అందరి కథ | Idhe Maa Katha First Look Poster Release | Sakshi
Sakshi News home page

అందరి కథ

Nov 20 2020 3:22 AM | Updated on Nov 20 2020 4:00 AM

Idhe Maa Katha First Look Poster Release - Sakshi

రోడ్డు ప్రయాణం నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇదే మా కథ’. (రైడర్స్‌ స్టోరి అనేది ఉపశీర్షిక). సుమంత్‌ అశ్విన్, శ్రీకాంత్, భూమిక, తాన్యా హోప్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. గురుపవన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్‌. సుబ్రహ్మణ్యం ఆశీస్సులతో మనోరమ గురప్ప సమర్పణలో గురప్ప పరమేశ్వర ప్రొడక్షన్స్‌ పతాకంపై జి.మహేష్‌ నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ‘ఇదే మా కథ’ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. గురుపవన్‌ మాట్లాడుతూ– ‘‘నేను రైడర్‌ని. అందుకే ఆ నేపథ్యంలో కథ రాశా.

డిసెంబర్‌లో షూటింగ్‌ పూర్తి చేస్తాం’’ అన్నారు. ‘‘ఇది మనందరి కథ. చాలా ఎమోషన్స్‌తో ట్రావెల్‌ అయ్యే స్క్రిప్ట్‌’’ అన్నారు జి.మహేష్‌. శ్రీకాంత్‌ మాట్లాడుతూ– ‘‘చిన్నప్పుడు చాలాసార్లు రైడింగ్‌కి వెళ్లాను. ఒకసారి హైదరాబాద్‌ నుండి లడక్‌కి కారులో వెళ్లాను. ఇప్పుడు ఈ టీమ్‌తో లడక్‌ వెళ్లడం ఒక మంచి అనుభూతి’’ అన్నారు. ‘‘బైక్‌ రైడింగ్‌ అంటే ఇష్టం కానీ నేను ప్రొఫెషనల్‌ రైడర్‌ని కాదు. గురుపవన్‌ నాకు శిక్షణ ఇచ్చారు’’ అన్నారు సుమంత్‌ అశ్విన్‌. ఈ చిత్రానికి సంగీతం: సునీల్‌ కశ్యప్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: చిరంజీవి ఎల్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement