఎక్స్ట్రా పవర్‌తో అతను ఎక్స్ట్రీమ్గా ఏం చేశాడో తెలుసుకోవాలంటే ‘సవ్యసాచి’ సినిమా చూడాల్సిందే. నాగచైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో ౖమైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఎర్నేని నవీన్, ౖవై. రవిశంకర్, చెరుకూరి మోహన్ నిర్మిస్తున్న చిత్రం ‘సవ్యసాచి’. ఇందులో నిధి అగర్వాల్ కథానాయిక. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను మార్చి 18న రిలీజ్ చేసి, చిత్రాన్ని జూన్ 14న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ‘‘ప్రస్తుతం నాగచైతన్య, భూమిక, ఇతర ముఖ్య తారాగణంపై హైదరాబాద్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం. ఆ తర్వాత యూఎస్‌లో మరో కీలక షెడ్యూల్‌ను ప్లాన్ చేశాం. కీరవాణి సంగీతం చిత్రానికి అదనపు ఆకర్షణ’’ అన్నారు నిర్మాతలు. రావు రమేశ్, వెన్నెల కిశోర్, సత్య, తాగుబోతు రమేశ్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు కెమెరా: యువరాజ్. ప్రేయసిగా శ్రీమతి మూడుముళ్లకు ముందు ముచ్చటగా మూడుసార్లు (ఏమాయ చేసావె, ఆటోనగర్ సూర్య, మనం) స్క్రీన్ షేర్ చేసుకున్నారు నాగచైతన్య, సమంత. మరోసారి వీరిద్దరూ కలిసి నటించబోతున్నారట. ‘నిన్ను కోరి’ ఫేమ్ శివ నిర్మాణ దర్శకత్వంలో నాగచైతన్య, సమంత కలిసి నటించనున్నారని, ఆల్రెడీ సినిమాకు ‘ప్రేయసి’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారని టాక్. -
‘సవ్యసాచి’ ఫస్ట్ లుక్ ముహూర్తం ఫిక్స్
‘ప్రేమమ్’ లాంటి సూపర్ సక్సెస్ తరువాత అక్కినేని నాగచైతన్య, చందు మొండేటిల క్రేజీ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ‘సవ్యసాచి’. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మాధవన్, భూమికలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘సవ్యసాచి’ ఫస్ట్ లుక్ మరియు రిలీజ్ డేట్ లను ఎనౌన్స్ చేసారు మైత్రీ మూవీ మేకర్స్. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు వై.నవీన్, వై.రవిశంకర్, మోహన్ లు మాట్లాడుతూ.. ‘మా యూనిట్ సభ్యులందరికీ సవ్యసాచి ఒక స్పెషల్ ఫిలిం. ప్రస్తుతం హైద్రాబాద్ లో హీరో నాగచైతన్య, భూమికలపై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ షెడ్యూల్ పూర్తవ్వగానే నెక్స్ట్ షెడ్యూల్ కోసం టీం అమెరికా వెళ్లనున్నారు. సినిమా ఫస్ట్ లుక్ ను మార్చి 18న విడుదల చేయాలనుకొంటున్నాం. అలాగే సవ్యసాచి చిత్రాన్ని జూన్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్నాం. ఆడియన్స్ ను ఆశ్చర్యపరిచే స్థాయిలో సినిమా ఉంటుంది. ఆర్.మాధవన్ పాత్ర సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. కీరవాణి గారు సవ్యసాచికి సంగీతం సమకూర్చడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది’ అన్నారు. -
తెలుగులో ఆ చిన్న మార్పు రావాలి
