![nani mca movie release on 21th December 2017 - Sakshi](/styles/webp/s3/article_images/2017/11/28/nai.jpg.webp?itok=M0sZGwvE)
‘శతమానం భవతి’ టు ‘రాజా ది గ్రేట్’... ఈ ఏడాది ‘దిల్’ రాజు నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నుంచి మొత్తం ఐదు చిత్రాలు (మధ్యలో నేను లోకల్, దువ్వాడ జగన్నాథమ్ (డీజే), ఫిదా) వచ్చాయి. ఇప్పుడు నాని ‘ఎంసిఎ’తో సిక్సర్ (ఒకే ఏడాది 6 సినిమాలు రిలీజ్ చేయడం) కొట్టడం గ్యారెంటీ అంటున్నారు ‘దిల్’ రాజు. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో శిరీష్, లక్ష్మణ్‌లతో కలసి ఆయన నిర్మించిన ‘ఎంసిఎ’ను డిసెంబర్ 21న విడుదల చేస్తున్నామని ప్రకటించారు. సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ రెండు పాటలు మినహా పూర్తయింది. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘ఈ ఏడాది ‘నేను లోకల్’తో నాని మా సంస్థలో హిట్ అందుకున్నాడు. ‘ఎంసిఎ’ అంతకు మించి హిట్టవుతుంది. మా సంస్థకు డబుల్ హ్యాట్రిక్ అందిస్తుంది. ఇందులో భూమిక కీలక పాత్ర చేశారు. అద్భుతమైన కథతో నానీని సరికొత్త స్టయిల్‌లో చూపిస్తున్నాడు శ్రీరామ్ వేణు. మిగతా రెండు పాటలను స్పెయిన్‌లో నాలుగు రోజుల్లో చిత్రీకరిస్తాం. దేవిశ్రీ ప్రసాద్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఆల్రెడీ విడుదలైన టైటిల్ సాంగ్‌కి మంచి స్పందన వచ్చింది. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ‘కొత్తగా..’ పాటను విడుదల చేస్తాం’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment