
బాలనటిగా కెరీర్ ఆరంభించిన సుజిత ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసింది. చిన్నప్పటినుంచే నటనలో ఓనమాలు నేర్చుకున్న ఆమె బుల్లితెరపై అనేక సీరియల్స్ చేసింది. వదినమ్మ సీరియల్‌తో తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఇది తమిళంలోని పాండియన్ స్టోర్స్‌కు తెలుగు రీమేక్. అక్కడ కూడా సుజిత ధనుషే ధనలక్ష్మి అనే ప్రధాన పాత్రలో నటిస్తోంది. దాదాపు 5 ఏళ్లుగా ఈ ధారావాహిక విజయవంతంగా కొనసాగుతోంది.
తను ఎంత బిజీగా ఉన్నా ఈ సీరియల్ షూటింగ్ కోసం టైం కేటాయించేది సుజిత. మొదటి నుంచి ఇప్పటివరకు ఎంతోమంది ఆర్టిస్టులు మారుతూ వచ్చారు, కానీ కొన్ని పాత్రలు, నటులు మాత్రం అలాగే ఉండిపోయారు. తాజాగా ఆమె ఈ సీరియల్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకుందట. అంతేకాదు, ఈ సీరియల్‌కు సీక్వెల్‌లోనూ నటించనని తెగేసి చెప్పేసిందట! చాలాకాలం నుంచి తనకు ఇవ్వాల్సిన పారితోషికం ఇవ్వకుండా ఎగ్గొట్టడంతోనే ఆమె ఈ నిర్ణయం తీసుకుందట.
ఈ విషయం తెలిసిన సీరియల్ మేకర్స్ వెంటనే ఆమెను సంప్రదించి ఇక మీదట ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తామని హామీ ఇచ్చారట. దీంతో సుజిత సీరియల్ నుంచి తప్పుకోవాలన్న ఆలోచనను విరమించుకున్నట్లు తెలుస్తోంది. ఏళ్ల తరబడి డబ్బులు ఇవ్వకుండా విసిగించడం వల్లే తనకు సీరియల్ నుంచి తప్పుకోవాలనే ఆలోచన వచ్చిందంటూ ప్రచారం జరుగుతోంది. ఇకపోతే సుజిత దర్శకనిర్మాత ధనుష్‌ను పెళ్లాడింది. వీరికి ధన్విన్ అనే బాబు ఉన్నాడు. సుజిత అన్నయ్య ప్రముఖ డైరెక్టర్ సూర్యకిరణ్ అన్న సంగతి తెలిసిందే!
చదవండి: ఇలాంటి సినిమాలకు అవార్డులు ఇస్తే దేశసమైక్యత దెబ్బతింటుంది
Comments
Please login to add a commentAdd a comment