‘‘మళ్లీ తెలుగులో కనిపించటం సంతోషంగా ఉంది. ‘ఎంసీఏ’లో నాది చాలా స్ట్రాంగ్ రోల్. తక్కువగా మాట్లాడినా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. నా దృష్టిలో ఏదైనా యాక్టింగే. వదిన పాత్ర చేయడానికి రిఫరెన్స్ ఏం తీసుకోలేదు. ఫ్రెండ్స్‌ని చూసి ఇన్స్పైర్ అవుతుంటా’’ అన్నారు భూమిక. నాని, సాయి పల్లవి జంటగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్, లక్ష్మణ్ నిర్మించిన ‘ఎంసీఏ’ ఈ నెల 21న విడుదలైంది. ఇందులో నాని వదినగా నటించిన భూమిక విలేకర్ల సమావేశంలో పలు విశేషాలు పంచుకున్నారు. ► నాని చాలా కంఫర్టబుల్ యాక్టర్. ఎక్సలెంట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు. కెమెరా ఆన్ అయితే చాలు టక్కున మారిపోతాడు. వరుస హిట్స్ వచ్చినా కూడా వెరీ డౌన్ టూ ఎర్త్. ‘దిల్’ రాజుగారు చాలా కూల్. అన్నింటినీ బాగా చూసుకుంటారు. బెస్ట్ ప్రొడక్షన్ హౌస్. నన్నో ఫ్యామిలీ మెంబర్లా చూసుకున్నారు. ► హాలీవుడ్, బాలీవుడ్ లాగా తెలుగులో చిన్న మార్పు రావాలి. విద్యాబాలన్ ‘తుమ్హారీ సులూ’ సినిమాలో పెళ్లయి, ఒక కొడుకు ఉన్న పాత్ర చేశారు. ఆ సినిమాలో చీరలే కట్టారు. గ్లామరస్‌గా ఏమీ ఉండరు. ఆరోగ్యంగా ఉంటారు. అందులో ఆమే మొయిన్ క్యారెక్టర్. అలాంటి చేంజ్ మన దగ్గర కూడా రావాలి. పెళ్లయితే చాలు... ఓన్లీ క్యారెక్టర్ రోల్స్ అని ఇక్కడివాళ్లు ఫిక్స్ అయిపోయారు. ► నా కజిన్ సిస్టర్ నాతో ట్రావెల్ చేస్తుంటారు. ఫ్యామిలీ నుంచి మంచి సపోర్ట్ ఉంది. అందుకే బాబు (యష్) గురించి నాకు దిగులు లేదు. మళ్లీ సినిమాలు నిర్మించే తీరిక లేదు. మా బాబుతో సరిపోతోంది. యష్ నర్సరీ చదువుతున్నాడు. నాకేదైనా షూటింగ్ ఉందంటే వాడు స్కూల్ ఎగ్గొట్టాలి. వాడు స్కూల్ ఎగ్గొట్టేంత విలువైన పాత్రలే చేయాలనుకుంటున్నాను (నవ్వుతూ). ‘సవ్యసాచి’లో నాగచైతన్య సిస్టర్ రోల్ చేస్తున్నాను. చాలా చిన్న పాత్ర అది. కానీ కథను ముందుకు తీసుకు వెళ్లే పాత్ర. ఎంత సేపు కనిపించాం అన్నది కాకుండా ఎంత మంచి రోల్ చేశాం అన్నది నాకు ముఖ్యం. ► నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకోవాలని ఉండేది. గ్రామర్ అంటేనే కొంచెం కష్టం. అందుకే ట్రై చేయలేదు. ‘ఎంసీఏ’లో చెప్పుకుందామనుకున్నా. కానీ కుదర్లేదు. ‘సవ్యసాచి’కి కచ్చితంగా ట్రై చేస్తా. ► ప్రస్తుతం హిందీలో ప్రభుదేవా, తమన్నా నటిస్తోన్న ‘కామోషి’లో మంచి రోల్ చేస్తున్నా. ఇది మార్చిలో రిలీజవుతుంది. తమిళంలో ‘కళియుగ కాలం’ అనే సినిమాలో నయనతార, నేను లీడ్ రోల్స్ చేస్తున్నాం. -
నిర్మాతంటే పదిమంది నిర్మాతలకి దారి చూపించాలి – కోడి రామకృష్ణ
‘‘పెళ్లి పందిరి’ సినిమాతో నా ప్రస్థానం మొదలైందంటూ రాజుగారు ఈ ఫంక్షన్ ఏర్పాటు చేయడం ఆయన సంస్కారానికి నిదర్శనం. ఆ సినిమా రాజుగారికే కాదు చాలామందికి టర్నింగ్ పాయింట్. చలనచిత్ర రంగానికి ఈరోజు రాజుగారు గర్వంగా మిగిలారు. నిర్మాతంటే సక్సెస్ఫుల్ సినిమా తీయడం మాత్రమే కాదు. పదిమంది నిర్మాతలకి దారి చూపించాలి. సినిమా అంటే ఇలా తీయాలి అని చూపించాలి. రాజుగారు ఓ సంచలన నిర్మాత అయ్యారంటే దానికి కారణం కృషి, పట్టుదల. ఇలాంటివాళ్లు ఇండస్ట్రీలో ఉంటే చలనచిత్ర రంగం ఎప్పుడూ ఎవర్గ్రీన్’’ అని దర్శకుడు కోడి రామకృష్ణ అన్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఈ ఏడాది ‘శతమానం భవతి, నేను లోకల్, ఫిదా, డీజే, రాజా ది గ్రేట్, ఎంసీఏ’ సినిమాలు వచ్చాయి. ఈ సందర్భంగా ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సెలబ్రేటింగ్ 2017’ కార్యక్రమం నిర్వహించారు. నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘ఈ ఏడాది మా బేనర్ నుంచి వచ్చిన ఆరు సక్సెస్‌ల గురించి అందరూ మాట్లాడుతున్నారు. ఈ ఆరు సినిమాల సక్సెస్‌లు మావి కాదు. టెక్నీషియన్స్, ఆర్టిస్ట్‌లవి. వారందరికీ థ్యాంక్స్. 1987 డిసెంబర్లో నా సినిమా లైఫ్ స్టార్ట్ అయింది. స్టార్టింగ్‌లో ఫెయిల్యూర్స్ వచ్చాయి. ‘పెళ్లి పందిరి’ మా లైఫ్‌లో లేకుంటే ఈ ఆరు సినిమాలు లేవు. ఐదు వేలరూపాయల గురించి మేం వెతుక్కున్న రోజులున్నాయి. డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఉన్న మేం ప్రొడక్షన్లోకి రావాలనే ఆలోచనతో వినాయక్‌తో ‘దిల్’ సినిమా తీశాం. సుకుమార్, బోయపాటి శీను, భాస్కర్, వంశీ, శ్రీకాంత్ అడ్డాల, వేణు.. ఇలా ఎనిమిది మంది దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తే ఏడుమంది సక్సెస్‌లో ఉండటం హ్యాపీ. హ్యాట్రిక్ సినిమాలు చేయాలనుకునేవాణ్ణి. కానీ ఆరు సినిమాలు ఒకే ఏడాదిలో హిట్ అవుతాయని కలలో కూడా లేదు. అది దేవుడు రాసిపెట్టి ఉన్నారు’’ అన్నారు. ‘‘ఒకే భాషలో ఆరు సినిమాలు చేసి వరుసగా హిట్స్, బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న ఘనత వెంకటేశ్వర బ్యానర్‌కి మాత్రమే దక్కింది. ఇందుకు రాజుగారు, శిరీష్, లక్ష్మణ్గార్లకి అభినందనలు’’ అన్నారు హీరో అల్లు అర్జున్. ‘‘తెలుగు సినిమాకి ది ఐకానిక్ ప్రొడ్యూసర్ రాజుగారు. ప్రొడక్షన్లోకి దిగాక తెలుస్తోంది అది ఎంత కష్టమో’’ అన్నారు హీరో నాని. ‘‘రాజుగారి సక్సెస్‌లో నేనూ పార్ట్ అయినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు హీరో వరుణ్ తేజ్. ‘‘ఈ ఏడాది ఎస్వీసీ బ్యానర్లో మొదటి హిట్ నా సినిమా అయినందుకు ఆనందంగా ఉంది’’ అని దర్శకుడు సతీశ్ వేగేశ్న అన్నారు. ‘‘మూడేళ్ల కిందట యువరాజ్ ఆరు సిక్సర్లు కొట్టారు. ఈ ఏడాది రాజుగారు ఆరు హిట్స్ కొట్టారు. ఆయన యువరాజ్.. ఈయన ‘దిల్’ రాజు అన్నారు’’ హరీష్ శంకర్. ‘‘రాజుగారు వంద సినిమాలు తీయాలి’’ అన్నారు దర్శకుడు శేఖర్ కమ్ముల. ‘‘ఎస్వీసీ బ్యానర్లో 27సినిమాలు తీస్తే అందులో 90శాతం సక్సెస్లుండటం గ్రేట్’’ అన్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. ‘‘ఆర్యతో అసిస్టెంట్ డైరెక్టర్‌గా నా జర్నీ ప్రారంభమైంది. రాజుగార్ని అప్పటి నుంచి చూస్తున్నా. ఆయన ఓ గోల్ పెట్టుకొని రీచ్ అవుతుంటారు’’ అన్నారు దర్శకుడు శ్రీరామ్ వేణు. ‘‘మూడేళ్ల తర్వాత నేను ఇక్కడున్నా’’ అన్నారు భూమిక. నటి జయసుధ, నటుడు జగపతిబాబు, ‘పెళ్లిపందిరి’ నిర్మాత రమేశ్, నిర్మాతలు శిరీష్, లక్ష్మణ్, బెక్కెం వేణుగోపాల్, సంగీత దర్శకులు దేవిశ్రీప్రసాద్, సాయికార్తీక్, శక్తికాంత్, నటుడు నరేశ్, హీరో నవీన్ చంద్ర, హీరోయిన్స్ మెహరీన్, అనుపమా పరమేశ్వరన్, దర్శకుడు వంశీ పైడిపల్లి, నక్కిన త్రినాథరావు తదితరులు పాల్గొన్నారు. -
నిన్న భూమిక..నేడు బిందు
-
ఈ పాపం ట్రాఫిక్ పోలీసులదే..!
