'గిరిజన బాలికల ఘటనపై విచారణ చేయండి'
Published Fri, Jan 22 2016 1:36 PM | Last Updated on Tue, Nov 6 2018 4:13 PM
వరంగల్: రాష్ర్ట వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసులో ఇంతవరకు ఎలాంటి పురోగతి లేకపోవడంతో విద్యార్థి లోకం ఆగ్రహించింది. ఇద్దరు గిరిజన బాలికలు అదృశ్యం అయి.. దారుణంగా హత్యకు గురైన ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ.. ఈ సంఘటనపై న్యాయ విచారణ జరిపించాలని దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ.. విద్యార్థి సంఘాల నాయకులు కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు.
భూమిక, ప్రియాంకలపై అత్యాచారం చేసి కిరాతకంగా హతమార్చిన దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ..డీఎస్‌యూ. టీవీవీ, ఏఎస్‌యూ, టీవీఎస్, ఏబీఎస్‌ఎఫ్, టీఎస్‌ఎఫ్ విద్యార్థి సంఘాలతో పాటు వివిధ పార్టీలకు చెందిన నాయకుల ఆధ్వర్యంలో శుక్రవారం కలక్టరేట్ వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. ఈ ఘటన పై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
Advertisement
Advertisement