
ఇక క్యారెక్టర్ రోల్సే చేస్తా
టీనగర్: గ్లామర్ పాత్రలో నటించి బోర్ కొడుతోంది, ఇకపై క్యారెక్టర్ రోల్స్‌కే పరిమితం అంటున్నారు నటి సోనా. ఇటీవల ఆమె విలేకరులతో మాట్లాడారు. తమిళంలో ఇదివరకే ఒప్పందమైన చిత్రాలు మినహా వేరే చిత్రాల్లో నటించడం లేదని, ప్రస్తుతం శివప్పు మనిదర్‌గళ్ చిత్రంలో నటిస్తున్నట్లు తెలిపారు. కొన్ని చిత్రాల్లో గ్లామరస్‌గా నటించాలని కోరారని, అన్ని చిత్రాల్లో ఆ విధంగా నటించడం బోర్ కొడుతోందన్నారు. ఇకపై అటువంటి పాత్రల జోలికి వెళ్లనని అన్నారు. మలయాళంలో అమర్ అక్బర్ ఆంతోని సహా కొన్ని చిత్రాల్లో నటిస్తున్నానని, అక్కడున్న దర్శకులు తనను గ్లామరస్‌గా చూపించడం లేదన్నారు. ఒక్కో చిత్రంలో తన క్యారెక్టర్‌కు ప్రాముఖ్యం కల్పిస్తున్నారని, నటనను చూపే విధంగా ఈ పాత్రలు ఉన్నట్లు పేర్కొన్నారు.