సాక్షి, సిటీబ్యూరో: కొందరు ‘తెల్ల’ఖాకీల నిర్లక్ష్యం... ఓ లారీ డ్రైవర్ నిర్వాకం... వెరసి ఓ కుటుంబంలో పెను విషాదం నింపింది. ముక్కుపచ్చలారని తొమ్మిదేళ్ళ చిన్నారి భూమిక ఉప్పల్ చిలుకానగర్ ప్రాంతంలో మంగళవారం ఉదయం మొగ్గలోనే రాలిపోయింది... అదే లారీ పదేపదే ఒకే తరహా ఉల్లంఘనకు పాల్పడుతున్నా ట్రాఫిక్ పోలీసులు మాత్రం చలాన్లతో సరిపెట్టారు. ఫలితమే మంగళవారం చోటు చేసుకున్న భూమిక విషాదాంతం. ఈ పాపం ట్రాఫిక్ పోలీసులదే అనడంలో సందేహం లేదు. ఆ నిషేధం నామమాత్రమేనా..? రాజధానిలో పెరిగిపోతున్న ట్రాఫిక్ ఇబ్బందులకు తోడు లారీలు మృత్యుశకటాలుగా మారడంతో ఉన్నతాధికారులు ఆంక్షలు విధించారు. ప్రధాన రోడ్లపై లారీల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించారు. రాచకొండ పరిధిలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు, రాత్రి 10.30 నుంచి ఉదయం 6 గంటల వరకు మాత్రమే భారీ వాహనాలు రాకపోకలు సాగించాలి. అయితే ఇవన్నీ కేవలం కాగితాలకే పరిమితమయ్యాయనేందుకు భూమికను పొట్టనపెట్టుకున్న ఇసుక లారీనే ప్రత్యక్ష సాక్ష్యం. ఈ మృత్యుశకటం ఉదయం 8 గంటల ప్రాంతంలోనూ ఉప్పల్ ట్రాఫిక్ పోలీసుస్టేషన్ పరిధిలో ‘స్వేచ్ఛగా’ విహరించడమే ఇందుకు నిదర్శనం. గతంలోనే ఇదే మాదిరిగా... భూమికను చిదిమేసిన లారీ (ఏపీ 29 వీ 7539) నిషేధిత సమయంలో ఉప్పల్ ట్రాఫిక్ ఠాణా పరిధిలో విహరించడం ఇది తొలిసారి కాదు. గత మూడు నెలల్లో ఇలా ఉల్లంఘనకు పాల్పడుతూ రెండుసార్లు ‘రికార్డుల్లోకి’ ఎక్కింది. మంగళవారంతో కలుపుకుంటే మూడోసారి. అక్టోబర్ 18 ఉదయం 9.05 గంటలకు వీటీ కమాన్ ప్రాంతంలో ఈ లారీని పట్టుకున్న ట్రాఫిక్ పోలీసులు నో ఎంట్రీ సహా ఐదు ఉల్లంఘనలకు సంబంధించి రూ.2700 జరిమానా విధించారు. ఈ నెల 13న ఉప్పల్ టయోటా షోరూమ్ వద్ద రూ.700 జరిమానా విధించారు. ఈ రెండూ స్పాట్ చలాన్లే అని ట్రాఫిక్ పోలీసుల వెబ్సైట్ స్పష్టం చేస్తోంది. జరిమానా విధిస్తే సరా? పదేపదే నిషేధిత సమయాల్లో దూసుకువస్తున్న ఇలాంటి అనేక లారీలకూ ట్రాఫిక్ పోలీసులు జరిమానాలు విధిస్తున్నారు. ఒకసారి చలాన్ విధించిన తర్వాత 24 గంటల వరకు ఆ వాహనంపై అదే ఉల్లంఘనకు సంబంధించిన మరో చలాన్ విధించే ఆస్కారం లేదు. దీంతో అనేక వాహనాలు చలాన్ మొత్తాన్నీ కిరాయికి మాట్లాడుతుకున్న వ్యక్తుల నుంచే వసూలు చేస్తూ యథేచ్ఛగా తిరుగుతున్నాయి. వారికి కాసుల పంట... చిలుకానగర్ వద్ద ప్రమాదానికి కారణమైన ఆ లారీ ఉప్పల్ ఇసుక లారీల అడ్డా నుంచి బయలుదేరి నిషేధిత సమయంలోనే ఉప్పల్ చౌరస్తాను దాటుకుంటూ వచ్చింది. ఇసుక రవాణా వాహనాలతో పాటు నిర్మాణంలో ఉన్న భవనాలు, సముదాయాలకు సంబంధించినవీ ట్రాఫిక్ పోలీసులకు కాసుల పంట పండిస్తుంటాయి. అక్కడకు రాకపోకలు సాగించే భారీ వాహనాలను ‘వదిలేయడం’ కోసం వాటి యజమానులతో ఒప్పందాలు కుదుర్చుకుంటారనే ఆరోపణలున్నాయి. భూమికను చిదిమేసిన ఇసుక లారీ పదేపదే ఉప్పల్ ప్రాంతంలో విహరించడం వెనుక ఇలాంటి ‘సర్దుబాటు’ ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా చేస్తే... నగరం నడిబొడ్డు హైదరాబాద్, చుట్టపక్క ల ఉన్న ప్రాంతాలు సైబరాబాద్, రాచ కొండ పరిధిల్లోకి వస్తాయి. ఈ నేపథ్యంలోనే ‘నిషేధం’ విషయంలో మూడు కమిషనరేట్ల అధికారులూ సమన్వయంతో పని చేయాలి. పగలు రాత్రి లేడా లేకుండా నగరం, కీలక శివారు ప్రాంతాల్లోకి లారీల రాకపోకల్ని పూర్తిగా నిషేధించాలి. ఔటర్ రింగ్‌రోడ్ మినహా మరెక్కడా ఈ మృత్యుశకటాలు తిరక్కుండా చేయాలి. లోపల ఏరియాల్లో లోడింగ్, అన్లోడింVŠ కు కేవలం రాత్రి వేళల్లోనే అనుమతించాలి. నిబంధనలు, నిషేధాల్ని అతిక్రమించిన భారీ వాహనాలను స్వాధీనం చేసుకునే దిశగా ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకోవాలి. (ప్రమాదానికి కారణమైన లారీకి జారీ చేసిన చలాన్) -
