sujitha
-
అప్పట్లో చిరంజీవితో చైల్డ్ ఆర్టిస్టుగా.. ఇప్పుడేమో సీరియల్ నటిగా.. ఈమె ఎవరంటే? (ఫొటోలు)
-
డైరెక్టర్ సూర్యకిరణ్ మృతిపై సుజిత ఎమోషనల్
టాలీవుడ్ రచయిత, దర్శకుడు సూర్య కిరణ్ (48) మార్చి 11న కన్నుమూశారు. పచ్చ కామెర్ల కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. చెన్నైలో ఆయన అంత్యక్రియలు జరిగిన విషయం తెలిసిందే. ఆయన మృతి పట్ల ఇండస్ట్రీ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఇప్పటికే సూర్యకిరణ్ గురించి ఆయన సన్నిహితులు పలు విషయాలను పంచుకుని బాధపడ్డారు కూడా. తాజాగా ఆయన సోదరి సుజిత రియాక్ట్ అయ్యారు. సూర్య కిరణ్‌కు సోదరి సుజిత అంటే చాలా ఇష్టం.. ఇదే విషయాన్ని ఆయన పలుమార్లు చెప్పిన విషయం తెలిసిందే. అదే విధంగా అన్నయ్య పట్ల సుజిత కూడా అమితమైన ప్రేమను చూపించేవారు. అలాంటిది నేడు సూర్యకిరణ్ లేడన్న నిజాన్ని తట్టుకోలేక ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. 'ఆయన నా అన్నయ్య మాత్రమే కాదు.. నా హీరో, నాకు తండ్రి కూడా.. ఇండస్ట్రీలో నీ టాలెంట్‌కు, నీ మాటలకు నేను ఎప్పుడూ అభిమానినే. మరో జన్మంటూ ఉంటే.. అప్పుడైనా నీ కలలన్నీ సాకారం కావాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను.' అంటూ సుజిత ఎమోషనల్ అయ్యారు. పసివాడి ప్రాణం సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన సుజిత తర్వాత సినిమాలు, సీరియల్స్‌లోనూ నటించి పెద్ద నటిగా ఎదిగారు. చిన్నప్పుడు వారు తండ్రిని కోల్పోవడంతో ఒక నాన్నలా తమ కుటుంబాన్ని సూర్యకిరణ్ పోషించారని గతంలో సుజిత చెప్పారు. ప్రస్తుతం ఆమె పలు సీరియల్స్‌లో నటిస్తూ హైదరాబాద్‌లోనే సెటిల్ అయ్యారు. తమ మధ్య 8 ఏళ్లు గ్యాప్ ఉండటంతో ఎంతో ప్రేమగా అన్నయ్య చూసుకునేవారని ఆమె పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Sujithar (@sujithadhanush) -
ఏళ్ల తరబడి షూటింగ్.. సుజితకు అరకొర పారితోషికం?!
బాలనటిగా కెరీర్ ఆరంభించిన సుజిత ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసింది. చిన్నప్పటినుంచే నటనలో ఓనమాలు నేర్చుకున్న ఆమె బుల్లితెరపై అనేక సీరియల్స్ చేసింది. వదినమ్మ సీరియల్‌తో తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఇది తమిళంలోని పాండియన్ స్టోర్స్‌కు తెలుగు రీమేక్. అక్కడ కూడా సుజిత ధనుషే ధనలక్ష్మి అనే ప్రధాన పాత్రలో నటిస్తోంది. దాదాపు 5 ఏళ్లుగా ఈ ధారావాహిక విజయవంతంగా కొనసాగుతోంది. తను ఎంత బిజీగా ఉన్నా ఈ సీరియల్ షూటింగ్ కోసం టైం కేటాయించేది సుజిత. మొదటి నుంచి ఇప్పటివరకు ఎంతోమంది ఆర్టిస్టులు మారుతూ వచ్చారు, కానీ కొన్ని పాత్రలు, నటులు మాత్రం అలాగే ఉండిపోయారు. తాజాగా ఆమె ఈ సీరియల్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకుందట. అంతేకాదు, ఈ సీరియల్‌కు సీక్వెల్లోనూ నటించనని తెగేసి చెప్పేసిందట! చాలాకాలం నుంచి తనకు ఇవ్వాల్సిన పారితోషికం ఇవ్వకుండా ఎగ్గొట్టడంతోనే ఆమె ఈ నిర్ణయం తీసుకుందట. ఈ విషయం తెలిసిన సీరియల్ మేకర్స్ వెంటనే ఆమెను సంప్రదించి ఇక మీదట ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తామని హామీ ఇచ్చారట. దీంతో సుజిత సీరియల్ నుంచి తప్పుకోవాలన్న ఆలోచనను విరమించుకున్నట్లు తెలుస్తోంది. ఏళ్ల తరబడి డబ్బులు ఇవ్వకుండా విసిగించడం వల్లే తనకు సీరియల్ నుంచి తప్పుకోవాలనే ఆలోచన వచ్చిందంటూ ప్రచారం జరుగుతోంది. ఇకపోతే సుజిత దర్శకనిర్మాత ధనుష్‌ను పెళ్లాడింది. వీరికి ధన్విన్ అనే బాబు ఉన్నాడు. సుజిత అన్నయ్య ప్రముఖ డైరెక్టర్ సూర్యకిరణ్ అన్న సంగతి తెలిసిందే! చదవండి: ఇలాంటి సినిమాలకు అవార్డులు ఇస్తే దేశసమైక్యత దెబ్బతింటుంది -
ఉన్నదంతా అమ్మేశారు, పీకల్లోతు అప్పులు.. కల్యాణి విడాకులకు కారణమిదే!
పసివాడి ప్రాణం సీరియల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన సుజిత తర్వాత సినిమాలు, సీరియల్స్‌లోనూ నటించి పెద్ద నటిగా ఎదిగింది. ఎంతో సాంప్రదాయంగా రెడీ అయ్యే సుజిత అన్నయ్య సూర్యకిరణ్ కూడా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. నటుడిగానే కాకుండా దర్శకుడిగానూ సత్తా చాటిన ఈయన బిగ్‌బాస్ తెలుగు నాలుగో సీజన్లో పాల్గొన్న వారం రోజులకే ఎలిమినేట్ అయ్యాడు. ఈయన నటి కల్యాణిని పెళ్లి చేసుకుని కొన్నేళ్లకే ఆమెకు విడాకులిచ్చాడు. తాజాగా వీరి విడాకులకు గల కారణాన్ని సుజిత ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ.. 'అన్నయ్యకు పెళ్లయిన మూడేళ్లకే నాకు వివాహం జరిగింది. నేను ఎక్కువగా షూటింగ్‌లోనే ఉండేదాన్ని. అప్పుడప్పుడు అన్నయ్యతో ఫోన్ మాట్లాడేదాన్ని. హైదరాబాద్‌కు షూటింగ్‌కు వచ్చినప్పుడు మాత్రం తనను నేరుగా కలిసేదాన్ని. వదిన (కల్యాణి) అప్పటికే తెలుగు ఇండస్ట్రీలో గొప్ప నటి. తనతో మాట్లాడటం, తనతో ఉండటం నాకు చాలా ఇష్టం. అక్కాచెల్లెళ్లు ఎలా ఉండేవారో మేమిద్దరం అలా ఉండేవాళ్లం. అయితే ఆర్థిక సమస్యలు అనేవి ఎక్కువకాలం ఉండకూడదు. అటువంటి ఇబ్బందులు వస్తే దాన్ని బ్యాలెన్స్ చేసే సామర్థ్యం దంపతుల్లో ఒక్కరికైనా ఉండాలి. లేకపోతే చాలా సమస్యలు వస్తాయి. వాళ్లిద్దరూ అనవసరంగా పెద్ద పెద్ద విషయాల్లో కాలు పెట్టారు. అన్నయ్య నిర్మాతగా సినిమా తీశాడు. నాకు చెప్తే సరేనన్నాను. అన్నయ్యకు, నాకు 8 ఏళ్ల ఏజ్ గ్యాప్. ఆయనకు సలహా ఇచ్చేంత పెద్ద దాన్ని కాదు. చిన్నప్పుడే నాన్న చనిపోవడంతో తనే నాకు తండ్రి లాగా! తనంటే నాకు కొంత భయం కూడా! చివరకు వారు తీసిన సినిమా డిజాస్టర్ అయింది, నష్టాలు వచ్చాయి. అదే వారి జీవితంలో వచ్చిన పెద్ద సమస్య! మాకీ విషయం తెలిసి సాయం చేద్దామనుకునేలోపు వారు మరీ దారుణ స్థితిలోకి వెళ్లిపోయారు. అన్నీ అప్పులు, ఉన్నదంతా అమ్మేశారు. కేరళలో మంచి ప్రాపర్టీ ఉండేది, దాన్ని కూడా అమ్మేశారు. సినిమా అనేది గ్యాంబ్లింగ్. ఇది అందరికీ కలిసి రాదు.. ఉన్న డబ్బంతా సినిమా కోసం పెట్టడం అనేది తెలివితక్కువ తనం. ఈ ఒక్క పని వాళ్ల జీవితాన్ని ముంచేసింది' అని చెప్పుకొచ్చింది సుజిత. చదవండి: దేశంలోనే రిచ్ హీరో.. కారు, బంగ్లాలు అమ్మేసి చివరి రోజుల్లో మురికివాడలో -
సీరియల్ నటి నూతన గృహ ప్రవేశం.. సోషల్ మీడియాలో వైరల్
సుజిత ధనుశ్ దక్షిణాది భాషల్లో పలు సీరియల్స్‌తో గుర్తింపు తెచ్చుకుంది. ఆమె తెలుగు, తమిళ, మలయాళ సినిమాలతో పాటు టీవీ సీరియల్స్‌లోనూ నటించింది. గతంలో స్టార్ మాలో ప్రసారమైన ‘వదినమ్మ’ సీరియల్లో కీలక పాత్రలో నటించింది. ప్రస్తుతం జెమిని టీవీలో ప్రసారమవుతున్న గీతాంజలి సీరియల్లో సుజిత నటిస్తోంది. చిరంజీవి బ్లాక్ బస్టర్ మూవీ పసివాడి ప్రాణం చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చింది సుజిత. ఆ తర్వాత జై చిరంజీవ సినిమాలోనూ హీరో చిరంజీవికి చెల్లెలిగా నటించింది. సుజిత చిన్నప్పుడు దాదాపు ఐదు భాషల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించింది. నటనలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. చిరంజీవితోపాటు తెలుగులో వెంకటేశ్, నాగార్జున, బాలకృష్ణ సినిమాల్లోనూ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించింది. తాజాగా ఆమె తన గృహప్రవేశానికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. తన భర్తతో కలిసి కొత్తింట్లో పూజలు చేస్తున్న ఫోటోలను అభిమానులతో పంచుకుంది. సుజిత ఫోటోలు షేర్ చేస్తూ గెస్ ద ఈవెంట్ అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన పలువురు అభిమానులు కంగ్రాట్స్ చెబుతున్నారు. సుజిత ఎవరంటే.. 1983 జూలై 12న కేరళలోని తిరువనంతపురంలో జన్మించింది. ఆమె ప్రముఖ డైరెక్టర్ సూర్యకిరణ్ సోదరి. ధనుష్ అనే నిర్మాతను వివాహమాడింది. ప్రస్తుతం చెన్నైలో నివాసముంటున్న సుజిత తెలుగు, తమిళం, మలయాళ సినిమాల్లో నటించింది. మలయాళ సిరీస్ స్వాంతం మలూట్టీలో మొట్టమొదటి సారిగా ప్రధాన పాత్రలో కనిపించింది. ఆ తర్వాత టీవీ సీరియల్స్ వైపు అడుగులు వేసింది. ‘మారుతని’ సీరియల్ ద్వారా ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. చివరిసారిగా ‘దియా’, కణం అనే సినిమాల్లో నటించింది. View this post on Instagram A post shared by Sujithar (@sujithadhanush) -
'పసివాడి ప్రాణం' చిత్రంలోని చిన్నోడు.. ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి నటించిన పసివాడి ప్రాణం సినిమా మీకు గుర్తుందా? అప్పట్లో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ఈ చిత్రంలో విజయశాంతి జోడిగా నటించింది. 1987లో విడుదలైన ఈ చిత్రాన్ని ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించారు. చిరంజీవి కెరీర్ తొలినాళ్లలో వచ్చిన ఎమోషనల్ చిత్రం ప్రేక్షకాదరణ పొంది ఘనవిజయం సాధించింది. చిరంజీవి కెరీర్లోనే సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో సుమలత ముఖ్యపాత్రలో నటించారు. అప్పట్లో ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన బాబుపైనే అందరి దృష్టి పడింది. ముద్దుగా కనిపించే అబ్బాయి పాత్రలో నటించింది ఎవరో మీకు తెలుసా? అతను ఇప్పుడెలా ఉన్నాడో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చదివేద్దాం పదండి. అబ్బాయి కాదు అమ్మాయే పసివాడి ప్రాణం చిత్రంలో మెప్పించిన ఆ చిన్నారి అబ్బాయి కాదు.. అమ్మాయి అన్న సంగతి చాలా మందికి తెలియదు. ఆమె మనందరికి తెలుసు. తాను మరెవరో కాదు సీరియల్ నటి సుజిత. గతంలో స్టార్ మాలో ప్రసారమైన ‘వదినమ్మ’ సీరియల్లో కీలక పాత్రలో నటించింది. ఆ తర్వాత జై చిరంజీవ సినిమాలోనూ హీరో చిరంజీవికి చెల్లెలిగా కూడా నటించింది. ఇక్కడే కాదు.. సుజిత చిన్నప్పుడు ఐదు భాషల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించింది. నటనలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. చిరంజీవితోపాటు తెలుగులో వెంకటేశ్, నాగార్జున, బాలకృష్ణ సినిమాల్లోనూ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించింది. సుజిత ఎవరంటే.. 