
నాగచైతన్య
సేమ్ వపర్. రైట్ హ్యాండ్‌కి ఎంత పవర్ ఉందో.. సేమ్ పవర్ లెఫ్ట్ హ్యాండ్‌కి కూడా ఉందతనికి. మరి ఈ ఎక్స్‌ట్రా పవర్‌తో అతను ఎక్స్‌ట్రీమ్‌గా ఏం చేశాడో తెలుసుకోవాలంటే ‘సవ్యసాచి’ సినిమా చూడాల్సిందే. నాగచైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో ౖమైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఎర్నేని నవీన్, ౖవై. రవిశంకర్, చెరుకూరి మోహన్ నిర్మిస్తున్న చిత్రం ‘సవ్యసాచి’.
ఇందులో నిధి అగర్వాల్ కథానాయిక. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను మార్చి 18న రిలీజ్ చేసి, చిత్రాన్ని జూన్ 14న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ‘‘ప్రస్తుతం నాగచైతన్య, భూమిక, ఇతర ముఖ్య తారాగణంపై హైదరాబాద్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం. ఆ తర్వాత యూఎస్‌లో మరో కీలక షెడ్యూల్‌ను ప్లాన్ చేశాం. కీరవాణి సంగీతం చిత్రానికి అదనపు ఆకర్షణ’’ అన్నారు నిర్మాతలు. రావు రమేశ్, వెన్నెల కిశోర్, సత్య, తాగుబోతు రమేశ్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు కెమెరా: యువరాజ్.
ప్రేయసిగా శ్రీమతి
మూడుముళ్లకు ముందు ముచ్చటగా మూడుసార్లు (ఏమాయ చేసావె, ఆటోనగర్ సూర్య, మనం) స్క్రీన్ షేర్ చేసుకున్నారు నాగచైతన్య, సమంత. మరోసారి వీరిద్దరూ కలిసి నటించబోతున్నారట. ‘నిన్ను కోరి’ ఫేమ్ శివ నిర్మాణ దర్శకత్వంలో నాగచైతన్య, సమంత కలిసి నటించనున్నారని, ఆల్రెడీ సినిమాకు ‘ప్రేయసి’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారని టాక్.
Comments
Please login to add a commentAdd a comment