‘‘ఫెయిల్యూర్స్‌లో ఉన్నప్పుడు పేర్లు (ప్రముఖ దర్శకులు) కావాలేమో కానీ, ప్రేక్షకులు ఆదరిస్తున్నప్పుడు, కుదిరితే ప్రతి సినిమాకి ఓ కొత్త డైరెక్టర్‌ని పరిచయం చేయాలి. మంచి పొజిషన్‌లో ఉంటే ఒక కొత్త హీరోయిన్‌ని ఇంట్రడ్యూస్ చేయగలగాలి. నా లాస్ట్ సినిమా పెద్ద హిట్ అయితే... వెంటనే పెద్ద పేరున్న డైరెక్టర్‌తో సినిమా చేయాలనుకోను. కొత్తవాళ్లతో చేయాలని ఆలోచిస్తాను. తెలుగులో కొత్త హీరోయిన్స్ లేరు. యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ రావడం లేదు అన్న మాటలు ఇండస్ట్రీలో వినిపిస్తుంటాయి.
చాన్స్‌లు ఇస్తే కదా కొత్తవారు వచ్చేది. నేనెప్పుడూ పేర్ల వెనక పరిగెత్తలేదు. పరిగెత్తను కూడా. పేర్ల కోసం నేను సినిమాలు చేయలేదు. చేయను.’’ అన్నారు హీరో నాని. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో నాని, సాయి పల్లవి జంటగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు, శిరీష్, లక్ష్మణ్ నిర్మించిన ‘ఎంసీఏ’ సినిమా గురువారం విడుదల కానుంది. ఈ సందర్భంగా నాని మంగళవారం పాత్రికేయులతో మాట్లాడారు. ఆయన చెప్పిన విశేషాలు..
► ‘ఎంసీఏ’లో క్యారెక్టర్స్ రియల్‌గా ఉంటాయి. సినిమా స్క్రీన్‌ప్లే యాక్షన్ మూడ్‌లో సాగుతుంది. కానీ యాక్షన్ సినిమా కాదు. రెగ్యులర్ మిడిల్ క్లాస్ అబ్బాయిలానే నా క్యారెక్టర్ ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లో ఈ మిడిల్ క్లాస్ అబ్బాయి హీరో అవ్వాల్సి వచ్చిందన్నది స్క్రీన్‌పై చూస్తే ప్రేక్షకులు థ్రిల్ అవుతారన్న నమ్మకం ఉంది. డైరెక్టర్ వేణు శ్రీరామ్ మిడిల్ క్లాస్ ఎమోషన్స్ అండ్ క్యారెక్టర్స్‌కు కమర్షియల్ హంగులు జోడించి బాగా తీశారు. ‘ఎంసీఏ’ షూటింగ్ స్పాట్‌లో నాకు, సాయి పల్లవికి మధ్య క్లాషెస్ వచ్చాయన్న న్యూస్ విని, ఇద్దరం నవ్వుకున్నాం.
► బ్యాగ్రౌండ్ ఉంటే చాలా ప్రెజర్ ఉంటుందేమో. ఇప్పుడు నాకు నచ్చిన సినిమా చేసుకుంటూ కెరీర్‌లో ముందుకెళ్లొచ్చు. బ్యాగ్రౌండ్ ఉన్నవాళ్లకు ఈ ఫ్రీడమ్ ఉండకపోవచ్చేమో.
► ‘భలే భలే మగాడివోయ్’ టైమ్‌లో నేచురల్ స్టార్ నాని అనే ట్యాగ్ ఇబ్బందిగా అనిపించింది. కానీ ఇప్పుడు లేదు. నేచురల్ స్టార్ అన్న పదంలో ప్రేక్షకుల ప్రేమ కనిపిస్తోంది.
► ‘మహానటి, భారతీయుడు’ లాంటి కథలు నాకు చెప్పి ఉంటే... నేను రిజెక్ట్ చేసి ఉంటే.. అదో రకం. నా దగ్గరకు అలాంటి కథలు రావడం లేదు. ప్రతిరోజు కొత్త కథలు వినడానికి టైమ్ కేటాయిస్తా. బట్ ఒక్క కథ కూడా రావడం లేదు. కమల్‌హాసన్‌గారు చూపిన వేరియేషన్స్‌ను మా యంగ్ జనరేషన్ యాక్టర్స్ అసలు చేయగలరా? అనిపిస్తుంది. చేస్తే మా జన్మ ధన్యమైనట్టే.
► మంచి సినిమాలు చేద్దామనే నిర్మాతగా మారాను. ‘అ!’ సినిమా ఫిబ్రవరిలో రిలీజ్ అనుకుంటున్నాం. సినిమా కాన్సెప్ట్ విని థ్రిల్ అయ్యాను. మంచి ఐడియా విన్నప్పుడు ఎవరూ ప్రొడ్యూస్ చేయరన్నప్పుడు, ఆ ఐడియా నాకు నచ్చితే నిర్మిస్తా.
► డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య చెప్పిన కథ నాగార్జునగారికి, నాకు నచ్చింది. ‘కృష్ణార్జునయుద్ధం’లో డబుల్ రోల్ చేస్తున్నా. అనిల్ రావిపూడితో ఓ సినిమా ఉండొచ్చు. మణిరత్నంగారి మూవీకి డిస్కషన్స్ జరిగాయి. డేట్స్ కుదరలేదు. అవసరాల శ్రీనివాస్‌తో ఓ సినిమా చేయాలి.
మంగళవారం మార్నింగ్ ఓ వెబ్‌సైట్‌లో న్యూస్ చదివి, బాధపడ్డాను. సంస్కారహీనంగా ఎంత దిగజారిపోయారంటే... ‘సినిమా బాగోలేదు. అంటే బాగోలేదు’ అని చెప్పండి. లేకపోతే ఇతను రెమ్యూనరేషన్ పెంచాడనో, షూటింగ్‌లో ఇబ్బంది పెడతాడనో, వీడికి తిక్క అనో.. ఇలాంటి గాసిప్‌లు రాయొచ్చు. వ్యక్తిగత జీవితంలోకి వెళ్లి ... అంటే అది ఏ విషయం గురించో కూడా చెప్పలేని పరిస్థితి నాదిప్పుడు. అంత దిగజారిపోయారు. ఇది సందర్భం అవునో కాదో నాకు తెలీదు. కానీ లింక్ చూసిన వెంటనే పదేళ్లు ఇండస్ట్రీలో ఉండి, ఇన్ని సినిమాలు చేసి, నేనేంటో అందరికీ తెలిశాక, ఇంత దారుణమైన మాటలతో, ఇలాంటి ఆర్టికల్ కూడా ఒకటి నా మీద రాయొచ్చా? అన్న ఫీలింగ్ కలిగింది.
పెళ్లై ఒక రిలేషన్‌లో ఉన్నాను. అసలు.. ఎలా? పొద్దునే కూర్చొని అలా రాసేస్తారా? అనిపిస్తుంది. ఒక సినిమా రెండు రోజుల్లో రిలీజ్ అవుతుంది అనగానే.. ఒక దారుణమైన హెడ్డింగ్ పెట్టేసి, నా పేరు చెప్పకుండా రెండు రోజుల్లో సినిమా రిలీజ్ అయ్యే ఒక హీరో అని రాస్తున్నారు. గాసిప్‌లు రాయొచ్చు. కానీ దిగజారిపోయి రాయాల్సిన అవసరంలేదేమో అనిపిస్తుంది. మనం సినిమాల మీద రన్ అవుతున్నాం. గాసిప్‌లు, రివ్యూస్, ఊహలు, నిజాలు ఇలా అన్ని పార్ట్స్ రాసుకోవచ్చు. కానీ ఊహకు కూడా అందని ఓ థాట్‌ని రుద్ది ఓ హెడ్డింగ్‌లా పెట్టి, రిలీజ్‌కి ముందు క్లిక్స్ కోసం ఇలా రాయడం సరికాదని నా ఫీలింగ్. నాకు బాధ కలిగింది కాబట్టి చెప్పాను.
నేను పేర్ల వెనక పరిగెత్తను
Published Wed, Dec 20 2017 12:47 AM | Last Updated on Wed, Dec 20 2017 12:47 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment