నాడు చిరంజీవి సినిమాలో చైల్డ్‌ ఆర్టిస్ట్‌.. ఇప్పుడో ప్రముఖ లాయర్‌ | Chiranjeevi Movie Child Artist Now Bigg Advocate | Sakshi
Sakshi News home page

చిరంజీవి సినిమాలో నటించిన ఈ బ్యూటీ ఇప్పుడో ప్రముఖ లాయర్‌.. ఎవరో తెలుసా..?

Published Tue, Mar 19 2024 1:49 PM | Last Updated on Tue, Mar 19 2024 3:04 PM

Chiranjeevi Movie Child Artist Now Bigg Advocate - Sakshi

'జై చిరంజీవ' చిత్రంతో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా వెండితెరకు పరిచయమైన శ్రియా శర్మ గుర్తుందా..? ఆ సినిమాతో ఆమెకు భారీగా అవకాశాలు వచ్చాయి. ఒకే ఒక్క చిత్రంతో ఎనలేని గుర్తింపు తెచ్చుకుంది. దీనికి ప్రధాన కారణం జై చిరంజీవా చిత్రంలో ఆమె మెగాస్టార్‌కు మేనకోడలిగా నటించడమే అని చెప్పవచ్చు. మరుసటి ఏడాదే 'నువ్వు నేను ప్రేమ'(సిల్లును ఒరు కాదల్‌) మూవీలో యాక్ట్‌ చేసింది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో బాల నటిగా రాణించింది. 'చిల్లర్‌ పార్టీ' సినిమాకు గానూ బెస్ట్‌ చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా జాతీయ అవార్డు అందుకుంది.

మహేశ్‌బాబు- శ్రీనువైట్ల కాంబినేషన్‌లో వచ్చిన దూకుడు మూవీలో సమంత చెల్లెలిగా నటించి ఆకట్టుకుంది. రచ్చ, తూనీగ తూనీగ, ఎటో వెళ్లిపోయింది మనసు చిత్రాల్లో టీనేజ్‌ గర్ల్‌గా కనిపించింది. మెగాస్టార్‌ చిరంజీవి నటించిన   జై చిరంజీవ సినిమాలో భూమిక, సమీరారెడ్డి కీలక పాత్రల్లో నటించారు. మెగాస్టార్‌ మేనకోడలిగా శ్రియా శర్మ నటించింది. తన చిన్ని చిన్ని మాటలతో, చిలిపి చేష్టలతో అలరించిన ఈమె చిరును మావయ్యా.. అంటూ ప్రేమగా పిలిచేది. ఈ మూవీలో చలాకీ నటనతో  అందరి మనసులు దోచిన ఈ పాప వయసు ఇప్పుడు 26 ఏళ్లు.

చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా మొదలైన తన ప్రయాణం హీరోయిన్‌గా తన మొదటి చిత్రం గాయకుడుతో ఎంట్రీ ఇచ్చింది. బిగ్‌బాస్‌ ఫేం అలీ రెజా ఇందులో హీరోగా నటించాడు. ఇది అంతగా విజయం సాధించలేదు.  ఆ తర్వాత శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ హీరోగా నటించిన నిర్మల కాన్వెంట్‌లో హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది కానీ అవకాశాలు మాత్రం పెద్దగా రాలేదు. 2016లో నిర్మలా కాన్వెంట్‌ రిలీజవగా ఆ తర్వాత మరే సినిమాలో కనిపించలేదు శ్రియా శర్మ. కానీ పలు వాణిజ్య ప్రకటనల్లో కనిపించింది. న్యాయవిద్యను అభ్యసించిన శ్రియా శర్మ ప్రస్తుతం పెద్దపెద్ద కార్పోరేట్‌ కంపెనీలకు అడ్వకేట్‌గా కొనసాగుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement