
మిస్సమ్మ మళ్లీ వస్తోంది..!
ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న భూమిక, పెళ్లి తరువాత సినిమాలకు దూరంగా ఉంటోంది. పూర్తిగా నటించటం మానేయకపోయినా.. చాలా తక్కువగా సినిమాల్లో నటిస్తోంది. ఖుషి, ఒక్కడు లాంటి కమర్షియల్ సినిమాలతో పాటు మిస్సమ్మ, అనసూయ లాంటి లేడి ఓరియంటెడ్ చిత్రాల్లోనూ అలరించింది భూమిక.
చివరగా టాలీవుడ్లో లడ్డుబాబు సినిమాలో నటించిన ఈ భామ త్వరలో మరో తెలుగు సినిమా చేసేందుకు అంగీకరించింది. నాచ్యురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమాలో భూమిక కీలక పాత్రలో నటించనుందట. అయితే ఈ సినిమాలో భూమికది సిస్టర్ క్యారెక్టర్ అన్న టాక్ వినిపిస్తోంది. హీరోయిన్గా గ్లామర్ రోల్స్తో పాటు, లేడి ఓరియంటెండ్ సినిమాల్లోనూ అలరించిన భూమిక, ఈ సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారబోతోంది. మరి ఈ సెకండ్ ఇన్నింగ్స్లో మిస్సమ్మ ఎంత వరకు అలరిస్తుందో చూడాలి.