Theft Happened In TV Actors Rajkamal And Latha Rao House In Chennai, Details Inside - Sakshi
Sakshi News home page

TV Actors Rajkamal-Latha Rao: బుల్లితెర దంపతుల ఇంట చోరీ.. పోలీసులకు ఫిర్యాదు

Published Mon, Jul 10 2023 9:59 AM | Last Updated on Mon, Jul 10 2023 10:04 AM

Theft Happened in TV Actors Rajkamal and Latha Rao House - Sakshi

చెన్నై: స్థానిక మధురవాయిల్‌లో ఒకేసారి రెండు ఇళ్లల్లో దుండగులు చోరీకి పాల్పడడం ఆ ప్రాంతంలో కలకలానికి దారి తీసింది. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ బుల్లితెర నటి లతారావ్‌ భర్త రాజ్‌కమల్‌ కూడా నటుడే. వీరికి చెన్నైలోని స్థానిక మధురవాయిల్‌, కృష్ణానగర్‌ 15వ వీధిలో పెద్ద బంగ్లా ఉంది. దీనిని షూటింగ్‌లకు అద్దెకు ఇస్తుంటారు. కాగా ఈ బంగ్లాకు వేసి వున్న తాళం తెరిచి ఉందంటూ నటి లతారావ్‌కు సమాచారం అందింది.

ఆమె లోపలికి వెళ్లి చూడగా రూ.లక్ష విలువైన ఎల్‌ఈడీ టీవీని ఎవరో దొంగిలించినట్లు తెలిసింది. దీంతో ఆమె వెంటనే మధురవాయిల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే ప్రాంతానికి చెందిన తిరువళ్లూర్‌ జిల్లా బీజేపీ నేత పొన్‌ ప్రభాకరన్‌ ఇంటి ముందు వున్న కారు కూడా చోరీకి గురైంది. దీంతో ఈ రెండు ఘటనలపై మదురవాయిల్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

చదవండి: ప్రముఖ సింగర్‌తో అనిరుధ్‌ ప్రేమాయణం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement