ఖమ్మం జిల్లా కూనవరం మండలం పైడిగూడెంలో ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు మృత్యువాతపడ్డారు.
ఖమ్మం జిల్లా కూనవరం మండలం పైడిగూడెంలో ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు మృత్యువాతపడ్డారు. గ్రామానికి చెందిన చిన్నారులు చదల స్వాతి(5), వల్లా భూమిక(5) బుధవారం మధ్యాహ్నం సమీపంలోని చెరువు వద్దకు వెళ్లారు. ఆడుకుంటూ నీటిలోకి దిగారు. సమీపంలోని ఉన్న వారెవరూ గమనించకపోవటంతో మునిగి చనిపోయారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.