1983 జూలై 12న కేరళలోని తిరువనంతపురంలో జన్మించింది. ఆమె ప్రముఖ డైరెక్టర్ సూర్యకిరణ్ సోదరి. ధనుష్ అనే నిర్మాతను వివాహమాడింది. ప్రస్తుతం చెన్నైలో నివాసముంటున్న సుజిత తెలుగు, తమిళం, మలయాళ సినిమాల్లో నటించింది. మలయాళ సిరీస్ స్వాంతం మలూట్టీలో మొట్టమొదటి సారిగా ప్రధాన పాత్రలో కనిపించింది. ఆ తర్వాత టీవీ సీరియల్స్ వైపు అడుగులు వేసింది. ‘మారుతని’ సీరియల్ ద్వారా ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. చివరిసారిగా ‘దియా’, కణం అనే సినిమాల్లో నటించింది.(చదవండి: 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' రివ్యూ) View this post on Instagram A post shared by Sujithar (@sujithadhanush) -
మా మంచి వదినమ్మ
బాలనటిగా మురిపించింది. సినిమా నటిగా మెరిపించింది. టీవీ నటిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. కేరళ కుట్టి అయినా తెలుగమ్మాయే అనిపించింది. ఇప్పుడు తెలుగిళ్లలో ‘మా’టీవీ ద్వారా ‘వదినమ్మ’గా తన స్థానం సుస్థిరం చేసుకోనుంది. ఆ వదినమ్మ పేరు సుజిత. తీరైన కట్టూ బొట్టుతో.. నిండైన రూపంతో ఆకట్టుకుంటున్న సుజిత ‘సాక్షి’ పాఠకులతో పంచుకుంటున్న భావాలు ఇవి. ‘బాలనటిగా, నటిగా అన్ని భాషల సినిమాల్లోనూ చేశాను. కానీ, ఎక్కువ సినిమాలు చేసింది తెలుగులోనే. అలా తెలుగువారికి నేను బాగా కనెక్ట్ అయ్యాను. సినిమాల్లో చేసినా నన్ను ఇంటింటికీ చేరవేసింది మాత్రం ‘కలిసుందాం రా’ సీరియల్. అప్పడు నేను తొమ్మిదవ తరగతిలో చేరబోతున్నాను. ఆ సమయంలో బాలాజీ టెలీఫిలిమ్స్ నుంచి ఈ ఆఫర్ వచ్చింది. అంత చిన్న వయసులో కాలేజీ చదివే అమ్మాయిలా, ఆ తర్వాత భార్యగా, ఉమ్మడి కుటుంబంలో కోడలిగా.. లీడ్ రోల్ పోషించాను. వయసుకు మించి మెచ్యూరిటీ చూపించడం ఆ సీరియల్ నాకు నేర్పింది. ఇప్పుడు 30 ఫ్లస్‌లో ఎలా ఉన్నానో అలా ఆ వయసులోనే సీరియల్లో కనిపిస్తాను. సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలి, కుటుంబసభ్యులతో ఎలా ఉండాలి... ఇలా ఎన్నో విషయాలను ఆ సీరియల్ నాకు నేర్పించింది. కాలేజీ చదువు మిస్ అయ్యాను స్కూల్ ఏజ్‌లోనే సీరియల్స్‌లోకి ఎంటర్ అయినప్పటికీ ఎప్పుడూ స్కూల్ డేస్‌ని మిస్ అవలేదు. అలా ప్లాన్ చేశారు అమ్మానాన్న. స్కూల్ ఉన్నప్పుడు క్లాస్‌కి, లేదంటే షూటింగ్‌కి అన్నట్టుగా ఉండేది. ఆ తర్వాత కాలేజీ చదువు మాత్రం రెగ్యులర్‌గా వెళ్లడం కుదరక మద్రాస్ యూనివర్శిటీ నుంచి ప్రైవేట్‌గా కట్టి చదివాను. మా చెల్లెలి కాలేజీ లైఫ్ చూశాక మాత్రం నేను కాలేజీ చదువుని, టీనేజ్ లైఫ్‌ని మిస్ అయ్యాను అని చాలా బాధపడ్డాను. టీవీ వదినమ్మ ‘పండియాన్ స్టోర్స్’ అని తమిళ్లో సీరియల్ చేస్తున్నాను. అది 200 ఎపిసోడ్స్ వైపుగా వెళుతూ మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సీరియల్‌ను తెలుగులో ‘వదినమ్మ’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ ఆఫర్ వచ్చినప్పుడు కొంచెం ఆలోచించాను. ఫ్యామిలీతో గడిపే సమయం