
ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘యుఫోరియా’. ఈ మూవీతో విఘ్నేశ్ గవిరెడ్డి టాలీవుడ్‌కి హీరోగా ఎంట్రీ ఇస్తుండగా, నటి ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. సారా అర్జున్, నాజర్, రోహిత్, లిఖిత యలమంచలి, పృథ్వీరాజ్ అడ్డాల, కల్పలత, సాయి శ్రీనికా రెడ్డి ఇతర పాత్రలు పోషించారు. గుణ హ్యాండ్ మేడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నీలిమ గుణ నిర్మాణంలో గుణశేఖర్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది.
ఈ విషయాన్ని ప్రకటించి, మహా శివరాత్రి సందర్భంగా ‘యుఫోరియా’ మేకింగ్ వీడియోను విడుదల చేశారు. ‘‘నేటి సమాజాన్ని ప్రతిబింబించేలా ట్రెండీ టాపిక్ నేపథ్యంలో సాగే చిత్రం ‘యుఫోరియా’. ఇప్పటికే విడుదల చేసిన మూవీ టైటిల్ గ్లింప్స్, కాన్సెప్ట్ వీడియో అందర్నీ ఆకట్టుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలనుప్రారంభించాం. త్వరలోనే ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సమర్పణ: రాగిణి గుణ, సంగీతం: కాల భైరవ, కెమేరా: ప్రవీణ్ కె. పోతన్.
Comments
Please login to add a commentAdd a comment