
బుల్లితెర నటుడు క్రిస్ వేణుగోపాల్ పెళ్లి చేసుకున్నాడు. 49 ఏళ్ల వయసులో నటి దివ్య శ్రీధర్‌తో ఏడడుగులు వేశాడు. కేరళలోని గురువాయూర్‌లో మంగళవారం వీరి వివాహం జరిగింది. వీళ్లిద్దరూ పాతరమట్టు అనే సీరియల్‌లో కలిసి నటించారు.

ఫస్ట్ ప్రపోజ్ ఎవరంటే?
ఈ వివాహం గురించి నటి దివ్య మాట్లాడుతూ.. నాకు మొదట ప్రపోజ్ చేసింది అతడే.. పెళ్లి చేసుకోవాలనుందని చెప్పాడు. నాకేమీ అర్థం కాలేదు. తీరా.. అతడు నన్ను మాత్రమే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు తెలిపాడు. అందుకు నన్ను ఒప్పించాడు కూడా! దీని గురించి నా కూతురు, కొడుక్కి చెప్తే వాళ్లు ఎంతగానో సంతోషించారు. తమకు తండ్రి దొరికాడని ఖుషీ అయ్యారు అని తెలిపింది.

ఇద్దరూ నటులే
కాగా క్రిస్ వేణుగోపాల్ సీరియల్స్‌తో పాటు సినిమాల్లోనూ యాక్ట్ చేస్తుంటాడు. దివ్య శ్రీధర్.. మలయాళ సీరియల్స్‌లో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలతో అలరిస్తూ ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment