‘‘మళ్లీ తెలుగులో కనిపించటం సంతోషంగా ఉంది. ‘ఎంసీఏ’లో నాది చాలా స్ట్రాంగ్ రోల్. తక్కువగా మాట్లాడినా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. నా దృష్టిలో ఏదైనా యాక్టింగే. వదిన పాత్ర చేయడానికి రిఫరెన్స్ ఏం తీసుకోలేదు. ఫ్రెండ్స్‌ని చూసి ఇన్‌స్పైర్ అవుతుంటా’’ అన్నారు భూమిక. నాని, సాయి పల్లవి జంటగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్, లక్ష్మణ్ నిర్మించిన ‘ఎంసీఏ’ ఈ నెల 21న విడుదలైంది. ఇందులో నాని వదినగా నటించిన భూమిక విలేకర్ల సమావేశంలో పలు విశేషాలు పంచుకున్నారు.
► నాని చాలా కంఫర్టబుల్ యాక్టర్. ఎక్సలెంట్ ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తాడు. కెమెరా ఆన్ అయితే చాలు టక్కున మారిపోతాడు. వరుస హిట్స్ వచ్చినా కూడా వెరీ డౌన్ టూ ఎర్త్. ‘దిల్’ రాజుగారు చాలా కూల్. అన్నింటినీ బాగా చూసుకుంటారు. బెస్ట్ ప్రొడక్షన్ హౌస్. నన్నో ఫ్యామిలీ మెంబర్‌లా చూసుకున్నారు.
► హాలీవుడ్, బాలీవుడ్ లాగా తెలుగులో చిన్న మార్పు రావాలి. విద్యాబాలన్ ‘తుమ్హారీ సులూ’ సినిమాలో పెళ్లయి, ఒక కొడుకు ఉన్న పాత్ర చేశారు. ఆ సినిమాలో చీరలే కట్టారు. గ్లామరస్‌గా ఏమీ ఉండరు. ఆరోగ్యంగా ఉంటారు. అందులో ఆమే మొయిన్ క్యారెక్టర్. అలాంటి చేంజ్ మన దగ్గర కూడా రావాలి. పెళ్లయితే చాలు... ఓన్లీ క్యారెక్టర్ రోల్స్ అని ఇక్కడివాళ్లు ఫిక్స్ అయిపోయారు.
► నా కజిన్ సిస్టర్ నాతో ట్రావెల్ చేస్తుంటారు. ఫ్యామిలీ నుంచి మంచి సపోర్ట్ ఉంది. అందుకే బాబు (యష్) గురించి నాకు దిగులు లేదు. మళ్లీ సినిమాలు నిర్మించే తీరిక లేదు. మా బాబుతో సరిపోతోంది. యష్ నర్సరీ చదువుతున్నాడు. నాకేదైనా షూటింగ్ ఉందంటే వాడు స్కూల్ ఎగ్గొట్టాలి. వాడు స్కూల్ ఎగ్గొట్టేంత విలువైన పాత్రలే చేయాలనుకుంటున్నాను (నవ్వుతూ). ‘సవ్యసాచి’లో నాగచైతన్య సిస్టర్ రోల్ చేస్తున్నాను. చాలా చిన్న పాత్ర అది. కానీ కథను ముందుకు తీసుకు వెళ్లే పాత్ర. ఎంత సేపు కనిపించాం అన్నది కాకుండా ఎంత మంచి రోల్ చేశాం అన్నది నాకు ముఖ్యం.
► నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకోవాలని ఉండేది. గ్రామర్ అంటేనే కొంచెం కష్టం. అందుకే ట్రై చేయలేదు. ‘ఎంసీఏ’లో చెప్పుకుందామనుకున్నా. కానీ కుదర్లేదు. ‘సవ్యసాచి’కి కచ్చితంగా ట్రై చేస్తా.
► ప్రస్తుతం హిందీలో ప్రభుదేవా, తమన్నా నటిస్తోన్న ‘కామోషి’లో మంచి రోల్ చేస్తున్నా. ఇది మార్చిలో రిలీజవుతుంది. తమిళంలో ‘కళియుగ కాలం’ అనే సినిమాలో నయనతార, నేను లీడ్ రోల్స్ చేస్తున్నాం.
Comments
Please login to add a commentAdd a comment