డబుల్ హ్యాట్రిక్‌ని టార్గెట్ చేశాం
‘‘ఎం.సి.ఎ.(మిడిల్ క్లాస్ అబ్బాయి) సినిమాని ఈ నెల 21న విడుదల చేస్తామని ఆగస్ట్ 19నే ప్రకటించా. అయితే, ఈ నెల 15న విడుదల చేయడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ కుదరలేదు. అందుకే 21న విడుదల చేస్తున్నాం’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. నాని, సాయిపల్లవి జంటగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు నిర్మించిన ‘ఎం.సి.ఎ’ ఈ నెల 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ– ‘‘ఈ ఏడాది మా బ్యానర్లో ఐదు సినిమాలు హిట్ సాధించాయి. ఇదే ఏడాది ‘ఎం.సి.ఎ’తో డబుల్ హ్యాట్రిక్ సాధించాలనుకున్నాం. అందుకే, కథ అనుకున్నప్పటి నుంచి డిసెంబర్లో రిలీజ్‌కి ప్లాన్ చేశాం. ఈ సినిమా హిట్ అయితే మా బ్యానర్ డబుల్ హ్యాట్రిక్ సాధిస్తుంది. మధ్య తరగతి కుటుంబ సభ్యుల మధ్య రిలేషన్షిప్, డ్రామాతో పాటు ఈ సినిమాలో బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ ఉంటుంది. శ్రీరామ్ వేణు మధ్యతరగతి యువకుడు కాబట్టి ప్రేక్షకులకు నచ్చేలా సన్నివేశాలు రాసుకున్నారు. వదిన, మరిది మధ్య అనుబంధం ఈ చిత్రంలో హైలెట్. భూమిక వదినగా కనిపిస్తారు. నాని, సాయిపల్లవిల మధ్య సీన్స్ చూసి ప్రేక్షకులు ఎగ్జయిట్ అవుతారు. దేవిశ్రీ ప్రసాద్ మంచి పాటలిచ్చారు. సోమవారం ట్రైలర్ విడుదల చేయబోతున్నాం. ఈ నెల 16న ప్రీ–రిలీజ్ వేడుక ప్లాన్ చేస్తున్నాం. 21న ప్రేక్షకులు ఏం చెబుతారని ఆసక్తిగా వెయిట్ చేస్తున్నాం. మ్యాజిక్ వర్కవుట్ అయితే సినిమా పెద్ద హిట్ సాధిస్తుంది’’ అన్నారు. అఖిల్ హీరోగా నటించిన ‘హలో’ ఈ 22న విడుదల కానున్న విషయం తెలిసిందే. ‘‘ఈ సినిమా ట్రైలర్ చూశాను. చాలా బాగుంది. రెండు సినిమాలు ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అన్నారు ‘దిల్’ రాజు. -
మిడిల్ క్లాస్ కుర్రాడి సమస్య ఏంటి?
నెక్ట్స్ ఏంటి? అసలు, సిన్మా కథేంటి? ‘నేను లోకల్’తో హిట్ అందుకున్న హీరో నాని, నిర్మాత ‘దిల్’ రాజు మరో సినిమా చేస్తున్నామని అనౌన్స్ చేయగానే ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. ఆసక్తిని మరింత పెంచుతూ, ‘ఎంసీఏ’ టైటిల్ అనౌన్స్ చేశారు. ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ అనే క్యాప్షన్‌తో! దీపావళి సందర్భంగా మిడిల్ క్లాస్ అబ్బాయిని అందరికీ చూపించారు. గళ్ల లుంగీ... చేతిలో రెండు పాల ప్యాకెట్లు... ప్రతి రోజూ పలు ఏరియాల్లో కనిపించే అబ్బాయిలకు ప్రతినిధిలా నాని వచ్చేశారు. అతడి చూపుల్లో సంతోషం కనిపిస్తోంది. మరి, అతనికున్న సమస్య ఏంటి? అది ప్రేమలోనా? పౌరుషంగా బతికే విధానంలోనా? తెలియాలంటే డిసెంబర్ వరకూ వెయిట్ చేయాల్సిందే. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న చిత్రమిది. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘ఇందులో సాయి పల్లవి హీరోయిన్. భూమిక కీ–రోల్ చేస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ మంచి మ్యూజిక్ ఇస్తున్నారు. ఈ చిత్రం మా బ్యానర్ వేల్యూను పెంచుతుంది. యాభై శాతం షూటింగ్ కంప్లీట్ చేశాం. డిసెంబర్ 21న సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. -
కష్టాల్లో నటి భూమిక!