తగ్గిపోతుందని. కానీ, ఈ విధంగా మరోసారి తెలుగువారికి దగ్గరకావచ్చు అనిపించింది. అదీ గాక వదినమ్మ రోల్ నన్ను బాగా ఆకట్టుకుంది. మన సంస్కృతి ప్రత్యేకత అంతా ఉమ్మడి కుటుంబంలోనే ఉంటుంది. అమ్మకు సమానంగా ఉంటుంది ఆ రోల్. ఆ కుటుంబం అంతా ఆమె చెప్పినట్టుగా వింటుంది. ‘వదినమ్మ’ సీరియల్లో వదిన పాత్ర పేరు ధనలక్ష్మి. పల్లెటూరిలో పుట్టిపెరిగిన అమాయకత్వం గల అమ్మాయి. కుటుంబం అంటే ఎంతో అభిమానం. సంప్రదాయ బద్ధంగా చీరకట్టు, పెద్ద బొట్టు, గాజులు.. చూడగానే దండం పెట్టాల్సినంత గౌరవంగా ఉంటుంది ఆ పాత్ర. రియల్ లైఫ్‌లో వదినమ్మ మా వారికి తోబుట్టువు ఒక్కరే. అది కూడా తనకు అక్క. మా ఆడపడుచు నాకు వదిన. అమ్మవాళ్లింట్లోనూ అన్నయ్య పెద్ద. (నవ్వుతూ) రియల్ లైఫ్‌లో వదినని కాలేకపోయాను. కానీ, వదిన రోల్ మాత్రం చాలా విలువైనది. వర్క్ – ప్యామిలీ బ్యాలెన్స్ పెళ్లికి ముందు ఒకే టైమ్‌లో 2–3 సీరియల్స్ చేసేదాన్ని. పెళ్లయ్యాక మాత్రం ఒకటే సీరియల్ చేస్తూ అది పూర్తయ్యాకనే మరోటి ఎంచుకుంటున్నాను. ఆ విధంగా నెలలో 10 రోజులు వర్క్‌కి, మిగతా 20 రోజులు ఫ్యామిలీకి అనుకున్నాను. ఇప్పుడు మా బాబు తన్విన్ యూకేజీ చదువుతున్నాడు. వర్క్ పేరుతో వాడిని మిస్ అవ్వకూడదు అనుకున్నాను. కానీ, ఇప్పుడు తమిళ్, తెలుగు సీరియల్స్ రెండింటి వల్ల వాడిని కొంచెం మిస్ అవుతున్నాను అనిపిస్తోంది. అయితే, ఈ విధంగా తెలుగు ప్రేక్షకులకు చేరువ అవుతున్నానని ఆనందంగా ఉంది. ఈ సీరియల్‌ని ఒప్పుకోవడానికి ముందు మా ఆయన ధనుష్‌తో, అమ్మతో మాట్లాడాను. బాబు పెద్దయి హయ్యర్ స్టడీస్‌కి వచ్చాక ఎలాగూ వాడికే కేటాయించాలి. అందుకే ఈ టైమ్‌లో ఇలా అవకాశాలు వస్తున్నాయి అనుకున్నాను. కోడలుగా అత్తగారితో మా అత్తగారు పూర్తిగా పల్లెటూరి వాతావరణం నుంచి వచ్చిన ఆవిడ. ఆమెనూ అమ్మ అనే పిలుస్తాను. ఆమెతో ఏదైనా సరే మాట్లాడటానికి మొహమాటపడను. ఇద్దరమూ చాలా బాగా ఉంటాం. నాకేదైనా నచ్చకపోతే వెంటనే చెప్పేస్తాను. మా అత్తగారు తమిళ్ సీరియల్స్ బాగా చూస్తారు. సలహాలు మాత్రం ఇవ్వరు. మా వారు మాత్రం నా డ్రెస్సింగ్ కలర్ కాంబినేషన్స్ గురించి చెబుతారు. మా వారు యాడ్ ఫిల్మ్ మేకర్. తన యాడ్ మేకింగ్‌లోనూ నా సజెషన్స్ ఉంటాయి. క్యాస్టింగ్ కౌచ్ దాదాపు నేను పుట్టిన దగ్గర నుంచి ఈ ఇండస్ట్రీలో ఉన్నాను. నాకంతా గ్రీన్‌గానే ఉంది. ఇండస్ట్రీ అద్దం లాంటిది. మనం ఎలా ఉంటే అది అలా చూపెడుతుంది. గౌరవం వదిలేసుకొని ఎవరూ గౌరవించడం లేదనుకోవడం కరెక్ట్ కాదు. ఇప్పుడున్న అమ్మాయిలకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. ఫైనాన్షియల్ పరంగానూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఉండే అవకాశాలు చాలా తక్కువ. ఇష్టాయిష్టాలు ఖాళీ సమయం దొరికితే సినిమా చూడటం బాగా ఇష్టం. ఎంత అలసటగా ఉన్నా సినిమా చూస్తే చాలు రీ ఫ్రెష్ అయిపోతాను. సినిమా తర్వాత లాంగ్ డ్రైవ్ అంటే పిచ్చి. నా లైఫ్ యాంబిషన్ ఈ లోకం చివరి అంచుల దాకా వెళ్లి చూడాలి. ట్రావెలింగ్ అంటే అంత ఇష్టం. ఇప్పటికి కొన్ని ప్లేస్లే చూశాను. ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి. ఎక్కడకైనా వెళితే నాకు ఫుడ్ ప్రాబ్లమ్ లేదు, వాతావరణం మార్పుల గురించి చింత లేదు. అందుకే టైమ్ దొరికితే ట్రావెలింగ్ వైపు మొగ్గు చూపుతాను.’ – నిర్మలారెడ్డి -
గోదావరిలో దూకిన బాలిక మృతదేహం లభ్యం
తూర్పు గోదావరి, మామిడికుదురు (పి.గన్నవరం): పెద్దలు నిరాకరించారన్న కారణంతో జీవితంపై విరక్తి చెంది పాశర్లపూడి వైనతేయ వారధిపై నుంచి దూకి ఆత్యహత్య చేసుకున్న పెదపట్నం గ్రామానికి చెందిన బాలిక ముత్యాల నాగసుజిత (14) మృతదేహం ఆదివారం లభ్యమైంది. అంబాజీపేట మండలం వాకలగురువు వైపు సుజిత మృతదేహాన్ని గుర్తించి మత్య్సకారులు పోలీసులకు సమాచారాన్ని తెలపడంతో మృతదేహాన్ని పాశర్లపూడి బ్రిడ్జి దగ్గరకు తీసుకు వచ్చారు. సుజిత మృతదేహం పూర్తిగా పాడైపోయింది. నగరం ఎస్సై జి.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సిబ్బంది బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రాజోలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నగరం గ్రామానికి చెందిన వెలిశెట్టి నాగదుర్గశివ (21) నాగసుజిత జంట శనివారం పాశర్లపూడి బ్రిడ్జిపై నుంచి వైనతేయ గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవడం, దుర్గాశివ మృతదేహం శనివారం సాయంత్రం లభ్యమైన సంగతి కూడా తెలిసిందే. అతడి మృతదేహానికి రాజోలు ఎస్సై లక్ష్మణ రావు ఆధ్వర్యంలో పోలీసులు పోస్టుమార్టం నిర్వహించి శవాన్ని బంధువులకు అప్పగించారు. -
కలవారి కోడలు... మళ్లీ వచ్చింది!
నటీనటులు ఎంతోమంది ఉన్నా, కొందరే ప్రేక్షకుల మనసుల్లోకి చొచ్చుకుపోతారు. ప్రేక్షకుల్ని తమ నటనతో ఫిదా చేసేసి, వాళ్ల మనసుల్లో సింహాసనం వేసుకుని కూర్చుంటారు. బుల్లితెర ప్రేక్షకులను అలా కట్టిపడేసిన నటి... సుజిత. కలవారి కోడలు, కలిసుందాం రా, గంగోత్రి వంటి సీరియల్స్‌తో ఆమె టెలివిజన్ సూపర్‌స్టార్ అయిపోయింది. అయితే ఎందుకనో గత కొంతకాలంగా ఆమె అంతగా కనిపించడం లేదు. దాంతో సుజిత ఏమైపోయిందా అనుకున్నవాళ్లూ ఉన్నారు. అయితే ఈ మధ్య సడెన్‌గా ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ సీరియల్‌తో బుల్లితెరపై ప్రత్యక్షమయ్యింది. దాంతో ఆమెను ఇన్ని రోజులూ మిస్ అయిన అభిమానులు సంబరపడుతున్నారు. ఆమె సీరియల్స్ ఎప్పుడూ ఆకట్టుకుంటాయి కాబట్టి టీవీ స్క్రీన్లకు కాన్ఫిడెంట్‌గా కళ్లప్పగించేస్తున్నారు!