మెగాస్టార్ చిరంజీవి నటించిన పసివాడి ప్రాణం సినిమా మీకు గుర్తుందా? అప్పట్లో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ఈ చిత్రంలో విజయశాంతి జోడిగా నటించింది. 1987లో విడుదలైన ఈ చిత్రాన్ని ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించారు. చిరంజీవి కెరీర్ తొలినాళ్లలో వచ్చిన ఎమోషనల్ చిత్రం ప్రేక్షకాదరణ పొంది ఘనవిజయం సాధించింది. చిరంజీవి కెరీర్‌లోనే సూపర్ హిట్‌గా నిలిచింది.
ఈ సినిమాలో సుమలత ముఖ్యపాత్రలో నటించారు. అప్పట్లో ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన బాబుపైనే అందరి దృష్టి పడింది. ముద్దుగా కనిపించే అబ్బాయి పాత్రలో నటించింది ఎవరో మీకు తెలుసా? అతను ఇప్పుడెలా ఉన్నాడో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చదివేద్దాం పదండి.
అబ్బాయి కాదు అమ్మాయే
పసివాడి ప్రాణం చిత్రంలో మెప్పించిన ఆ చిన్నారి అబ్బాయి కాదు.. అమ్మాయి అన్న సంగతి చాలా మందికి తెలియదు. ఆమె మనందరికి తెలుసు. తాను మరెవరో కాదు సీరియల్ నటి సుజిత. గతంలో స్టార్ మాలో ప్రసారమైన ‘వదినమ్మ’ సీరియల్‌లో కీలక పాత్రలో నటించింది.
ఆ తర్వాత జై చిరంజీవ సినిమాలోనూ హీరో చిరంజీవికి చెల్లెలిగా కూడా నటించింది. ఇక్కడే కాదు.. సుజిత చిన్నప్పుడు ఐదు భాషల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించింది. నటనలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. చిరంజీవితోపాటు తెలుగులో వెంకటేశ్, నాగార్జున, బాలకృష్ణ సినిమాల్లోనూ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించింది.
సుజిత ఎవరంటే..
1983 జూలై 12న కేరళలోని తిరువనంతపురంలో జన్మించింది. ఆమె ప్రముఖ డైరెక్టర్ సూర్యకిరణ్ సోదరి. ధనుష్ అనే నిర్మాతను వివాహమాడింది. ప్రస్తుతం చెన్నైలో నివాసముంటున్న సుజిత తెలుగు, తమిళం, మలయాళ సినిమాల్లో నటించింది. మలయాళ సిరీస్ స్వాంతం మలూట్టీలో మొట్టమొదటి సారిగా ప్రధాన పాత్రలో కనిపించింది. ఆ తర్వాత టీవీ సీరియల్స్ వైపు అడుగులు వేసింది. ‘మారుతని’ సీరియల్ ద్వారా ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. చివరిసారిగా ‘దియా’, కణం అనే సినిమాల్లో నటించింది.(చదవండి: 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' రివ్యూ)
Comments
Please login to add a commentAdd a comment