అక్కైనైనా, వదినైనా అలాంటి ఇంకే పాత్రలనై చేయడానికి రెడీ అంటోందట నటి భూమిక. ఈ భామ బహు భాషానటి అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విజయ్‌కు జంటగా భద్రి చిత్రం ద్వారా కోలీవుడ్‌కు నాయకిగా పరిచయం అయిన భూమికకు రోజాకూట్టం మంచి పేరు తెచ్చి పెట్టింది. ఆ తరువాత సూర్యతో సిల్లన్ను ఒరు కాదల్, సిత్తిరైయిల్ ఒరు నిలాస్సోరు లాంటి కొన్ని చిత్రాల్లో నటించింది. ప్రభుదేవాకు జంటగా నటించిన కళవాడియ పొళుదుగళ్ చిత్రం నిర్మాణం పూర్తి అయ్యి చాలా ఏళ్లే అయినా ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు. తెలుగులోనూ ఖుషీ, సింహాద్రి వంటి మంచి విజయవంతమైన చిత్రాల్లో నటించినా ఎక్కువ చిత్రాల్లో నటించలేదు. నటిగా మంచి ఫామ్‌లో ఉండగానే యోగా మాస్టర్ భరత్‌ను ప్రేమించి పెళ్లి చేసుక్ను భూమిక చిత్రాలను తగ్గించుకుంది. బిడ్డకు తల్లి అయిన భూమిక తన భర్తను నిర్మాతగా నిలబెట్టే ప్రయత్నం చేసి చేతులు కాల్చుకుంది. ఈ విషయంలోనే భర్త భరత్‌తో మనస్పర్థలు తలెత్తాయనే ప్రచారం ఆ మధ్య జోరుగా సాగింది. విషయం విడాకుల వరకూ వచ్చినట్లు సోషల్ మీడియాలో ప్రచారం హల్చల్ చేసింది. అయితే తన వ్యక్తిగత విషయాల గురించి నటి భూమిక ఎక్కడా బయట పెట్టలేదు. అయితే తను ఆర్థికపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నట్లు టాక్. దీంతో మళ్లీ నటనపై దృష్టి సారించిన భూమికకు హీరోయిన్ అవకాశాలు ముఖం చాటేశాయి. ఎంఎస్.ధోని అనే హిందీ చిత్రంలో ధోనికి అక్కగా చిన్న పాత్ర పోషించడానికి కూడా వెనుకాడలేదు. ఆ తరువాత కూడా భూమికకు అవకాశాలు రావడంలేదు. ఇక లాభం లేదని అవకాశాల వేటలో పడ్డ భూమిక అక్క, వదిన లాంటి పాత్రల్లో నటించడానికి రెడీ అంటూ తన సన్నిహితులతో చెబుతున్నారట. మరి భూమిక గోడును కోలీవుడ్, టాలీవుడ్ వర్గాలు ఆలకిస్తాయా? అలాంటి అవకాశాలతో ప్రోత్సహిస్తాయా అన్నది వేచి చూడాల్సిందే. -
మిస్సమ్మ మళ్లీ వస్తోంది..!
ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న భూమిక, పెళ్లి తరువాత సినిమాలకు దూరంగా ఉంటోంది. పూర్తిగా నటించటం మానేయకపోయినా.. చాలా తక్కువగా సినిమాల్లో నటిస్తోంది. ఖుషి, ఒక్కడు లాంటి కమర్షియల్ సినిమాలతో పాటు మిస్సమ్మ, అనసూయ లాంటి లేడి ఓరియంటెడ్ చిత్రాల్లోనూ అలరించింది భూమిక. చివరగా టాలీవుడ్లో లడ్డుబాబు సినిమాలో నటించిన ఈ భామ త్వరలో మరో తెలుగు సినిమా చేసేందుకు అంగీకరించింది. నాచ్యురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమాలో భూమిక కీలక పాత్రలో నటించనుందట. అయితే ఈ సినిమాలో భూమికది సిస్టర్ క్యారెక్టర్ అన్న టాక్ వినిపిస్తోంది. హీరోయిన్గా గ్లామర్ రోల్స్‌తో పాటు, లేడి ఓరియంటెండ్ సినిమాల్లోనూ అలరించిన భూమిక, ఈ సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారబోతోంది. మరి ఈ సెకండ్ ఇన్నింగ్స్‌లో మిస్సమ్మ ఎంత వరకు అలరిస్తుందో చూడాలి. -
ఫీల్ గుడ్ లవ్‌స్టోరీ
‘ప్రేమంటే సులువు కాదురా.. అది నీవు గెలవలేవురా... ప్రేమించ షరతులేమిటో..’ అంటూ ‘ఖుషీ’ చిత్రంలో పవన్ కల్యాణ్, భూమిక పాడుకున్న పాట ఇప్పటికీ యువత మదిలో మెదులుతూ ఉంటుంది. ఇప్పుడా ప్రస్తావన ఎందు కంటే.. ‘ప్రేమంటే సులువు కాదురా’ పేరుతో ఓ చిత్రం తెరకెక్కింది. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్ సాలూరి, సిమ్మీదాస్ జంటగా చందా గోవిందరెడ్డిని దర్శకత్వంలో భవనాసి రాంప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రం రిలీజ్‌కి రెడీగా ఉంది. నిర్మాత మాట్లాడుతూ- ‘‘కుటుంబ భావోద్వేగాలకు పెద్దపీట వేస్తూ తీసిన చిత్రమిది. ఫీల్ గుడ్ ఎమోషనల్ లవ్‌స్టోరీ. ‘మా అబ్బాయి నటించిన చిత్రాల్లో ఇది బెస్ట్’ అని కోటిగారు ప్రశంసించడం మరచిపోలేను. నందన్‌రాజ్ స్వరపరచిన పాటలకు మంచి స్పందన వచ్చింది. కమలాకర్ రీ-రికార్డింగ్ హైలెట్’’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: కొమారి సుధాకర్‌రెడ్డి, శ్రీపతి శ్రీరాములు. -
చెరువులో మునిగి ఇద్దరు చిన్నారులు మృతి
ఖమ్మం జిల్లా కూనవరం మండలం పైడిగూడెంలో ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు మృత్యువాతపడ్డారు. గ్రామానికి చెందిన చిన్నారులు చదల స్వాతి(5), వల్లా భూమిక(5) బుధవారం మధ్యాహ్నం సమీపంలోని చెరువు వద్దకు వెళ్లారు. ఆడుకుంటూ నీటిలోకి దిగారు. సమీపంలోని ఉన్న వారెవరూ గమనించకపోవటంతో మునిగి చనిపోయారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
'గిరిజన బాలికల ఘటనపై విచారణ చేయండి'
వరంగల్: రాష్ర్ట వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసులో ఇంతవరకు ఎలాంటి పురోగతి లేకపోవడంతో విద్యార్థి లోకం ఆగ్రహించింది. ఇద్దరు గిరిజన బాలికలు అదృశ్యం అయి.. దారుణంగా హత్యకు గురైన ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ.. ఈ సంఘటనపై న్యాయ విచారణ జరిపించాలని దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ.. విద్యార్థి సంఘాల నాయకులు కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. భూమిక, ప్రియాంకలపై అత్యాచారం చేసి కిరాతకంగా హతమార్చిన దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ..డీఎస్‌యూ. టీవీవీ, ఏఎస్యూ, టీవీఎస్, ఏబీఎస్ఎఫ్, టీఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలతో పాటు వివిధ పార్టీలకు చెందిన నాయకుల ఆధ్వర్యంలో శుక్రవారం కలక్టరేట్ వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. ఈ ఘటన పై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. -
‘గిరిజన బాలికలది ముమ్మాటికీ హత్యే’
వరంగల్ జిల్లాలో గిరిజన బాలికల హత్యకు కారకులైన వారిని వెంటనే పట్టుకుని శిక్షించాలని వివిధ ప్రజా, మహిళ, కుల సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు గురువారం హైదర్‌గూడ ఎన్ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విరసం నేత వరవరరావు మాట్లాడారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కంబాలకుంట తండాకు చెందిన బానోతు భూమిక(14), ప్రియాంక(14)లది ఆత్మహత్యలా కనబడడం లేదని, అది ఆత్యాచారం జరిపి ముక్కలు ముక్కలుగా చేశారని దీనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి, హత్యకేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన బాలికల ఘటన ఓ రాకెట్ అని ఆయన ఆరోపించారు. తాము చదువుకుంటున్న నల్లబెల్లి మండలం మూడు చెక్కలపల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలకని నవంబర్ 24న బయలుదేరి మార్గమధ్యలోనే మాయమయ్యారని ఆయన తెలిపారు. వారిని నిర్బంధించి అత్యాచారం జరిపి, ముక్కలుగా నరికి గుట్టల్లో విసిరేయడం, వారి అవయవాలను కుక్కలు పీక్కుతినడం దుర్మార్గమైన ఘటన అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో హాస్టల్ వార్డెన్, ఎస్ఐ లపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఘటనకు స్థానిక మంత్రి, ఉపముఖ్యమంత్రి, ఎమ్మెలేలు బాధ్యత వహించాలని ఆయన కోరారు. మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, కులనిర్మూలన పోరాట సమితి ఉపాధ్యక్షులు బూరం అభినవ్, పౌరహక్కుల సంఘం నాయకులు ప్రొఫెసర్ లక్ష్మణ్, చైతన్య మహిళ సంఘం నాయకురాలు జయ, కిష్టప్ప(డిటిఎఫ్), ట్రైబల్ జేఏసీ నాయకులు ఉదయ్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
మల్లంపల్లిదే మందు డబ్బా ?
ఆత్మహత్య చేసుకునేందుకే బాలికలే కొన్నారా.. ? హతమార్చే ఆలోచన ఉన్న వారి పనేనా... ? నర్సంపేట : భూమిక, ప్రియూంక మృతిపై కారణాలు తెలుసుకునే కొద్దీ పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నారుు. హాస్టల్ లో ఉండేందుకు ఆసక్తిలేక ఇంటికి వెళ్లిన వారు తిరిగి హాస్టల్‌కు వెళ్తున్నామని చెప్పి వుల్లంపల్లిలోని బంధువుల ఇంటికి వెళ్లగా తల్లిదండ్రులకు తెలియుడంతో వుందలించినట్లు సమాచార. దీంతో వారు ఆత్మహత్య చేసుకునేందుకు నిర్ణరుుంచుకుని వుల్లంపల్లిలోనే వుందుడబ్బా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. లేదంటే విద్యార్థినులను హతవూర్చాలనే ముందస్తు ఆలోచన ఉన్న వారు పథకం ప్రకారమే వుల్లంపల్లికి వెళ్లిన విద్యార్థినులను కలుసుకుని అక్కడే వుందుడబ్బా కొనుగోలు చేసి హతవూర్చిన తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు సంఘటన స్థలంలో వదిలివెళ్లారా అనే అనువూనాలు వ్యక్తవువుతున్నారుు. వుల్లంపల్లిలోని హరిహర ఫర్టిలైజర్ దుకాణంలో క్రిమిసంహారక వుందు డబ్బాను కొనుగోలు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు తెలిసింది. పోలీసులు అదుపులో పలువురు.. ఈ కేసులో వుల్లంపల్లికి చెందిన ఫర్టిలైజర్ యుజవూనితోపాటు నర్సం పేటకు చెందిన కొందరు యుువకులను, ఆటో డ్రైవర్లను, బాలికల స మీప బంధువులను వేర్వేరుగా పోలీసులు విచారిస్తున్నట్లు తెలిసింది. -
సెకెండ్ ఇన్నింగ్స్‌లో భూమిక సక్సెస్ అవుతుందా?
