డబుల్‌ హ్యాట్రిక్‌ని టార్గెట్‌ చేశాం | 'MCA' To Release On Dec 21 | Sakshi
Sakshi News home page

డబుల్‌ హ్యాట్రిక్‌ని టార్గెట్‌ చేశాం

Published Fri, Dec 8 2017 1:27 AM | Last Updated on Fri, Dec 8 2017 1:27 AM

'MCA' To Release On Dec 21 - Sakshi

‘‘ఎం.సి.ఎ.(మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి) సినిమాని ఈ నెల 21న విడుదల చేస్తామని ఆగస్ట్‌ 19నే ప్రకటించా. అయితే, ఈ నెల 15న విడుదల చేయడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ కుదరలేదు. అందుకే 21న విడుదల చేస్తున్నాం’’ అని నిర్మాత ‘దిల్‌’ రాజు అన్నారు. నాని, సాయిపల్లవి జంటగా  శ్రీరామ్‌ వేణు దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై ‘దిల్‌’ రాజు నిర్మించిన ‘ఎం.సి.ఎ’ ఈ నెల 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ– ‘‘ఈ ఏడాది మా బ్యానర్‌లో ఐదు సినిమాలు హిట్‌ సాధించాయి.

ఇదే ఏడాది ‘ఎం.సి.ఎ’తో డబుల్‌ హ్యాట్రిక్‌ సాధించాలనుకున్నాం. అందుకే, కథ అనుకున్నప్పటి నుంచి డిసెంబర్‌లో రిలీజ్‌కి ప్లాన్‌ చేశాం. ఈ సినిమా హిట్‌ అయితే మా బ్యానర్‌ డబుల్‌ హ్యాట్రిక్‌ సాధిస్తుంది. మధ్య తరగతి కుటుంబ సభ్యుల మధ్య రిలేషన్‌షిప్, డ్రామాతో పాటు ఈ సినిమాలో బ్యూటిఫుల్‌ లవ్‌స్టోరీ ఉంటుంది. శ్రీరామ్‌ వేణు  మధ్యతరగతి యువకుడు కాబట్టి ప్రేక్షకులకు నచ్చేలా సన్నివేశాలు రాసుకున్నారు. వదిన, మరిది మధ్య అనుబంధం ఈ చిత్రంలో హైలెట్‌.

భూమిక వదినగా కనిపిస్తారు. నాని, సాయిపల్లవిల మధ్య సీన్స్‌ చూసి ప్రేక్షకులు ఎగ్జయిట్‌ అవుతారు. దేవిశ్రీ ప్రసాద్‌ మంచి పాటలిచ్చారు. సోమవారం ట్రైలర్‌  విడుదల చేయబోతున్నాం. ఈ నెల 16న ప్రీ–రిలీజ్‌ వేడుక ప్లాన్‌ చేస్తున్నాం. 21న ప్రేక్షకులు ఏం చెబుతారని ఆసక్తిగా వెయిట్‌ చేస్తున్నాం. మ్యాజిక్‌ వర్కవుట్‌ అయితే సినిమా పెద్ద హిట్‌ సాధిస్తుంది’’ అన్నారు. అఖిల్‌ హీరోగా నటించిన ‘హలో’ ఈ 22న విడుదల కానున్న విషయం తెలిసిందే. ‘‘ఈ సినిమా ట్రైలర్‌ చూశాను. చాలా బాగుంది. రెండు సినిమాలు ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అన్నారు ‘దిల్‌’ రాజు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement