Character Role
-
మిస్సమ్మ మళ్లీ వస్తోంది..!
ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న భూమిక, పెళ్లి తరువాత సినిమాలకు దూరంగా ఉంటోంది. పూర్తిగా నటించటం మానేయకపోయినా.. చాలా తక్కువగా సినిమాల్లో నటిస్తోంది. ఖుషి, ఒక్కడు లాంటి కమర్షియల్ సినిమాలతో పాటు మిస్సమ్మ, అనసూయ లాంటి లేడి ఓరియంటెడ్ చిత్రాల్లోనూ అలరించింది భూమిక. చివరగా టాలీవుడ్లో లడ్డుబాబు సినిమాలో నటించిన ఈ భామ త్వరలో మరో తెలుగు సినిమా చేసేందుకు అంగీకరించింది. నాచ్యురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమాలో భూమిక కీలక పాత్రలో నటించనుందట. అయితే ఈ సినిమాలో భూమికది సిస్టర్ క్యారెక్టర్ అన్న టాక్ వినిపిస్తోంది. హీరోయిన్గా గ్లామర్ రోల్స్‌తో పాటు, లేడి ఓరియంటెండ్ సినిమాల్లోనూ అలరించిన భూమిక, ఈ సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారబోతోంది. మరి ఈ సెకండ్ ఇన్నింగ్స్‌లో మిస్సమ్మ ఎంత వరకు అలరిస్తుందో చూడాలి. -
ఆ ట్రైలర్ లో భూమికను చూశారా?
ఖుషీ, ఒక్కడు, అనసూయ లాంటి సినిమాలతో తెలుగులో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన భూమిక పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆమె హిందీ సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో మెరవనుంది. రెండు రోజుల క్రితం రిలీజై ఇప్పటికే 40లక్షల మంది వీక్షకులను మెప్పించిన 'ఎమ్మెస్ ధోనీ' చిత్ర ట్రైలర్లో తళుక్కుమంది భూమిక. సాధారణ రైల్వే టికెట్ కలెక్టర్ స్థాయి నుంచి స్టార్ క్రికెటర్‌గా ఎదిగిన ధోనీ స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని 'ఎమ్మెస్ ధోనీ' పేరుతో తెరకెక్కించిన విషయం తెలిసిందే. యువనటుడు సుశాంత్ రాజ్‌పుత్ టైటిల్ రోల్‌ను పోషిస్తున్నారు. ఈ చిత్రంలో ధోనీ సోదరిగా భూమిక కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. దీంతో ఇక మీదట ఆమె క్యారెక్టర్ రోల్స్ కు ఓకే చెబుతారేమోననే టాక్ వినిపిస్తోంది. అదే నిజమైతే.. తిరిగి భూమిక తెర మీద కనిపించాలని కోరుకునే ఫ్యాన్స్‌కు పండుగే. -
ఆ ట్రైలర్ లో భూమికను చూశారా?
-
ఇక క్యారెక్టర్ రోల్సే చేస్తా
టీనగర్: గ్లామర్ పాత్రలో నటించి బోర్ కొడుతోంది, ఇకపై క్యారెక్టర్ రోల్స్‌కే పరిమితం అంటున్నారు నటి సోనా. ఇటీవల ఆమె విలేకరులతో మాట్లాడారు. తమిళంలో ఇదివరకే ఒప్పందమైన చిత్రాలు మినహా వేరే చిత్రాల్లో నటించడం లేదని, ప్రస్తుతం శివప్పు మనిదర్గళ్ చిత్రంలో నటిస్తున్నట్లు తెలిపారు. కొన్ని చిత్రాల్లో గ్లామరస్‌గా నటించాలని కోరారని, అన్ని చిత్రాల్లో ఆ విధంగా నటించడం బోర్ కొడుతోందన్నారు. ఇకపై అటువంటి పాత్రల జోలికి వెళ్లనని అన్నారు. మలయాళంలో అమర్ అక్బర్ ఆంతోని సహా కొన్ని చిత్రాల్లో నటిస్తున్నానని, అక్కడున్న దర్శకులు తనను గ్లామరస్‌గా చూపించడం లేదన్నారు. ఒక్కో చిత్రంలో తన క్యారెక్టర్‌కు ప్రాముఖ్యం కల్పిస్తున్నారని, నటనను చూపే విధంగా ఈ పాత్రలు ఉన్నట్లు పేర్కొన్నారు.