-
దుబాయ్‌లో భూమిక
సగటు పౌరుడు సంపాదించుకోవడానికి అమెరికా, సింగపూర్, దుబాయ్ లాంటి అరబ్ దేశాలకు వెళ్లడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అయితే కొందరు నటీమణులు మాత్రం ఇక్కడ బాగా సంపాదించుకుని విదేశాల్లో సెటిలవ్వాలని ఆశిస్తుంటారు. నటి భూమిక ఇందుకు అతీతం కాదు. తమిళం, తెలుగు, హిందీ, కన్నడం భాషల్లో పలు చిత్రాల్లో నటించి పాపులర్ అయిన నటి భూమిక. 2000 సంవత్సరంలో ప్రముఖ నటిగా వెలుగొందిన ఈమె తమిళంలో బద్రి, రోజాకూటం, చిల్లున్ను ఒరు కాదల్ తదితర చిత్రాల్లో నటించారు. అలాగే తెలుగులో మిస్సమ్మ, ఖుషి, సింహాద్రి చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. యోగా మాస్టర్ భరత్‌ను పెళ్లి చేసుకుని కొంతకాలం నటనకు దూరంగా ఉన్న భూమిక ఆ తరువాత నటిగానే కాకుండా తన భర్తను నిర్మాతగా చేర్చి రెండు మూడు చిత్రాలు నిర్మించారు. భూమికకు ఏడాదిన్నర కొడుకు ఉన్నాడు. కొడుకు పుట్టిన తరువాత నటనకు దూరంగా ఉన్న భూమిక ఇప్పుడు దుబాయ్‌లో సెటిల్ అయ్యారు. అక్కడ యోగా సెంటర్‌ను నెలకొల్పి భర్తకు సాయంగా ఉంటున్నారు. అంతేకాదు ఇండియాలోనూ పలు యోగా సెంటర్లను నెలకొల్పుతున్నట్లు భూమిక తెలిపారు. -
భూమికకు కొడుకు పుట్టాడు!
బిడ్డకు జన్మనివ్వడం అంటే పునర్జన్మ ఎత్తినట్లే. ఇటీవలే భూమికకు ఇది అనుభవంలోకొచ్చింది. జస్ట్ రెండు వారాల క్రితమే ఆమె ఓ బాబుకి జన్మనిచ్చారు. ‘బిడ్డకు జన్మనిచ్చేది తల్లి అయితే.. ఆ తల్లికి జన్మనిచ్చేది ఆ బిడ్డే. బిడ్డతో పాటు ఆ తల్లీ పుట్టినట్లే’ అంటున్నారు భూమిక. భరత్ ఠాగూర్ని వివాహం చేసుకున్న తర్వాత భూమిక పెద్దగా సినిమాలు చేయలేదు. ఆ మధ్య ‘ఏప్రిల్ ఫూల్’ అనే చిత్రంలోనూ. రవిబాబు దర్శకత్వంలో ‘లడ్డూబాబు’లోనూ నటించారు. ఈ రెండూ విడుదలకు సిద్దమయ్యాయి. భూమిక తెరపై కనిపించి చానాళ్లయ్యింది కాబట్టి, ఆమె సినిమాలకు ఫుల్స్టాప్ పెట్టేశారని చాలామంది ఊహించారు. కానీ, సినిమాలకు దూరమయ్యే ప్రసక్తే లేదని, గర్భవతిగా ఉన్నప్పుడే ‘ఏప్రిల్ ఫూల్’లో చేశానని భూమిక తెలిపారు. ప్రస్తుతం మాతృత్వం తాలూకు ఆనందాన్ని అనుభవిస్తున్నారామె. త్వరలో మా అబ్బాయికి నామకరణ మహోత్సవం జరపనున్నామని చెబుతూ -‘‘ప్రెగ్నెన్సీ నుంచి తల్లయిన వరకు జరిగిన ప్రయాణానికి సంబంధించిన అనుభూతిని మాటల్లో చెప్పలేను. పుట్టిన బిడ్డను చూసిన క్షణంలో నేను, భరత్ ఆనందం పట్టలేక ఏడ్చేశాం. బాబుకి ఏ పేరు పెట్టాలో ఇంకా నిర్ణయించుకోలేదు. జీవితంలో వచ్చిన ఈ కొత్త దశ చాలా చాలా బాగుంది’’ అని తెలిపారు. -
స్టార్ స్టార్ సూపర్ స్టార్ - భూమిక