ఫీల్ గుడ్ లవ్‌స్టోరీ
‘ప్రేమంటే సులువు కాదురా.. అది నీవు గెలవలేవురా... ప్రేమించ షరతులేమిటో..’ అంటూ ‘ఖుషీ’ చిత్రంలో పవన్ కల్యాణ్, భూమిక పాడుకున్న పాట ఇప్పటికీ యువత మదిలో మెదులుతూ ఉంటుంది. ఇప్పుడా ప్రస్తావన ఎందు కంటే.. ‘ప్రేమంటే సులువు కాదురా’ పేరుతో ఓ చిత్రం తెరకెక్కింది. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్ సాలూరి, సిమ్మీదాస్ జంటగా చందా గోవిందరెడ్డిని దర్శకత్వంలో భవనాసి రాంప్రసాద్ నిర్మించారు.
ఈ చిత్రం రిలీజ్‌కి రెడీగా ఉంది. నిర్మాత మాట్లాడుతూ- ‘‘కుటుంబ భావోద్వేగాలకు పెద్దపీట వేస్తూ తీసిన చిత్రమిది. ఫీల్ గుడ్ ఎమోషనల్ లవ్‌స్టోరీ. ‘మా అబ్బాయి నటించిన చిత్రాల్లో ఇది బెస్ట్’ అని కోటిగారు ప్రశంసించడం మరచిపోలేను. నందన్‌రాజ్ స్వరపరచిన పాటలకు మంచి స్పందన వచ్చింది. కమలాకర్ రీ-రికార్డింగ్ హైలెట్’’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: కొమారి సుధాకర్‌రెడ్డి, శ్రీపతి శ్రీరాములు.