
సవ్యసాచి మూవీ ప్రీ లుక్ పోస్టర్
‘ప్రేమమ్’ లాంటి సూపర్ సక్సెస్ తరువాత అక్కినేని నాగచైతన్య, చందు మొండేటిల క్రేజీ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ‘సవ్యసాచి’. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మాధవన్, భూమికలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘సవ్యసాచి’ ఫస్ట్ లుక్ మరియు రిలీజ్ డేట్ లను ఎనౌన్స్ చేసారు మైత్రీ మూవీ మేకర్స్. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు వై.నవీన్, వై.రవిశంకర్, మోహన్ లు మాట్లాడుతూ.. ‘మా యూనిట్ సభ్యులందరికీ సవ్యసాచి ఒక స్పెషల్ ఫిలిం.
ప్రస్తుతం హైద్రాబాద్ లో హీరో నాగచైతన్య, భూమికలపై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ షెడ్యూల్ పూర్తవ్వగానే నెక్స్ట్ షెడ్యూల్ కోసం టీం అమెరికా వెళ్లనున్నారు. సినిమా ఫస్ట్ లుక్ ను మార్చి 18న విడుదల చేయాలనుకొంటున్నాం. అలాగే సవ్యసాచి చిత్రాన్ని జూన్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్నాం. ఆడియన్స్ ను ఆశ్చర్యపరిచే స్థాయిలో సినిమా ఉంటుంది. ఆర్.మాధవన్ పాత్ర సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. కీరవాణి గారు సవ్యసాచికి సంగీతం సమకూర్చడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment